Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంగిలి వార్తలకూ ఓ పద్ధతి ఉంటుంది డియర్ కేసీయార్ సర్..!!

November 16, 2026 by M S R

.

ఎంగిలి వార్త…! ఈ పదం గురించి ఓసారి చెప్పుకోవాలి… నేషనల్ ప్రెస్ డే కదా… సందర్భసహితం కూడా…! పార్టీ పత్రికలు ఎలా భ్రష్టపత్రికలు అయ్యాయో చాలాసార్లు ఉదాహరణలతోసహా చెప్పుకున్నాం కదా… ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన నమస్తే తెలంగాణ పత్రిక చివరకు తస్కిన మేడిగడ్డ బరాజ్ చందంగా ఎలా పంకిలమైందో కూడా చెప్పుకున్నాం…

పొద్దున దాని ఫస్ట్ పేజీ బ్యానర్ స్టోరీ చూడగానే మొదట నవ్వొచ్చింది, తరువాత ఎప్పటిలాగే జాలేసింది… ఫాఫం, చివరకు అది బుంగలుపడ్డ అన్నారం బరాజ్ అయిపోయింది కదా అనిపించింది… ఐనా విలువలు వదిలేసిన సంస్థ విమర్శల్నీ పట్టించుకోదు గానీ, ఈ బ్యానర్ స్టోరీ కమ్ ఎంగిలివార్త గురించి ఓసారి చెప్పుకుందాం…

Ads

ఆ బ్యానర్ స్టోరీ ఏమిటయ్యా అంటే..? ఆంధ్రాబాబు అలియాస్ చంద్రబాబు నిర్లజ్జగా, దుర్మార్గంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు గండి కొట్టి, ప్రత్యేకంగా ఓ గుప్త సొరంగాన్ని తవ్వేసి, ఎడాపెడా నీళ్లను తరలించుకునే కుట్రకు పాల్పడ్డాడు అనేది స్టోరీ… 1200 కోట్ల ఖర్చు అట, సొరంగం పనులు వేగంగా సాగుతున్నాయట… రోజూ 160 మిలియన్ లీటర్ల నీటి చోరీ చేయబోతోంది అని సారాంశం…

510 అడుగులు అంటే నీరు డెడ్ స్టోరేజీకి చేరినా సరే… లిఫ్టులు, ఇన్‌టేక్ వెల్స్, సొరంగం, 1658 కిలోమీటర్ల పైప్‌లైన్… ఆల్రెడీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు పూర్తయిందనీ, తాగునీటి పేరిట కేంద్రం 50 శాతం నిధులు, జలజీవన్ మిషన్ పేరిట ఇచ్చి సహకరిస్తోంది అని సారాంశం…

నిజానికి సీరియస్ వార్తే… అసలే జగన్ బాబు తన జాన్‌జిగ్రీ దోస్త్ కేసీయార్ ఇచ్చిన ప్రోత్సాహంతో రాయలసీమ లిఫ్ట్ కట్టి, పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసి, తెలంగాణ ప్రయోజలాలకు వైసీపీ, బీఆర్ఎస్ సంయుక్త ద్రోహం చేసిన కథ తెలుసు కదా మనకు… శ్రీశైలం నీటి చోరీ… జగన్ అయినా, చంద్రబాబు అయినా ఒకటే కదా… ఇప్పుడు చంద్రబాబు ఏకంగా సాగర్‌కే పొక్క కొడుతున్నాడు…

అసలే రేవంత్ రెడ్డి- చంద్రబాబు బంధం, బనకచర్ల కుట్ర అంటూ బీఆర్ఎస్ ఏవేవో పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉంటుంది కదా… అలాంటి స్థితిలో చంద్రబాబు ఏకంగా నాగార్జునసాగర్‌కు పొక్క కొట్టడం సీరియస్ వార్తే… కానీ ఇప్పటికీ సాగునీటి మంత్రి ఉత్తమకుమారుడి నుంచి ఏ ప్రకటన లేదు… కాళేశ్వరం బాపతు అవినీతి సంద్రంలో మునకలేసిన సాగునీటి ఇంజినీర్లకూ సోయి లేదు…


sagar


సరే, ఇక ఎంగిలి వార్త విషయానికి వద్దాం… నిజానికి ఈ స్టోరీ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లాష్ చేసింది ప్రభాత ఉదయం అనే పత్రిక… అది ఇంకా మార్కెట్‌లోకి రాలేదు కానీ వెబ్‌సైట్ నడుస్తోంది, పత్రిక డమ్మీలు వేస్తున్నారు… అందులో వచ్చింది ఈ వార్త… (ఆ పత్రిక కథాకమామిషు తరువాత చెప్పుకుందాం)… సరే, ప్రజాప్రయోజనం దృష్ట్యా ఆ వార్తను ఎవరైనా అందుకుని ఫాలోఅప్ చేయవచ్చు, అవసరమే, అక్కడ బేషజాలు అక్కర్లేదు…

కానీ చంద్రబాబు- రేవంత్ అక్రమ బంధం అని ఇంకా బదనాం చేయడానికి మరో వార్త దొరికింది అనుకుని… తనకు చేతకాకపోయినా… ఉదయం స్టోరీని కాపీ చేసింది… చేయడం వోకే, కానీ కొంత వాల్యూ ఆడిషన్ జరగాలి, కొంత కసరత్తు జరగాలి, అదనపు సమాచారం తెలుసుకోవాలి, భిన్నంగా ప్రజెంట్ చేయాలి… కానీ ఎలాగూ ఉదయం మార్కెట్‌లో లేదు కదా, మనకేం అడ్డు అనుకుంది…

nsp

నిర్లజ్జగా ఉదయంలోని గ్రాఫిక్‌ను యథాతథంగా కాపీ కొట్టింది… అదే వార్త, అవే వివరాలు… బ్యానర్ కొట్టేసింది… ఎంగిలి వార్తలు- తీసుకోవల్సిన జాగ్రత్తలు అనే ఎపిసోడ్, ఈరోజు తెలుగు జర్నలిస్టు ప్రపంచంలో నవ్వులపాలైన నమస్తే నిర్వాకం ఇదే… అవునులే, జీతాలు పెరగక, ఆరేళ్లుగా పైసా ఇంక్రిమెంట్లు లేక, అందరూ ఖాళీ చేస్తున్న మేడిగడ్డ దుకాణం అది… ఇదుగో ఇలా నాలుగు ఎంగిలివార్తలు రాసుకుంటే సరి… పాపం కేసీయార్…

చంద్రబాబు సాగర్ రిజర్వాయర్‌కు పొక్క కొడుతున్న తీరును కూడా సమర్థిస్తూ యెల్లో మీడియా… ‘అవును, కేసీయార్ కొండపోచమ్మసాగర్‌’ నుంచి అక్రమంగా తన వందల ఎకరాల ఫామ్స్‌కు నీళ్లు తీసుకుపోవడం లేదా అని ఎదురుదాడి చేస్తుందేమో చూడాలి… అవునూ, ఉత్తమ కుమారా..? వాటీజ్ దిస్..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎంగిలి వార్తలకూ ఓ పద్ధతి ఉంటుంది డియర్ కేసీయార్ సర్..!!
  • కమెడియన్ సద్దాం నిజంగా ఘంటసాలను అవమానించాడా..?!
  • మీడియా ఏమైనా రాసుకోనీ… ప్రేక్షకుడి అసలు తీర్పు వేరు- వసూళ్లు వేరు..!!
  • ఎన్టీఆర్ ఓడి- కృష్ణ గెలిచి… రెండు సింహాల నడుమ నలిగిన గిరిబాబు..!!
  • ఓ మర్డర్ కేసును మలుపు తిప్పిన ఆ ఉత్కంఠభరిత మ్యాచ్!
  • MUSK – THE FANTASY BUILDER … కలల్ని కళ్ల ముందుంచుతాడు !!
  • చంద్రబాబు చెబితే నవ్వారు- కానీ భావి ప్రయోగాలు- ఆశలు మాత్రం అవే !!
  • అమెరికాపై అదృశ్య దాడి…? కుప్పకూలుతున్న వ్యవస్థలు… లాక్‌డౌన్ 2.0 కుట్రనా..?
  • రాజరికపు వైభవాన్ని వదిలేసిన తొలి జమిందారు! చదవాల్సిన చరిత్ర!!
  • నాటి యండమూరి నవల – రికార్డుల ‘వాయేజర్‌’పై నా గాఢాసక్తికి కారణం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions