.
ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’ను భ్రష్టుపట్టించిన ముఖ్యుల్లో మనోజ్ ముంతాషిర్ కూడా ఒకడు… అప్పట్లో తన విఫల సమర్థనలతో కూడా బోలెడు వ్యతిరేకతను ఎదుర్కున్నాడు… ఇప్పుడు రామాయణం సినిమా వస్తున్న నేపథ్యంలో… ఈయన మళ్లీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు… తిక్క చేష్టలు అలవాటే కదా… వివరాల్లోకి వెళ్దాం…
మనోజ్ ముంతాషిర్ మరో వివాదం: రామాయణం కొత్త పాటపై పరోక్ష విమర్శలతో నెటిజన్ల ఆగ్రహం… దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘జై జై రామ్’ పాటపై ప్రముఖ గీత రచయిత, సంభాషణల రచయిత మనోజ్ ముంతాషిర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి… ఆస్కార్ విజేత హన్స్ జిమ్మర్, సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ కలిసి అందించిన ఈ పాటకు శ్రేయా ఘోషల్, అరిజిత్ సింగ్ గాత్రం అందించగా, శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది…
Ads
అయితే, ఈ పాట విడుదలైన మరుసటి రోజే మనోజ్ ముంతాషిర్ తన గత రచనలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంఓ తాజా వివాదానికి దారితీసింది….
వివాదానికి కారణం ఏంటి?
-
స్వీయ ప్రశంసలు…: గతంలో తాను రాసిన ‘ఆదిపురుష్’ చిత్రంలోని హిట్టయిన ‘రామ్ సియా రామ్’ వీడియో క్లిప్‌ను మనోజ్ తన సొంత ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు…
-
పరోక్ష విమర్శ…: హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ లాంటి దిగ్గజాల కాంబినేషన్‌లో వచ్చిన కొత్త రామాయణం పాటను ఉద్దేశించి, నా పాటే బాగుంది అన్నట్టుగా ఆయన ఈ పోస్ట్ పెట్టాడంటూ నెటిజన్లు భావించారు… తన పాటతో పోల్చుకుంటూ కొత్త ప్రాజెక్ట్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారని మండిపడ్డారు… లేకపోతే సరిగ్గా రామాయణం పాట రిలీజ్ సమయంలోనే తన పాత పాటను పోస్ట్ చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి…
-
ఆదిపురుష్ జ్ఞాపకాలు…: 2023లో వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమాలోని ‘రామ్ సియా రామ్’ పాట మినహా మిగతా సంభాషణలు తీవ్ర వివాదాలకు, విమర్శలకు గురయ్యాయి…. ఆ సినిమా మాటల రచయితగా మనోజ్ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు…
సోషల్ మీడియాలో నెటిజన్ల తీవ్ర వ్యతిరేకత… మనోజ్ ముంతాషిర్ చేసిన ఈ పోస్ట్‌పై ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, రెడిట్ వేదికగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు…
“ఆదిపురుష్ వైఫల్యం నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు వెళ్లడం మానేసి, హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ లాంటి దిగ్గజాలతో పోటీ, పోలికలు దేనికోయ్… హాస్యాస్పదం…’’
అంటూ కొందరు ఘాటుగా స్పందించారు… ‘రామ్ సియా రామ్’ మంచిపాట అయినప్పటికీ, ఒక కొత్త ప్రాజెక్ట్‌ను కించపరిచేలా వ్యవహరించడం ఆయన క్రీడాస్ఫూర్తి లేమికి నిదర్శనమని విమర్శించారు… అంతేకాకుండా, గతంలో ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుని పాత్రకు రాసిన వివాదాస్పద సంభాషణలను కూడా నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తుచేసి ట్రోల్ చేశారు…
ఇతర కళాకారుల విజయాలను అభినందించాల్సింది పోయి, తన పాత విజయాలతో పోల్చుకుంటూ ఇతరుల పనిని చిన్నచూపు చూడటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి…
Share this Article