Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అరబ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు- ఇజ్రాయిల్‌కు ఆత్మహత్యా సదృశం

November 2, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …. ఇజ్రాయేల్ నెతన్యాహు!
“ We must establish a strong, nationalist, right wing government ”.
యాంటీ జియోనిస్ట్ అయిన అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇజ్రాయేల్ మనుగడకి ప్రమాదం – నెతన్యాహు!

ఇజ్రాయేల్ పార్లమెంట్ నెసెట్ ( Knesset )కి జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు!
అసలు నెతన్యాహు ప్రాతినిధ్యం వహిస్తున్న లికుడ్ ( Likud ) పార్టీతో పాటు నెతన్యాహు కూడా ఓడిపోతాడని అంచనా వేశారు కానీ అనూహ్యంగా మెజారిటీకి కావాల్సిన 61 సీట్లకి గాను 53 సీట్లు గెలుచుకొని తిరిగి అధికారం చేపట్టడానికి 8 సీట్ల దూరంలో ఆగిపోయింది లికుడ్ పార్టీ!

Ads

  • ఇజ్రాయేల్ పార్లమెంట్ ని నెసెట్ ( Knesset ) అని పిలుస్తారు!
    నెతన్యాహు ఉన్న బ్లాక్ గెలిచిన సీట్లు: 53
    లెఫ్టిస్ట్ మాజీ IDF చీఫ్ గడి ఐసన్ కోట్ ( Gadi Eisenkot )బ్లాక్ గెలిచిన సీట్లు: 48
    అరబ్ పార్టీల బ్లాక్ గెలిచిన సీట్లు:19

నెతన్యాహు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే మరో 8 సీట్లు కావాలి! అరబ్ పార్టీల మద్దతు తీసుకోడు నెతన్యాహు. నెతన్యాహుని తీవ్రంగా వ్యతిరేకంచే ఐసెన్ కోట్ సంకీర్ణ ప్రభుత్వంలో చేరడు!
హంగ్ పార్లమెంట్ ఏర్పడింది!
ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ రాజ్యాంగం ఏమి చెపుతుంది?

ఇజ్రాయేల్ కి అసలు రాజ్యాంగమే లేదు!
1948 లో ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పడ్డాక ప్రత్యేకించి రాజ్యాంగం అంటూ ఏది వ్రాసుకోలేదు. సహజ న్యాయ సూత్రాలని పాటిస్తూ ముందు ముందు కోర్టులు ఇచ్చే తీర్పుల ఆధారంగా వ్యవస్థని నడపాలని నిర్ణయించారు అప్పట్లో.
మరి ఇజ్రాయేల్ లో ఎగ్జిక్యూటివ్, జ్యూడిషల్, శాసన వ్యవస్థలు ఎలా నడుస్తాయి?

The Harari Resolution: హారారీ రేసొల్యూషన్ ని 1950లో అప్పటి నెసెట్ ( Knesset ) ఆడాప్ట్ చేసుకొన్నాక చేసిన నిర్ణయం ఏమిటంటే ఒకేసారి రాజ్యాంగం వ్రాసుకునే బదులు ఒక చాప్టర్ తరువాత ఇంకొక చాప్టర్ ని వ్రాసుకుంటూ పోవాలని, అవి అన్నీ సహజ న్యాయ సూత్రాల మీద ఆధారపడి ఉండాలని!

బేసిక్ లాస్ ( Basic Laws ): ఈ సహజ న్యాయ సూత్రాలు పార్లమెంట్ ( the knesset ), ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు ఎలా నడవాలి, అలాగే ఇజ్రాయేల్ పౌరులు వాళ్లకి ఇష్టమొచ్చిన వృత్తిని ఎంచుకునే స్వేచ్చని ఇస్తాయి.

1995 లో ఇజ్రాయేల్ సుప్రీం కోర్టు ల్యాండ్ మార్క్ తీర్పుని ఇచ్చింది… Bank Mizrahi vs Israel ministry of finance కేసులో తీర్పుని ఇస్తూ బేసిక్ లాస్ అనేవి వ్రాసుకున్న రాజ్యాంగంకంటే బలమైనవి అని పేర్కొన్నది. So, చాప్టర్ బై చాప్టర్ వ్రాసుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నది సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా ఉన్నది అన్నమాట!

Well, ఆ దేశం నుండి కొంత ఈ దేశం నుండి కొంత తీసుకొని అతుకుల బొంత రాజ్యాంగం వ్రాసుకునే బదులు ప్రాక్టికల్ గా సమస్యని పరిష్కరించే విధంగా వ్రాసుకున్నదే కాల పరీక్షకి నిలబడుతుంది!

అసలు ఇజ్రాయేల్ పూర్తి స్థాయి రాజ్యాంగం ఎందుకు వ్రాసుకోలేదు?
రాజకీయ- మతపరమైన వైరుధ్యాలు ఉన్నాయి!
ముందే సమగ్రమైన రాజ్యాంగం వ్రాసుకుంటే తరవాత రోజుల్లో చీటికీ మాటికీ సవరించుకోవాల్సి వస్తుందని!
ఇజ్రాయేల్ మొదటి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్! ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పడ్డాక మొదటి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ ( David Ben Gurion) చాలా ముందు చూపు కలవాడు.
డేవిడ్ బెన్ గురియన్ కి నిశ్చితమైన, బలమైన మత విశ్వాసాలు ఉన్నాయి. యూదుల పవిత్ర గ్రంధం ‘తోరా’ ( Torah ) అంటే గట్టి విశ్వాసం, భక్తి ఉంది.

డేవిడ్ బెన్ గురియన్ ఏమని ఆలోచించాడు అంటే…. 2 వేల ఏళ్ళ క్రితం యూదుల దేశమైన ఇజ్రాయేల్,  జుడియా లని మతపరమైన యుద్దాల వలన యూదులు తమ దేశాలని వదిలి వేల మైళ్లు దూరంగా వెళ్లిపోవాల్సి వచ్చింది.

మళ్ళీ ఇప్పుడు (1948) లో తిరిగి తమ స్వంత దేశం ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో రాజ్యాంగం అనేది ‘ తోరా ’ కి అనుగుణంగా ఉండాలి కాబట్టి మారిన కాలమాన పరిస్థితుల్లో తొందరపడి అరువు తెచ్చుకున్న రాజ్యాంగం వ్రాసుకుంటే అది ‘ The Promised Land ’ గా ఉండబోదు అని అభిప్రాయపడ్డాడు బెన్ గురియన్!

డేవిడ్ బెన్ గురియన్ ది ఆలోచన కాదు ముందు చూపు!
1948 లో ఇజ్రాయేల్ దేశం ఏర్పడినప్పుడు అప్పట్లో అక్కడ జోర్దాన్ కి చెందిన అరబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అఫ్కోర్స్! పాలస్తీనియన్స్ అని అంటున్నా వాళ్ళు జోర్దాన్ దేశం నుండి వచ్చిన వాళ్ళే!
ఇజ్రాయేల్ ప్రజలు మత స్వేచ్ఛ కలిగివుంటారు అలా అని సెక్యూలర్ పదానికి విపరీతమైన అర్ధం రాకుండా జాగ్రత్తపడ్డారు.

సెక్యులర్ అంటే అన్ని మతాల ప్రజలకి సమానమైన హక్కులు ఇస్తూ అదే సమయంలో బాధ్యత కూడా సమంగా పంచుకోవాలి అనే అర్ధంలో అమలు చేస్తున్నారు!
1948 లో ఇజ్రాయేల్ ఏర్పడినప్పుడు స్థానికంగా ఉన్న యూదుల సంఖ్య చాలా తక్కువ. యూరోప్, ఆఫ్రికా, అమెరికాల నుండి యూదులు తిరిగి తమ స్వదేశం వచ్చే రోజులు అవి. ఇక సరిహద్దులు అనేవి స్పష్టంగా ఏర్పడలేదు కాబట్టి తరుచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఇలాంటి పరిస్థితుల్లో సమగ్రమైన రాజ్యాంగం వ్రాసుకోవడం అనేది సరైంది కాదని బెన్ గురియన్ అభిప్రాయపడ్డాడు.

israel

ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశానికి సమగ్రమైన రాజ్యాంగం లేదు, ఉన్నవి బేసిక్ లాస్ మాత్రమే!
ఇప్పుడు హంగ్ నెసెట్ ( Knesset ) ఏర్పడింది!
నెతన్యాహు అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడు!
ఇక మిగిలింది Gadi Eisenkot బ్లాక్! ఐసేన్ కోట్ మాజీ చీఫ్ అఫ్ స్టాఫ్ ! నెతన్యాహు అంటే అసలు పడదు!
నెతన్యాహు తండ్రి పోలాండ్ కి చెందినవాడు అలాగే ఐసేన్ కోట్ కుటుంబం మోరాకో నుండి ఇజ్రాయేల్ కి వచ్చిన మీజ్రహీ యూదులకి (Mizrahi Jews from Morocco ) చెందిన వాడు.

నెతన్యాహు మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఉగ్ర గ్రూపు హమాస్ నాయకులకి రహస్యంగా నిధులు అందించాడు అనేది ఒక ఆరోపణ అయితే మరో రెండు అవినీతి కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి!
హమాస్ కి నిధులు రహస్యంగా ఇచ్చాడు అనేది బెస్లెస్స్ ఆరోపణ. గాజాలో ప్రజల కోసం అని సుమారుగా 150 మిలియన్ డాలర్లని ఖాతార్ బ్యాంకుకి తరలించి అక్కడి నుండి పాలస్తినా ఆధారిటికి వెళ్ళేవి కానీ నెతన్యాహు బ్యాంకు ద్వారా కాకుండా నేరుగా ఖాతార్ అధికారుల సమక్షంలో పాలస్తినా ఆధారిటికి ఇవ్వడం మొదలుపెట్టాడు.

ఇజ్రాయేల్ అంతర్గత సెక్యూరిటీ సంస్థ అయిన షిన్ బెట్ ( Shin Bet ) 2019 లో నేతన్యాహుని హెచ్చరించింది నిధులు దారి మళ్ళి హమాస్ కి చేరుతున్నాయని. కానీ నెతన్యాహు ఆ హేచ్చరికని పట్టించుకోకుండా నేరుగా నగదు రూపంలోనే ఇస్తూ వెళ్ళాడు, చివరికి 2023 అక్టోబర్ 17 న హమాస్ దాడి చేసింది! దీనికి కారణం నెతన్యాహు అని ప్రతిపక్షాలతో పాటు ఇజ్రాయేల్ పౌరులు కూడా విశ్వసిస్తున్నారు!
దాని ఫలితమే హంగ్ పార్లమెంట్!

ప్రధానిగా నెతన్యాహు రాజీనామా చేయాల్సి వస్తే అది నేరుగా జైలులోకే వెళ్ళాలిసి వస్తుంది!
ఈ రోజు ఇజ్రాయేల్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు అరబ్ పార్టీలతో కలిసి గడి ఐసేన్ కోట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అంటూ!
So, నెతన్యాహుకి కష్ట కాలమే!
ఒకవేళ ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోతే ఆపద్ధర్మ ప్రధాని హోదాలో మళ్ళీ ఎన్నికలకి ఆదేశాలు ఇస్తాడు నెతన్యాహు!

అరబ్ పార్టీలతో కలిసి Gadi Eisenkot ప్రభుత్వం ఏర్పాటు చేసేట్లయితే మరో సమస్య ఏర్పడుతుంది అది గ్రేటర్ ఇజ్రాయేల్ ఏర్పాటు చేయడానికి అరబ్ పార్టీలు ఒప్పుకోవు!
సమస్య దహియా డాక్ట్రిన్ ( Dahieh Doctrine ) తోనే!

దహియా డాక్ట్రిన్ అంటే ఏమిటి?
అనధికార మిలిటంట్ గ్రూపులని అణిచివేయడానికి ఇజ్రాయేల్ మిలిటరీ వేసే వ్యూహం అంటే హమాస్, హెజ్బొల్లాని అణిచివేయడానికి పన్నిన వ్యూహం!
మొదట ఉగ్ర గ్రూపులు ఉన్న ప్రదేశంలో రోడ్లు, వంతెనలని నాశనం చేసి సప్లైస్ ని ఉగ్రవాద గ్రూపులకి చేరకుండా చేయడం… IDF ఇప్పటికే ఈ పని పూర్తి చేసింది అండర్ గ్రౌండ్ టన్నెల్స్ తో సహా అన్నిటిని నాశనం చేసింది గాజాలో, లెబనాన్ లో.

రెండవ దశలో ఉగ్ర గ్రూపులు ఉన్న ప్రదేశంలో ఉన్న ఇళ్లని తుదికంటా నాశనం చేయడం. ఇది గాజాలో 90% చేసింది లెబనాన్, సిరియాలలో ఇంకా చేయాల్సి ఉంది!
ఇప్పుడు అరబ్ పార్టీలతో కలిసి గడి ఐసేన్ కోట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గాజా, లెబనాన్, సిరియాలలో ఉన్న ఇజ్రాయేల్ సైన్యం వెనక్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అరబ్ పార్టీలు ఈ షరతులు పెట్టే మద్దతు ఇస్తాయి.

ఐసేన్ కోట్ కొడుకు యుద్ధంలో మరణించాడు. పైగా అదే సైన్యాన్ని నడిపిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేసాడు గడి ఐసేన్ కోట్!
ఇజ్రాయేల్ ప్రధాని పేరు మారుతుంది తప్పితే దహియా డాక్ట్రిన్ అనేది మారదు, అమలు చేయాల్సిందే!

So, నెతన్యాహు ధైర్యంగా ఉండడానికి కారణం దహియా డాక్ట్రిన్! అరబ్ పార్టీల షరతులకి ఒప్పుకొని ఐసేన్ కోట్ ప్రధాని అయితే అది ఆత్మహత్య అవుతుంది అతనికి!

ఎక్కడో ఇజ్రాయేల్ లో హంగ్ ఏర్పడితే ఇక్కడ భారత్ లో ఎందుకంత ఆసక్తి ఏర్పడింది?
ఒక్క భారత్ లోనే కాదు, ప్రపంచ దేశాలు అన్నీ ఆసక్తితో చూస్తున్నాయి!
నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికాలో రిపబ్లికన్స్ కి మెజారిటీ తగ్గి డేమోలకి పెరిగితే ఇటు ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకి అడ్డుకట్టపడడంతో పాటు ఇజ్రాయేల్ కి ఇస్తున్న మిలిటరీ ఎయిడ్ కి ఫుల్ స్టాప్ పడుతుంది!

మరోవైపు ఇరాన్, మధ్య ప్రాచ్యం సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుంది అనే ఆశ అన్ని దేశాలకి!
ఇప్పటికే యూరోపు అగ్ని గోళం అయిపొయింది కాబట్టి కొత్తగా ఒరిగేది ఏమి ఉండదు. కాకపొతే శీతాకాలంలో వేడిగా ఉండడానికి కావాల్సినంత ఇంధన సరఫరా జరుగుతుంది అనే ఆశ!

మరో వైపు క్రూడ్ ధర బారేల్ కి $116 చేరుకోవడంతో దాదాపుగా అన్ని దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు కొండేక్కి కూర్చుంటున్నాయి!
ట్రంప్, నెతన్యాహుల వల్లే ఇదంతా జరుగుతున్నది అని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు!

అమెరికా ఆర్ధికంగా కుదేలయ్యే పరిస్థితి వచ్చినప్పుడల్లా ఏదో ఒక చోట యుద్ధం జరుగుతుంది! అంచేత పేర్ల మార్పు వల్ల మంచి జరగదు అని గ్రహించడం మేలు!
ప్రస్తుతం సంవత్సరానికి ఒక ట్రిలియన్ డాలర్లని వడ్డీల కింద చెల్లిస్తున్నది అమెరికా!
ఇజ్రాయేల్ లో నాయకత్వం మార్పు, అమెరికాలో ట్రంప్ అపరిమిత అధికారాలకి కత్తెర పడుతున్నది కాబట్టి ఏదో మంచి జరగబోతున్నది అని ఆశించడం వృధా!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అరబ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు- ఇజ్రాయిల్‌కు ఆత్మహత్యా సదృశం
  • సినిమా రక్త చరిత్ర… రాప్తాడు రంపం వెనుక దాగున్న ‘విషం’…
  • నో, నో… *కొత్త బొద్దింకలు- మోదీ సర్కారు’పై కథనం కానేకాదు ఇది!!
  • BiggBoss10… రేయ్, ఎవుర్రా మీరంతా..!! ఎంపికలు ఎవరి నిర్వాకం..!?
  • 5 స్టార్స్ !! రామాయణకు ఈ ప్రముఖ విశ్లేషకుడి అసాధారణ రేటింగ్ !!
  • A Journalist’s Journey Through Two Eras of Reporting
  • ఒక డోరతీ… కొంచెం సమీక్ష.. బోలెడు సైన్సూ…
  • మన పేదరికం నిజంగా తగ్గిందా..? జబ్బలు చరుచుకుందామా..?
  • ఒక సరస్వతీ పుత్రుడు – ఒక సరస్వతీ పుత్రిక – ఓ అదర్శ కుటుంబం !!
  • పగులుతున్న పాపాల పుట్టలు – బీఆర్ఎస్ క్యాంప్ హఠాత్తుగా సైలెంట్

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions