.
బీఆర్ఎస్ రోజూ టన్నుల కొద్దీ బురద గుమ్మరించే ప్రయత్నం చేస్తున్నా సరే… తెలంగాణ- హైదరాబాద్ అభివృద్ధి ఏదో ఆగిపోయినట్టుగా సమాజానికి ఓ రాంగ్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేస్తున్నా సరే… రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కాల్సిన క్రెడిట్ దక్కుతూనే ఉంది… అప్పట్లో తనను వెక్కిరించిన ఆంధ్రావాదుల్ని హైదరాబాద్ అభివృద్ధి ఏటేటా పెరుగుతూ, ఆ నోళ్లు మూయిస్తూనే ఉంది…
పెట్టుబడుల వాతావరణ అనుకూల విధానాలు, హైదరాబాద్‌కు ఉన్న సహజ సిద్ధమైన అనుకూలతలు తోడవడంతో రాష్ట్ర ఎగుమతుల రంగం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది... గత మూడేళ్ల కాలంతో పోలిస్తే 2023– 2026 మధ్య కాలంలో తెలంగాణ సరుకు ఎగుమతులు (merchandise exports) ఏకంగా 68.3 శాతం వృద్ధిని నమోదు చేయడం రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యానికి నిదర్శనం…
Ads
గణాంకాలు చెబుతున్న వాస్తవాలు… కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DGCI&S) గణాంకాల ప్రకారం, 2020–2023 మధ్య కాలంలో తెలంగాణ సగటు వార్షిక సరుకు ఎగుమతులు ₹79,000 కోట్లుగా ఉండగా, 2023–2026 మధ్య కాలంలో అవి ₹1,33,000 కోట్లకు చేరుకున్నాయి…
-
2020–21 ఆర్థిక సంవత్సరంలో ₹64,539 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులు, 2025–26 నాటికి ₹1,22,655 కోట్లకు పెరిగి దాదాపు రెట్టింపయ్యాయి…
-
ముఖ్యంగా 2024–25 సంవత్సరంలో ఎగుమతులు అత్యధికంగా ₹1,61,843 కోట్ల మార్కును తాకడం విశేషం…
ఫార్మాకు తోడుగా ఇంజనీరింగ్, ఏరోస్పేస్ జోరు… తెలంగాణ ఎగుమతులంటే కేవలం ఫార్మా రంగానికే పరిమితం కాకుండా, ఇప్పుడు ఇంజనీరింగ్ వస్తువులు, ఏరోస్పేస్ రంగాలు ప్రధాన చోదక శక్తులుగా మారాయి…
-
ఎలక్ట్రికల్ మెషినరీ, మెకానికల్ ఉపకరణాల ఎగుమతులు 2024–25లో ₹14,632.20 కోట్లు ఉండగా, 2025–26లో 21.41 శాతం పెరిగి ₹17,764.81 కోట్లకు చేరాయి…
-
లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్, జిఇ ఏవియేషన్ వంటి దిగ్గజ సంస్థల కార్యకలాపాలతో తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీకి ప్రధాన కేంద్రంగా మారింది... 2024–25 మొత్తం ఎగుమతుల్లో విమాన- అంతరిక్ష నౌకల విడిభాగాల వాటా దాదాపు 30 శాతంగా నమోదైంది…
-
2026–27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో కూడా ఇంజనీరింగ్ ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 31 శాతం వృద్ధిని సాధించాయి…
హైదరాబాద్ దాటి జిల్లాల వైపు విస్తరణ… అభివృద్ధి కేవలం రాజధానికే పరిమితం కాకుండా, ప్రభుత్వం అనుసరిస్తున్న CURE–PURE–RARE అభివృద్ధి ప్రణాళికల వల్ల జిల్లాలకు సైతం విస్తరిస్తోంది…
-
2025–26లో ₹29,131.19 కోట్లతో (23.75% వాటా) మేడ్చల్-మల్కాజిగిరి అగ్రస్థానంలో నిలవగా, హైదరాబాద్ (₹26,437.55 కోట్లు), సంగారెడ్డి (₹24,970.43 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి…
-
మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా ఎగుమతులు ఏకంగా 56.17 శాతం పెరిగి ₹10,648.13 కోట్లకు చేరుకోగా, యాదాద్రి భువనగిరి జిల్లా 32.13 శాతం వృద్ధితో ₹4,119.68 కోట్ల ఎగుమతులను నమోదు చేసింది…
భవిష్యత్ లక్ష్యాల దిశగా అడుగులు … రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, సులభతర వాణిజ్య విధానాలు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. డిసెంబర్ 2026లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ వేదికగా పరిశ్రమలు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాలకు సంబంధించి కొత్త పాలసీలను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సానుకూల దృక్పథం, పారిశ్రామిక విస్తరణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యానికి బలమైన పునాది వేస్తున్నాయి…
అబ్బే, అంతా మా కేసీయార్ పాలనలో పడ్డ పునాదులే కారణం అని ఇక బీఆర్ఎస్ క్యాంపు ఓ సోది పురాణానికి తెరతీస్తారేమో..!!
Share this Article