Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అర్ధరాత్రి- అందరూ నిశ్శబ్దం- గుప్త తాంత్రిక పూజ- ఎక్కడంటే?

October 14, 2026 by M S R

.

1) వైఖానస, పాంచరాత్ర వంటి సంప్రదాయిక దక్షిణాచార ఆగమ పూజల్లో అభిషేకాలు, అలంకరణలు, నామార్చనలు, కుంకుమార్చనలు వంటివి కనిపిస్తాయి… 2) కొమురవెల్లి వంటి శైవ క్షేత్రాల్లో మైలపోలు, పట్నం వంటి మరో విశిష్ట అర్చన కనిపిస్తుంది… 3) కామాఖ్యలో గానీ, తారాపీఠ్‌‌లో గానీ బలులు, వామాచార తాంత్రిక పూజలు కనిపిస్తాయి, అంటే పంచ మకారాల కౌలాచారం…

4) సమ్మక్క- సారలమ్మ క్షేత్రంలో అడవి నుంచి తెచ్చిన కుంకుమ భరిణెలకు బెల్లం, కొబ్బరికాయలతో పూజలుంటాయి… 5) గ్రామదేవతలు అంటే శక్తిస్వరూపాలు, కల్లు-సారా సాకపోసి, బలిచ్చి, మాంసనైవేద్యం సమర్పించడం మరో పాపులర్ పద్ధతి… 6) పూరిలో దేవుళ్ల దారువిగ్రహాలను మార్చాలనుకున్నప్పుడు ఓ విశిష్ట పూజాపద్ధతిలో మహత్తును కొత్త విగ్రహాల్లోకి ఆవాహన చేయించడం మరో విశిష్ట పద్ధతి…

Ads

medaram

7) తిరువనంతపురంలోని ప్రసిద్ధ అట్టుకల్ భగవతి గుడి దగ్గర ఓరోజు లక్షల మహిళలు ఇరుముడిలో నైవేద్య సరుకుల్ని తీసుకొచ్చి, వరుసగా పొయ్యిలు పేర్చి, అక్కడే పొంగలి నైవేద్యం వండి సమర్పిస్తారు… 8) కర్నాటక, బెళగావి జిల్లా కిత్తూరులోని ఛాజుకా దేవి జాతరలో వేలాది కుటుంబాలు బొబ్బట్లు, మిర్చి బజ్జీలు అక్కడే వండి పంచిపెడతారు… మహాదాసోహ క్రతువులో ఓ ఏడాది ఏకంగా 20 లక్షల రోటీలు, 6 లక్షల షెంగహోలి (హోలిగ), 400 క్వింటాళ్ల మదలి, 10 క్వింటాళ్ల తుప్ప పంపిణీ… అదొక రికార్డు…

mirchi bajjji

…. ఇలా ఒక్కో గుడిలో ఒక్కో పూజా పద్ధతి… ప్రధానంగా ఆదిశక్తి స్వరూపాలుగా పిలువబడే, కొలువబడే దేవతలకు ఆయా స్థానిక, సంప్రదాయిక అర్చన పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి… వేటికవే ప్రత్యేకం… ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే..? ‘మహిళల శబరిమల’ అని పిలువబడే మండైకాడు భగవతి అమ్మన్ గుడిలో జరిగే ఓ విభిన్న పూజాతంతు చదువుతుంటే, పైవన్నీ గుర్తొచ్చాయి… ఈ పూజ పేరు ఒడుక్కు పూజ…

holige

మామూలుగా జాతర, ఉత్సవం అంటే చప్పుళ్లు, కోలాహలం, డప్పులు, బాజాలు, నినాదాల సంరంభం కదా… సమ్మక్క ఆగమనం అయితే పోలీసుల కాల్పుల స్వాగతం, ఎదురుకోళ్లు, నినాదాలతో అడవి దద్దరిల్లుతుంది… కానీ మండైకాడులో పూర్తి భిన్నంగా ఓ పదిరోజుల మాసి కోడై ఉత్సవం ముగింపు వేళ ఈ ఒడుక్కు పూజ నిర్వర్తిస్తారు…

odukku pooja

ఇందులో నిశ్శబ్దం, రహస్య తాంత్రిక పూజ ప్రధానం… పూజ ప్రారంభమవడానికి ముందు ఆలయంలోని లైట్లన్నీ పూర్తిగా ఆర్పివేస్తారు… కేవలం సాంప్రదాయ నెయ్యి దీపాలు లేదా నూనె దివిటీల (Theevetti) వెలుతురులో మాత్రమే గర్భగుడిలో పూజ జరుగుతుంది… ఈ సమయంలో భక్తులందరూ అత్యంత నిశ్శబ్దాన్ని పాటిస్తారు…

mandaikadu

అమ్మవారి ఉగ్రరూపాన్ని లేదా శాంత స్వరూపాన్ని లయం చేసే తాంత్రిక ప్రక్రియగా దీనిని భావిస్తారు… అర్చకులు కూడా మూతులకు అడ్డంగా వస్త్రాన్ని ధరించి, కాగడాలను ఊరేగింపుగా తీసుకొస్తారు… అర్ధరాత్రి ప్రత్యేక నైవేద్యాల్ని సమర్పించి ఉత్సవాలను ముగిస్తారు ఒడుక్కు అంటే ముగింపు అని అర్థం…

mandaikadu

‘మాసి కొడై’ (Maasi Kodai) ఉత్సవాల సమయంలో కేరళ, తమిళనాడుల నుండి లక్షలాది మంది మహిళా భక్తులు ఇరుముడి కట్టుకుని వస్తారు… వారు ఆలయ పరిసరాలలో, సముద్ర తీర ప్రాంతంలో పొయ్యిలు పెట్టి అమ్మవారికి పొంగల (పొంగలి) వండి నైవేద్యంగా సమర్పిస్తారు… ఇంట్రస్టింగు..!!

women sabarimala

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అర్ధరాత్రి- అందరూ నిశ్శబ్దం- గుప్త తాంత్రిక పూజ- ఎక్కడంటే?
  • మహిళలకు ప్రత్యేకంగా వేరే శబరిమల..? నిజమేంటో చెప్పుకుందాం..!!
  • ఓ వెధవ ట్రోలర్‌కు వేణుస్వామి భార్య వీణశ్రీవాణి పర్‌ఫెక్ట్ కౌంటర్ !!
  • CJP – కూలీ ఇచ్చి మరీ తన్నించుకున్నట్టు అయిపోయింది !!
  • రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు
  • అసలే గతితప్పిన సంసారి… పైగా సమాజానికి బోడి ఉచిత సలహాలు…
  • పిచ్చి స్క్రిప్టుతో అభాసుపాలు – ఇప్పుడు దిద్దుబాటుకు మరో ప్రయాస
  • డియర్ చంద్రబోస్, ఓ నాలుగు రోజులు చల్లగరిగెలో ఉండి రావచ్చుగా…
  • Ellis Island – అమెరికా పారడాక్స్ వలస కథలకు అచ్చమైన సాక్ష్యం !!
  • నిషా నూర్‌..! ఈమెదీ సిల్క్ స్మిత కథేనా..? డర్టీ పిక్చర్‌-2 అదేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions