.
ఎవరో పాపం అల్ప సంతోషులు… క్రైస్తవ మతప్రచారమే వృత్తిగా ఉన్న బ్రదర్ అనిల్, షర్మిలలు తమ బిడ్డ అంజలీ రెడ్డి పెళ్లిని హిందూ వివాహ తంతుతో జరిపిస్తున్నారు, గ్రేట్, అనూహ్యమైన మార్పు, సూపర్ అని రాసిన కొన్ని పోస్టులు కనిపించాయి…
నిజమే, ఒక ప్రభావవంతమైన, ప్రజాజీవితంలో ఉన్న క్రైస్తవ కుటుంబం హిందూ పద్దతికి మారితే విశేషమే అనుకుందాం, కానీ అది నిజమేనా..? జగన్‌తో ఆస్తి గొడవలు, యలహంక ఇల్లు నాదేనని ప్రకటన, రాజకీయ వివాదాలు ఎట్సెట్రా పక్కన పెడదాం కాసేపు, ఆ ఇంట్లోకి అడుగుపెట్టవద్దంటూ కోర్టు ఆదేశాలను కూడా… కానీ కొన్ని ఫోటోలు కనిపించాయి హల్దీ వేడుకపై…
Ads
యూట్యూబులో వీడియోలు కనిపించాయి… అది హల్దీ వేడుకేనా..? పసుపు, గంధం పూస్తున్నట్టుగా..! అసలు హల్దీయే తెలుగు వివాహపద్దతి కాదు… నార్తరన్… తెలుగు కుటుంబాల్లో పసుపులు దంచడం… ప్రాంతాలను బట్టి వేర్వేరు పేర్లు… ఇప్పుడు హల్దీని మనం మన తెలుగు పద్ధతుల్లోకి అరువు తెచ్చుకుని దాన్నీ ఘనంగా సెలబ్రేట్ చేసేస్తున్నాం…
సరే, ఆ హల్దీ వేడుక చూస్తుంటే, గతంలో విజయమ్మ, షర్మిల ఓ ప్రార్థన స్థలానికి వెళ్లి వివరణ ఇచ్చుకున్న వీడియో గుర్తొచ్చింది.., అప్పట్లో షర్మిల కొడుకు పెళ్లి చేశారు కదా, అది హిందూ సంప్రదాయంలో జరపలేదనీ, చివరకు పుస్తె కాదు, శిలువను మెడలో వేయించామని కూడా చెప్పిన తీరు గుర్తొచ్చింది… కానీ పైకి మాత్రం హిందూ పద్దతిలో పెళ్లి జరిపించినట్టు జనానికి కనిపిస్తుంది…

రేపు కూడా అంతేనేమో… ఇప్పుడంటే జగన్‌తో ఆస్తి గొడవలతో ఆమె రాజకీయాల్లోకి వచ్చింది గానీ ఆమె నిజమైన మతప్రచారకురాలు, అది ఆమె ఇష్టం… తన భర్త బ్రదర్ అనిల్‌కుమార్ సరేసరి, ఆయన ఫుల్ టైమ్ ప్రచారకుడే… వైఎస్ కుటుంబం ఫస్ట్ నుంచీ క్రిస్టియన్లే… వాళ్ల మతం వాళ్ల అభిమతం… గుడ్…
ఎటొచ్చీ హిందూ తంతుగా భ్రమింపజేయడం దేనికనేదే ప్రశ్న… మొన్న కావ్య- అనిరుధ్ పెళ్లి జరిగింది… వాళ్లకు నచ్చిన, ఆత్మగౌరవ పద్దతిలో… హోమాలు, మంత్రాలు, హిందూ పెళ్లి తంతు ఏమీ లేదు… వాళ్లిష్టం, డీఎంకే హిందూ వ్యతిరేక, నాస్తిక భావజాలం… రాజ్ నిడిమోరు- సమంత పెళ్లి మరో తరహా… అది భూతశుద్ధి వివాహం… అంతకుముందు ఆమె నాగచైతన్యను క్రిస్టియన్- హిందూ పద్ధతుల్లో విడివిడిగా పెళ్లి చేసుకుంది…
విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి కూడా ఆమె కొడవ, అతని తెలుగు సంప్రదాయాల్లో జరిగింది… ఒకే మతం అయినా సరే వేర్వేరు పెళ్లి పద్దతులు ఉంటాయి, ప్రాంతాలు, సామాజికవర్గాలను బట్టి… అదితి హైదరీ, సిద్ధార్థ్ పెళ్లి వనపర్తిలోని ఓ 400 ఏళ్ల పురాతన గుడిలో జరిగింది, తన మూలాలున్న ప్రాంతం కాబట్టి, తన విశ్వాసం కాబట్టి అక్కడే పెళ్లి చేసుకుంది ఆమె… పక్కా తెలంగాణ వైదిక పెళ్లి తంతుతో…! ఈ ఉదాహరణలు చాలా స్పష్టంగా వారి వారి పద్ధతుల్లో, వారి నమ్మకాల్లో జరిపించుకోబడిన పెళ్లిళ్లు… ఏవీ హిందూ పెళ్లి తంతుగా భ్రమింపచేసే పెళ్లిళ్లు కావు… ఎంచక్కా తాము నమ్మే మతాచారం మేరకు పెళ్లి జరిపించొచ్చు కదా..!!
ఎహె, వాళ్లు ఏ పద్ధతిలో పెళ్లి చేస్తే మనకెందుకు అంటారా..? అంతేలెండి… హల్దీ, మెహందీ, సంగీత్ గట్రా మనం నార్త్ నుంచి దిగుమతి చేసుకుని… మంగళస్నానాల తంతులో సైతం సినిమా పాటలకు రికార్డింగ్ డాన్సులు కూడా చేస్తున్నాం కదా…!! ఎవరిష్టం వారిది..!!
Share this Article