Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరీ ‘ఆదర్శ’ కుటుంబం కాదు గానీ… ఏదో సంసారపక్షంగా నడిపించేశారు!

October 30, 2026 by M S R

.

వెంకటేశ్ సినిమాలతో ఓ ఉపయోగం… ఎంచక్కా ఫ్యామిలీ ప్రేక్షకులు భయపడకుండా వెళ్లొచ్చు… బూతులు, అశ్లీలం, రోత, వెగటు, వెకిలి, రొచ్చు ఎపిసోడ్లు, సీన్లు పెద్దగా ఉండవు… (రానా అనే వెబ్‌సీరీస్ మినహాయింపు)… అన్నింటికీ మించి బీభత్సమైన హింస, నరికివేతలు, నెత్తురు, విధ్వంసం, మానవాతీత శక్తిగా ఎలివేషన్, రొడ్డకొట్టుడు ఫార్ములా… ఇవేవీ కనిపించవు…

ఏదో ఓ కథ… ప్లెయిన్‌గా, సాఫీగా, సంసారపక్షంగా సాగిపోతుంది కథనం… వయస్సు మీదపడినా సరే, తోటి ఇతర ముసలి హీరోలు వేసినట్టు అడ్డమైన రొమంటిక్ ఫోజులు, స్టెప్పులు, బూతు పాటలూ వెంకీకి దూరం దూరమే… అవును, ఈరోజు విడుదలైన తన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కూడా ఈ కోవలోనిదే… సేఫ్ సినిమా…

Ads

సేఫ్ అంటే నిర్మాతలకు సేఫో కాదో తెలియదు గానీ… థియేటర్ వెళ్లే ప్రేక్షకులకు, ప్రత్యేకించి ఫ్యామిలీ ప్రేక్షకులకు అడ్డమైన కమర్షియల్ దుర్వాసనల నుంచి సేఫ్… దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఏదో మాయ చేసి, కథను అటోఇటో తిప్పేసి, రీళ్లు చుట్టేసి… శుభం కార్డు వేస్తాడు కదా… అదే చేశాడు అలవాటు కొద్దీ…

అసలు కథేమిటంటే..? నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం శ్రీనిధి సిటీకి ప్రయాణిస్తుంది… అక్కడ వారితో ఎలాంటి సంబంధం లేని ఇద్దరు పిల్లలను కలుస్తారు… ప్రతి ఒక్కరికీ వారి స్వంత కథలు, సమస్యలు ఉంటాయి… కానీ వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ క్రమంగా ఒక కుటుంబంగా ఎలా మారారనేదే ఈ సినిమా కథ…

తన భుజాలపై సినిమాను నడిపించాడు వెంకటేశ్… ఇలాంటి పాత్రలు తనకు కొట్టిన పిండి, అలవోకగా అలాా అలా చేసేకుంటూ పోయాడు… సునాయాసంగా… త్రివిక్రమ్ కూడా పెద్దగా ప్రయోగాల జోలికి పోలేదు… వెంకీని తన జానర్ నుంచి బయటికి రానివ్వలేదు… ఈ సినిమాకు వెంకటేశే బలం… త్రివిక్రమ్ దర్శకత్వంకన్నా…

శ్రీనిధి శెట్టికి ఒక ముఖ్యమైన పాత్ర లభించినా… పాపం నివేథా పేతురాజ్ పాత్రను మాత్రం బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది… అవునూ, ఆమె సీన్లు కొన్ని ఎందుకు తీసేశారు త్రివిక్రమ్, ఏమైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..? ఎడిటర్ అత్యుత్సాహంతో కసిగా కట్ చేసి పారేశాడా..? పాపం నివేథా…

aadarsha kutumbam

ఫస్టాఫ్ పెద్దగా కొత్తదనం ఏమీ ఉండదు… అంతా ఫన్, కామెడీ ప్రధానం… సీన్లు కూడా సో సో… వెంకటేశ్ టైమింగ్ బాగానే ఉంటుంది… దోపిడీ దొంగల కథ కాస్త ఆసక్తిని పెంచి, మొదటి సగాన్ని రన్ అయ్యేలా చేస్తుంది… ఇంటర్వెల్ లో వచ్చే వైలెంట్ బ్లాక్ కాస్త ఆశ్చర్యపరిచినా, తమిళ చిత్రం ‘బ్లాస్ట్’ షేడ్స్ కనిపిస్తాయి… 

సెకండాఫ్‌లో త్రివిక్రమ్ ఆ మూస ధోరణి దాటేసి, ఈ సినిమా ‘బ్లాస్ట్’ లేదా ఇతర సినిమాల టెంప్లేట్ లోకి జారకుండా చూసుకోవాల్సింది… త్రివిక్రమ్ కథాకథనాల్లో ప్రిడిక్టబిలిటీని దాటలేకపోయాడు… కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సినిమా ఒకసారి చూడదగినది అనిపిస్తుంది… అది థియేటర్ వెళ్లి చూస్తారా? ఓటీటీలో వచ్చేవరకు ఆగుతారా అనేది ప్రేక్షకుడి ఇష్టం… మరీ పరుగులు పెట్టి చూడాల్సినంత సీన్ అయితే లేదు…

నిజానికి కమెడియన్ సత్యను త్రివిక్రమ్ ఎఫీషియెంట్‌గా వాడుకోలేదేమో అనిపిస్తుంది… తనకు త్రివిక్రమ్ మార్క్ సీన్లు పడితే రెచ్చిపోయేవాడు… సినిమా ఇంకాస్త రక్తికట్టేది… సంగీతం విషయంలో థమన్ నిరాశపరిచాడు… బీజీఎం వరకూ వోకే… కానీ గుర్తించుకునే పాటల్లేవు… మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే… ఇది మరీ త్రివిక్రమ్‌ను మరో మెట్టు ఎక్కించే సినిమా ఏమీ కాదు…

ఏదో వెంకటేశ్‌కు బాగా అలవాటైన జానర్‌లో అలాగే లాగించేశాడు… మెరుపుల్లేకుండా… ప్రిరిలీజ్ ఈవెంటులో ఉద్దవ గీత గురించి చాలా చెప్పాడు కదా… పాపం ఈ కథాకథనాలు చూస్తుంటే… ఆయనేదో కలియుగ లక్షణాల పేరిట కొత్త ప్రవచనం చెప్పాడు కదా, మరేమిటి ఈ సినిమాను సంబంధం లేకుండా ఇంత నిస్సారంగా మలిచాడేమిటి అనిపిస్తుంది…!!

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి స్థాయిలో ఉంటుందని చెప్పాడు నిన్న ఏదో మీటింగులో వెంకటేశ్... అవును, కామెడీలో తనది భలే టైమింగు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మరీ ‘ఆదర్శ’ కుటుంబం కాదు గానీ… ఏదో సంసారపక్షంగా నడిపించేశారు!
  • అటు నోటి దూలతో నెగెటివిటీ – ఇటు మహర్దశ కూడా నడుస్తోంది
  • ప్రవచనకారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ… తమరు తప్పులో కాలేశారు…
  • … చివరకు ఓటీటీలోనూ ఫాస్ట్‌ఫార్వర్డ్ చేస్తూ సైతం చూడలేకపోతి…
  • మియాపూర్ కేసు ! కేసీయార్ పట్టించుకోలేదు- రేవంత్ చేసి చూపించాడు !!
  • ‘అన్యమతస్తులు ఎంతటివారైనా సరే… ధ్వజస్థంభం దాటడానికి లేదు…’
  • వారణాసి OTT బిజినెస్… జక్కన్న మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా ?
  • శ్రీదేవి బిడ్డకు తత్వం బోధపడిందట ! తప్పు జరిగిందని ఒప్పుకోలు !!
  • కొంపదీసి సీతమ్మ కిడ్నాప్ లోకకల్యాణం కోసమేనని చెబుతారా ఏం?!
  • అమెరికాలో ‘హ్యూమన్ కంపోస్టింగ్’… గుర్తొస్తున్న వీరశైవుల అంత్యక్రియలు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions