ఓ పని చేయండి… ఊహల్లోనే ఓ దేశం సృష్టించండి… భూమిపై స్థానం, జనాభా, చరిత్ర, సంస్కృతి లేకపోయినా పర్లేదు… అందులో మీరు చెప్పిందే శాసనం, మీరు చెప్పిందే రాజ్యాంగం… ఓ కరెన్సీ, ఓ జెండా, ఓ పార్లమెంటు… నో, నో, పార్లమెంటు, సుప్రీం కోర్టులు అక్కర్లేదు… దానికి అత్యున్నత ఏకైక ధర్మకర్త అనగా ధర్మ నియంత మీరే…… లేదంటే ఇంకో పని కూడా చేయొచ్చు… అమెరికా ఆధీనంలోని ఓ దీవి కొనండి… అందులోనే మీ దేశం ఉందని […]
లేడీ ఆర్టిస్ట్ అనగానే, పేలవంగా స్కిట్లు చేసే పర్ఫార్మర్ అనుకుంటిరా….. ఫైమా…!!
ఇది వార్త అవుననుకుంటే వార్తే… కాదనుకుంటే కాదు… ఈమె పేరు ఫైమా… తెలుగు జనానికి బాగా పరిచయమైన పేరే… బక్కగా, నల్లగా, పొట్టిగా, ముందువైపు కాస్త ఊడిపోయిన జుట్టు, పళ్ల మధ్య సందు… బిలో యావరేజ్… ఇది సగటు మగాడు చూసే చూపు, వేసే అంచనా… కానీ ఆమెలో మెరిట్ సూపర్… అవ్వ, అయ్య, మగపిల్లల్లేరు, అక్కాచెల్లెళ్లే.. రేకుల ఇల్లు… దుర్భరంగానే లైఫు… అవేమీ ఆమెను ఫ్రస్ట్రేషన్‌లోకి పంపించలేదు… తనలో కామెడీ టైమింగ్ ఉందనీ తనకు అంతగా […]
Atreya… హార్టిస్టు మాత్రమే కాదు… గొప్ప డెమొక్రటిక్ రైటర్ Also…
Bharadwaja Rangavajhala ….. ఆత్రేయ సినిమా పాటల రచనలో ప్రజాస్వామ్య దృక్పధం కనిపిస్తుంది. అది తెలుగులో ఇంకే సినిమా కవిలోనూ కనిపించదు. చాలా స్పష్టంగా … ఏ మనిషి కూడా మరో మనిషి ఏరియాలోకి పోయి ప్రవర్తించకూడదు అంటాడాయన. ఇందుకు ఉదాహరణలు అనేకం చెప్పుకోవచ్చు …. నీ మనసునీదిరా ఇచ్చుకో దాచుకో ఏమైనా చేసుకో కానీ ఎదుటి వారి మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు? అంటాడు … అంతే కాదు … నీలో నువ్వే అనుకున్నావ్ … నీదే అనీ […]
కేసీయార్ ఏదో అనుకున్నాడు… ఎదురు తిరిగింది… తలబొప్పి కట్టింది…
మనం బ్రహ్మాస్త్రం అనుకున్నది కాస్తా రివర్సులో మనపైకే దూసుకొస్తుంటే..? కేసీయార్ బీజేపీపై ప్రయోగించిన అస్త్రం పరిస్థితి అదే… మా ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందహో అని టాం టాం చేశాడు, ఎవరో దళారులు ఏదేదో సంప్రదింపులు చేశారంటూ వాళ్ల మీద కేసులు పెట్టాడు, వాళ్లు మాట్లాడుకున్నవే అని రికార్డు చేశాడు… సుప్రీంకోర్టు సహా దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలకు సీడీల్లో ఆ వివరాలు పంపించాడు… పార్టీల అధ్యక్షులకు పంపించాడు… ప్రెస్ మీట్ పెట్టాడు… ఒక్క సీఎం, ఒక్క […]
త్రిష పనైపోలేదు… చెరగని అదే సోయగం… చేతిలో 5 మెగా ప్రాజెక్టులు…!!
2002 నుంచీ సినిమాలు చేస్తోంది త్రిష… అంటే 21 ఏళ్లు… ఇండియన్ సినిమాలో సగటు హీరోయిన్ ఆయుష్షుతో పోలిస్తే చాలా ఎక్కువ… ఆమధ్య ఇక త్రిష పనైపోయిందన్నారు అందరూ… ముసలిదైపోయింది, వట్టిపోయిందని తిట్టిపోశారు… 96తో మళ్లీ పట్టాలెక్కిన ఆమె పొన్నియిన్ సెల్వన్‌లో పాత త్రిషను గుర్తుచేసింది… అయిపోయిందని కూసిన నోళ్లు మూతపడ్డాయి… ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నవి పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ గాకుండా నాలుగు సినిమాలు… నలభయ్యేళ్ల వయస్సొచ్చినా సరే, పాతకలోపే అన్నట్టు కనిపిస్తున్న త్రిష చేతిలో […]
మలయాళ రీమేకులన్నీ హిట్లు కావు… తెలుగు కథకులకు విలువ లేదు…
ఓటీటీ పుణ్యమాని అన్ని భాషల ప్రేమికులకు నాణ్యమైన సినిమా అందుబాటులోకి వచ్చింది… తమకు నచ్చిన సినిమాలను సబ్ టైటిల్స్ చూస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు… థియేటర్లకు వెళ్లి నిలువుదోపిడీ ఇవ్వాల్సిన పని లేదు… ఇష్టమున్న సీన్లు పదే పదే చూడొచ్చు, బోర్ సీన్లు జంప్ చేయొచ్చు, చెత్తా పాటల్ని స్పీడ్‌గా లాగించేయొచ్చు… మరీ అవసరమైతే నేరుగా క్లైమాక్స్ చూసేసి, వేరే సినిమాకు వెళ్లిపోవచ్చు… ఇలా మలయాళం సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి… ఎప్పుడైతే ఆ సినిమాలు ఓటీటీలో […]
ఒకటే చెట్టు… మీద పది పక్షులు… ఒకటే తుపాకీ గుండు… తర్వాత మీరే చదవండి…
ఒక ప్రొఫెసర్‌కు తన పిల్లల ఐక్యూ పరీక్షించాలని అనిపించింది… క్లాసులో ఓ పిల్లవాడిని లేపాడు… అడిగాడు… ‘‘ఒక చెట్టు మీద 10 పక్షులున్నాయ్… నువ్వు ఒకదాన్ని తుపాకీతో కాల్చావు, ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి..?’’ మిగతావన్నీ ఎగిరిపోతాయి అని జవాబు చెబుతాడని అందరూ ఎదురుచూస్తున్నారు… ఈ పక్షులు, చెట్లు, కాల్పుల పజిల్స్ ఎప్పుడూ వినేవే కదా… కానీ ఆ పిల్లాడు ఇండియన్ పొలిటికల్ లీడర్ టైపు… ఈడీ ప్రశ్నలకు బదులు చెప్పే తరహాలో సంభాషణ ఇలా సాగింది… […]
‘‘నా మాటలు మిమిక్రీకరించారు… నన్ను బదనాం చేస్తున్నారు… మీ మైక్ మీదొట్టు…’’
Misinterpretation: హైదరాబాద్ విలేఖరి:- మీరు రెండు గంటల క్రితం ఢిల్లీలో విమానం ఎక్కే ముందు అన్న మాటకు కట్టుబడి ఉన్నారా? రాజకీయ నాయకుడు:- ఢిల్లీలో చలి ఎక్కువగా ఉండి… నా మాట వణికి… మీ ఢిల్లీ విలేఖరికి నా మాండలికం అర్థం కాక… అది మాండురాగం అనుకున్నాడు. నిజానికి నేను పాడింది పాండురాగం. హై. వి.:- నేనడుగుతున్నది మీ సంచలన ప్రకటన గురించి. పాడు రాగాల గురించి కాదు. రా. నా:- నేను చెబుతున్నది కూడా మీరడిగిందే. […]
సాయిమాధవ్ డైలాగులు చెత్తబుట్టలోనికి… త్రివిక్రమ్ రీరైటింగ్ షురూ…
త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే తన దర్శకత్వం, తన కథ కమామిషు గాకుండా తన డైలాగులు గుర్తొస్తాయి… అతడు సినిమాలో ‘నేనూ వస్తా, నేనే వస్తా’ అనే డైాలాగ్ అద్భుతం… మాయాబజార్లో ఓ ఫేమస్ డైలాగ్ ‘అమ్మో, అమ్మే’ అనే డైలాగును అసలు ఎవరూ మరిచిపోలేరు… నెంబర్ వన్ టాప్ డైలాగ్ అది… తరువాత అంతటి పవర్ ఫుల్ డైలాగ్ ఇదేనేమో… ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్నది బుర్రా సాయిమాధవ్… ఆ తల వంచకు, అది నేను […]
ఎవరి పాటలో ఎందుకు..? మన పాత హిట్లను మనమే రీమిక్స్ చేసుకుందాం…!!
పాత హిట్ పాటలను రీమిక్స్ చేసి కొత్త సినిమాల్లో వాడుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే… ఇందులో చాలా రకాలు.., ముఖ్యమైనవి… 1) ట్యూన్ అదే ఉంటుంది, కాస్త గాయకుల టోన్ కొత్తగా ఉంటుంది… కంటెంటు కూడా సేమ్… అంటే పాత పాటే కొత్తగా వినిపిస్తుంది… వీలైనంతవరకూ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పాతవే వాడతారు… ఉదాహరణకు రీసెంటుగా కల్యాణరాం అమిగోస్ సినిమాలో పాత వెంకటేష్ సినిమాలోని ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ పాట రీమిక్స్ చేసి వాడటం… అప్పట్లో అది సూపర్ హిట్ […]
రాముడికి పెళ్లి చేస్తాం… తోచినంత కట్నాలు చదివించాలి ధర్మాత్ములు…
మొన్నామధ్య కేసీయార్ కొండగట్టు పోయాడు… వంద కోట్లు ఇచ్చేస్తున్నా అన్నాడు… అవసరమైతే ఎన్ని వందల కోట్లయినా పెట్టేద్దాం అన్నాడు… సూపర్ టెంపుల్‌గా డెవలప్ చేద్దాం అన్నాడు…. కొన్ని డబ్బులు కూడా రిలీజ్ అయిపోయినట్టున్నయ్… ఒక్కసారి సీన్ కట్ చేసి, ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దాం… భద్రాచలం గుడికి (భద్రాద్రి అంటున్నారుట ఇప్పుడు, ఈ స్థలాల పేర్ల మార్పిడి ఏమిటో అర్థం కాదు, యాదగిరిని యాదాద్రి అనీ, భద్రాచలాన్ని భద్రాద్రి అనీ… ఇదో పైత్యం… ఇంకా నయం కొండగట్టుకు కొండాద్రి […]
పేరులోనే గుడ్ఇయర్… బతుకంతా అప్పులు, అనారోగ్యం… ప్రాణం తీసిన ప్రయోగాలు…
చార్లెస్ గుడ్ ఇయర్… తన పన్నెండో ఏట బడి మానేశాడు… కనెక్టికట్‌లో ఉండే తన తండ్రి హార్డ్‌వేర్ స్టోర్స్‌లో పనిచేయడం కోసం… 23వ ఏట క్లారిసా బీచర్ను పెళ్లి చేసుకున్నాడు… ఓ కొడుకు పుట్టాడు… ఫిలడెల్ఫియాలో మరో హార్డ్‌వేర్ స్టోర్స్ సొంతంగా తెరిచాడు… గుడ్ ఇయర్ మంచి సమర్థుడైన వ్యాపారే… కానీ తనకు కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ కొత్త ఆవిష్కరణల మీద ఆసక్తి అధికం… 1820 ప్రాంతంలో తను నేచురల్ రబ్బర్ (ఇండియన్ రబ్బర్) మీద బాగా […]
ముద్ద తినగ నేర్పిండు… ము– కడగనేర్పిండు… బట్ట కట్టించిండు, భాష నేర్పించిండు…
ఒక్క చంద్రబాబేనా..? బావమరిది బాలయ్య, కొడుకు లోకేష్ కూడా బోలెడుసార్లు నోరుపారేసుకున్నారు… అవి నాలుకలు కావనీ, తాటిమట్టలనీ వాళ్లకువాళ్లే నిరూపించుకున్నారు… తెలంగాణ వచ్చినందుకు కాదు, ఇలాంటి బేకార్లను వదిలించుకున్నందుకు తెలంగాణ సమాజం సంతోషిస్తోంది… మళ్లీ మళ్లీ అవే కూతలు రాగులు, సజ్జలు, జొన్నలు తిని బతికే తెలంగాణ జనం ఎన్టీయార్ రెండురూపాయల బియ్యం ఇచ్చాకే అన్నం తిన్నదట… మెదళ్లు పాదాల్లోకి దిగిపోయినట్టున్నయ్… ఇదే చెబుతూ ఓ మిత్రుడి సెటైర్ ఏమిటంటే… ‘‘గతంలో నారావారిపల్లెలో అమ్మణమ్మ అనే ఓ […]
రక్తికట్టని ఇళయరాజా పాటకచేరీ… ఈ వయస్సులో ఎందుకీ తిప్పలు రాజా..?!
ముందుగా ఒక చిన్న విషయం చెబుతాను… మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ పేరు విన్నారా..? తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశాడు… అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్, దర్బార్, బీస్ట్, తిరు… ఇలా… తెలుగులో బ్రహ్మాండంగా హిట్ సినిమా లేదు గానీ తమిళంలో తనే టాప్ ఇప్పుడు… సినిమాలే కాదు, ఈరోజున లైవ్ కన్సర్ట్లు ఇరగదీస్తున్నది కూడా తనే… తను ఓ సంచలనం… ఈమధ్య ఓ తూర్పు దేశంలో తను ప్రోగ్రామ్ పెడితే… అక్షరాలా పది కోట్ల […]
Dogology… దీన్నే గతి తార్కిక భౌభౌవాదం అందురు…
The Theory on Dog: …ఆ విధంగా తెలంగాణాలో కుక్కల నుండి తమను తాము రక్షించుకోవడానికి పసి పిల్లలకు తగిన శిక్షణ ఇవ్వాలని, చిట్కాలు నేర్పాలని, అవగాహన కలిగించాలని నిర్ణయం తీసుకోవడమైనది. కుక్కల సంతానోత్పత్తి తగ్గించడానికి వెను వెంటనే చర్యలు తీసుకోవాలని గట్టిగా అనుకున్నారు. హోటళ్లు వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుక్కకాటుకు గురి కాకుండా ఇంకా అనేకానేక సలహాలు, సూచనల మీద పురపాలక శాఖ అత్యవసర […]
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ హాఫ్ పేజీ వివరణ..!!
విశేషమే… అంతటి రాధాకృష్ణ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు వివరణ ఇచ్చుకోవడం… నన్ను అర్థం చేసుకొండి, నా రాతల్ని అపార్థం చేసుకోకండి అంటూ హాఫ్ పేజీ పాటు పవన్ ఫ్యాన్స్‌ను వేడుకున్న తీరు ఎందుకోగానీ సరైందిగా అనిపించలేదు… నిజంగానే కేసీయార్ ఓ రాజకీయ ఎత్తుగడగా పవన్ కల్యాణ్‌కు 1000 కోట్లు ఇవ్వజూపాడు అని తను గత వ్యాసంలో రాయడాన్ని కేసీయార్ కోణంలోనే చదువుకోవాలి… కేసీయార్ డబ్బు వెచ్చిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడనేది ఆ వాక్యం చదవాల్సిన […]
తారకరత్నను ఎన్టీయార్ కుటుంబం వెలివేసిందా..? ఈ పెద్దకర్మ కార్డు చూడండి…
మనం పొద్దున్నే కదా చెప్పుకున్నది… తారకరత్నకు గొప్ప పరివారం ఉండీ, ఘనమైన వారసత్వం ఉండీ… కఠినాత్ములైన తల్లిదండ్రుల కారణంగా, తన ప్రేమను ఇన్నేళ్లయినా అంగీకరించలేని వాళ్ల పంతాల కారణంగా… ఆ పెద్ద పరివారంలో భిన్నంగా బతికిన తారకరత్న విషాదం గురించి… కారులో నిద్రించిన క్షణం నుంచీ భార్యాభర్తలు కష్టాలకోర్చి బతుకులు వెళ్లదీయడం గురించి… అమ్మాయి వైపు ఆమె కుటుంబం, విజయసాయిరెడ్డి, అబ్బాయి వైపు జస్ట్, బాలకృష్ణ మాత్రమే కాస్త ఆత్మీయులుగా కనిపిస్తున్నారే తప్ప అంతపెద్ద ఎన్టీయార్ కుటుంబం […]
సిరిమువ్వల సింహనాదం… థియేటర్ రిలీజుకే విశ్వనాథ్ పట్టు… కనుమరుగు…
Bharadwaja Rangavajhala………. “నేనేదో గొప్ప సినిమా తీశాను. అది విడుదల కాకపోతే ప్రపంచం ఏదో కోల్పోయిందని నేనననుగానీ … నేను తీసిన సినిమాల్లో ఒకటి రిలీజ్ కాకుండా ఆగిపోవడం నాకెందుకో కొంచెం బాధగా ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలా వేసి నలుగురికీ చూపించాలనే కోరిక కూడా నాకు లేదు. ఎవరో వచ్చి అడుగుతారు … నేను ల్యాబు నుంచీ ఈ ప్రింటు తెప్పించి వేయడం జరుగుతోంది. ఈ సినిమా కూడా జనంలోకి వెడితే … నేను అనుకున్న విషయం […]
గొప్ప పరివారం… వందల కోట్ల సంపద… ఘనమైన వారసత్వం… ఐనా ఏం దక్కింది..?!
ఇది కూడా ఓ సినిమా కథకు ఏమీ తీసిపోదు… ప్రేమ, పెళ్లి, కక్షకట్టిన కుటుంబం, ఆటుపోట్లు, మొహం చూడని తల్లీతండ్రి, చివరకు మరణం, ఎడబాటు… అవును, నందమూరి తారకరత్న జీవితంలో వైఫల్యాలు ఎన్నో ఉండవచ్చుగాక… కానీ మనిషి చాలా మంచోడు, ఆ ఎన్టీయార్ కుటుంబసభ్యుల్లో పెద్దగా కనిపించని ఓ అరుదైన ప్రేమగుణం నిండుగా జీర్ణించుకున్న మనిషి… ఇప్పుడు ఆ ప్రేమ దూరమై ఆయన ప్రియురాలు కమ్ పెళ్లాం అలేఖ్యరెడ్డి కుమిలిపోతోంది… ఆమె ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్టు […]
Balagam… చావు సంబురపు పాట… పైకి సాగదోలే పాట… మనిషిని కాలేసే పాట…
మంచి చావు చచ్చిండు… ఈ వాక్యం విన్నారా ఎప్పుడైనా..? మిగతా ప్రాంతాల్లో ఏమో గానీ… ఎవరితో సేవలు చేయించుకోకుండా, కార్పొరేట్ డాక్టర్ల బారిన పడకుండా… సొంత ఇంట్లోనే, సొంత ఊళ్లోనే, హఠాత్తుగా కన్నుమూస్తే… తనకేమయ్యా మంచి మరణం పొందాడు, బంగారు చావు చచ్చిండు అంటరు తెలంగాణలో…! ఆ చావు తాలూకు శోకాలు కొద్దిసేపే… సాగనంపే (ఈ లోకం నుంచి) అంత్యక్రియల్ని కూడా ఘనంగా చేస్తారు… పరామర్శకు వచ్చిపోయే బంధు, స్నేహితగణానికి కాసింత మందు పోస్తారు… కర్మ రోజున […]
- « Previous Page
- 1
- …
- 284
- 285
- 286
- 287
- 288
- …
- 494
- Next Page »