.
బిగ్‌బాస్ టీమ్ తామొక్క గొప్ప సర్ప్రైజ్ ప్లాన్ చేశాం, ట్విస్టు అదిరిపోయింది, ఇక ప్రేక్షకులు గమ్మత్తుగా చిత్తయిపోతారు, ఈ దెబ్బకు రేటింగ్స్ రివ్వుమని ఎగుస్తాయి అని భ్రమించినట్టుంది పాపం… పది సీజన్లుగా చూసీ చూసీ సగటు బిగ్‌బాస్ ప్రేక్షకుడికి చాలా తెలుసు, అన్నీ ముందే ఊహించేస్తారు కూడా…
అందుకని చరణ్‌ను హౌజులోకి ప్రవేశపెట్టడం పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమీ కాలేదు… పైగా ఆ సీన్ క్రియేషన్ కూడా అపరిపక్వంగా ఉంది… నవ్వొచ్చింది… షో స్టార్టయి మూడు రోజులు కూడా కాకముందే చరణ్‌ను సిల్లీ రీజన్స్‌తో ఎలిమినేట్ చేయడమే రాబోయే మరో ట్విస్టుకు సంకేతం అని అందరూ గ్రహించిందే…
Ads
బయటికి వచ్చాక శివాజీ ఇంటరాగేషన్ లేదు కదా, అందరికీ అర్థమైంది రీఎంట్రీ ఉంటుందని… ఏ మృత్యు సైనికులైతే తీసుకుపోయారో వాళ్లే వచ్చి అప్పగించిపోయారు… కాకపోతే ఓ సెట్ వేశారు, స్మశానంలాగా… నాలుగు శవపేటికలు…
దాన్ని ఓపెన్ చేయమన్నారు, షాలిని ఓపెన్ చేసింది, అంతే, నువ్వు మాతోరా అన్నట్టుగా గేటు వైపు తీసుకుపోయారు… కాసేపు సస్పెన్స్, తరువాత ఇదేదో వైల్డ్ కార్డ్ ఎంట్రీయో, ఎవరో రీఎంట్రీయో అనుకుని ఆమె తన ముసుగు తీసేయడంతో చరణ్ ప్రత్యక్షం…
ఈమాత్రం దానికి శవపేటిక తెరవడం దేనికి..? దానికీ రీఎంట్రీకి లింక్, సింక్ మన్నూమశానం ఏమీ కుదర్లేదు… ఇంకాస్త బెటర్ రైటింగ్ అవసరం స్క్రిప్టుకు..! అవునూ, మరి చైత్రను కూడా అలాగే మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు కదా… ఆమె సంగతేమిటి..? అదీ కొంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు… ఆమె ఇంటర్వ్యూలు గట్రా ఏమీ రాలేదు బయట, ఎలిమినేషన్ తరువాత..!

నిజానికి హౌజ్ మేట్స్ కూడా అనుకుంటున్నదే చరణ్‌ను మళ్లీ ప్రవేశపెడతారని… ఎదురుచూస్తున్నారు కూడా! కెప్టెన్సీ టాస్కులో దేబ్జానీ బాగా ఆడింది, ఆమే కన్నీళ్లు పెడుతూ చెప్పినట్టు… నసీబ్ రాసిలేదు… త్రిగుణ్, రోహిత్, రాంప్రసాద్, ఝాన్సీ, అమన్ హైలైట్ అయ్యారు… మరో లెవల్ ఉందట టాస్కులో… ఎటొచ్చీ ఆ వంశీ గడ్డం, మొహం, అరుపులే చికాకు పుట్టిస్తున్నాయి..!!
Share this Article