.
Pardha Saradhi Potluri ….
భారత్ PoJK ని స్వాధీనం చేసుకోబోతున్నదా? Part 2
భారత్ PoJK ని స్వాధీనం చేసుకోబోతున్నది అని అనుకోవడానికి మూడో కారణం అగ్నివీర్ ల కాల పరిమితి తీరిపోయినా మరో రెండేళ్లు ఎక్స్టెన్షన్ ఇవ్వడం!
1.అగ్నిపధ్ పధకం కింద ఎన్నికకాబడ్డ అగ్నివీర్ లకి 4 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది.
2.అగ్నిపధ్ కింద సైన్యంలో పనిచేసే అగ్నివీర్ లలో 25% మందిని వాళ్ళ పనితీరుని పరిశీలించి బెస్ట్ పెర్ఫమాన్స్ చూపించిన వాళ్ళని శాశ్వత సైనికుడుగా ( regular soldier ) సర్వీసులోకి తీసుకుంటుంది ఆర్మీ. మిగతా వాళ్ళు సర్వీస్ నుండి తొలగింపబడతారు!
3.కానీ అనూహ్యంగా నవంబర్ 4, 2026 న ప్రస్తుతం అగ్నివీర్ లుగా పనిచేస్తూ 4 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన అగ్నివీర్ లకి మరో రెండేళ్లు పొడిగింపు ఇచ్చారు అంటే మొత్తంగా 6 ఏళ్ళ సర్వీస్ ఇచ్చారు.
4.మరో రెండేళ్ల కాల పరిమితి పెంచినా, రెండేళ్ల తరువాత బెస్ట్ పెర్ఫమాన్స్ చూపించిన అగ్నివీర్ లకి పర్మనెంట్ అయ్యే అవకాశం కల్పించారు! ఇదే విషయం ఆధారం చేసుకొని PoJK ని స్వాధీనం చేసుకోబోతున్నారు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయ డిఫెన్స్ నిపుణులు.
Ads
5. అగ్నివీర్ లకి ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి కేంద్ర కాబినెట్ ఆమోదం తెలపగా CDS జెనరల్ N.S రాజ సుబ్రమణి అధికారికంగా ప్రకటించారు!
6. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఉన్న సైనికులు అక్కడే ఉండడమో లేక ఫార్వార్డ్ ఆపరేషన్ కోసం PoJK లోకి వెళ్లడమో జరిగినప్పుడు వీళ్ళ స్థానంలోకి అగ్నివీర్ లని నియమించవచ్చు కాబట్టి ఎక్సటెన్షన్ ఇచ్చివుండవచ్చు!
7. నెలరోజుల క్రితం కొన్ని ఇంటర్నేషనల్ డిఫెన్స్ న్యూస్ పోర్టల్స్ పాకిస్తాన్ తన ఆయుధ సంపత్తిని చాలా వేగంగా ఆధునీకరిస్తున్నది అని వివరాలు ప్రచురించాయి కానీ PoJK ని కాపాడుకువడానికే అని కూడా గట్టిగా చెప్పాయి.
******************
రెండు నెలల క్రితం CIA భారత్ ని హెచ్చరిస్తూ పాకిస్తాన్, చైనా, బాంగ్లాదేశ్ ఒకేసారి భారత్ మీద దాడి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి అని సందేశం పంపింది! ఈ వార్త ధ్రువీకరణ కాలేదు కానీ నిజమెంతో తెలియదు. అఫ్కోర్స్! భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ( CDS ) లు మొదటినుండి ఇదే విషయాన్ని గట్టిగా చెప్తూ వస్తున్నారు భారత్ రెండున్నర దేశాలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అని.
రెండున్నరలో చైనా, పాకిస్తాన్ లు రెండు అయితే ఆ అర మాత్రం మన దేశంలోని శత్రువులు అని అర్ధం వచ్చేలా వాడుతున్నారు కానీ మారిన పరిస్థితుల్లో ఆ అర బాంగ్లాదేశ్ గా రూపాంతరం చెందింది.
Well, ఆపరేషన్ సిందూర్ జరిగిన సమయంలో చైనా వార్ స్ట్రాటజిస్ట్స్ పాకిస్తాన్ లో మకాం పెట్టి రియల్ టైమ్ డేటాని రికార్డ్ చేశారు. ఇండియన్ డిఫెన్స్ ఎక్సపర్ట్స్ ఎలాంటి వ్యూహం పన్నారు, ఆ వ్యూహలు ఎలాంటి ఫలితాలని ఇచ్చాయి అన్నవాటిని మినిట్ బై మినిట్ రికార్డ్ చేశారు.
చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు విఫలం అయ్యిందో చైనా వాళ్లకి ముందే తెలుసు కాబట్టి దాని గురుంచి పట్టించుకోలేదు, ఎందుకంటే పిండి కొద్దీ రొట్టె కదా? అసలే అప్పు, దానికితోడు తక్కువలో కావాలి అంటే మంచి ఎయిర్ డిఫెన్స్ ఎక్కడి నుండి వస్తుంది? పనిలో పనిగా టర్కీకి చెందిన ఎటాక్ డ్రోన్ ఇంజినీర్లు కూడా అదే సమయంలో వార్ రూమ్ లో ఉంటూ టర్కీ డ్రోన్ల పనితీరుని రికార్డ్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ 1 లో ఏవేవి విఫలం అయ్యాయి, బదులుగా కొత్తవి ఏవేవి సమకూర్చుకోవాలి అని లిస్ట్ ని తయారుచేసుకొని వాటిని అమలుచేస్తున్నది పాకిస్థాన్!
ఒకసారి పాకిస్తాన్ ముందస్తు సన్నాహాలు ఎలా ఉన్నాయో చూద్దాం…..

8. ఆర్మీ & ఆర్టీలరీ: ఫతాహ్ సీరీస్ గైడెడ్ మల్టీపుల్ రాకెట్ లాంచర్స్ ని ఆర్మీలో చేర్చింది.
9. Fatah-4 క్రూయిజ్ మిసైల్స్ ని ఆర్మీలో చేర్చింది, దీని రేంజ్ 750 km.
10. Fatah II హైపర్ సానిక్ మిసైల్స్ ని చేర్చింది, కాకపొతే ఇది పాత వర్షన్ ని అప్గ్రేడ్ చేసి పరీక్షించి, ఓకే అయ్యాక, వీటికోసమే కొత్త కమాండ్ ఏర్పాటు చేసి, దానికి ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ అని పేరు పెట్టింది. హైపర్ సానిక్ టెక్నాలజీ చైనా ఇచ్చింది.
11.పాకిస్తాన్ దగ్గర ఉన్న MBT ( Main Battle Tank ) హైదర్ MBT కి పాత ఆర్మర్ ( ట్యాంక్ కి ఉండే స్టీల్ లేదా కంపోజిట్ కవచం ) ని తీసేసి కొత్తవి అమర్చింది. హైదర్ MBT అనేది చైనా VT-4 MBT కి పాకిస్థాన్ పేరు. VT-4 MBT ని పాకిస్థాన్ లో అసెంబుల్ చేయడానికి చైనాకి చెందిన NORINCO అనే సంస్థ లైసెన్స్ ఇచ్చింది.
యుద్ధం అంటూ జరిగితే ఈ హైదర్ MBT ని అసెంబుల్ చేసే ఫాక్టరీ మీద భారత్ దాడి చేస్తుంది కానీ…హైదర్ MBT ఫ్యాక్టరీ ‘తక్షశిల’ లో ఉంది. తక్షశిలలోనే ధ్వంసం కాబడ్డ పురాతన నలంద విశ్వావిద్యాలయం తాలూకు అవశేషాలు ఉన్నాయి, ఈ స్థలం యూనెస్కో వారసత్వ సంపద జాబితాలో ఉంది… ఖర్మ!
ఇంటర్నేషనల్ వార్ అబ్జర్వర్స్ పాకిస్థాన్ హైదర్ MBT ఆర్మర్ ని అప్గ్రేడ్ చేస్తున్నది అంటే దానర్ధం భారత ఆర్మీ పాకిస్తాన్ లోకి చొచ్చుకు రాబోతున్నది అని తెలుసుకొని ముందు జాగ్రత్త పడుతున్నది అని అంటున్నారు.
12.అటాక్ హెలికాప్టర్స్..: 2025 అగస్టులో పాకిస్థాన్ చైనా నుండి Z-10ME అటాక్ హెలికాప్టర్స్ కొన్నది. Z-10ME అటాక్ హెలికాప్టర్ అమెరికన్ అపాచి అటాక్ హెలికాప్టర్ కి పోటీగా తయారుచేసింది. అపాచి అటాక్ హెలికాప్టర్స్ అమెరికా నుండి మన దేశం కొన్న సంగతి తెలిసిందే! అపాచి కానీ Z-10ME కానీ ఎయిర్ ఫోర్స్ కి చెందినవి కావు ఆర్మీ కి చెందినవి. Close-in support కోసం ఫార్వార్డ్ లైన్ లో ఉండే ఆర్మీ సైనికుల కోసం వాడతారు.
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్!
13. చైనా సహాయంతో పాకిస్తాన్ ఫ్యూజన్ నెట్వర్కింగ్ ( Network -centric operations using Fifth generation fighter jet J-36, J-10C and JF-17 Thunder ) ని చాలావేగంగా నిర్మించింది.
Fusion network అంటే J-10C , JF-17 థండర్ ఫైటర్ జెట్స్ ని అంతరిక్షంలో ఉండే సాటిలైట్స్ తో అనుసంధానం చేస్తూ గ్రౌండ్ రాడార్స్ తో లింక్ ఏర్పాటు చేయడం. ఇలా చేయడం వలన భారత్ నుండి వచ్చే ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్స్ ని సాటిలైట్ గుర్తించి టార్గెట్ ఎక్కడ ఉందో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కి సమాచారం ఇస్తూ టార్గెట్స్ ఏ విమానం రేంజ్ లో ఉందో కూడా చెప్తుంది. దాంతో ఆ ఫైటర్ జెట్ లేదా ఎయిర్ డిఫెన్స్ టార్గెట్ ని ధ్వంసం చేస్తుంది. ఇక్కడ ఫైటర్ జెట్ కి ఉండే రాడార్ రేంజ్ తో సంబంధం ఉండదు. ఎందుకంటే సాటిలైట్స్ టార్గెట్ ఎక్కడ ఉందో చెప్తుంది గ్రౌండ్ రాడార్స్ టార్గెట్ వైపు వెళ్లే మిసైల్స్ ని గైడ్ చేస్తాయి.
ఈ ఫ్యూజన్ నెట్వర్క్ అనేది చాలా ప్రమాదకరం!
ఉదా: చైనా తయారీ PL-17 ఎయిర్ to ఎయిర్ మిసైల్ రేంజ్ 280 km, కానీ JF-17 థండర్ రాడర్ రేంజ్ 120 km అయితే JF-17 PL-17 ని ఎక్కడో 250 KM దూరంలో ఉన్న టార్గెట్ మీదకి ప్రయోగించగలదు.
ఇది ఎలా సాధ్యం?
ఇక్కడే ఫ్యూజన్ నెట్వర్క్ అప్లై అవుతుంది. స్పేస్ లో ఉండే చైనా ఉపగ్రహం టార్గెట్ ని గుర్తించి JF-17 కి చెప్తుంది PL-17 ని ప్రయోగించమని… వెంటనే JF-17 పైలట్ PL-17 ని ప్రయోగిస్తాడు కానీ మిసైల్ ని టార్గెట్ మీదకి గైడ్ చేసేది గ్రౌండ్ రాడార్లు, అక్కడికి దగ్గరలో ఉండే నెట్వర్క్ టవర్లు.
So, ఫ్యూజన్ నెట్వర్క్ ని ముందు నాశనం చేయాల్సి ఉంటుంది భారత్. లేకపోతే మన ఫైటర్ జెట్స్ లేదా మిసైల్స్ పిట్టల్లా రాలిపోతాయి!
ఇదే ఫ్యూజన్ నెట్వర్క్ ని భారత్ ఏర్పాటు చేయలేదా?
లేదు! ఫ్యూజన్ నెట్వర్క్ ని ఏర్పాటు చేయాలంటే ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాఫ్టర్లు, ఎయిర్ డిఫెన్స్, డ్రోన్స్, గ్రౌండ్ రాడార్స్ అన్నీ ఒకే దేశానికి చెందినవి అయి ఉండాలి!
సుఖోయ్ Su-30MKI, Mig -29K లు రష్యావి. S-400 ఎయిర్ డిఫెన్స్ రష్యాది. రాఫెల్ F3R ఫ్రాన్స్ ది. ఆపాచి అటాక్ హెలికాప్టర్స్ అమెరికావి. గ్రౌండ్ రాడార్స్ కొన్ని రష్యావి మరికొన్ని భారత్ వి. ఫ్యూజన్ నెట్వర్క్ ని ఏర్పాటు చేయాలంటే రష్యా, ఫ్రాన్స్, అమెరికా దేశాలు సోర్స్ కోడ్స్ ఇవ్వడమే కాదు, ఫైటర్ జెట్స్ ఎయిర్ ఫ్రెమ్స్ లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
రష్యా ఒప్పుకుంటుంది కానీ ఫ్రాన్స్, అమెరికాలు ఒప్పుకోవు. ఫ్రాన్స్ డసాల్ట్ ఏవియేషన్ రాఫెల్ F3 లో వెస్ట్రన్ సెన్సర్ ఫ్యూజన్, టాక్టికల్ డాటా లింక్స్ అయిన SPECTRA, LINK-16 తో కంపెటిబెల్ అయి ఉంటాయి. రాఫెల్ నావిగేషన్ అమెరికన్ GPS లేదా యూరోపియన్ నావిగెషన్ సిస్టమ్ తో పాటు safran డెవలప్ చేసిన INS ( Inertial Navigation System ) SIGMA 95 N ని మూడు డిజిటల్ లేజర్ గైరో స్కోప్స్, యాక్సీలో మీటర్స్ ని ఉపయోగించి సాటిలైట్ సిగ్నల్స్ ని కలుపుకొని స్వంతంగా పనిచేస్తుంది కాబట్టి నిజానికి GPS అవసరం ఉండదు.
అఫ్కోర్స్! డసాల్ట్ ఏవియేషన్ మనకి ఇచ్చిన రాఫెల్ F3R , రాఫెల్ M లని NavIC తో సింక్ అయ్యేలా సరఫరా చేసింది!
మరి మన స్వంత ఫ్యూజన్ నెట్వర్క్ ని ఎప్పుడు ఏర్పాటు చేసుకోగలం?
2035 వరకూ ఆగాలి!
Contd.. Part 3
Share this Article