Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉప్పూనిప్పూ కలయిక! హరీశ్ తదుపరి అడుగులపై మళ్లీ చర్చ!!

November 28, 2026 by M S R

.

రాజకీయాల్లో ఒక పుల్ల ఇటు నుంచి అటు పడితే… దాని వెనుక ఓ మర్మం ఉంటుంది… తెలంగాణ రాజకీయాల్లో ఇదొక ఆసక్తికరమైన చిత్రం… నువ్వా నేనా అంటూ కాలు దువ్వుకునే నేతలు, అచ్చం ఉప్పునిప్పూ బాపతు వైరం, పాత మెదక్ జిల్లా రాజకీయాల్లో నిత్యసమరం సలిపే హరీష్ రావు, జగ్గారెడ్డి ఒక్కచోట కలిశారు… అలుముకున్నారు..,  wow, what a scene

జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రముఖుడు… హరీశ్ రావు బీఆర్ఎస్‌లో నంబర్ టూ, సారీ, నంబర్ త్రీ… ఇద్దరికీ సూటిపోటీ మాటలు పరిపాటే… జ‌గ్గారెడ్డి (Jagga Reddy) ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించాడు…

Ads

jaggareddy

ఇంటికొచ్చిన విశిష్ట అతిథిని జగ్గారెడ్డి గౌరవించాడు, మర్యాదగా రమ్మన్నాడు, నాలుగు మంచి మాటలు మాట్లాడాడు… ‘2004లో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన కలిసి ఆయన ఛాంబర్ లో భోజనం చేసే వాళ్ళం… ఆ తర్వాత నేను కాంగ్రెస్ లో వచ్చాక.. మళ్ళీ ఇప్పటి వరకు హరీశ్ రావుని కలవలేదు… 21 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిశాం..’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చాడు…

కానీ నిజం ఏమిటో కూడా తనే చెప్పాడు… ‘నా కూతురి పెళ్లికి హరీశ్‌రావుని పిలవలేకపోయాను… కానీ ఈ ఫంక్షన్ మిస్ కావొద్దని ఆహ్వానించాను… మా ఇద్దరి మ‌ధ్య‌ ఎటువంటి రాజకీయాలు లేవు… ఇలా క‌ల‌వడంలో ఎటువంటి మతలబు లేదు… రాజ‌కీయం రాజకీయమే…

హరీశ్‌రావు బీఆర్ఎస్‌లో అగ్రనేత… నేను కాంగ్రెస్ లో టాప్ లీడర్ కాకపోయినా ఓ స్థాయి లీడర్ నే… అనేక ఫంక్షన్లకు ఆయన్ని పిలవలేకపోయాను… పదేళ్లు హరీశ్‌రావు మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన్ని కలవలేదు..’ ఇలా సాగిపోయింది తన వివరణ…

అవును, ఇన్నేళ్లూ తను పిలిచింది లేదు, ఇతను వెళ్లింది లేదు… మర్యాద రాజకీయం కూడా లేదు ఇద్దరి నడుమ… కానీ హఠాత్తుగా తను పిలిచాడు, ఇతను వెళ్లాడు… ఎందుకు ఆసక్తికరం అంటే…

హరీశ్ రావు బీఆర్ఎస్‌లో కంఫర్ట్‌గా లేడు… తను ఒప్పుకోడు, కానీ నిజం నిజమే… కేసీయార్ బిడ్డ తనను ఇష్టారాజ్యంగా విమర్శిస్తున్నా సరే, తను కిమ్మనడం లేదు, మౌనం అంగీకారం ఉన్నట్టుగా జనంలోకి నెగెటివ్‌గా పోతూనే ఉంది… రేప్పొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీయార్ వెంటనే సీఎం అన్నట్టుగా కేసీయార్ సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు కేడర్‌కు…

నెవ్వర్, హరీశ్ రావు బీఆర్ఎస్‌లో సెకండ్ లేయర్ లీడర్‌గా ఉండలేడు… కేటీయార్ సీఎం అయితే హరీశ్ రావు స్థానం ఏమిటో తనకూ తెలుసు… అసలు కేసీయారే తనను నమ్మడు పెద్దగా, రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీయార్ చాన్నాళ్లు హరీశ్‌ను దూరం ఉంచిన సంగతి తెలుసు కదా…

మరోవైపు హరీశ్ రావును బీజేపీ హైకమాండ్ వచ్చెయ్ అని సైగలు చేస్తోంది… (హరీశ్ బీజేపీలో ఎవరెవరిని కలిశాడో నాకు తెలుసు అని రేవంత్ రెడ్డి కూడా ఈమధ్య బాంబు పేల్చిన సంగతి తెలుసు కదా…)

ఈ స్థితిలో బీఆర్ఎస్‌లో ఒకరకంగా పొగబెట్టినట్టు ఉంది హరీశ్ రావు… అలాగని బీజేపీలోకి వెళ్దామంటే కిషన్‌రెడ్డి సహా చాలామంది కాబోయే సీఎంలు తనకు అడ్డం పడతారు… కాంగ్రెస్‌లోకి వెళ్తే రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ… రాహుల్ పెద్దగా ఎంటర్‌టెయిన్ చేయడు… సో, జగ్గారెడ్డి ద్వారా హరీశ్ రావు ఆశిస్తున్నది ఏమిటి..? ఇంట్రస్టింగ్ ప్రశ్న..!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఉప్పూనిప్పూ కలయిక! హరీశ్ తదుపరి అడుగులపై మళ్లీ చర్చ!!
  • మధురై కార్తీకదీపం… ఇద్దరే ఇద్దరు… ఆరిపోకుండా చూశారు…
  • నేలపై మెతుకులు ఏరుకున్న ‘పెళ్లి భోజనం’! దిక్కుమాలిన పెళ్లి జాతర!!
  • పాకిస్థాన్ ఎడారుల్లో తెలుగు బంధువులు!
  • నెట్‌ఫ్లిక్స్ పాకిస్థానీ కంటెంట్ వివాదం! కేంద్రం ఊరుకోవాలా..?!
  • యూపీ సభా? బహిరంగసభా? డీలిమిటేషన్‌ పర్వంలో ఓ ఉపకథ!!
  • ఇండస్ట్రియల్ పాలసీ 2.0 … గ్లోబల్ సమ్మిట్ వేదికగా 11 కొత్త పాలసీలు!!
  • మీరు బహుశా ఈ సినిమా గురించి విని ఉండకపోవచ్చు!
  • మహేశ్ బాబు లుక్‌కు ఎఐ నగిషీలు- సిక్స్ ప్యాక్ ప్రయాసలు..?
  • నోటిమాటలు చాలు… నోటరీలు కాపురాల్ని నిలబెట్టలేవు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions