Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కులగణన, స్కిల్ డెవలప్మెంట్… మోదీ నోట రే-రె (Re-Re) మాట..!!

November 23, 2026 by M S R

.

దేశ రాజకీయాల్లో ఇప్పుడు రెండు పెద్ద ముచ్చట్లు నడుస్తున్నాయి… ఒకటి సామాజిక న్యాయం కోసం కుల గణన, రెండోది యువత భవిష్యత్తు కోసం నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్)… ఢిల్లీ పెద్దలు ఈ అంశాలపై ఇప్పుడు గళం విప్పుతుంటే, తెలంగాణలో ‘రే-రే’ (రేవంత్ రెడ్డి) సర్కారు ఎప్పుడో ఆ పని మొదలుపెట్టి, దేశానికే దారి చూపిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది…

కుల గణనలో ఫస్ట్… ఇప్పుడు స్కిల్స్‌లోనూ బెస్ట్! దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టిగా నినదించినప్పుడు, దాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టి చూపించింది తెలంగాణే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ జనాభా లెక్కల్లో కుల గణన అంశాన్ని ప్రకటించడానికి ముందే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర సర్వేను పూర్తి చేసి ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసింది…

Ads

rere model

ఇప్పుడు సరిగ్గా అదే సీన్ నైపుణ్యాభివృద్ధి విషయంలోనూ రిపీట్ అవుతోంది. రెండేళ్ల ముందే రేవంత్ విజన్… గత రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఒకే మాట చెబుతూ వస్తున్నారు— “కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లు ఉంటే సరిపోదు… మారుతున్న కాలానికి తగ్గట్టు యువత చేతిలో పనిముట్లు, ఆధునిక నైపుణ్యాలు ఉండాలి” అని…

మాటలతో సరిపెట్టకుండా, దాన్ని చేతల్లోకి తెచ్చారు… టాటాతో జతకట్టి రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐ (ITI) కాలేజీల రూపురేఖలు మార్చేందుకు దిగ్గజ సంస్థ టాటా టెక్నాలజీస్‌తో చేతులు కలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC s)…: పాత కాలపు కోర్సుల స్థానంలో రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి లేటెస్ట్ టెక్నాలజీలలో యువతకు శిక్షణ ఇప్పిస్తున్నారు…

rere model

ఇప్పుడు మోదీ నోట అదే మాట!
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇదే అంశంపై మాట్లాడటం ఆసక్తికరంగా మారింది… డిగ్రీల కంటే నైపుణ్యాలే ముఖ్యమని, ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం ఉన్న భారతీయ యువతకు ఫుల్ డిమాండ్ ఉందని ఆయన అన్నారు… అంతేకాదు, ఐఐటీ (IIT) గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ (ITI) విద్యార్థులకు గౌరవం దక్కాలని ప్రధాని పిలుపునిచ్చారు…

రాజకీయ సంకల్పానికి నిదర్శనం
ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతున్న ఈ అంశాలను తెలంగాణలో ‘రే-రె’ (రేవంత్ రెడ్డి) ప్రభుత్వం రెండేళ్ల క్రితమే గుర్తించి, నిధులు కేటాయించి, కార్పొరేట్ భాగస్వామ్యంతో గ్రౌండ్ లెవల్‌లో అమలు చేస్తోంది…

రాజకీయ హామీలను కేవలం ప్రసంగాలకే పరిమితం చేయకుండా, సరైన పాలసీలు, పెట్టుబడులతో ముందుకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో తెలంగాణ నిరూపిస్తోంది… సామాజిక న్యాయం నుంచి రేపటి తరం ఉద్యోగాల వరకు… తెలంగాణ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కులగణన, స్కిల్ డెవలప్మెంట్… మోదీ నోట రే-రె (Re-Re) మాట..!!
  • ఎఐ రంగులు అద్దుకుని కొత్తగా వినిపిస్తున్న ఆపాత మధురాలు !
  • రాధికా ఆప్టే ఎద్దేవా నుంచి- సుప్రీంకోర్టు దాకా…. మేనరికాలు!!
  • తెలంగాణ కవితకు సహజమైన ఈ స్థానిక వాడుక భాష అర్థం కాలేదా..?!
  • ముఖ్యమంత్రి కాదు… మఠాధిపతి కాదు… ఆ అమ్మకు మాత్రం కొడుకే!
  • అడ్డంకులు తొలిగాయి- రేవంత్ కొరడా ఝళిపించాలి ఇక…
  • అయ్యా, న్యాయమూర్తి గారూ… రాజీనామా చేస్తే నేరం రద్దయిపోదు..!!
  • క్రైస్తవ మతప్రచారకుల ఇంట హిందూ వైదిక పెళ్లి తంతు..?!
  • ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా… తెలంగాణ అభివృద్ధి ఆగలేదు, ఆగదు…
  • మోడీ భాయ్ … తమరు డౌన్ వర్డ్ స్పైరల్‌లో పడిపోయారు- జాగ్రత్త !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions