Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇడిసిపెట్టలేదు- ఒడిసిపట్టలేదు… హరీష్- కేటీయార్ క్షుద్ర రాజకీయం !

October 18, 2026 by M S R

.

కేటీయార్- హరీష్ రావు… అసలే అసత్యాలు, వక్రబాష్యాల గాలిపోగేసి టన్నుల కొద్దీ ప్రత్యర్థుల మీద బురదలా గుమ్మరించే గుణం… నమ్మిన వాళ్లను నట్టేట ముంచే కేరక్టర్స్ అని సాక్షాత్తూ కవితే చెబుతోంది… మరోవైపు రేవంత్ రెడ్డి తెలంగాణను నిండా ముంచిన ఆ కుటుంబం అక్రమాలను రోజుకొకటి ఆధారాలతోసహా వెల్లడిస్తున్నాడు… జనంలో కేసీయార్ కుటుంబ ఆస్తులు, సంపద, ఫామ్ హౌజులు, స్టార్ హోటళ్లు, సర్కారీ భూముల ఆక్రమణ చర్చనీయాంశాలయ్యాయి…

ఇవన్నీ ఇంకా ఫ్రస్ట్రేషన్ పెంచుతున్నట్టున్నాయి… ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు… నిన్న వాళ్ల విమర్శ ఏమిటంటే..? ‘‘ఎల్‌నినో 100 దేశాల్లో ప్రభావం చూపిస్తున్నట్టు సీఎం చెబుతున్నాడు, మరి ఏపీలో ఎందుకు లేదు..? చంద్రబాబు జలపండుగ చేస్తున్నాడు..? తెలంగాణలో సీఎం క్రియేట్ చేసిన కరువు ఇది… పట్టిసీమ నుంచి 500 టీఎంసీలు ఎత్తిపోసుకున్నాడు చంద్రబాబు, జూరాల నుంచి 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం ఏరియాకు తరలిస్తున్నాడు… మనకేమో చేతకాలేదు…’’

Ads

  • …. ఇదీ వాళ్ల విమర్శ… వాళ్లకు తెలియక కాదు, తెలిసీ తెలంగాణ సమాజం చెవుల్లో రఫ్లీషియా పూలు పెట్టడం… మేం ఏది చెప్పినా తెలంగాణ జనం నమ్ముతారు, తెలంగాణ జనం ఎడ్డోళ్లు అని వాళ్ల నమ్మకం… ఒకటీ రెండు నిజాలు చెప్పుకుందాం…

patti seema

1) పట్టిసీమ అసలు లిఫ్టింగ్ కెపాసిటీ ఎంతో తెలుసా..? కేవలం 8500 క్యూసెక్కులు… అంటే రోజంతా 24 పంపులు, 24 మోటార్లు నడిచినా ఒక టీఎంసీ కూడా ఎత్తిపోయలేదు… రేవంత్ ఇడిసిపెట్టిండు- బాబు ఒడిసిపట్టిండు అనే మాట ప్రాసకు సరే, కానీ ఈ సీజన్‌లోనే 500 టీఎంసీలు ఎత్తిపోసుకున్నాడు చంద్రబాబు అనే హరీష్- కేటీయార్ మాటలు విని జనం నవ్వుకునే పరిస్థితి…

  • ఎందుకంటే..? 2025-16 లో పట్టిసీమ లిఫ్ట్ ప్రారంభమైతే… ఈ పుష్కరకాలంలో దాదాపు 1033 రోజులపాటు పంపులు నడిపిస్తే గానీ 500 టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణాలోకి పంపించలేదు… మరి 2015 నుంచి తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు..? నీటిని ఇడిసిపెట్టింది ఎవరు..? కేసీయార్ కాదా..? అందుకే ఓ విమర్శ చేసేముందు అది తనకే తగులుతుందా లేదానేది ఓసారి చూసుకోవాలి…

hnss

2) మరో విమర్శ… జూరాల నుంచి కుప్పం దాకా 700 కిలోమీటర్లు చంద్రబాబు తీసుకుపోతున్నాడు అని… ఇది దశాబ్దాల నాటి ప్రాజెక్టు… ప్రధానంగా హంద్రీ-నీవా ప్రాజెక్టు ఆధారిత నీటిప్రవాహ నెట్‌వర్క్ ఇది… అంతకుముందు ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు వర్క్స్ వేగంగా సాగాయి… ఇందులో చంద్రబాబు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా కాలువలు తవ్వి తరలించుకుపోయిందేమీ లేదు…

  • నిజానికి కేసీయార్ పాలనకాలంలోనే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేశారు, రాయలసీమ లిఫ్ట్ పనులు చేశారు… కృష్ణా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి, ఆంధ్రాకు అడ్డగోలు వాటా రాసిచ్చేసి, తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీయార్… అదంతా తవ్వితే పెద్ద బాగోతం… కుప్పం ఏరియాకు కృష్ణా నీరు ఎలా వెళ్తుందో పైన చార్ట్ చూస్తే అర్థమవుతుంది…

el nino

3) ఎల్‌నినో… వాతావరణంలో ఎల్‌నినో (అనావృష్టి), లానినో (అతివృష్టి) సాధారణం… కానీ ఈసారి ఎల్‌నినో తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది… ఒక్క తెలంగాణ మీద కాదు… ఐక్యరాజ్యసమితి (UN), వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్ (WMO), అలాగే UNICEF నివేదికల ప్రకారం ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 నుండి 100 దేశాలపై  ఉంటుంది…

  • ఇది రేవంత్ రెడ్డి చెప్పింది కాదు… ప్రత్యక్షంగా వర్షాభావం (కరువు) లేదా అతివృష్టి (వరదలు) వల్ల సుమారు 40 కి పైగా దేశాలు అతి తీవ్రమైన భౌగోళిక, ఆర్థిక, వ్యవసాయ సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి…

కాగా ఇదేదో తెలంగాణకే పరిమితమైనట్టు, అదీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రియేట్ చేసినట్టు విమర్శలు చేయడం క్షుద్ర రాజకీయం..! అన్నట్టు… రాష్ట్రంలో కరువు రావాలని హరీష్ రావు ఏవో క్షుద్ర పూజలు చేశాడని కదా కాంగ్రెస్ ఆరోపించింది… ఆ పూజలు ఫలించాయని ఆనందపడుతున్నాడా..? ఏపీ పచ్చగా ఉంది, తెలంగాణ ఎండిపోయిందని అంటున్నాడా..? చంద్రబాబుకు సర్టిఫికెట్ ఇస్తున్నాడా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జగన్ బొద్దింకల్ని ముద్దాడటం వెనుక ఇంత పే-ద్ద కథుందా..?!
  • ఇడిసిపెట్టలేదు- ఒడిసిపట్టలేదు… హరీష్- కేటీయార్ క్షుద్ర రాజకీయం !
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • నా చిన్నప్పటి ప్రియురాలు… ఈరోజుకూ కలలో పలకరిస్తుంది…
  • ప్రహార్ ! బాలీవుడ్ మరో మేలిమి కథ ! కసబ్ విచారణలో కొత్త కోణాలు !!
  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!
  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!
  • ప్రధాని ఎవరైతేనేం..? టరమ్స్ శాసించేది అంబానీ..! ఇదీ జియో పుట్టుక !!
  • కవిత చెప్పింది ! సాయం చేసిన చేతులనే కాటేసే కేటీయార్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions