Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సొంతిల్లు లేని కేటీయార్ అవస్థ ఈ తెలంగాణ సమాజానికి పట్టదా!?

September 17, 2026 by M S R

.

Gurram Seetaramulu …. విధి ఆడుతున్న వింత నాటకంలో ఎవరెక్కడ ? ఏవి తల్లీ, ప్రపంచాన్ని వణికించిన చెంగీజ్ ఖాన్ వారసుల ఆనవాళ్ళు ? టోపీలు కుట్టుకుని వచ్చిన సొమ్ముతో బ్రతికిన మొఘల్ సామ్రాజ్య వీరుడు ఔరంగజేబు అస్థికల ఆనవాళ్ళు ఎక్కడ ?

బహుదూర్ షా రెండో మునిమనవరాలు కలకత్తా మురికివాడల్లో ఎందుకుంది ? రాయచూర్, నాందేడ్ మొదలు మూడు రాష్ట్రాలలో విస్తరించి, వందల ఏళ్లు దక్కన్‌ను పరిపాలించి, ప్రపంచ కుబేరుడిగా అవతరించి 5 వేల కిలోల బంగారాన్ని జస్ట్, సిగరెట్ పీక విసిరేసినంత సింపుల్‌గా దానం చేసిన ఏడో నిజాం మనవడు టర్కీలో ఎందుకు గొర్రెలను మేపుకుంటూ బ్రతికాడు, ఎందుకు అనామకంగా చనిపోయాడు ?

Ads

అలహాబాద్ బాద్‌షా కొడుకు కుటుంబం దేశాన్ని నలబై ఏళ్ళకు పైగా పాలించినప్పటికీ నెహ్రూ, ఆయన ముని మనవడు రాహుల్ గాంధీకి ఇప్పటికీ సొంత ఇల్లు ఎందుకు లేదు ?

ఒకవేళ ఉన్నా లేకున్నా లక్షల కోట్లు బ్యాంక్‌లకు ఎగ్గొట్టిన వాళ్ళను, స్విస్ బ్యాంక్‌లో ఉన్న సొమ్ము తెచ్చి, ప్రతి ఎక్కౌంట్‌లో 15 లచ్చలు వేయడం చేతకాకున్నా, 12 ఏళ్ల పాలనలో గాంధీ ఆస్తులను బయట పెట్టడం ఆయనకు ఒక్క మౌస్ క్లిక్‌తో సాధ్యం, మరెందుకు చేయడం లేదు ?

politics

చింతమడకలో రెండు ఎకరాలలో, వందల ఎకరాల భూ వసతి ఉన్న గడీల పుట్టిన బిడ్డ రాస్ట్రాన్ని పదేళ్ళు పాలించినా తన కొడుకు, బిడ్డ అందరూ కలిసి ఉండేంత విశాలమైన భవనం ఎందుకు కట్టుకోలేక, నగరానికి సుదూరంగా 75 కిలోమీటర్ల దూరంలో జస్ట్ డెబ్బై ఎకరాల ఫామ్ హౌజ్‌కే పరిమితం అయి ఓ బీద రైతుగా ఎందుకు మిగిలాడు ?

గోడల మీద వాల్ రైటింగ్ రాసుకుని బ్రతికిన రేవంత్ రెడ్డి, ముక్కి ఏడేళ్ళు డిగ్రీ చదివి, రాష్ట్రాన్ని ఏ హక్కు, అర్హత, అధికారంతో ముఖ్యమంత్రి అయ్యాడు ? అయినా ప్రతిపక్ష నాయకుల ఆస్తుల చిట్టా అడగడానికి అర్హత ఉండాలి కదా ? దొరలు, భూస్వాములు మాత్రమే అర్హులు. గోడల మీద రాతలకు ఆ అర్హత లేదు అన్న సారం గమనించారా ?

ఈ మీటింగ్‌లో మా పేరు లేదు, ఉన్నా మొదటి పేరుగా లేదు. మా ప్రాంతం లేదు. ఈసారి అవార్డు మాకే, మా కులానికే లేదా మా గ్యాంగ్‌కే దక్కాలి అనే దగ్గరే మన మేధావులు ఆగిపోయారు. కుంగిన, కునారిల్లిన బ్రతుకుల గురించి అసలే పట్టలేదు. కుళ్లిన గడీలకు, కూలిన కోటలకు తోరణాలు కట్టే పనిలో మాత్రం బిజీ . న్యూస్‌లో కనబడని వినబడని అంకెలకు నివాళి…

( నిన్నా ఇవ్వాళ అధికార ప్రతిపక్ష పార్టీల ప్రెస్ మీట్లు విన్నాక కలిగిన వైరాగ్యంలో… ) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రక్తికట్టని చరణ్ రీఎంట్రీ సీన్! బిగ్‌బాస్ టీమ్ పూర్ స్క్రిప్ట్ రైటింగ్!!
  • సొంతిల్లు లేని కేటీయార్ అవస్థ ఈ తెలంగాణ సమాజానికి పట్టదా!?
  • రేవంత్ బుల్‌డోజర్ దాడి! పెద్ద దొర గడీ ప్రహారీ గోడలకు బీటలు!!
  • ఇదెక్కడి చోద్యం రాజమౌళీ? డబ్బు కావాలి గానీ థాంక్స్ చెప్పవా..?!
  • 100 శాతం టారిఫ్ పిడుగు! ఇండియా- అమెరికా బంధాలకు విషమ పరీక్ష !!
  • సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్..! ఆశ తీరలేదు – కల నిజం కాలేదు !!
  • ‘చీట్ స్మాల్… చీట్ మెనీ…’ ఓ ఫేక్ మేట్రిమోనీ..! ఇదోరకం ఫ్రాడ్ మనీ !!
  • మళ్లీ ప్రభాస్ ఆదిపురుష్‌పై ట్రోలింగ్ ! గోకి తిట్లు తినడమంటే ఇదే !!
  • హైదరాబాద్ విముక్తి దినం ! తెలంగాణ పార్టీల ఆత్మాభిమాన దరిద్రం !!
  • సీమా పాహుజా ! క్లిష్టమైన ప్రతి సీబీఐ కేసూ ఈమె దర్యాప్తు చేయాల్సిందే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions