.
Pardha Saradhi Potluri …. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ – Asia-Pacific Economic Cooperation- APEC!
చైనా లో జరిగిన APEC సమావేశానికి భారత ప్రధానిని పిలవలేదు, అదే కాంగ్రెస్ ప్రధాని కనుక ఉండి ఉంటే చైనా APEC సమావేశంలో కుర్చీలో ఉండేవారు ట్రంప్, పుతిన్, జీ జింగ్‌పింగ్‌లతో అని ప్రచారం!
ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ కి భారత్ దేశానికి సంబంధం ఎక్కడి నుండి వచ్చింది?
APEC ని 1989 లో స్థాపించారు!
APEC స్థాపించడానికి కారణం ఏమిటి?
Pacific Rim అంటే పసిఫిక్ మహా సముద్రం తీరం వెంట ఉన్న దేశాలు (the countries, territories, and coastal regions surrounding the Pacific Ocean) పరస్పరం సహకారానికి, స్వేచ్చా వాణిజ్యం ( free trade ) కోసం APEC ని స్థాపించారు!
Ads
భారత దేశానికి పసిఫిక్ మహా సముద్ర తీరం ఉందా?
APEC హెడ్ క్వార్టర్స్ సింగపూర్‌లో ఉంది!
APEC సభ్య దేశాలు : ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, చైనా, హాంగ్ కాంగ్ ( చైనా ), ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, మెక్సికో, న్యూజీలాండ్, పపువా – న్యూ గినియా, పెరూ, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, తైవాన్, థాయ్ లాండ్, వియాత్నాం, అమెరికా దేశాలు ఉన్నాయి.
APEC అంటే అదేదో సభ్యదేశాలు సమావేశం అయిపోయి పరస్పర అంగీకారంతో అధికారికంగా ఒప్పందాల మీద సంతకాలు జరుగుతాయి అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే! APEC సమావేశాలలో కేవలం చర్చలు జరుగుతాయి తప్పితే అధికారికంగా ( Govt., To Govt., ) సంతకాలు జరగవు! మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అంటూ ఒక తీర్మానం చేసుకొని ఎవరి దేశాలకి వాళ్ళు వెళ్ళిపోతారు తప్పితే మేలు జరిగేది శూన్యం!
నవంబర్ 17- 18… రెండు రోజుల పాటు చైనాలోని షేంజెన్ లో జరిగిన APEC SUMMIT అనేది 33 వ సమావేశం 1989 నుండి ఇప్పటివరకు!
ప్రతీ సమ్మిట్ కి ఉన్నట్లే ఈసారి కూడా ఒక నినాదం పెట్టుకున్నారు అది…
“Building an Asia-Pacific Community to prosper together ”
ప్రాస్పర్ లేదు మన్ను లేదు. బ్రూనై, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, మలేషియా దేశాల సముద్రజలాలలో చైనాకి చెందిన పెద్ద పెద్ద చేపల పడవలు చేపలు పడుతున్నాయి గత దశాబ్ద కాలంగా… కానీ ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు!
డోనాల్డ్ ట్రంప్, వ్లాడిమిర్ పుతిన్, జీ జింగ్పింగ్ ముగ్గురూ కలిసి సమావేశామయ్యారు కానీ ఎవరినీ అనుమతించలేదు!
జీ జింగ్ పింగ్ ట్రంప్ తో…: తైవాన్ చైనాలో అంతర్భాగం కాబట్టి పశ్చిమ దేశాల జోక్యాన్ని సహించేది లేదు!
ట్రంప్ జిన్జ్పింగ్ తో…: అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ పెట్టుబడులు, ప్రయోజనాలు ఉన్నాయి తైవాన్ సెమికండక్టర్ పరిశ్రమలలో కాబట్టి యూరోపియన్ యూనియన్ ని కూడా కలుపుకొని మరొకసారి చర్చలు జరుపుదాం!
పుతిన్ ట్రంప్ తో… : ఇప్పటివరకు ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించుకున్న భూ బాగాలు అంటే Donbas తో సహా రష్యాకి అప్పచెప్తున్నట్లు అగ్రిమెంట్ మీద జెలెంస్క్కీ సంతకం పెడితే రష్యన్ సైన్యం యుద్ధం ఆపేస్తుంది.
ట్రంప్ పుతిన్ తో….: నేను జెలెంస్క్కీ తో ఇప్పుడే మాట్లాడి ఒప్పిస్తాను, అలాగే యూరోప్ నాయకులతో మాట్లాడి ఉక్రెయిన్ ని నాటో సభ్య దేశంగా చేర్చుకొని రష్యా అడిగిన భూభాగాన్ని ఇచ్చేద్దామని ఒప్పిస్తాను.
పుతిన్ ట్రంప్ తో…: ఉక్రెయిన్ కి నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి వీల్లేదు, అలాగే పొలాండ్ ని నాటో నుండి తీసేస్తేనే యుద్ధ విరమణ జరుగుతుంది, లేదంటే యుద్ధం కొనసాగుతుంది!
జీ జింగ్ పింగ్ ట్రంప్ తో…: ఇరాన్ మీద దాడులు తీవ్రతరం చేస్తే మధ్య ప్రాచ్యం మళ్ళీ భగ్గుమంటుంది. ఈసారి ఇరాన్ ని ఎవరూ ఆపలేరు.
ట్రంప్ జీ జింగ్ పింగ్ తో….: ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ఉన్నది ఉన్నట్లుగా అప్పచెపితే యుద్ధం ఆపేసి ఇరాన్ మీద ఆంక్షలని ఎత్తేసి ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా అమెరికా సహాయం చేస్తుంది!
వ్రాయడానికి రెండు పేజీలు పట్టేలా వ్రాయవచ్చు కానీ క్లుప్తంగా APEC లో జరిగింది ఇదే!
అమెరికా ఉభయసభలలో రిపబ్లికన్స్ డామినేషన్ పోయి డెమోలకి ఆధిక్యం వచ్చిన తరువాత పుతిన్, జీ జింగ్ పింగ్ లతో మాట్లాడడానికే చైనా వచ్చాడు తప్పితే APEC దేశాల మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం అనే పడికట్టు మాటల కోసం కాదు.
జనవరి 14 నుండి డెమోక్రాట్లు ప్రతీ డాక్యుమెంట్ ని క్షుణ్ణంగా పరిశీలించి కానీ ఆమోదం తెలపరు. ఇప్పటివరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని వాటి తాలుకు డాక్యుమెంట్స్ ని కూడా అధ్యయనం చేయబోతున్నారు కాబట్టి ట్రంప్ ఇరాన్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్ మీద యుద్ధం మొదలుపెట్టిందే ట్రంప్! జనవరి 14 తరువాత కాంగ్రెస్ కి సమాధానం చెప్పాల్సిఉంటుంది. ట్రంప్ వీటో చేయలేడు, ఎందుకంటే యుద్ధం ప్రకటించే ముందు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి కానీ ట్రంప్ ఆ పని చేయలేదు!
నవంబర్ 17- 18 APEC సమావేశాలు జరిగాయి, ఎటు వాళ్ళు అటు వెళ్లిపోయారు.
పుతిన్ పోలాండ్ ని నాటో నుండి తప్పించమని అడిగాడు ట్రంప్ ని, కానీ సమాధానం రాలేదు, కాబట్టి ఉక్రెయిన్ పోలాండ్ సరిహద్దుల వద్ద పొలాండ్ భూ భాగం మీద రష్యా క్రూయిజ్ మిసైల్ తో దాడి చేసి హెచ్చరించింది నిన్న!
పోలాండ్ నాటో ఆర్టికల్ 5 ని యాక్టివేట్ చేయమని డిమాండ్ చేస్తున్నది. నాటో ఆర్టికల్ 5 ప్రకారం నాటోలో సభ్యత్వం లేని దేశం నాటో సభ్య దేశం మీద దాడి చేస్తే వెంటనే నాటో దేశాలు ఆ దేశం మీద దాడి చేస్తాయి.
24 గంటలు గడిచినా నాటో ప్రతిస్పందించలేదు సరికదా మా క్రూయిజ్ మిసైల్ పొరపాటున పోలాండ్ భూభాగంలో పడ్డది అని రష్యా నుండి ఎలాంటి ప్రకటన రాలేదు!
కాబట్టి పుతిన్ నాటో మీద యుద్ధం ప్రకటిస్తాడా లేదా నాటోనే యుద్ధం ప్రకటిస్తుందా అనేది వేచి చూడాలి!
అసలే చలి కాలం అందులోనూ తీవ్ర ఇంధన కొరత ఎదురుకుంటున్న యూరోప్ పోలాండ్ విజ్ఞప్తికి స్పందించి రష్యాతో తలపడతాయా?
చైనా సమావేశంలో ట్రంప్ పుతిన్ మధ్య రహస్యంగా ఏదో ఒప్పందం జరిగివుంటుంది. లేకపోతే చైనా నుండి మాస్కోకి రాగానే ఇటు ఉక్రెయిన్ మీద దాడులు తీవ్రం చేసిన పుతిన్ అటు పోలాండ్ మీద కూడా దాడి చేశాడు అంటే ట్రంప్ ఏదో సందేశం ఇచ్చి ఉండాలి!
ప్రధాని మోడీ చాలా స్పష్టంగా చెప్పారు పుతిన్, జెలెన్సకీ ఒప్పుకుంటే మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని. కానీ పుతిన్ వైపు నుండి ఎలాంటి అభ్యర్ధన రాలేదు కానీ జేలెన్స్కీ మాత్రం అడిగాడు!
మోడీ లక్ష్యం ఒకటే! ఎవరికి దూరం కాకూడదు అలాగే మధ్యవర్తిత్వం చేస్తే అది విఫలం అవకూడదు అని!
SO..! APEC అనేది మన దేశానికి సంబంధించినది కాదు కాబట్టి మోడీని పిలిచినా వెళ్ళేవారు కాదు!
ఈ కాంగ్రెస్ సోషల్ మీడియాకి బుర్ర ఉండదు కానీ ప్రతిసారి కూలి ఇచ్చి మరీ తన్నించుకుంటారు! కాంగ్రెస్ వాళ్ళ మైండ్సెట్ ఎలా ఉంటుంది అంటే…
“ప్రపంచ తమిళ మహాసభలకి తెలుగు వారిని ఆహ్వానించలేదు కాబట్టి అవమానం జరిగింది ” అనే టైప్!
Share this Article