Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!

September 14, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta … బ్రిక్స్ వేదికపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఏమైంది, అనారోగ్యమా? నిజాలు బయటకు వస్తాయా?
న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు Xi Jinping కొద్దిసేపు అసౌకర్యంగా కనిపించడంతో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి ఆయన వైపు తిరిగి “Is he okay?” అంటూ ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అక్కడి నుండి వెంటనే హోటల్ కి వెళ్ళిపోయి హోటల్ లో కొంత సేపు అనారోగ్యానికి గురైన ఆయనకు అత్యవసర వైద్యం అందించారని, ఆరోగ్య కారణాలతో బ్రిక్స్ సదస్సును మధ్యలోనే వదిలి చైనాకు తిరిగి వెళ్లారు. తరువాత Xi డిన్నర్ కు కూడా హాజరు కాలేదు.

Ads

అదేవిధంగా Xi ఆరోగ్య పరిస్థితి కారణంగా బీజింగ్‌లో సైన్యాన్ని భారీగా మోహరించారని, Second Ring Road పరిధిలో సైనికులు కనిపించారట .
ఇవన్నీ సోషల్ మీడియాలో చైనాకు చెందిన ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రాసిన పోస్ట్. ఆవిడ చైనాలో లేని మీడియా స్వేచ్చకు వ్యతిరేకంగా అమెరికా వేదికగా పోరాడుతున్నారు. ఈ వాదనలకు ప్రస్తుతానికి అధికార ఆధారాలు లేవు.

చైనాలో ఏం జరుగుతుందనేది బయటకు తొందరగా తెలియదు. గత ఏడాది కూడా జిన్‌పింగ్‌ ను పదవి నుండి దింపటానికి చైనా ఆర్మీలో కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నించారనీ, జిన్‌పింగ్‌ అధికార నివాసానికి దగ్గరగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయనీ, జిన్‌పింగ్‌ అనుకూల వర్గం పరిస్థితిని అదుపులోకి తీసుకొని వైరి వర్గంలో కొంత మందిని కాల్పుల్లో చంపేసి ఒక మేజర్ జనరల్ ను అరెస్ట్ చేశారనీ వార్తలు వచ్చాయి.

ఈ జర్నలిస్ట్ పలు దఫాలుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. తరువాత చైనా ఆ మేజర్ జనరల్  న్యూక్లియర్ రహస్యాల్ని అమెరికాకు అమ్మాడనే ఆరోపణల మీద అరెస్ట్ చేశామని అధికారికంగా ప్రకటించింది.

తరువాత జిన్‌పింగ్‌ చైనా మిలిటరీ అగ్ర నాయకత్వాన్ని purge చేసి కొంత మందిని తీసేశారని కూడా అధికారికంగా చెప్పారు. అంటే ఏదో జరిగింది కానీ అసలు నిజాలు ఎవరికీ పూర్తిగా తెలియదు.

వైరల్ అవుతున్న ప్రతి కథ, జోడించిన కథనం నిజం కావాల్సిన అవసరం లేదు. కానీ చైనా చరిత్ర, ఈ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కథనాలు తరువాత నిజాలు అని తేలటంతో నమ్మకుండా కూడా ఉండలేము. పూర్తి నిజాలు నెమ్మదిగా వస్తాయి, రాకపోవచ్చు కూడా. ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియా కథనం మాత్రమే…

#BRICS2026 #XiJinping #NarendraModi #IndiaChina #BRICS #FactCheck #NewDelhi

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?
  • జస్ట్, సెక్యూరిటీ కాదు- రాష్ట్రపతి పక్కన నడక అంత ఈజీ కాదు!
  • సంపన్నుల లగ్జరీ కొనుగోళ్లు – సిస్టమ్‌కు నష్టమా? లాభమా?
  • ఒకప్పటి తిరుగులేని సామ్రాజ్యం- ఇప్పుడు 4 ముక్కల విచ్ఛిన్నం అంచుల్లో!!
  • దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!
  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions