Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చివరి రోజుల్లో అన్నమయ్య సినిమా తీయాలని కూడా కష్టపడ్డాడు పాపం…

February 7, 2024 by M S R

Bharadwaja Rangavajhala………   డైరక్టర్ మాధవరావు ఆత్రేయతోనే ఎక్కువగా రాయించుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన మాధవరావు చిల్లర దేవుళ్లు నవలను సినిమాగా తీసీ అందులోనూ ఆత్రేయతోనే పాటలు రాయించుకున్నాడు. కింద మీకు కనిపిస్తున్న ఫొటోలో ఆత్రేయ ఆఫీసులో కూర్చున్న మాధవరావూ ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ జగన్నాథ్ ఉన్నారు.

annamayya

ఈ ఇద్దరూ ఆత్రేయ దగ్గరకు ఎందుకొచ్చారంటే.. 1972 అగస్ట్ నెల్లో విడుదలైన కన్నతల్లి సినిమా పాటల గురించి మాట్లాడడానికి వెళ్లారు. నిజానికి ఈ ఫొటో తీసినది 1970 డిసెంబర్ లో. 71 చవరకన్నా సినిమా పూర్తై ఉండాలి. మరి ఎందుకంత ఆలస్యం గా విడుదలైందో? ఇక పోతే ఈ ఫొటోలో ఆత్రేయ గారి య‌జ్ఞోప‌వీత‌ము కనిపిస్తోంది చూశారూ…. అది చూడగానే నాకో విషయం గుర్తొచ్చింది.

Ads


బాపు రమణలు వంశ‌వృక్షం తీసి ఆత్రేయకి ప్రీవ్యూ చూపించారు. ఎలా ఉందంటే … “రమణా ఒరిజినల్ భైరప్ప నవలలో పాత్రలన్నీ శైవ మతస్తులు కదా… తెలుగులో మా నిలువు నామాలుగా మార్చేశావేంట”ని నిలదీశారట. దీంతో రమణ గారు మన “సుగతి” ఇంతే అనేశారు.


ఆత్రేయతో బాపు రమణలు పనిచేసింది ఒక్క పెళ్లీడు పిల్లలకే. దుక్కిపాటి మధుసూధనరావు గారి సినిమా కావడంతో ఆత్రేయ అనివార్యంగా వచ్చేశారు. ఓ పాట కాస్త మార్చాలని బాపు అంటే గసురుకున్నారట. దీంతో అలాగే ఉంచి చిత్రీకరణ కానిచ్చేశారట బాపు. ఆత్రేయ రాసిన పాటల్లో ఆయన వ్యక్తిగత జీవితం కనిపిస్తుంది.


ఆత్రేయ జీవితంలో ప్రేమ వైఫల్యం ఉంది. తను ప్రేమించిన అమ్మాయి సగోత్రీకురాలు కావడంతో పెళ్లి చేసుకోలేక పోయాడు. కోడెనాగు చిత్రంలో కథ విందువా నా కథ విందువా పాటలో … అన్న అను మాటతో అన్ని తుంచేశావు అని రాసిన దగ్గర ఆత్రేయ ప్రేమ వైఫల్యం గురించే చెప్పినట్టు అనిపిస్తుంది.


మోడ్రన్ గా కనిపించినా … కారులో షికారుకెళ్లే లాంటి పాటలు రాసినా … కమ్యునిస్టు వి.మధుసూధనరావుతో స్నేహం చేసినా హరిపురుషోత్తమరావుతో కలసి తిరిగినా … అందాకా ఎందుకు మందు కొట్టినా… కాట్రగడ్డ మురారి అన్నట్టు అధర్మపత్ని దగ్గరకు వెళ్లినా..
య‌జ్ఞోప‌వీతాన్ని వీడలేదు. సంప్రదాయాన్నీ వదలలేదు. చివర రోజుల్లో అన్నమయ్య సినిమా తీయాలని కూడా చాలా కష్టపడ్డాడు పాపం… ఐనా తీయలేకపోయాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions