.
“ఓటీటీలోకి మెగాస్టార్”… “చిరంజీవి టాక్ షో… ‘మెగావర్స్’ ప్రోమో విడుదల!” “టాక్ షోకు హోస్ట్‌గా చిరంజీవి” “మెగావర్స్’తో సరికొత్త అవతారం!” *బ్రహ్మానందం, సునీల్, సత్య అతిథులుగా 15 ఎపిసోడ్లతో తొలి సీజన్…
… నిన్నటి ఈ వార్తల సారాంశం ఇదే… చాన్నాళ్లుగా వింటున్నదే, కానీ నిన్న నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసంది ఒక ప్రోమో… ‘మెగా నాస్టాల్జియా.. మెగా నవ్వులు.. మెగా ముచ్చట్లు’ అంటూ…
Ads
మొదట chira jeeva అని సోషల్ మీడియాలో వదిలి, తరువాత N స్థానంలో నెట్ ఫ్లిక్స్ లోగోను ఇరికించి, క్రియేటివ్ ప్రచారం చేసుకుంది… ‘ఎన్’ (N) అంటే నెట్‌ఫ్లిక్స్.. మెగా కలయిక కుదిరింది.. మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు ఒకే చోట అంటూ చిరంజీవి ఆసక్తికర క్యాప్షన్ జోడించాడు… అంతా బాగుంది… కానీ..?
అంత వీజీ కాదు… అందులోనూ చిరంజీవికి అంత వీజీ అస్సలు కాదు… ఈ మాట ఎందుకొస్తున్నదో చెప్పాలంటే కొన్ని కారణాలున్నాయి… ఉదాహరణలున్నాయి… ఇదే చిరంజీవి గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హోస్ట్ చేశాడు… అమితాబ్ బచ్చన్ ఏళ్లుగా, అనేక సీజన్లను హోస్ట్ చేసిన సూపర్ హిట్ షో అది… ఇతర భాషల్లో కూడా ఎవరూ దీన్ని సక్సెస్ చేయలేకపోయారు… హిందీలో కూడా…
దాని తెలుగు రూపాన్ని చిరంజీవి చేయలేకపోయాడు… అదే అమితాబ్‌కూ చిరంజీవికి నడుమ తేడా… అంతెందుకు..? గతంలో నాగార్జున కాస్త బెటర్‌గా చేశాడు, కానీ జూనియర్ చేయలేకపోయాడు… ఇలాంటి షోలలో ‘స్వ’గతాలు ఎక్కువైతే ప్రేక్షకుడు, అందులోనూ ప్రజెంట్ జనరేషన్ అస్సలు యాక్సెప్ట్ చేయదు…
సేమ్ బిగ్‌బాస్ షో… జూనియర్, నాని రెండు సీజన్లకే మావల్ల కాదు బాబోయ్ అని వదిలేశారు… కానీ నాగార్జున ఎనిమిదీ పదేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతున్నాడు… సరే, టాక్ షోలకు వద్దాం… ముందే చిరంజీవి దీన్ని సక్సెస్ చేయలేడనే తీర్పులు వద్దులే గానీ…
ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం… 15 ఎపిసోడ్లతో తొలి సీజన్ అట… బ్రహ్మానందం, సునీల్, సత్య తదితరులు అట… వాళ్లతో చిరంజీవి షో దేనికి… బిగ్ టీవీలో కిస్సిక్ టాక్ షో చేసే జబర్దస్త్ వర్ష చాలు… చిరంజీవి ఓ రేంజ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులతో చేయాలి… అప్పుడే దానికి ఇంపార్టెన్స్… ఆ వాల్యూ వస్తాయి… లేదంటే పాతతరం వాళ్లను కూర్చోబెట్టి నాస్తాల్జిక్ ముచ్చట్లు పెట్టాలి… తన సినిమాల్లో కనిపించే బిల్డప్పులు, ఎలివేషన్లు ఈ షోలో అవాయిడ్ చేయాలి… హిపోక్రటిక్‌గా కాదు, నిజాయితీగా చెబుతున్నాడు అనిపించాలి…
గతంలో చాలామంది చేశారు… కానీ బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో బాగా హిట్… కానీ అదీ ఓ దశ దాటగానే ఫేడవుట్… గెస్టులుగా రావడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించలేదు, దాంతో షో మొత్తానికే ఆగిపోయింది… ‘అతి’ సర్వత్రా వర్జనీయం… ఇప్పుడు జగపతిబాబు కూడా ఇలాంటిదే జయమ్ము నిశ్చయమ్మురా అని జీ5 కోసం చేస్తున్నాడు… పెద్దగా హిట్ అయినట్టు లేదు…
అన్నింటికన్నా ముఖ్యమైంది నెట్‌ఫ్లిక్స్ రీచ్… ఇప్పటికీ దాని సబ్‌స్క్రిప్షన్ రేటు ఎక్కువే… దానికన్నా మాటీవీ వంటివి సరైన వేదిక అయిఉండేది… లేదా ఎక్కువ చానెళ్లున్న యూట్యూబ్ చానెల్ అయినా సరే… బిగ్‌బాస్ షో ఎంత చెత్త చెత్త అయిపోయినా సరే రేటింగ్స్ ఉన్నాయంటే అది స్టార్ మాటీవీ రీచ్, బ్రాండ్ వల్ల… చిరంజీవికి అర్థమైంది అనుకుంటాను… తన బావమరిది ఓటీటీ ఆహా వేదికను కాదని నెట్‌ఫ్లిక్స్ ఎంచుకోవడం తప్పో ఒప్పో రెండు ఎపిసోడ్లతో తేలిపోతుంది..!! అవునూ, ఆహాను ఎందుకు అవాయిడ్ చేసినట్టు..?!
చివరగా… చిరంజీవికి ఎవరూ చెప్పినట్టు లేదు… మెగా వర్స్‌లో వర్స్ అనే పదం అశుభసంకేతం…!! verse, worse వేర్వేరు పదాలే అయినా సరే..!!
Share this Article