Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రూ కామ్రేడ్ వెళ్లిపోయాడు – ఆ ఎరుపు రంగూ వెలిసిపోయింది !!

September 15, 2026 by M S R

.

Gurram Seetaramulu … ఆ రాజకీయాలు ఎంత పాపపంకిలమైనా… కామ్రేడ్ సీతారాం ఏచూరి అంటే నాకు అభిమానం.
ఈ దేశంలో హిందుత్వ రాజకీయాలు ఫాసిస్టు రాజకీయాలు వేరు కాదు అని మూడు దశాబ్దాల క్రితమే చెప్పిన మేధావి.

ఇక Cpim పార్టీ ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయింది . అదొక శిలాజం ప్రస్తుతం… వాళ్ళు నందిగ్రాంలో జన సంఘ్ గా, ఆంధ్రాలో తెలుగు దేశంగా , తెలంగాణలో భారత రాష్ట్ర సమితిగా …
మొత్తంగా ఏ పార్టీకీ దగ్గర కాదు అని చెబుతూనే ఫాసిస్టు పార్టీల ఎదుగుదలకే దోహదపడిన మహా గొప్ప పార్టీ వాళ్లది…

Ads

సీతారాం ఆలోచనకు విరుద్ధంగా… ఆయన దేశంలో లేని కాలంలో… కేవలం అణుఒప్పందానికి కాంగ్రెస్ అనుకూలం అనే చిన్న సాకుతో UPA -1 ను కుప్పకూల్చి సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లింది అని చెప్పి, ఫాసిస్టు ఆగమనానికి దారులు పోసిన ఘనులు ప్రకాష్ కారత్ అండ్ కో.,.

కారత్‌కూ ఏచూరికీ నక్కకూ నాకలోకానికి ఉన్నంత దూరం ఆచరణలో, ఆలోచనలో …
ఆంధ్రా తెలంగాణ ఫ్రాక్షన్స్… సీతారాం ఏచూరి వ్యతిరేక కారత్ అనుకూలవర్గం అనేది దాచేస్తే దాగని సత్యం…
ఇది బయట సమాజానికి తెలియదు అనుకుంటారు వాళ్ళు…
పాపం జనాలు, గుడ్డి వాళ్ళు, ప్రజాశక్తి పేపర్‌లో ఏది వస్తే, అదే కింది కేడర్ నమ్ముతారు అని వాళ్ళ అంధ విశ్వాసం…

వాళ్ళ పార్టీ నిర్ణయాలు స్వర్గంలో జరుగుతాయి, నరకంలో బ్రతికే వాళ్ళకు అవి చేరవు, అర్థం కావు అనుకుంటారు. వాళ్లకు వాళ్ళు కులాతీత జనతా ప్రజాస్వామిక విప్లవం అంటుంటారు కానీ ఆ పార్టీలో ఒక కులమే చక్రం తిప్పాలి, అడ్డొస్తే నరికేస్తాం అనీ అంటారు…

వర్తమాన కాలంలో చదువుకున్నతరం అంతరించిపోలేదు అని ఎప్పటికీ రుజువు చేసినవాడు సీతారాం ఏచూరి . ఫాసిస్టు పార్టీని ఓడించాలి అంటే కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొని పోవాలి అనేవాడు . ఆ శక్తులు విడిపోతే అంతిమంగా ఫాసిజమే రాజ్యం సొంతం చేసుకునే ప్రమాదం ఉంటుంది అనేది ఆయన థీసిస్.

ఇప్పుడు అదే జరిగింది, జరుగుతోంది…
Cpim పార్టీ వాళ్ళు ఏనాడూ ఏచూరి ఆలోచనలను గౌరవించలేదు, పైగా ఆయన స్ఫూర్తిని సమూలంగా దెబ్బ తీశారు.
అది ఒక్కరోజులో జరిగింది కాదు, తెలంగాణలో ఆయన ఒంటరి… ఆయన ఆలోచనలు అనాధ… ఇప్పుడు ఆయన లేడు, ఆయన కలలు గన్న ఐక్య సంఘటన ఆనవాళ్ళు కూడా లేవు.

ఇప్పుడు ఈ దేశం సమూలంగా ఫాసిస్టు చేతుల్లో ఉంది.
ధిక్కరించే గొంతులు లేవు, మూక స్వామ్యం ముసుగేసుకున్న ప్రజాస్వామ్యం …
తను మనకి దూరమై రెండేళ్లు…
ఆయనను వ్యతిరేకించిన శక్తులే ఆయన మీద పుస్తకాలు వేసి అమ్ముకున్నారు.
సీతారాం సార్,
మిమ్మల్ని లక్షలాది మంది నిజమైన కామ్రేడ్స్ మిస్ అవుతున్నారు..
.
కుల రొచ్చులో కొట్టుకుని కునారిల్లుతున్న
అభినవ మార్క్స్ , లెనిన్, జింగుచకా గాళ్ళు
మా పార్టీ ఇక నుంచి అన్ని పార్టీలకు సమదూరం అవుతూ …
మానవ సమాజానికి కాంతి సంవత్సరాల దూరంలో దేదీప్యమానంగా వెలుగుతూనే ఉన్నారు…

…
సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ , ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండేళ్ల కింద ఎయిమ్స్‌లో వూపిరితిత్తులు మొరాయించి మనకు దూరం అయ్యాడు.
హైదారాబాద్‌లో జరిగిన జాతీయ మహాసభలో జరిగిన జుగుప్సాకరమైన క్యాంప్ రాజకీయాలలో మైనారిటీ తీర్మానాన్ని గెలిపించిన ధీరుడు అతను… కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అదొక చారిత్రిక ఘటన.

చివరిగా ఒక మాట చెప్పగలను.
ఈ దేశంలో ఒకనాటి UPI నేటి INDA కూటమికి ఏచూరి ఒక అదనపు సొబగు. ఇప్పుడు CPIM లో అంతటి ప్రభావవంతమైన నాయకులు అసలే లేరు. పైగా ఫాసిజానికి మినియేచర్లు.
ఈ దేశానికి ఈ కాలానికి అవసరమైన నాయకుడు సీతారాం ఏచూరి.

I can say It’s an irreplaceable loss to left camp and social democracy. రెస్ట్ ఇన్ పవర్ కామ్రేడ్ సీతారాం, అల్విదా…  ( మొన్నటి 12వ తేదీ ఆయన వర్ధంతి)…

సీతారాం ఏచూరి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • KTR ట్వీట్లు, ఆరోపణలు సరే… ఇంతకీ ఠాణాలో దాడి ఘటన జరిగిందా?
  • ట్రూ కామ్రేడ్ వెళ్లిపోయాడు – ఆ ఎరుపు రంగూ వెలిసిపోయింది !!
  • అచ్యుతం కేశవం … బాగున్నట్టే ఉంది… కానీ ఏదో తెలియని అసంతృప్తి !!
  • GDN – మాధవన్ మరో మంచి పాత్ర! చూడదగిన ఓ బయోపిక్ !!
  • 72 వేల మందికి పీఆర్సీ కట్?… అపోహలేమిటి – నిజాలేమిటి?
  • ‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?
  • తెలంగాణ రెడ్లు, కోమట్లు – వందల తరాలుగా ఓ జన్యులోప వారసత్వం!!
  • కొరగాని వారసులు! ఘోషిస్తున్న బాల్ ఠాక్రే ఆత్మ! – అసలెవరు ఈ దిశా ?
  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions