Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

20 వేల ఎకరాలు ఏం సరిపోతాయి ? ఇంకా ఇంకా కావాలి !!

September 19, 2026 by M S R

 

Pardha Saradhi Upadrasta …. ఈ ప్రపంచానికి పెద్ద కనెక్టింగ్ ఎయిర్పోర్ట్ జర్మనీలోనే అతిపెద్దదైన ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం సుమారు 5,683 ఎకరాల (2,300 హెక్టార్లు) వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇది ఏటా దాదాపు 6 , 7 కోట్ల మంది ప్రయాణికులను , మిలియన్ల టన్నుల కార్గోను హ్యాండిల్ చేస్తుంది. వారిలో 48.7% transfer passengers, అంటే ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాల దేశాల మధ్య తిరుగుతూ జస్ట్ ఈ విమానాశ్రయాన్ని ట్రాన్స్ఫర్ కోసం వాడుతారు. అంటే ఇక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ లు ఎక్కుతారు.

ఈ ప్రపంచంలో ఉన్న అధిక దేశాలకు కనెక్టివిటీ ఉన్న ఇంకొక విమానాశ్రయం దుబాయ్. అలాంటి దుబాయ్ ఎయిర్పోర్ట్ 7200 ఎకరాల్లో ఉంది. ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఈ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుత వార్షిక సామర్థ్యం 11.5 కోట్ల మంది ప్రయాణికులు. 2025 సంవత్సరంలో ఈ విమానాశ్రయం చరిత్రలోనే అత్యధికంగా 9.52 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

Ads

రోజూ లక్షల మంది ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణిస్తుంటారు. పీక్ సీజన్లలో గంటకు దాదాపు 11,500 మందికి పైగా ప్రయాణికులను ఇది హ్యాండిల్ చేయగలదు. ఇది ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాలలోని 110 కి పైగా దేశాలకు, దాదాపు 291 గమ్యస్థానాలకు అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది. ప్రపంచంలోని సుమారు 108 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇక్కడి నుండి తమ సర్వీసులను నడుపుతున్నాయి. ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఉపయోగించే వారిలో దాదాపు సగం మంది (సుమారు 40%-50%) ఒక దేశం , మరో దేశానికి వెళ్లేందుకు ఇక్కడ విమానం మారే (Connecting/Transfer) ప్రయాణికులే.

హైదరాబాద్ విమానాశ్రయం 5,500 ఎకరాలు. కానీ కట్టి 10 యేళ్లు అయినా దానిలో 50% వాడుకోవటం లేదు. 400 ఏళ్ల నగరం, ఇప్పటికే IT, ఫార్మా లాంటి రంగాల్లో ఎంతో ముందుకు పోయిన హైద్రాబాద్ లోనే విమానాశ్రయమే ఇంకా పూర్తిగా వాడబడటం లేదు .

కానీ మన అమరావతి విమానాశ్రయం మాత్రం 20 వేల ఎకరాలు కావాలి అంట. దానిలో రైతులకు, వారికి వీరికి పంచగా మళ్ళీ ఎయిర్పోర్ట్ కు మిగిలేది 5000 ఎకరాలు అట, అంటే ఆ దుబాయ్, ఫ్రాంక్‌ఫర్ట్, హైద్రాబాద్ విమానాశ్రయాలకులాగా అమరావతిలో ఫ్లైట్లు ఎప్పుడు వచ్చేను, అంత రద్దీ ఎప్పుడు అయ్యేను? అసలు అమరావతి విమానాశ్రయానికి అంత మంది వస్తారా? ట్రాన్స్ఫర్ ప్యాసింజర్లు ఎక్కువ అవ్వాలి అంటే ఎన్ని ఏళ్ళు, దశాబ్దాలు పడుతుంది?

పక్కనే మొన్న అంతర్జాతీయ విమాశ్రయం అంటూ ఎంతో అట్టహాసంగా, ఘనంగా ప్రారంభం అయిన భోగాపురం విమానాశ్రయానికి సరి అయిన రోడ్ లేదు. విశాఖ నుండి విమానాశ్రయంకు సుమారు 50 కిలోమీటర్ల దూరం 2 గంటలు పడుతోంది. తిప్పి తిప్పి కొడితే రోజుకి 25, 30 ఫ్లైట్లు వచ్చి పోవటం లేదు.

పక్కనే గన్నవరం విమానాశ్రయం ఉంది. దాన్ని expand చేసుకుంటే పోతుంది. దేశ విదేశాల్లో ఇప్పటికే పెద్ద అధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమల , తిరుపతి వద్ద రేణిగుంట విమానాశ్రయంలో ఇంకా అంతర్జాతీయ విమానాలు దిగటం లేదు. చెన్నైలో దిగి అక్కడ నుండి వస్తారు. దాన్ని expand చేసుకొని అంతర్జాతీయ విమానాలు నడిపితే అక్కడ చాలా ఉపయోగం…

ఇంకా అమరావతి రైల్వే స్టేషన్ కి, బస్టాండ్ లు కట్టడానికి 1000 ఎకరాలు కావాలంట. 1000 ఎకరాల్లో ఎన్ని ప్లాట్ఫారంలు వేస్తారు ?

ఈ రోజు వరకు కేంద్రం నుండి ఇంత పెద్ద రైల్వే స్టేషన్ కానీ విమానాశ్రయం కానీ కడతాం, అవసరం అని చెప్పలేదు, వీళ్ళు ఇక్కడ వేల ఎకరాల పూలింగ్ అనేస్తున్నారు.

మొదటి విడత పూలింగ్ అప్పుడు చెప్పింది అదొక సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని , కంపెనీలకు, మౌలిక సదుపాయాలకు పోగా ప్రభుత్వం వద్ద బోలెడంత ల్యాండ్ బ్యాంక్ వుంటుంది , అది అమ్ముకున్నా అమరావతికి ఫైనాన్స్ వస్తుంది, అప్పులు అక్కర్లేదు, ప్రభుత్వ బడ్జెట్ అవసరం లేదు అన్నారు. చివరకు ఇదే మంత్రి గారు మొదటి విడతలో మిగిలింది 2000 ఎకరాలు మాత్రమే అనేసారు. ఎవరికి ఎంత ఎక్కడిచ్చారో మరి. ఇప్పుడు రెండవ విడత అట. మూడవ విడత ఎప్పుడో……

ఈ లెక్కన అమరావతి నుండి అనంతపురం దాకా ఎక్కడా భూమి మిగిల్చేలా లేరు. అంతా ల్యాండ్ పూలింగ్ లో లేపేసేలా వున్నారు.

భూమి తీసుకోవడం తప్పు అని కాదు. అభివృద్ధి జరగాలి, కానీ భారీ భూసమీకరణకు సమానంగా భారీ పారదర్శకత కూడా ఉండాలి. భారీ పథకాలు వుండాలి. నగరం ఎప్పుడు విస్తరిస్తుంది? జనాలు ఎప్పుడిస్తారు? ఇన్ని విమానాలు, ప్రయాణికులు ఎప్పుడు వస్తారు? ఇంకొక 50, 75 ఏళ్ళకు అన్నా వస్తారా? ఇక తిట్టేసుకోండి ఆంధ్ర ద్రోహి అని….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 20 వేల ఎకరాలు ఏం సరిపోతాయి ? ఇంకా ఇంకా కావాలి !!
  • పెళ్లానికి తెలీకుండా లవర్‌తో జాలీ విదేశీ ట్రిప్‌ ప్లాన్… కానీ..?
  • ‘పంచనామా’ కాదు… పాత యాంకర్ ఉదయభాను ఇజ్జత్ పంచనామా!
  • రాముడికన్నా లక్ష్మణుడు కాస్త పొడుగు ఉండకూడదా ఏం?!
  • దానం అనర్హత కేసులో సుప్రీంకోర్టుకు టీబీజేపీ!
  • హార్వర్డ్ హైదరాబాద్‌కు..! ఇక విదేశీ విద్యకూ భాగ్యనగరం!!
  • ఫస్ట్ నుంచీ దానం జర్నీ అంతే … అదృష్టం- దురదృష్టం సమాంతరంగా!
  • ఆస్కార్‌కు గొందల్ ! భారీ పోటీ నడుమ ఈ మూవీయే ఎందుకు ఎంపిక?!
  • మమతకు దెబ్బ మీద దెబ్బ… డెస్టినీ ఎదురుతంతే… అంతే…
  • ఫస్ట్ కెప్టెన్ ఝాన్సీ! సరైన ఫలితమే! కానీ యాదృచ్ఛికమేనా?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions