చిత్రమైన పోస్టులు, ట్రోలర్స్‌కు బెదిరింపులు, ఆవేశం, వివాదాలకు తోడు ఆ డ్రెస్సులు, ఆ ఫోజులు… అసలు అనసూయ అంటేనే సోషల్ మీడియాలో అదొక డిఫరెంటు టైపు… కాకపోతే ఆవేశాన్ని ఆపుకోలేదు, సంయమనం తక్కువ, కడుపులో ఉన్నది కక్కేస్తుంది…
అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా మీద తన అభిప్రాయం చెప్పేసరికి సోకాల్డ్ ఫ్యాన్స్ ఆమె మీద ఎగబడిపోయారు తెలుసు కదా… ఆంటీ అని ముద్రేశారు కదా… అప్పటి నుంచి ఆ అర్జున్‌రెడ్డి తాలూకు నెగెటివ్ ఒపీనియన్, తనను ట్రోలర్స్ ఆడుకున్న తీరు పదే పదే గుచ్చుతూ ఉంటుందేమో… ఈసారి ఆ దర్శకుడు వంగ సందీప్‌రెడ్డికి చురకలు అంటించింది…
ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది… సరే, ఆమె మిగతా పోస్టుల సంగతెలా ఉన్నా… ఈ పాయింట్ మాత్రం అనసూయ సరిగ్గానే పట్టుకుంది… యానిమల్ హీరో కేరక్టరైజేషన్ విషయంలో దర్శకుడు తప్పులో కాలేశాడనేది నిజం… ఆ యానిమల్ మూవీలో అక్కకు రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు యానిమల్ టైపు హీరో… అదే తన భార్య రష్మికతో మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోకు అని హితవు చెబుతాడు…
Ads
అక్కతో మగాడు, భార్యతో మగాడు అనే అర్థమొచ్చేలా పోస్టిన అనసూయ… పైగా నన్ను హిపోక్రైట్ అంటారు అని వెటకారాన్ని దట్టించింది… అంటే మీరు అసలైన హిపోక్రైట్స్ అనే అర్థమొచ్చేలా… సరే, దీన్ని కూడా ఖండించేవాళ్లు, ఉల్టా ట్రోల్ చేసేవాళ్లు ఉంటారేమో గానీ అనసూయ చెప్పిన పాయింట్ మాత్రం నిజమే…
ఈ స్టోరీ నిజంగా అనసూయ పెట్టిందేనా అని ఆమె ఖాతా వెతికితే కనిపించలేదు… కాకపోతే కొందరు స్క్రీన్ షాట్ పెట్టారు… పైగా ఆమెకు అర్జున్ రెడ్డి అన్నా, యానిమల్ అన్నా సేమ్ భావన కాబట్టి నిజంగానే స్టోరీ పెట్టి ఉందనే అనుకుందాం… జావేద్ అక్తర్, కిరణ్ రావు వంటి బాలీవుడ్ ప్రముఖులు యానిమల్ ధోరణిని తప్పుపట్టారు… కిరణ్ రావు అయితే లాపతా లేడీస్‌లో ఓ సీన్ కూడా పెట్టింది…
దానికి ఎక్కడో కాలిన వంగ ఏవో రిటార్టులిచ్చాడు… సెటైర్లు, రిటార్టులు, ఎదురుదాడి సరైన సమర్థన కావు, నిజానికి యానిమల్ తరహా కేరక్టరైజేషన్ విషయంలో తనకు సమర్థన లేదు కూడా… కాకపోతే ఇన్నాళ్ల తరువాత అనసూయ ఎందుకు స్పందించిందో తెలియదు, చాన్నాళ్లుగా ఎవరినీ గోకలేదుగా, చేతులు దురదపెడుతున్నట్టున్నయ్…
సరే, సందీప్‌రెడ్డి ఎప్పటిలాగే స్పందించి… ‘ఆంటీ’ అని ప్రస్తావిస్తూ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఏదైనా కామెంటుతాడేమో అనుకుంటే అదేమీ కనిపించలేదు… థూనాబచె, చివరకు అనసూయ విమర్శకు కూడా స్పందించాలా నేను అనుకున్నాడేమో కూడా తెలియదు… అవునూ, సందీప్ భాయ్, నీ హీరో చెల్లెలికో న్యాయం, పెళ్లానికో న్యాయం ఎందుకు చెప్పాడంటావు..?!
Share this Article