.
మీకు గుర్తుందా..? బిగ్‌బాస్ హౌజులోకి రాగానే కెప్టెన్ రూమ్ చూసి, ఝాన్సీ అంటుంది… ‘ఓహో, ఫస్ట్ కెప్టెన్‌గా నేను ఉండబోయేది ఇందులోనేనా?’… లాంచింగ్ షోలో ఆమె డైలాగ్ స్పష్టంగానే వినిపించింది… కట్ కాలేదు… ఏమిటి ఈ పిల్ల? ఏమిటిలా అంటోంది అని ఆశ్చర్యమనిపించింది…
అవును, నిజంగానే ఆమే ఫస్ట్ కెప్టెన్ అయింది… అంటే, ఇదంతా స్క్రిప్టేనా..? చివరకు కెప్టెన్సీ టాస్కులు కూడా స్క్రిప్టు ప్రకారం నడపాలా..? ఇదంతా యాదృచ్చికం ఏమీ కాదనే అనిపిస్తోంది… జాగ్రత్తగా గమనించండి.., అగ్నిపరీక్ష ఆడిషన్లలో కూడా ఆమెను నేరుగా, అందరికన్నా ముందుగా బిగ్‌బాస్ హౌజులో ఎంట్రీకి ఎంపిక చేశారు…
Ads
అఫ్‌కోర్స్, ఆమె ఆటతీరు కూడా బాగుంది కూడా… ఆమెకు తెలివి ఉంది, తనదైన సొంత ఎత్తుగడలున్నాయి… వేరేవాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది… చూడబోతే మన ఊళ్లో, మన ఇంటిపక్కన ఉండే ఓ అమ్మాయిలా కనిపిస్తుంది, వెకిలి ధోరణులు కూడా కనిపించవు…
ఐతే ఆమె ఫర్దర్‌గా ఇలాగే బిగ్‌బాస్ టీమ్ కరుణతో ముందుకు వెళ్తుందనీ చెప్పలేం… గీతామాధురి, శ్రీముఖి, తనూజ వంటి చాలామంది చివరలో ఎగిరిపోయారు… కాకపోతే ఆమెను బలమైన కంటెస్టెంటుగా చాన్నాళ్లు కాపాడుతుంది బిగ్‌బాస్ టీమ్… అది మాత్రం పక్కా…
ఇదంతా ఊహించాయి ఇతర కంటెస్టెంట్ల సోషల్ మీడియా టీమ్స్… అందుకని ఆమెనే టార్గెట్‌గా చేసి, విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి… గుంటనక్క అనీ, లేడీ కట్టప్ప అనీ, ఏమాత్రం నమ్మదగని కేరక్టర్ అని ఆమె మీద నెగెటివిటీ పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి… వోటింగులో కూడా కనిపిస్తోంది… ఆమె మరీ దిగువన లేదు, ఎగువన లేదు… ఓమోస్తరు వోటింగు మాత్రమే వస్తోంది…
మరో పల్లవి ప్రశాంత్ అని ముద్రవేస్తున్నారు, సింపతీ గేమ్ ఆడుతోందని ఆడిపోసుకుంటున్నారు… కానీ నిజం కాదు, పల్లవి ప్రశాంత్ కేరక్టర్ వేరు, అంతా ఫేక్ అనిపించేలా ఉంటుంది, పైగా విజేత అయ్యాక తన ఫ్రెండ్స్ వీథుల్లో క్రియేట్ చేసిన అరాచకం మరీ దారుణం… బేకార్ బ్యాచ్…
ఝాన్సీ పొలం పనులు చేస్తుంది, పాటలు పాడుతుంది, చదువుకుంటోంది… ప్రమోషన్ రీల్స్ కూడా చేస్తుంది… ఆర్టిఫిషియల్ అనిపించదు… ఆమె వయస్సులో ఉన్న పిల్లలతో ఓసారి పోల్చిచూడండి, బాధ్యతను, కుటుంబ గౌరవాన్ని ఫీలయ్యే కేరక్టర్ ఆమె… అందుకే ఈ ట్రోల్ చూసి ఝాన్సీ తల్లి హేమలతకు కోపమొచ్చింది… మీకేం పుట్టిందిరా, ఎందుకు ట్రోల్ చేస్తున్నారురా అని ఏదో వీడియో కూడా రిలీజ్ చేసినట్టుంది…
ఆమెపై కావాలని నెగెటివ్ కామెంట్లు, పోస్టులు పెట్టేవాళ్లు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఒకటుంది… ఇది ఆట, ఎవరైనా గెలవడానికే ప్రయత్నిస్తారు, ఎవరి స్ట్రాటజీలు వాళ్లకుంటాయి… అలాగే ఇది బిగ్‌బాస్ ఆట, తను అనుకున్నట్టే ఆడిస్తాడు, ఫలితం కూడా వాడు అనుకున్నట్టే ఉంటుంది…!! ఫస్ట్ కెప్టెన్‌గా ఝాన్సీ ఎంపిక కూడా అలాంటిదే..!!~
Share this Article