.
అవును, కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి తమిళనాడులోని రెండు బలమైన, పవర్ఫుల్ కుటుంబాల నడుమ వియ్యం… అదే రజినీకాంత్, కరుణానిధి కుటుంబాల నడుమ వియ్యం… అదెలాగో తెలియాలంటే ఈ జంట నేపథ్యాల్లోకి వెళ్లాలి… వెళ్దాం పదండి…
ముందుగా అనిరుధ్ ఎవరు..? అందరికీ పాపులర్ కంపోజర్గానే తెలుసు… ఇళయరాజా ఎప్పుడో తన ప్రాభవం కోల్పగా… రెహమాన్, దేవిశ్రీప్రసాద్, థమన్లను దాటేసి ఎంతోదూరం వెళ్లిపోయాడు అనిరుధ్… అతిశయోక్తి కాదు, అబద్ధమూ కాదు… ప్రస్తుతం పీక్స్… ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ కంపోజర్…
Ads
తను విదేశాల్లో కాన్సర్ట్ చేస్తే కనీసం 10 కోట్లు ఛార్జ్ చేస్తాడు… ఒక్కటంటే ఒక్కటి కూడా విదేశాల్లో గానీ, ఇండియాలో గానీ ఫ్లాప్ షో లేదు… ఆడియన్స్ కిక్కిరిసిపోతారు… కమర్షియల్లీ మోస్ట్ సక్సెస్… తను సినిమా చేస్తానంటేనే నిర్మాత ఎగిరి గంతేసే రేంజ్ గిరాకీ…
అనిరుధ్ కుటుంబం కళాకారుల కుటుంబమే… తల్లి శాస్త్రీయ నృత్యంతో అనుబంధం ఉన్న కళాకారిణి… ఆమె రజనీకాంత్ భార్య లతకు స్వయంగా సోదరి… అంటే, రజినీకాంత్ షడ్డకుడి కొడుకు… తనకూ కొడుకుతో సమానం… అంత దగ్గరి సంబంధం వాళ్లది…
అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర తమిళ నటుడు… సినిమాలు, టెలివిజన్లో నటుడిగా గుర్తింపు పొందాడు… రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన 3 సినిమాతోనే అనిరుధ్ సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశాడు… తన తాత కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం స్వయంగా ఫిలిమ్ మేకర్… సంచలనం సృష్టించిన వై దిస్ కొలవెరి డి పాట కంపోజ్ చేసింది అనిరుధే…
చాలామందికి ఇప్పటి వరకు అనిరుధ్కి రజనీకాంత్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉందని తెలియదు… దానికితోడు ప్యూర్ టాలెంట్తో పైకొచ్చిన rockstar….

మరి కావ్య మారన్… క్రికెట్ ప్రేమికులందరికీ తెలిసిన పేరు… సన్రైజర్స్ జట్టు వాళ్లదే… ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచులో ఆమె ప్రతి బంతికీ ప్రదర్శించే హావభావాలు, ఉద్వేగాలు చాలా ఫేమస్… ఆమె నేపథ్యం చూద్దాం…
కరుణానిధి కుటుంబం… తమిళనాట ఆర్థికంగా, రాజకీయంగా చాలా పవర్ఫుల్… ఈ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సోదరి షణ్ముగసుందరి… ఆమె భర్త మురసోలి మారన్… ఆయన కొడుకు కళానిధి మారన్… ఈ కళానిధి బిడ్డ కావ్య మారన్… కళానిధి మారన్ దాదాపు 30 వేల కోట్ల నెట్వర్త్ ఉన్న సన్గ్రూపు ఓనర్… స్టాలిన్ ఈమెకి తాత అవుతాడు…
కరుణానిధి- మారన్ కుటుంబాల నడుమ మరో బంధం కూడా ఉంది… మురసోలి మారన్ తమ్ముడైన మురసోలి సెల్వం కరుణానిధి కుమార్తె సెల్విని వివాహం చేసుకున్నాడు… ఈ కుటుంబం నుంచి ఎంపీలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు… ఇదీ కావ్య పాప నేపథ్యం…
కరుణానిధి, మారన్ కుటుంబాల మొత్తం నెట్వర్త్ లెక్కించడం అసాధ్యం… అంతటి సాధనసంపత్తి… అందుకనే తమిళనాట ఇప్పుడు కావ్య మారన్- అనిరుధ్ పెళ్లి బహుళ చర్చనీయాంశం… ఓ ఆసక్తికరమైన విషయం చెప్పి ముగిద్దాం…
అసలు అనిరుధ్, కావ్య నడుమ ప్రేమ ఎక్కడ మొదలైందనేది వేరే కథ… ఐతే దాదాపు పదేళ్ల క్రితం తంతి టీవీ కార్యక్రమంలో అనిరుధ్ కాబోయే భార్య గురించి ఓ టారో కార్డ్ రీడర్ చెప్పిన విషయాలు ఇప్పుడు కావ్య మారన్ నేపథ్యానికి దగ్గరగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది…
ఆ కార్యక్రమంలో అనిరుధ్కు ప్రేమ వివాహం జరుగుతుందని, తల్లిదండ్రుల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటారని టారో రీడర్ అంచనా వేశారు… అంతేకాదు, ఆయన కాబోయే భార్య సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని, ఉన్నత చదువులు చదివి ఉంటుందని, మీడియా లేదా బ్రాడ్కాస్టింగ్ రంగానికి సంబంధించిన పెద్ద సంస్థతో సంబంధం ఉంటుందని పేర్కొన్నట్లు వీడియో కనిపిస్తోంది…
ఇప్పుడు కావ్య మారన్ నేపథ్యాన్ని పరిశీలిస్తే… అప్పటి జ్యోతిష్యం అచ్చంగా నిజంగానే జరుగుతున్నట్టు చెప్పుకోవాలి… ఇంట్రస్టింగ్… ( గోపు విజయకుమార్ రెడ్డి )
Share this Article