Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భలేవారే, యాంగ్రీ రాజశేఖర్‌ సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలూ చేయగలడు తెలుసా..!!

June 15, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. రాజశేఖర్ ఏంగ్రీ , రఫ్ & టఫ్ పాత్రల్లోనే కాదు ; సంసారపక్ష సినిమాల్లో , సాఫ్ట్ పాత్రల్లో , రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రల్లో కూడా రాణించాడు . అలాంటి సినిమాల్లో ఒకటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ అల్లరి ప్రియుడు సినిమా .

1+2 సినిమా . హిందీలో సాజన్ సినిమాలో ఇద్దరు హీరోలు , ఒక హీరోయిన్ . ఆ కధను స్ఫూర్తిగా తీసుకుని ఇద్దరు హీరోయిన్లు , ఒక హీరో కధగా నేసారు సత్యానంద్ , రాఘవేంద్రరావు . డైలాగులను కూడా సత్యానందే వ్రాసారు . బాగా వ్రాసారు .

Ads

హీరో రాజశేఖర్ బ్రతుకు తెరువు కోసం పట్టణానికి వచ్చి తన గేంగుతో పాటల ప్రోగ్రాములను ఇస్తుంటాడు . ఆ క్రమంలో అతనికి రమ్యకృష్ణ తారసపడటం , ఆమే కవిత అనే పేరుతో కవితలు వ్రాస్తుందని తెలియదు అతనికి . హీరోయిన్ల తండ్రి రావు గోపాలరావు ఆశ్రయాన్ని సంపాదిస్తాడు హీరో .

రమ్యకృష్ణ తాను ప్రేమిస్తూ హీరోకు కవితలు వ్రాసేది మధుబాల అని పరిచయం చేయటం , తర్వాత నిజం తెలుసుకున్న మధుబాల తండ్రికి నిజం చెప్పి రమ్యకృష్ణతో పెళ్ళి జరిపించాలని ప్రయత్నించటం , ఈలోపు సుధాకర్ హీరోయిన్లను కిడ్నాప్ చేయటం , హీరో వచ్చి తుక్కుతుక్కుగా కొట్టేసి రమ్యకృష్ణని పెళ్లి చేసుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది .

సినిమా ఘనవిజయానికి కారణం పాటలు , డాన్సులు , వాటి చిత్రీకరణ . పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ . వేటూరి , సిరివెన్నెల , భువనచంద్ర , వెన్నెలకంటి , కీరవాణి వ్రాసిన చక్కటి సాహిత్యానికి కీరవాణి శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . బాలసుబ్రమణ్యం , చిత్ర అద్భుతంగా పాడారు .

రోజ్ రోజ్ రోజా పువ్వా , ఏం పిల్లది ఎంత మాటన్నది డ్యూయెట్లు రాజశేఖర్ , రమ్యకృష్ణల మీద ; చెప్పకనే చెపుతున్నది ; ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి డ్యూయెట్లు రాజశేఖర్ , మధుబాల మీద రాఘవేంద్రరావు చాలా రమ్యంగా చిత్రీకరించారు .

అందమా నీ పేరేమిటి , అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు పాటలు ఆహ్లాదంగా సాగుతాయి . ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా బాగుంటుంది . డాన్సుల్ని ప్రభుదేవా బ్రహ్మాండగా కంపోజ్ చేసారు .
ఈ చక్కని రొమాంటిక్ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు రెండు నంది అవార్డులు వచ్చాయి . ఉత్తమ దర్శకునిగా రాఘవేంద్రరావుకు , ఉత్తమ సంగీత దర్శకునిగా కీరవాణికి అవార్డులు వచ్చాయి . 25 వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది .

ఇతర ప్రధాన పాత్రల్లో బ్రహ్మానందం , మనోరమ , రావు గోపాలరావు , శుభ , సుధాకర్ , శ్రీహరి , సుత్తి వేలు , సారధి , రవిశంకర్ తదితరులు నటించారు . రవితేజ రాజశేఖర్ గేంగులో ఒకడిగా నటించాడు . కె కృష్ణమోహన రావు నిర్మాత .

తమిళంలోకి డబ్బింగ్ అయింది . కన్నడంలోకి రీమేక్ అయింది . రవిచంద్రన్ , నమ్రత , మాళవిక ప్రధాన పాత్రల్లో నటించారు . 1993 మార్చిలో రిలీజయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . గొప్ప వినోదాత్మక చిత్రం . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉన్నా మరలా మరలా చూడతగ్గ ఎంటర్టయినరే …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions