Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామాయణంలో పిడకల వేట & గుడ్డు మీద ఈకలు పీకడం!

November 9, 2026 by M S R

.

(  Srini Kesiraju  ) …. నిన్నే రామాయణం సినిమా చూడడం జరిగింది. విజువల్ గా మేకర్స్ కష్టం కనబడుతుంది కానీ పంటి కింద రాళ్ళలాగా కొన్ని చిన్న చిన్న అనుమానాలు నివృత్తి కావడం కోసం ఇలా అందరితో పంచుకోవడం…

1. వాస్తవానికి, ఆయన అసలు పేరు ‘దశగ్రీవుడు’ (పది తలలు కలవాడు) లేదా ‘దశకంధరుడు’.
శివుడి అనుగ్రహం లేదా శివ కనెక్షన్ లేకుండా అతనికి ‘రావణుడు’ అనే పేరు రాలేదు.
• పౌరాణిక కథనం ప్రకారం, దశగ్రీవుడు అహంకారంతో కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు, పరమశివుడు తన కాలి బొటనవేలితో ఆ పర్వతాన్ని కిందకి నొక్కాడు.

Ads

• పర్వతం కింద వేళ్ళు నలిగిపోవడంతో దశగ్రీవుడు తీవ్రమైన వేదనతో, భీకరంగా పది లోకాలు దద్దరిల్లేలా అరిచాడు (“రావ” అంటే భయంకరమైన శబ్దం/అరుపు).
• ఆ విధంగా భయంకరంగా అరిచినందుకు, ఆ తర్వాత శివ తాండవ స్తోత్రంతో శివుడిని మెప్పించినందుకు, పరమశివుడే అతనికి ‘రావణుడు’ (భయంకరంగా అరిచేవాడు) అని నామకరణం చేశాడు.

కాబట్టి, శివుడితో ఆ ఘట్టం జరగకముందే, లంకను జయించిన ప్రారంభ సమయాల్లోనే అతడిని ‘రావణుడు’ అని పిలవడం లేదా అతడు స్వయంగా ‘రావణ రాజ్యం’ అని ప్రకటించుకోవడం పౌరాణిక చరిత్రపరంగా సినీ రచనలో దొర్లిన ఒక చిన్న పొరపాటు లేదా వైరుధ్యం.

రామాయణ

2. ఇంద్రుడిపై విజయం, ‘చంద్రహాసం’ ఖడ్గం వెనుక ఉన్న వైరుధ్యం: దశగ్రీవుడు కైలాస పర్వతాన్ని కదిలించబోయి శివుడి కాలి బొటనవేలి కింద నలిగిపోయినప్పుడు, ఆయనను శాంతింపజేయడానికి వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి, పరమశివుడిని స్తుతిస్తూ ‘శివ తాండవ స్తోత్రం’ రచించాడు.

ఆ భక్తికి, స్తుతికి ప్రసన్నుడైన పరమశివుడు అతనికి ‘రావణుడు’ అనే పేరును పెట్టడమే కాకుండా, ఎన్నటికీ ఓటమి ఎరుగని, అత్యంత శక్తివంతమైన ‘చంద్రహాసం’ అనే దివ్యమైన ఖడ్గాన్ని బహుమతిగా ప్రసాదించాడు.
దేవేంద్రుడితో యుద్ధం చేసి ఓడించే సమయానికే రావణాసురుడి చేతిలో ‘చంద్రహాసం’ అనే దివ్య ఖడ్గం ఉన్నట్లు చూపించడం కూడా రామాయణ మూల కథ ప్రకారం కాలక్రమ దోషమే (Anachronism).

రామాయణ

3. శ్రీరామచంద్రుడి జననానికై అగ్నిదేవుడు పాయసం అందించినప్పుడు ఆ పాయసం నీలంగా ఉండడం నాకు నచ్చలేదు. పాయసం అంటే అది వైట్ గా ఉండాలి లేదా లైట్ ఎల్లోగా ఉండాలి. వాల్మీకి రామాయణం (బాలకాండ, 16వ సర్గ) ప్రకారం ఆ పాయస పాత్ర, పాయసం గురించి స్పష్టంగా వర్ణించబడింది:

ఆ దివ్య పురుషుడు తలపై పట్టుకున్న పాత్ర తప్తకాంచన (కాచిన బంగారం లాంటి ప్రకాశం కలిగినది) అని పేర్కొనబడింది. ఆ పాయసాన్ని దేవతలు స్వీకరించే దివ్యాన్నంతో, పాలు, నెయ్యి శోభతో ఉన్న పవిత్రమైన ప్రసాదంగా వర్ణించారు.

ramayan

4. విద్యుత్‌జిహ్వుని వధ ఆల్మోస్ట్ లంకా యుద్ధానికి కొంచెం ముందరగా జరుగుతుంది. కానీ మన సినిమాలో మాత్రం రాముడు వనవాసంలో ఉండగానే తనను చంపేసినట్టు చూపించేశారు. దీన్ని ఒకసారి విజ్ఞులు వెరిఫై చేసుకోగలరు.

5. రావణుడు రాజ్యాభిషేకం చేసుకున్నప్పుడు ప్రజలందరికీ హామీ ఇస్తూ నా ఇల్లు బంగారంలో ఉంటే మీ ఇల్లు కూడా అట్లానే ఉంటుంది, అదే బంగారంలాగా ఉంటుందని చెప్పాడు. కానీ తర్వాత చూస్తే ఈయనదేమో పెద్ద రాజభవ ప్రాకారం ఉంటుంది, మిగతా వాళ్ళందరి మామూలు ఇళ్లు ఉంటాయి…

ravana

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రామాయణంలో పిడకల వేట & గుడ్డు మీద ఈకలు పీకడం!
  • నేలపై కూర్చున్నా చేతిలోనే కంచం! మారిన మన భోజన సంస్కృతి!!
  • మోషన్ పిక్చర్ కాదు, ఎమోషన్ పిక్చర్ – ఆయువుపట్టు, జటాయువుపట్టు
  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియా త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నదా?
  • సీతమ్మ శౌర్యం ! ఆ ఇంగ్లిష్ వెర్షన్ సీన్ ఇండియాలో ఎందుకు తీసేశారు..?!
  • ఓహ్, అదా అసలు సంగతి – స్థానిక గెలుపు బాబు ఘనత ఏమీ కాదన్నమాట..!!
  • సో కాల్డ్ హీరో మెటీరియల్ కాదు- సో వాట్, నిఖార్సయిన నటుడు..!!
  • మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు? ఎన్సీపీ వర్గాల పునఃకలయిక?
  • పది భారీ సైలోలు… ఆహారధాన్యాల నిల్వపై రేవంత్ ప్రభుత్వ కొత్త ఆలోచన భేష్…
  • కాలిపోయేది మా పర్సులు..! నీ గల్లాపెట్టె నిండకపోతే మాదా తప్పు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions