Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!

October 17, 2026 by M S R

.

డీప్ స్టేట్ ఫస్ట్ టార్గెట్ యూపీ… అక్కడ యోగీని, బీజేపీని దింపేయాలి… తిరిగి యాదవ- ముస్లిం క్రిమినల్ మాఫియా రాజ్యం స్థాపించాలి… వచ్చే లోకసభ ఎన్నికల నాటికి బీజేపీ బలం గణనీయంగా తగ్గిపోవాలి… తద్వారా కేంద్రంలో యాంటీ-బీజేపీ ప్రభుత్వానికి మార్గం సుగమం చేయాలి…. ఈ ప్రచారం ఉంది కదా…

కానీ ఇప్పుడప్పుడే యూపీలో పాత ఎస్పీ అఖిలేష్- కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే సూచనలు ఏమీ కనిపించడం లేదు… అలా అని News18 మెగా సర్వే చెబుతోంది… అఖిలేశ్ బలం పెంచుకుంటున్న మాట నిజమే అయినా… యోగీని వెనక్కి నెట్టేంత స్థాయికి చేరుకున్నాడా అంటే ఇప్పటికైతే లేదనే సమాధానం ఈ సర్వే ఫలితాల్లో కనిపిస్తోంది…

Ads

2027 ఎన్నికలకు ముందే బీజేపీకి బూస్ట్.. ముఖ్యమంత్రి రేసులో యోగీకి అందనంత దూరంలో అఖిలేశ్!! ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమరం ఇప్పుడే మొదలైంది… 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది… గత ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన అఖిలేశ్ యాదవ్… ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాడు… కానీ, ప్రస్తుతానికి ప్రజాభిప్రాయం మాత్రం యోగి ఆదిత్యనాథ్ వైపే మొగ్గుచూపుతున్నది…

up survey

యోగీకి 66 శాతం.. అఖిలేశ్‌కు 24 శాతమే! 2027 ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు ఓటింగ్ జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 66.6 శాతం మంది మద్దతు ఇస్తామని చెప్పారట… సమాజ్‌వాదీ పార్టీ–కాంగ్రెస్ కూటమికి 26.4 శాతం, మాయావతి బీఎస్పీకి 5.4 శాతం మంది మద్దతు పలికారట… అంటే ప్రధాన ప్రత్యర్థి కూటమితో పోలిస్తే ఎన్డీయేకు దాదాపు 40 శాతం పాయింట్ల ఆధిక్యం!

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న దగ్గరకు వస్తే యోగి ఆదిత్యనాథ్‌కు 66.2 శాతం మంది మద్దతు పలికారు… అఖిలేశ్ యాదవ్‌కు 24.4 శాతం మంది మాత్రమే మొగ్గుచూపారు… దాదాపు 42 శాతం పాయింట్ల తేడా! అంటే యోగీకి మరోసారి ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలనుకునే వారి సంఖ్య అఖిలేశ్‌కు అవకాశం ఇవ్వాలనుకునే వారి కంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట…

ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది… యోగీ ప్రభుత్వం పనితీరుపై 77.1 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారట… మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని 65.2 శాతం మంది అభిప్రాయపడ్డారట… ఇవన్నీ అధికార పార్టీకి అనుకూలమైన సంకేతాలే…

yogi

యోగీకి కలిసొస్తున్నది ఏమిటి? ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో యోగి ఆదిత్యనాథ్‌కు బలమైన నాయకుడిగా గుర్తింపు రావడానికి ప్రధాన కారణాల్లో శాంతిభద్రతల అంశం ఒకటి… ఒకప్పుడు యూపీ అంటేనే గూండారాజ్, రాజకీయ కక్షలు, మాఫియా పెత్తనం అనే విమర్శలు వినిపించేవి… ఇప్పుడు ఆ పాత పరిస్థితులు తిరిగి రావద్దనే ఆలోచన ఓటర్లలో బలంగా ఉందని సర్వే సూచిస్తోంది…

ప్రభుత్వ శాంతిభద్రతల నిర్వహణపై 74 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, మౌలిక సదుపాయాల విషయంలో 68.6 శాతం, సంక్షేమ పథకాల అమలుపై 66.3 శాతం మంది సానుకూలంగా స్పందించారు…

ఈ అంశం యోగీకి రాజకీయంగా పెద్ద ప్లస్ పాయింట్… ఎందుకంటే ఎన్నికల సమయంలో కుల సమీకరణాలు, మతపరమైన అంశాలు, సంక్షేమ పథకాలు ప్రభావం చూపినా… తమ కుటుంబానికి భద్రత ఉందనే నమ్మకం ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయగలదు… ఆ నమ్మకాన్ని తన ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకోవడంలో యోగీ కొంతమేర సఫలమైనట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి…


అఖిలేశ్‌ను తక్కువ అంచనా వేయలేం! అయితే, యోగీకి ఆధిక్యం ఉందని అఖిలేశ్‌ను తీసిపారేయడం కూడా తొందరపాటే… 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గణనీయమైన విజయాలు సాధించింది… బీజేపీ గతంతో పోలిస్తే తన స్థానాలను కోల్పోగా, అఖిలేశ్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది… ఆ ఫలితాలు యూపీ రాజకీయాల్లో బీజేపీకి ఎదురులేదనే వాదనను ప్రశ్నించాయి…

తాజా సర్వేలోనూ సమాజ్‌వాదీ పార్టీ– కాంగ్రెస్ కూటమి మద్దతు గత ఎన్నికలతో పోలిస్తే పెరిగినట్లు కనిపిస్తోంది… 2022 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 3.7 శాతం పాయింట్లు, 2024 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2.4 శాతం పాయింట్లు పెరుగుదల నమోదైనట్లు సర్వే విశ్లేషణ చెబుతోంది…

అంటే అఖిలేశ్‌కు అవకాశమే లేదని కాదు… ఆయనకు ఓటు వేయాలనుకునే వర్గం ఉంది… నిరుద్యోగం, ధరల పెరుగుదల, పరీక్షల పేపర్ లీకులు వంటి అంశాలు యువతలో అసంతృప్తిని పెంచితే ఆ ప్రభావం ఎన్నికలపై పడవచ్చు… అఖిలేశ్ ఈ సమస్యలను ఎంత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్తాడు..? యువతను, వెనుకబడిన వర్గాలను, ఇతర సామాజిక సమూహాలను ఎంతవరకు తనవైపు తిప్పుకుంటాడు అన్నదానిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది…


ఇప్పటికైతే యోగీదే పైచేయి! రాజకీయాల్లో సర్వేలు శాశ్వత తీర్పులు కావు… ఎన్నికలకు నెలల ముందు కనిపించిన ఆధిక్యాలు.. ప్రచారం, కూటములు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమస్యలు, ఓటర్ల మూడ్‌ను బట్టి మారవచ్చు…

గమనిక: ఈ కథనం News18–Pvalue Analytics నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించబడింది… 2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 30,925 మందిని ఇంటింటికీ వెళ్లి ఇంటర్వ్యూ చేశారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!
  • ప్రధాని ఎవరైతేనేం..? టరమ్స్ శాసించేది అంబానీ..! ఇదీ జియో పుట్టుక !!
  • కవిత చెప్పింది ! సాయం చేసిన చేతులనే కాటేసే కేటీయార్ !!
  • వీథుల్లో అల్లర్లు – అలజడి … వీటితో ప్రభుత్వాన్ని మార్చడం అసాధ్యం !!
  • నోబెల్ విజేత – తండ్రి కోరిక కోసం, మూలాలు వెతుక్కుంటూ వచ్చింది !
  • అయ్యా నరేష్ గారూ… బాగా నటించగలరు, ఎటొచ్చీ యాసతోనే తిప్పలు !!
  • గడుసు వ్యాపారి మస్క్ – ‘రాకెట్ కారు’ లాంచింగ్ అదరగొట్టేశాడు !!
  • నీయక్క – రణబాలితోనూ నీ గ్రహచారం మారలేదోయ్ విజయ్…
  • నీట్, వోట్… అన్నీ సాకులు ! ప్రభుత్వం కూల్చడమే అసలు టార్గెట్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions