Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘ ఆ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ నా మెంటల్ మ్యాప్ మార్చేశాడు ’’

September 20, 2026 by M S R

.

అజిత్ దోవల్… ఇండియన్ జేమ్స్‌బాండ్, సూపర్ స్పై వంటి చాలా విశేషణాల్ని ఉపయోగిస్తారు ఆయన గురించి మనవాళ్లు ఏం చెప్పాలనుకున్నా… ఇండియా తరఫున చాలా కీలకమైన గూఢచర్య, సైనిక ఆపరేషన్లలోనూ తన పేరు వినిపిస్తూ ఉంటుంది… కొన్ని దశాబ్దాలుగా…

దేశభద్రతకు సంబంధించి తెరవెనుక జరిగే రహస్య కార్యాచరణలో తన ప్రమేయం తప్పక ఉంటుంది… నిజానికి తను కేరళకు చెందిన ఐపీఎస్ కేడర్ అధికారి… మొదట్లో కొన్నాళ్లు కేరళలో చేశాడు, తరువాత ఇంటలిజెన్స్ బ్యూరోలో చేరాక ఇక వెనక్కి వెళ్లలేదు, రొటీన్- రెగ్యులర్ సర్వీసులో లేడు…

Ads

దోవల్ పేరు వినగానే ఫస్ట్ స్పురించేది తను పాకిస్థాన్‌లో అనామకంగా బతుకుతూ గూఢచారిగా పనిచేసిన తీరు… కానీ అంతకుముందు తన దేశపు తూర్పు ప్రాంతాల్లో కీలక ఆపరేషన్లు నిర్వహించేవాడు… ప్రత్యేకించి కొన్ని ఈశాన్య రాష్ట్రాలు అంతకుముందు ఇండియాలో భాగం కావు… వాటిని కలుపుకోవడానికి చైనా, ఇండియా నడుమ ఓ స్పర్థ నడిచేది…

అలాంటిదే సిక్కిం కూడా… శనివారం (సెప్టెంబర్ 19)  ఐఐటి రూర్కీ స్నాతకోత్సవ వేడుకలో మాట్లాడుతూ… అక్కడ తను పనిచేసిన తొలి నాళ్లలో తనకు ఎదురైన ఇబ్బందుల్ని చెప్పుకొచ్చాడు…

‘‘ఇరవయ్యేళ్లకే నేను స్పైగా మారిపోయాను… మరీ తొలినాళ్లలోనే సిక్కిం బాధ్యతలు ఇచ్చారు… అప్పటికి అది మన దేశంలో భాగం కాదు… ఇండియాలో విలీనంపై చర్చలు, సంప్రదింపులు సాగుతున్నాయి… చైనాకు అది ఇష్టం లేదు… సరిహద్దు ప్రాంతాలపై నిఘా వేయడం, చైనా ఆర్మీ కదలికలపై నిఘా మా టీమ్ పని… మేమిచ్చే రిపోర్టులను బట్టి ఢిల్లీలో రాజకీయ వ్యవహారాలు ఉండేవి…

ఓసారి ఒక మిషన్‌లో భాగంగా సమాచారం సేకరిస్తూ మా టీమ్ సరిహద్దుల్లోకి వెళ్లింది… ప్లాన్ ప్రకారం వారం రోజుల్లో తిరిగి వచ్చేయాలి… కానీ రెండు వారాలు గడిచినా కమ్యూనికేషన్ లేదు, తిరిగి రాలేదు… అప్పట్లో కమ్యూనికేషన్, కంటాక్ట్ చాలా కష్టం కదా… పైగా ఆరోజుల్లో హిమపాతం, అడవులు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో ఆ టీమ్ ఏమైందో అర్థం కాలేదు…

నా టీమ్ చైనా ఆర్మీకి దొరికిపోయిందని హెడాఫీసు నుంచి ఫోన్ కాల్ వచ్చింది… అక్కడికి ఆ సమాచారం ఎలా తెలిసిందో నాకర్థం కాలేదు… కానీ అది నిజమే… చైనా లిబరేషన్ ఆర్మీ మా టీమ్‌ను పట్టుకుంది, సుదీర్ఘ విచారణ, తీవ్ర ఒత్తిళ్లు… కాస్త సీరియస్ దౌత్య ప్రయత్నాలతో చివరకు రిలీజ్ చేసింది చైనా… కానీ ఇంత నిర్లక్ష్యం ఏమిటంటూ నాపై ఉన్నత స్థాయి విచారణ మొదలైంది…

ఇక ఈ కెరీర్ క్లోజ్ అయినట్టే అనుకున్నాను… కానీ ఉన్నతాధికారుల విచారణలో మరో నిజం బయటపడింది… హెడాఫీసు మాకు సమకూర్చిన మ్యాపులు, రూట్ స్కెచ్చుల్లోనే లోపాలుండి, వాటి వల్లే నా టీమ్ చైనాకు చిక్కిందని తేలింది… హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను… ఆ ఇబ్బంది నుంచి బయటపడినా సరే చాన్నాళ్లు నన్ను ఆందోళన విడిచిపెట్టలేదు, అధైర్యం ఆవరించింది…

డిప్రెషన్… ఓ ముసలి టిబెటన్ షెర్పా ఆఫీసర్ కొన్ని మాటలు చెప్పాడు… లైఫ్ కూడా ఓ మ్యాప్ వంటిదే… కొందరు కరెక్టుగా చదువుతారు, కొందరు తప్పుగా చదువుతారు, అన్వయంలో కూడా తేడాలు… మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి గమ్యం, ఎలా ప్రయాణం అనే విషయాలపై స్పష్టత ఉంటే చాలు, అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి, దాటేస్తూ వెళ్లిపోవడమే మన పని అని బోధించాడు… ఈరోజుకూ అవే నా మీద పనిచేస్తున్నాయి… నన్ను నడిపించేవి ఆ షెర్పా ఆఫీసర్ మాటలే… టార్గెట్, ఎఫర్ట్… అంతే’’

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధం ముదురుతోంది – ప్రపంచ దేశాలన్నీ లాగబడుతున్నయ్ !!
  • ‘‘ ఆ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ నా మెంటల్ మ్యాప్ మార్చేశాడు ’’
  • అంతటి కమలహాసన్ సైతం… ఆ అక్కినేని సీన్లలో వెలవెలా..!!
  • ఇరుముడి ! థియేటర్- ఓటీటీ వీక్షకుల వేర్వేరు స్పందనలు..!!
  • కనిమొళి థర్డ్ ఫ్రంట్ ప్రయాస – కేసీయార్ రెడీయా..? సాహసిస్తాడా..?
  • ‘‘ వసూళ్లు తప్ప విలువల్లేవు – నేనిక నటించను – ఇక చాలు ’’
  • ఎదుటివారి ప్రశంస మనకు మత్తు – అందుకే ఆడంబర ప్రదర్శనలు
  • అగడు పడ్డట్టు తెగ మింగారు! ఎవడి పాలైందిరో నా తెలంగాణ !!
  • సౌదీ మరింత చిక్కుల్లోకి! రెండు జెట్ ఫైటర్లను కూల్చిన హుతీలు!!
  • 20 వేల ఎకరాలు ఏం సరిపోతాయి ? ఇంకా ఇంకా కావాలి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions