.
Sree’nivas Bibireddy ….. అజయ్ బిష్త్ సన్యాసం స్వీకరించినప్పుడు ఆయన వయసు కేవలం 21 ఏళ్లు. ఒక నవంబర్ నెలలో, ఇంట్లో ఎవరికీ కనీసం సమాచారం ఇవ్వకుండానే అజయ్ వెళ్లిపోయి సన్యాసిగా మారాడన్న విషయం ఆ తర్వాత ఆయన తల్లి సావిత్రి దేవి గారికి తెలిసింది…
ఈ దేశంలో 21 ఏళ్ల వయసున్న కొడుకుపై ప్రతి తల్లికి ఉండే ఆశలు, కలల్లాగే తనకు కూడా… కానీ కొడుకు తీసుకున్న ఈ నిర్ణయం సావిత్రి దేవి గారిని ఎంతో వేదనకు గురిచేసింది. 21 ఏళ్ల ప్రాయంలోనే సన్యాస దీక్షలో భాగంగా త్యాగానికి, ధర్మానికి అంకితమైన అజయ్ బిష్త్ (యోగి ఆదిత్యనాథ్) గారికి ఇకపై కుటుంబ బంధాలు గానీ, ప్రాపంచిక అనుబంధాలు గానీ ఉండకూడదు.
Ads
ఆ వార్త విన్న మరుక్షణమే సావిత్రి దేవి గారు తన భర్త ఆనంద్ బిష్త్ గారితో కలిసి వాహనంలో గోరఖ్‌పూర్ మఠానికి బయలుదేరారు. సన్యాసిగా మారిన తన కొడుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నించారు…
సన్యాసం స్వీకరించిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ గారు భిక్ష కోసం స్వయంగా తన తల్లి సావిత్రి దేవి గారి ఇంటికి వెళ్లారని చదువుతుంటాం. మొదట ఆ తల్లి షాక్‌కు, దుఃఖానికి గురైనప్పటికీ… తన కొడుకు స్వీకరించిన సన్యాస దీక్షను, సంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ, సన్యాసులను సంబోధించే ‘మహారాజ్’ అనే పిలుపుతో ఆ యోగికి స్వాగతం పలికి భిక్ష అందించింది.
ఈ నేల సంస్కృతి, వారసత్వం పట్ల వారికి ఉన్న అంకితభావం అలాంటిది.
ఆయన గోరఖ్‌పూర్ ఎంపీగా పనిచేసినప్పుడైనా, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వంటి మహా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడైనా… సావిత్రి దేవి గారు ఏనాడూ ఏ అవసరానికో, సిఫార్సు కోసమో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
అంతేకాదు, వారు ఉత్తరప్రదేశ్‌లో నివసించలేదు కూడా! బదులుగా, తమ పూర్వీకుల నేలైన ఉత్తరాఖండ్‌లోని పంచూర్ గ్రామంలో ఒక సామాన్య పౌరురాలిలాగే జీవించారు.
“ముఖ్యమంత్రి తల్లి” అనే హోదాను ఏమాత్రం ఆపాదించుకోకుండా… నిరాడంబరంగా బతికింది.
నిన్న ఆ మాతృమూర్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది…
ఒకప్పుడు తన కొడుకుని చూడటానికి గోరఖ్‌పూర్ మఠానికి వెళ్లిన ఆ తల్లిని…. కడసారి చూడటానికి ఈరోజు మహంత్ యోగి ఆదిత్యనాథ్ గారు ఆ గ్రామానికి వచ్చారు. తల్లి పార్థివ దేహం వైపు ఆయన చాలా సేపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు… ఆ క్షణంలో యోగి గారి మనసులో ఏం మెదిలి ఉంటుందో కదా?

ఏదేమైనా, తాను ఈ దేశానికి ఇచ్చిన మాటను చివరి శ్వాస వరకు నిలబెట్టుకుని ఆ తల్లి సెలవు తీసుకుంది. నేడు ఈ దేశానికి యోగి ఆదిత్యనాథ్ గారు ఎంతటి ముఖ్యమైన నాయకుడో ప్రత్యేకంగా ఒక్క మాటలో కూడా వర్ణించాల్సిన అవసరం లేదు.
హిందూ సమాజ మనుగడ కోసం ఆ తల్లి చేసిన మహా త్యాగమే యోగి.
ప్రారంభంలో సన్యాసం స్వీకరించిన యోగిని వెనక్కి తీసుకెళ్లడానికి సావిత్రి దేవి గారు గోరఖ్‌పూర్‌కు వెళ్లినప్పుడు…
తల్లిదండ్రులను ఓదార్చిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ గారు వెంటనే అక్కడి ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా తన గురువైన మహంత్ అవైద్యనాథ్ గారికి కాల్ చేశారు. ఆ రోజు ఫోన్‌లో గురువు అవైద్యనాథ్ గారు సావిత్రి దేవి గారికి ఇచ్చిన హామీ, భరోసానే… తన కొడుకుని ఈ దేశానికి అంకితం చేయాలనే నిర్ణయం ఆ తల్లి తీసుకునేలా చేసింది…
“మీ నలుగురు కుమారులలో ఒకరు నేడు ఈ దేశాన్ని పునర్ నిర్మించడానికి, హిందూ ధర్మాన్ని బలోపేతం చేయడానికి నాతో వచ్చాడు. అమ్మా, ఆయనను ఆ పని చేయనివ్వండి…”
సావిత్రి గారిలోని నిజమైన మాతృత్వం దానిని అంగీకరించింది, యోగి గారిలోని కర్మ కూడా దానిని స్వీకరించింది. ఈ దేశం కోసం వారిద్దరూ నిలబెట్టుకున్న ఆ మాటలే బహుశా ఆ చివరి క్షణంలో వారి మధ్య మౌనంగా మాట్లాడుకుని ఉంటాయేమో…
Share this Article