Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘యాదాద్రి’పై రేవంత్ రెడ్డి కొరడా ! కేసీయార్ నిర్వాకాలే అసలు తలనొప్పి !!

October 15, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి కొరడా తీశాడు… పనిచేయకుండా, ఫలితాలు చూపకుండా మొరాయిస్తున్న సీనియర్ ఐఏఎస్‌లనూ ఉపేక్షించేది లేదనీ, సస్పెండ్ చేస్తాననీ హెచ్చరించడంతో… కదలిక వచ్చింది… ఎనర్జీ సెక్రెటరీ నవీన్ మిత్తల్, జెన్‌కో సీఎండీ ఎట్టకేలకు కదిలారు… యాదాద్రి థర్మల్ ప్లాంటకు పరుగులు తీశారు…

అంతేకాదు, ఇతర శాఖలకు చెందిన ఐదుగురు ఐఏఎస్‌లను కూడా ఈ ప్లాంటు సమస్యల అధ్యయనం, సరైన చర్యల కోసం నిర్దేశించాడు తాజాగా… ఈ నెలాఖరు వరకు వాళ్లు వంతులవారీగా అక్కడే తిష్ట వేసి, ఆయా సమస్యల్ని సార్టవుట్ చేయడానికి ప్రయత్నించాలి… ప్లాంటు సీఈని కూడా సస్పెండ్ చేశారు తాజాగా…

Ads

నిన్న ప్రత్యేకంగా ‘పంటలకు కరెంటు సరఫరా’పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి ఎనర్జీ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా… (కొందరు అధికారులు సర్కారుపై వ్యతిరేకత పెరగడానికి ఉద్దేశపూర్వకంగానే విధినిర్వహణలో మొరాయిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది…)

యాదాద్రి థర్మల్ ప్లాంటు కుంటినడకకు కూడా కేసీయార్ నిర్వాకాలే కారణం… ఇది మరో కాళేశ్వరం… అసలే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో భద్రాద్రి థర్మల్ ప్లాంటు నిర్మించడం ఓ తప్పు నిర్ణయం కాగా… ఈ యాదాద్రిని సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మించినా… పిట్ హెడ్ (ఇంధనం ఉన్న దగ్గర) ప్లాంటు కాకపోవడం ఓ శాపం… సింగరేణి నుంచి నాణ్యమైన బొగ్గు సరఫరాపై తప్పుడు అంచనాలు మరో శాపం… దాంతో అల్ట్రా మెగాపవర్ ప్లాంటు కావల్సిన ప్లాంటు కాస్తా కుంటి నడక నడుస్తోంది…

yadadri thermal

ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ప్రత్యేకించి కేటీఆర్ చేసిన ఆరోపణల గురించీ చెప్పుకోవాలి ఓసారి… నిన్న సింగరేణిలో కేటీఆర్ అనేక విమర్శలు చేశాడు… తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులనే ఈ ప్రభుత్వానికి ఆపాదించాడు… నిజానికి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది బీఆర్ఎస్, కేసీయార్… సింగరేణి సరఫరా చేసే జీ-9 గ్రేడ్ నాణ్యత బొగ్గుపై నిజాలు ఇవీ…

పదేళ్లలో సింగరేణి సరఫరా చేసిన ఈ నాణ్యమైన బొగ్గు సగటున కేవలం 4 మిలియన్ టన్నులు… 9 గనుల్లో ఉత్పత్తి ఉన్నా అవసరాలకు సరిపడా లేదు… ఈ ఏడాది జెన్‌కో కేంద్రాలకు సరఫరా చేసిన జీ9 బొగ్గు కేవలం 0.52 మిలియన్ టన్నులు మాత్రమే…

కానీ ఈ యాదాద్రి ప్లాంటుకు ఏటా 14 మిలియన్ టన్నుల జీ-9 బొగ్గు సరఫరా చేసేలా ఇంధన సరఫరా ఒప్పందం కుదిరింది కేసీయార్ హయాంలో జరిగిందే… సింగరేణి భవిష్యత్తులో చేపట్టే కొత్త గనుల నుంచి పెరిగే ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకొని ఆ ఒప్పందం రాసి మమ అనిపించేశారు…

తీరా ఆచరణకు వచ్చేసరికి సింగరేణి కొత్త గనులపై బీఆర్ఎస్‌కు ఓ దశ, ఓ దిశ లేకుండా పోయాయి… కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకపోవడంతో కీలకమైన కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాకులు సంస్థకు దక్కలేదు… ఫలితంగా ఏటా దాదాపు 10 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశాన్ని సింగరేణి కోల్పోయింది…

దాదాపు 14 గనులు మూతపడటం కూడా ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపింది… దీనివల్ల 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సింగరేణి కోల్పోయింది … ఈ రేవంత్ సర్కారు నయం, రెండేళ్లలోనే నైనీ బొగ్గు గనికి అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించారు… కేసీయార్ హయాంలో నైనీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు…

యాదాద్రి ప్లాంటును కేవలం కమీషన్ల కోసం అతుకుల బొంతలా నిర్మించి, సాంకేతిక లోపాలతో మూలన పడేలా చేసింది మీరు కాదా…? ఆ లోపాలను సరిదిద్దుతుంటే మాపై విమర్శలు చేస్తారా…? అని మంత్రి శ్రీధర్ బాబు కేటీయార్ మార్క్ యాదాద్రి, సింగరేణి విమర్శలకు సరైన జవాబులే ఇచ్చాడు తాజాగా…

కానీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసి, అధికారం పోగానే అవన్నీ మరిచి ఉల్టా విమర్శలు చేయడం బీఆర్ఎస్‌కు బాగా అలవాటైపోయింది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘యాదాద్రి’పై రేవంత్ రెడ్డి కొరడా ! కేసీయార్ నిర్వాకాలే అసలు తలనొప్పి !!
  • రజినీ ఒక్కడు చాలదా..? మరీ ఇన్ని కామియోలు ఎందుకురా బుజ్జా..!!
  • కట్టి, కూల్చి, మళ్లీ కట్టి… కేసీయార్ మార్క్ ‘ఇంజినీరింగ్ అద్భుతం’…
  • మళ్లీ తెరపైకి బనకచర్ల ! చంద్రబాబు తమిళనాడు నుంచి నరుక్కొస్తున్నాడా..!?
  • జాతీయ పరీక్షల్లో AI సాయం ! నందన్ నీలేకని ప్రతిపాదన భేష్ !!
  • గజల్ శ్రీనివాస్ అంటేనే… గజలియత్‌కు ఓ అవమానం, ఓ కళంకం !!
  • ఓ సామాజిక కథతో మళ్లీ కలిసిన సీతారాముల జంట!
  • ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!
  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!
  • 40 ఏళ్ల కిందటే ఉమ్మడి పౌరస్మృతి, విదేశీ నిధులు, మతమార్పిడిపై చర్చ!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions