Sunitha Ratnakaram…… ప్రకాష్ రాజ్ ఈ సినిమాని తెలుగూ, తమిళమూ, కన్నడ భాషల్లో 2014 లో తీసాడు, 2011 మలయాళం సినిమా ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ ఆధారంగా… కన్నడంలో తప్ప అన్నిచోట్లా బానే తన్నేసిందట. అయినా 2016 లో హిందీలో మొదలెట్టాడు. రకరకాల కష్టాలు దాటుకుని ఇప్పుడు ఈ 2022లో ‘జీ5’ ద్వారా ఎట్టకేలకు విడుదలైంది. ఇవేమీ తెలీకుండానే నానా పాటేకర్ కనపడుతున్నాడని చూడటం మొదలుపెట్టా ఓ రెండు మూడు వారాల ముందు… కాసేపటికి శ్రేయా కనిపించి […]
ఎట్టెట్టా… కూర్మావతారంలో ఈ భూమిని మోస్తాడా విష్ణువు… అబ్బ ఛా…
నిజమే… చిన్నదే కావచ్చుగాక పొరపాటు… లేదా తప్పు… కానీ ఎవరూ గమనించలేకపోయారు… పవన్ కల్యాణ్ ఎన్నికల ఎమరాల్డ్ గ్రీన్ ట్రక్కు పేరు వారాహి అని చదివి, ఈ వారాహి ఎవరని సెర్చుతుంటే… అనుకోకుండా సాయి వంశీ అనే ఫేస్బుక్ మిత్రుడి వాల్ మీద కనిపించింది ఇది… ఇది కూడా వరాహరూపానికి సంబంధించిన పరిశీలనే… అసలే కాంతార సినిమాలోని వరాహరూపం సినిమా వివాదం వార్తలు రోజూ చదువుతున్నామా..? ఇప్పుడు ఇది మరో వరాహం టాపిక్… ఏకంగా విష్ణువు వరాహవతారం […]
తెలంగాణలో ట్రక్కుయాత్ర ఉంటుందా..? బీఆర్ఎస్ కేడర్ సహిస్తుందా..?
ఆ మైన్ ప్రూఫ్ వెహికిల్ కలర్ మీద, ఎత్తు మీద, టైర్ల మీద, రిజిస్ట్రేషన్ చిక్కుల మీద బొచ్చెడు వార్తలు రాశారు, అయిపోయినయ్ కదా… తెలంగాణ సర్కారుకు ఈ చిన్న విషయాల మీద ఆసక్తి ఉండదు…. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ స్నేహితుడూ కాదు, ప్రత్యర్థీ కాదు… ఆలివ్ గ్రీన్ బదులు ఎమరాల్డ్ గ్రీన్ అని రాసేసి, ఓ నంబర్ ఇచ్చేసి, రిజిస్ట్రేషన్ మమ అనిపించేశారు… అసలు అది కాదు కాస్త చూడాల్సింది… ఈ ట్రక్కులో… ఓహ్, క్యారవాన్ […]
రవితేజా, నీ బాంచెన్… మా భాషను పిస్స పిస్స చేస్తున్నవ్ కదర భయ్…
అది అసలే మెగాస్టార్ మూవీ… ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదు… రెండు సినిమాలు వరుసగా చీదేసినా సరే, మళ్లీ అవే డ్రెస్సులు, అవే స్టెప్పులు, ఇవే ఇమేజీ పోకడలు… అదే నెత్తిమాశిన ఫార్ములా పోకడలు… కానీ, దేవుడు కదా, ఎవ్వడూ ఏమీ అనొద్దు… మొన్నామధ్య ఎవరో ఆమీర్ భాన్, లాల్ సింగ్ చద్దా అన్నాడు, ప్రజెంట్ చేశాడు, అది కాస్తా ఫట్ మని తన్నేసింది… తరువాత సల్మాన్ ఖాన్ అన్నాడు, అతిథి పాత్రో, విశేష పాత్రో ఇచ్చాడు… […]
నెత్తిమాశిన ఓ రిపోర్టు… దానిపై ఎర్రపత్రిక బ్యానర్ స్టోరీ… ఇదేం దుర్గతి కామ్రేడ్…
చైనా దుర్మార్గాలు తప్ప ప్రపంచంలో ఏం జరిగినా, మస్తు నీతులు చెప్పే సీపీఎం పార్టీ, దాని అనుబంధ మీడియా పూర్తిగా పాతాళానికి చేరుకున్నట్టుంది… చివరకు బ్యానర్ స్టోరీ హెడింగులో అక్షరదోషాల్ని కూడా ఎవరైనా చేతులు పట్టి దిద్దించాలా..? కంటెంటు గురించి తరువాత చెబుతాను… తెలంగాణలో ప్రజాశక్తిని చీల్చి నవతెలంగాణ అని ఓ పత్రిక పెట్టారు కదా… ఈరోజు ఓ హెడింగ్… ‘సవాళ్లేన్నో…’… నిజమే, టైపో అయితే విమర్శించకూడదు… కానీ ఒక పత్రిక తన ఫస్ట్ పేజీ బ్యానర్‌ను […]
పరమ దిక్కుమాలిన వార్త… అచ్చు నారాయణ కూతల్లాగే పరమ నాసిరకం…
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాలు, అనుబంధ మీడియా, ప్రచారం వెనుక అధ్యయనం అనేది ప్రధానంగా కనిపించేది… విషయాల్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవడం, పాలకుడి లైన్ ఏమిటో తెలుసుకుని, సరైన గణాంకాలతో విమర్శ పెట్టడం..! అలాంటిది నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఎవడితోపడితే వాడితో దోస్తీ, పెద్ద పార్టీలకు తోకలుగా మారిపోవడం కమ్యూనిస్టు పార్టీల దుర్గతి… కేసీయార్‌తో దోస్తీ కుదరగానే, టరమ్స్ బాగా సంతృప్తికరంగా అనిపించగానే… ఎర్రదండు గవర్నర్ ఇంటి మీదకు దండయాత్రకు వెళ్లింది… అవసరమా..? తెలంగాణలో అదొక్కటే […]
సీబీఐ విచారణ గదిలో మీడియా సీక్రెట్ గొట్టాలు… చూసినట్టే రిపోర్టింగ్…
‘సౌత్ గ్రూపు’తో సంబంధమేమిటి..?… సాక్షి… పదిఫోన్లు ఎందుకు మార్చారు… వెలుగు… సెల్ ఫోన్ల ధ్వంసమేల..? ఆంధ్రజ్యోతి… ఇలా రకరకాల పత్రికలు సీబీఐ టీం ఎమ్మెల్సీ కవితను ఏమేం ప్రశ్నలు అడిగాయో రాసిపారేశాయి… అసలు ఈ విచారణకు లైవ్‌లో ప్రసారం చేయాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిన్న చేసిన డిమాండే పెద్ద నవ్వులాట అయిపోయింది… చివరకు ఆ పార్టీ దురవస్థ అది… మీడియా కథనాలు కూడా నారాయణ బాటలోనే ఉన్నాయి… ఆరు గంటలా..? ఏడు గంటలా..? విచారణ జరుగుతున్నంతసేపూ సినిమాల్లో […]
కాంతార సీక్వెల్ కోసం రిషబ్ ప్రత్యేక పూజలు… పంజుర్లి దేవుడి హెచ్చరికలు…
అయిపోయింది… ఓటీటీలోకి వచ్చేసింది… థియేటర్లలోనూ చల్లబడింది… టీవీల్లో ప్రసారం బాకీ ఉంది… కాంతార మొత్తానికి ఒక చరిత్ర లిఖించి వెనక్కి వెళ్లిపోతోంది… బెంగుళూరులో 50 షోలు వేస్తున్నారు… అదంతా హాంగోవర్ బ్యాచ్.. మరి సీక్వెల్..? ఎస్, ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే సీక్వెల్ తీసి జనం మీదకు వదలడం, సొమ్ము చేసుకోవడం అలవాటు కదా… మరి రిషబ్ శెట్టి, ఈ సినిమా నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్ చేసేది కూడా ఆ వ్యాపారమే కదా… సీక్వెల్‌కు రెడీ […]
Jagan ఏం చేసి ఉండాల్సింది..? KCR కు స్ట్రాంగ్ హెచ్చరిక చేసి ఉండాల్సిందా..?
‘‘షర్మిల కాన్వాయ్‌లోని వాహనాలపై దాడి చేయడం, షర్మిల కూర్చున్న వాహనాన్ని టోయింగ్ చేసుకుంటూ పోలీసులు తీసుకువెళ్లడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశం సందర్భంగా ‘మీ సోదరిని అలా లాక్కుంటూ వెళ్లినా మీకు బాధ కలగలేదా?’ అని జగన్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించడాన్ని ఆషామాషీగా తీసుకోలేం. రాజకీయ ప్రయోజనం లేకపోతే ప్రధానమంత్రి ఈ అంశాన్ని అంత ముఖ్యమైన సమావేశం వద్ద ప్రస్తావిస్తారా? కేంద్రాన్ని ధిక్కరిస్తే తమకు కలిగే నొప్పి ఏ స్థాయిలో […]
జక్కన్నా, ఏమంటివి ఏమంటివి… కాంతారతో కళ్లు తెరుచుకునెనా… ఎంతమాట ఎంతమాట…
రాజమౌళికి జ్ఞానోదయం అయ్యింది… కాకపోతే అది ఒరిజినల్, ప్యూర్ కాదు… ఉత్త ఫేక్… కాంతార సినిమా మన సినిమా నిర్మాతలు, దర్శకుల మైండ్ సెట్ మార్చాలట… సినిమా భారీ వసూళ్లకు, సక్సెస్‌కు పెద్ద స్టార్లు, పెద్ద బడ్జెట్లు అవసరం లేదట… ఒత్తిడి పెంచుతోందట… నిజానికి ఇండియన్ సినిమాల్లో అనేక అవలక్షణాల్ని ప్రవేశపెట్టిందే రాజమౌళి… ఇప్పుడు అరెరె అని నాలుక కర్చుకుంటున్నట్టు మాట్లాడుతున్నాడు… సీన్లకుసీన్లు కాపీ కొట్టడం, చరిత్రను వక్రీకరించడం, హీరోల్ని మానవేతర శక్తులుగా చూపించడం వంటి క్రియేటివిటీ […]
దగ్గుబాటి నారప్పా…! ఈ చారిటీ ఏందప్పా..? పిల్లికి బిచ్చమేశారా ఎన్నడైనా..!!
నారప్ప రెవిన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం… దగ్గుబాటి సురేష్ నోటి నుంచి వచ్చిన ఈ మాట కాస్త నవ్వు పుట్టించింది… తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరెన్నిక గన్న పెద్దలకు చారిటీ అంటే తెలుసా..? అసలు దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన చారిటీ వార్త ఒక్కటైనా చదివామా..? ఫోటో ఒక్కటైనా చూశామా..? తనే కాదు, ది గ్రేట్ దిల్ రాజు, రాజమౌళి ఎట్సెట్రా అందరూ… పిల్లికి బిచ్చం, ఎడమచేత్తో కాకిని… వంటి సామెతలన్నీ వీళ్లకే సూటబుల్… ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందీ […]
అడ్డమైన గ్రాఫిక్స్ వచ్చి… మన ఇమేజీ దెబ్బతినిపోయిందోయ్… ఏం చేద్దాం…
సాక్షి Yaseen Shaikh ది మంచి వెటకారం, వ్యంగ్యం, శ్లేష దట్టించిన కలం… మొదలుపెడితే చాలు, అలా నవ్విస్తూ సాగిపోతుంది… కానీ చాన్నాళ్లయింది తనను చూసి… చదివి… మళ్లీ ఎఫ్బీలో కనిపించింది తాజాగా… షేర్ చేయకుండా ఉండలేం… మీరూ ఎంజాయ్ చేయండి… ఎఫ్బ రైటింగ్సులో తోపులం అనుకునేవాళ్లు ఖచ్చితంగా చదవాలి సుమా… సినీమృగాయణం! ‘ఓసోసీ పిల్ల ఖోడి ఫ్ఫెఠ్ఠా’ పాట దూరంగా వినిపిస్తుండగా పరవశించింది కోడి. ‘‘నా జాతిజనులు పాడుకునే జాగృతీ గీతంగా ఈ పాట ఎప్పటికీ నిలచిపోవాల’’ని […]
అంట్లు తోమేందుకు ఇప్పుడు మగ విమ్… ఆడ విమ్కన్నా శక్తిమంతమైనది…
ఆడ పని… మగ పని… అసలు వంటపని ఆడదా…? మగదా…? ఇదేం పిచ్చి ప్రశ్న… ఎవరు చేస్తే వాళ్లది..? పనికి లింగభేదం ఏముంది..? మారుతున్న కాలంతోపాటు వంటపనితో పాటు గతంలో కేవలం ఆడవాళ్లకే పరిమితమైన ప్రతి పనిలోనూ మగవాడు సాయం చేస్తున్నాడు… చేయాలి… చేయక తప్పదు… అంట్లు తోమడం ఆడపని… పాలు వేడిచేసి, కాఫీ పెట్టడం మగపని అని తేడాలు ఏమీ ఉండవు కదా… కానీ కార్పొరేట్ ప్రపంచం ఊరుకుంటుందా..? పనిని కూడా జెండరైజ్ చేసేస్తుంది… తమ […]
తెలంగాణ కంచి… ఈ వరదరాజపురం గుడికి వందలేళ్ల నాటి ఓ కథ ఉంది…
శారదా వాసుదేవ్ తన వాల్ మీద రాసుకొచ్చిన ఓ స్టోరీ ఆసక్తికరంగా అనిపించింది… ఏ గుడికైనా రకరకాల స్థలపురాణాలు ఉంటాయి… అందులో అధికశాతం నమ్మబుల్‌గా ఉండవు… కానీ ఇదెందుకో కనెక్టింగ్… ఆమె రాసింది యథాతథంగా ఇక్కడ పెట్టలేం… అంటే స్టార్ గుర్తులు అడ్డుతగులుతాయి… మన భాషలో మనం చదువుకుందాం… గుండెలపై కాదు… తలపై కుంపటి,.. అది తెలంగాణ కంచి… శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం… హైదరాబాద్‌కు దగ్గరలోనే ఉంది… ఎలా వెళ్లాలో తెలుసా..? ఈసీఐఎల్ క్రాస్ […]
85 లక్షలకు చేరిన బిగ్‌బాస్ ప్రైజ్ మనీ… సోషల్ తిట్లతో దిగొచ్చిన టీం…
కొన్నాళ్లుగా బిగ్‌బాస్ టీంకు ఒకటే పని… విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీలో ఎంత కోత పెట్టాలి..? ఎలా కోతపెట్టాలి అని..! పేరుకు యాభై లక్షల ప్రైజ్ మనీ అని ప్రకటించి, మళ్లీ ఈ కోతలేమిట్రా, ఎలాగూ ఈసారి షో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఖర్చులు మిగుల్చుకునే వేషమా అని నెటిజనం, సోషల్ మీడియా, మీడియా వెక్కిరింపులకు, తిట్టిపోతలకు దిగాయి… ఆ టీంకు వాచిపోయినట్టుంది… దిగొచ్చింది… నిజానికి ఆమధ్య రాజ్ అనుకుంటా… కంటెస్టెంట్ ఏదో పాట పాడి, […]
నమ్రత చేసిన తప్పేముంది..? అవి మినర్వా రేట్లు… అలాగే మండుతుంటయ్…!!
మన సైట్లకు, ట్యూబర్లకు ఒకటే లోకం… ఎవడైనా ఏదైనా రాస్తే చాలు, ఇక అందరూ దాన్నే పట్టుకుని దున్నేస్తారు… నిజమో, అబద్ధమో జాన్ దేవ్… పహెలే లిక్ లేనా… బస్…! ఎస్, నిజం… మహేశ్ బాబు ప్రతి అడుగు వెనుక నమ్రత ఉంటుంది… ఆమె గ్రిప్ చాలా ఎక్కువ తన ఫ్యామిలీ మీద… ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమే మేనేజ్ చేస్తుంది… తప్పో ఒప్పో డబ్బు కావాలి… అందుకే గుట్కా సరొగేట్ యాడ్స్ కూడా చేస్తుంటాడు మహేశ్ […]
కాంతారలో తల్లి కమల పాత్ర గుర్తుందా..? ఆకట్టుకున్న ఆ సహజ నటి ఎవరో తెలుసా..?
ప్రముఖ నటుడు, డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్, స్క్రిప్ట్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఈమధ్య కొత్త సినిమాలపై తన అభిప్రాయాలను రాస్తున్నాడు కదా… తాజాగా కాంతార ఓటీటీలో చూసినట్టున్నాడు… సినిమా గురించి నాలుగు మంచిమాటలు చెబుతూనే… ‘‘తల్లి పాత్ర పోషించిన అమ్మాయిని ఎవరితో పోల్చాలో అర్థం కావడం లేదు… అసలు ఆమె సినిమా నటి అంటే ఎవరూ నమ్మరు… అడవిలో ఉండే అమ్మాయితో ఆ పాత్ర చేయించారా అన్నంత సహజంగా చేసింది… హేట్సాఫ్’’ అని ప్రశంసించాడు… ఆమెకు మంచి […]
సన్నజాజుల రాగేశ్వరి..! శృంగార గాయని అనొచ్చా..? ఐటమ్ సాంగ్స్‌కే ప్రసిద్ధి..!!
ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో శృంగార నర్తకి (నటి అంటే సరిపోయేదేమో..) జయమాలిని తనకు నచ్చిన పాట సింహబలుడు సినిమాలో ఎన్టీయార్‌తో చేసిన ‘సన్నజాజులోయ్’ అని చెప్పింది… ఎందుకు నచ్చింది అంత బాగా అని ఇంటర్వ్యూయర్ అడిగినట్టు, ఆమె ఏదో చెప్పినట్టు గుర్తులేదు… కానీ నిజానికి ఆమె చేసిన వందల ఐటం సాంగ్స్‌లో దీనికి మరీ అంతగా గుర్తుంచుకునేంత సీన్ ఉందా అనేది ప్రశ్న… ఉంది… కానీ ఆ పాటలో ఏవో సాహిత్య విలువలున్నాయని కాదు, అవేమీ లేవు […]
విశిష్ట అద్వైతుడు రామానుజాచార్యుడి బయోపిక్‌లో నందమూరి బాలకృష్ణ..!
సోషల్ మీడియాలో కొన్ని ఠక్కున ఆకర్షిస్తయ్, ఒకింత ఆలోచనలో లేదా ఆందోళనలో పడేస్తయ్… అనుమానించేలా చేస్తయ్… చివరకు అదేమీ లేదులే అని తేల్చుకున్నాక కుదుటపడుతుంది… ఇదీ అలాంటిదే… బాలయ్య హీరోగా రామానుజాచార్యుల బయోపిక్ తీయబోతున్నారు, బాలయ్య 109వ సినిమా ఇదే, చినజియ్యర్ స్వామి సూచనలతో కథ ఉంటుందనేది ఆ పోస్టు సారాంశం… ఓ ఫోటో కూడా పెట్టారు… ఆరా తీస్తే, కొన్ని పరిస్థితులు, ప్రజెంట్ ట్రెండ్స్ పరిశీలిస్తే ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చునని తేలిపోతుంది… రామానుజాచార్యుల కథ విశిష్టం… […]
ఆట ముగింపుకొచ్చింది… అవే బిచ్చపు రేటింగ్స్… మాటీవీ ఇజ్జత్ పోయింది…
మా టీవీకి మస్తు రీచుంది… బార్క్ రేటింగ్స్‌ను లేపగలం, దింపగలం, తొక్కగలం అనే బలుపు భావనలు స్టార్ మాటీవీకి ఏమైనా ఉంటే… అవన్నింటినీ బద్దలు కొడుతోంది బిగ్‌బాస్ సీజన్… చివరకు వచ్చింది కదా, రేపోమాపో ఆదిరెడ్డిని, కీర్తిని లేదా ఇనయను, కీర్తిని లేదా ఇనయను ఆదిరెడ్డిని బయటికి పంపించేసి, టాప్ ఫైవ్ ఎవరో తేల్చేసే సమయం కూడా వచ్చేసింది కదా అనుకుంటుంటే… రేటింగ్స్ ఏమైనా పిసరంత పెరిగాయా అని చూస్తే మరింత షాక్… నిజం, మాటీవీ రేటింగ్స్ […]
- « Previous Page
- 1
- …
- 265
- 266
- 267
- 268
- 269
- …
- 458
- Next Page »