.
తెలంగాణ ఏర్పడగానే మొదలు… తెలంగాణ భాషలో అగడు పడ్డట్టు.., అంటే ఆబగా, పైనబడి వందల ఎకరాలను ‘ధరణి’ అనే ఓ మాయదారి కుట్ర సిస్టం తీసుకొచ్చి… అసైన్డ్ భూములు, ఇనాం భూములు, ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు… చివరకు ఈడీ, ఐటీ జప్తు చేసిన భూముల్ని సైతం… ఇంకా తవ్వితే ఏమొస్తాయో… ఎనిమీ లాండ్స్, సీలింగ్ భూములు… వందలు, వేల ఎకరాలను సోకాల్డ్ ఉద్యమ పార్టీ ముఖ్య నేతలు కాజేశారు… కొల్లగొట్టారు… (జయలలిత భూముల గురించి తెలియదు)…
బహుశా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్కామ్ ఇదే అయి ఉంటుంది… ఇంతా చేసి, వేల కోట్ల భూముల్ని, ఆస్తుల్ని పొట్టపగిలేట్టు, ఓ వంద తరాలు తినేట్టు… కాజేసిన, తిన్న వాళ్లు తీరా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కొక్కరి భూబాగోతాన్ని బట్టబయలు చేస్తుంటే… అబ్బే, మేమందరమూ కలిసి ఉండటానికి సరైన ఇల్లు లేక, మా అయ్య ఓచోట, మేం ఓచోట బతుకుతున్నాం కనాకష్టంగా అంటున్నాడు కేటీయార్…
Ads
తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా బోల్డ్ లెటర్స్‌లో రాసుకుని, పదే పదే అలవిమాలిన వైరాగ్యంతో సగటు తెలంగాణవాసి తన మీద తనే జాలిపడుతూ నవ్వుకునే వ్యాఖ్య… ఒక జాతిపిత సృష్టించిన ఓ మహా అవినీతి రాజ్యం… బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే ప్రతి ప్రతిపక్ష అభ్యర్థి ఎన్నికల ఖర్చును నేను భరిస్తాను అని కేసీయార్ అన్నప్పుడే తెలంగాణవాసికి అర్థమైపోయింది… తన గురువు చంద్రబాబును మించి లక్ష రెట్లు అవినీతికి దారులు పరచాడని..!!

మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి లెక్కలు, వివరాలు చెబుతుంటే యావత్ తెలంగాణ సమాజం విస్తుపోయింది… ఓ జాతిపిత, తెలంగాణ ముఖ్యమంత్రి, బాపు అసలు రూపం ఇదా అని… కేటీయార్, కేసీయార్, హరీష్‌రావు, కవిత, సంతోష్ తదితర కల్వకుంట్ల కుటుంబ సభ్యుల గిన్నీస్ బుక్ రికార్డు అవినీతి, అక్రమాలే కాదు… దయాకర్‌రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సుధీర్‌రెడ్డి, డ్రగ్స్ కేసు రోహిత్ రెడ్డి… ఇంకా ఎందరో…
ఇవన్నీ ఎందుకు..? హైదరాబాదులో బీఆర్ఎస్ నేతల స్వైరవిహారం (పాపం, పాలమ్మిన, పూలమ్మిన వేల కోట్ల చామకూర మల్లారెడ్డి కూడా తక్కువేనేమో) కథలు బయటపడేకొద్దీ తెలంగాణ సిగ్గుతో తలదించుకుంటోంది… ఓ విముక్తి ఉద్యమం ఇలాంటి నేతల్ని తయారుచేసి, తెలంగాణ మీదికే భస్మాసురుల్ని ప్రయోగించిందా అని…
తాజాగా టీపీసీసీ ఎన్ఆర్ఐ లీగల్ సెల్ మరో నిజాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టింది… అక్రమాల అడ్డా జన్వాడ కేటీయార్ ఫామ్ హౌజు తనదే అని ఎవరో ప్రదీప్ రెడ్డి చెబుతున్నాడు కదా… కాదు, దాన్ని 2023 ఎన్నికల్లో కేటీయార్ తన భార్య శైలిమ ఆస్తిగా చూపించాడట… మళ్లీ తనే చెబుతాడు, మేం ఉండటానికి సరైన ఇల్లు లేదని…
- నిజంగానే తెలంగాణ ఎంత అమాయకపు సమాజం… ఎంత నిలువు దోపిడీకి గురవుతున్నా సరే, పదే పదే తనపై దాడి చేసి దోచుకునే వాళ్లనే నమ్ముతోంది… ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ సాక్షిగా… చివరకు ఎవడి పాలైందిరో తెలంగాణ…

ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్కామ్ ధరణి… వేల ఎకరాల స్వాహాయణం… భూబకాసురులు సాగించిన భూభోజనం..! నో, నెవ్వర్, రేవంత్ రెడ్డికి ఇంత పెద్ద పుట్టను తవ్వి, శిక్షించడం తనతో కాదు… తెలంగాణ ఏర్పడిననాటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో జరిగిన భూబాగోతాలపై నిజంగానే ఓ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే…. ప్రపంచమే నివ్వెరబోయే ఇంకెన్ని స్వాహాయజ్ఞాలు బయటపడతాయో…
కానీ బీజేపీ జరగనివ్వదు… బీజేపీ అత్యంత కీలకనేత సంతోష్‌నే తీసుకుపోయి జైళ్లో నూకాలని కేసీయార్ ప్రయత్నిస్తే ఏమాత్రం సిగ్గు, అభిమానం లేకుండా… ఈరోజుకూ కేసీయార్‌ను కాపాడుకొస్తున్నది మోదీషా… రాజకీయాల్లో నైతికత కూడా ముఖ్యమే మోదీ సాబ్, మీ బండి సంజయ్‌కు ఉన్నంత టెంపర్‌మెంట్ కూడా మీకు లేదు…
తిట్టిపోసిన చంద్రబాబును ఆప్యాయంగా అలుముకున్నట్టే, రేప్పొద్దున కేసీయార్‌నూ అలుముకుంటాడు మోదీ… మళ్లీ తెలంగాణవాసి బిక్కమొహం వేసి… ఈ బకాసురుల కోసమా మేం వేలాదిగా ప్రాణత్యాగాలు చేసింది అని అమరవీరుల ఆత్మలూ ఘోషించి… ఛ ఛ…

విప్రో సర్కిల్‌లోని ఫీనిక్స్ బిల్డింగ్ ఎవరిది..? వేల కోట్ల ప్రాపర్టీ ఇది… బీజేపీ నేతలకు తెలియదా… ఈడీలు, సీబీఐలు, మన్నూమశానాలు కళ్లుమూసుకున్నాయా..? తెలంగాణకు బీఆర్ఎస్ ముఖ్యనేతలు చేసిన ద్రోహం, మోసంకన్నా బీజేపీ చేస్తున్న మోసమే అనైతికం, అత్యంత దారుణం..!!
Share this Article