.
పేరుకు ఏవేవో సాకులు… అది నీట్ కావచ్చు, అది సీఈసీ కావచ్చు… లేదా మీడియా ముందే చెబుతున్నట్టు రెజిమ్ ఛేంజ్ అల్లర్లు కావచ్చు… అది సీజేపీ కావచ్చు, ప్రత్యక్ష- పరోక్ష మద్దతునిస్తున్న ప్రతిపక్షాలు కావచ్చు… కానీ దేశంలో అరాచకం సృష్టించే విదేశీ శక్తుల కుట్ర అని అందరూ అనుమానిస్తున్నదే…
దేశమంతా పెట్రోల్ చల్లిపెడుతున్నారు… ఏదో ఓ ఇన్సిడెంట్ క్రియేట్ చేసి, మంట పెట్టడమే అసలు ప్రణాళిక అని సందేహిస్తున్నదే… బోరాలు, అశుతోష్, సౌరవ్, దీప్కేలు, సీజేపీలు, ఇతర సంస్థలే కాదు… ప్రకాశ్ రాజ్‌లు, ప్రశాంత్ భూషణ్‌లు ఆ కుట్రల్లో భాగస్వాములే అనే డౌట్లూ ఉన్నవే…
Ads
కాకపోతే చాలామందికి డీప్ స్టేట్ మీద అనుమానం… అదెప్పుడూ ఇండియా వ్యతిరేక కుట్రల మాస్టర్ మైండ్, ఫైనాన్షియల్ బ్యాకింగ్… ఈ నేపథ్యంలో అమెరికన్ మీడియా దిగ్గజం ‘ఫాక్స్ న్యూస్’ (Fox News) డిజిటల్ విభాగం చేపట్టిన ఒక సంచలన డిజిటల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది… ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 13 దేశాలకు చెందిన 101 సంస్థలు సంయుక్తంగా అమలు చేస్తున్న కుట్రను అది బయటపెట్టింది…

ఫ్రాన్స్, భారత్‌లతో పాటు పలు దేశాల్లో చెలరేగుతున్న అల్లర్లు, నిరసనల వెనుక ఒక గ్లోబల్ నెట్‌వర్క్ క్రియాశీలకంగా ఉందని ఆ కథనం విశ్లేషించింది…
ఈ కథనంలోని పూర్తి వివరాలు, ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి…
1. 101 సంస్థలు – 13 దేశాల నెట్‌వర్క్… ఫాక్స్ న్యూస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ప్యారిస్ వీధుల నుంచి దిల్లీ వరకు జరుగుతున్న నిరసనలు, అల్లర్లు యాదృచ్ఛికంగా పుట్టుకొచ్చినవి కావు. దీనివెనుక 13 దేశాలకు చెందిన దాదాపు 101 సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఈ కథనం వెల్లడించింది. ఇందులో సోషలిస్ట్, కమ్యూనిస్ట్ గ్రూప్‌లు, కార్మిక సంఘాలు (Trade Unions), స్టూడెంట్ యూనియన్లు, మీడియా నెట్‌వర్క్‌లు ఉన్నట్లు పేర్కొన్నారు.
2. ‘రెడ్- గ్రీన్’ కూటమి, ఆర్థిక నిధుల కోణం…ఈ గ్లోబల్ ప్రొటెస్ట్ ఎకోసిస్టమ్‌ను విశ్లేషిస్తూ నివేదిక కొన్ని కీలక పదాలను ప్రస్తావించింది…
- “రెడ్” (Red)… కమ్యూనిస్ట్, వామపక్ష, సోషలిస్ట్ సిద్ధాంతాలతో కూడిన సంస్థలు.
- నిధుల ప్రవాహం (Following the Money)… పశ్చిమ దేశాలను అస్థిరపరచడమే లక్ష్యంగా కొన్ని అరాచక శక్తులు, అంతర్జాతీయ సంస్థలు ఈ నిరసనలకు తెరవెనుక నిధులు సమకూరుస్తున్నాయని, ప్రచార వ్యూహాలను అందిస్తున్నాయని ఫాక్స్ న్యూస్ ఆరోపించింది.
3. ఫ్రాన్స్, భారత్‌ల మధ్య లింకులు… ఈ నివేదికలో ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లను, భారత్‌లో తలెత్తిన కొన్ని రాజకీయ, ప్రజా నిరసనలను ఒకే గొడుగు కిందకు తెచ్చి విశ్లేషించారు…
- భారత్: దిల్లీ కేంద్రంగా జరిగిన కొన్ని ఆందోళనలు, ఎన్నికల సంఘం (Election Commission) తీరును వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలు, రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాలను ఈ గ్లోబల్ నెట్‌వర్క్ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసిందని పేర్కొంది.
- ఫ్రాన్స్: ఫ్రాన్స్‌లో ఆర్థిక ఇబ్బందులు, విద్యా విధానాలు, వలసదారుల నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక ఆందోళనలను ఈ సంస్థలు పాశ్చాత్య నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపింది.
4. ఉమ్మడి ప్రచారాలు, సోషల్ మీడియా పాత్రప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ (Progressive International)… ఫ్రాన్స్, స్పెయిన్, అల్బేనియా, భారత్‌లో జరుగుతున్న నిరసనల అంశాలపై ఈ అంతర్జాతీయ రాజకీయ సంస్థ సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు నివేదిక ఎత్తిచూపింది.
- యువతను లక్ష్యంగా చేసుకోవడం: ‘జెన్-జెడ్’ (Gen-Z) తరపున ఫ్రాన్స్, భారత్‌లలో ఒకే రకమైన నినాదాలు, పోస్టర్లు, సంఘీభావ సందేశాలు సోషల్ మీడియా వేదికగా (ఉదాహరణకు ‘ఇండియన్ అలయన్స్ పారిస్’ వంటి సంస్థల ద్వారా) ప్రచారం చేయబడ్డాయని, ఇది కేవలం యాదృచ్ఛికం కాదని ఇన్వెస్టిగేషన్ పేర్కొంది…
- అంతేకాకుండా, రాబోయే రోజుల్లో యూరప్ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ యువజన సమ్మెలు’ (International Youth Strikes) నిర్వహించడానికి ఈ నెట్‌వర్క్ ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నట్లు హెచ్చరించింది…
స్థానిక సమస్యల పేరుతో మొదలయ్యే చిన్న నిరసనలను కూడా కొన్ని నిర్దిష్ట సంస్థలు తమ విస్తృత రాజకీయ, సిద్ధాంతపరమైన అజెండా కోసం ఎలా వాడుకుంటున్నాయో ఈ ఫాక్స్ న్యూస్ కథనం విపులంగా వెల్లడించింది… దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్గత శాంతిభద్రతలను దెబ్బతీయడానికి సరిహద్దులు దాటి సాగుతున్న ఈ ప్రణాళికలు ప్రపంచ దేశాల నిఘా వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి…
Share this Article