కామెడీ అంటే ఇదే… చాన్నాళ్ల తరువాత వీసమెత్తు బూతు వాసన లేని ఓ స్కిట్ ఎక్సట్రా జబర్దస్త్‌లో మనసారా నవ్వించింది… అన్నింటికీ మించి ఓ విషయంలో మెచ్చుకోవాలని కూడా అనిపించింది…… ఓడలు బళ్లు, బళ్లు ఓడలు సహజమే కదా… ఒకవేళ ఇప్పుడు సెకండ్ లేయర్ కమెడియన్లుగా ఉన్న వాళ్లు టాప్ రేంజుకు చేరిపోయి, ఇప్పుడు పాపులర్ కమెడియన్లుగా ఉన్న గెటప్ సీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ గనుక చితికిపోతే..? పూలమ్మిన చోటే కట్టెలు అమ్మినట్టుగా ఆ […]
హమ్మయ్య… సిరి, శ్రీహాన్ కలిసిపోయారు… నెక్స్ట్ దీప్తి, షన్నూయేనా..?!
గుర్తుందా..? ఆమధ్య కొన్నిరోజులపాటు యూట్యూబ్ చానెళ్లు, సైట్లే గాకుండా సోషల్ మీడియా పోస్టులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు సైతం ఓ అంశాన్ని రచ్చ రచ్చ చేశాయి… ఏమిటంటే..? బిగ్‌బాస్ గత సీజన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి హన్మంతు, మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ ఫుల్లు రెచ్చిపోయి బిహేవ్ చేసి, మొత్తం షో అంతా కంపు చేశారని బోలెడు విమర్శలొచ్చినయ్ కదా… తీరా చూస్తే సిరికి బయట శ్రీహాన్ అనే లవర్… లవర్ ఏమిటి సహజీవనమే అన్నారు… […]
అతీతులం అనే భ్రమల్ని బద్దలు కొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి..!!
నవీన్ పట్నాయక్‌ను అభినందించాలి… కాదు, ఆయన్ని ఆ కుర్చీ మీద అలాగే కొనసాగిస్తున్న ఒరిస్సా ప్రజల్ని అభినందించాలి… ఒక్క పొల్లు మాట లేదు, ప్రచార కండూతి లేదు, అబద్ధాలు లేవు, మాట తప్పడాలు లేవు, జనాకర్షక పథకాలు లేవు, కుటుంబ పాలన లేదు, తనకు అవినీతి అంటనివ్వడు… అసలు ఇవి కాదు, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా ఏ ఎస్ అయినా సరే, దొరికితే కేసులు పెట్టేయడం, వదిలించుకోవడం… కొడితే ఆ తిమింగిలాల్ని కొట్టాలి… చిన్న చిన్న […]
అనగనగా ఓ విశాలుడు… మరో ఉప్మా సినిమాని భుజాన వేసుకుని బయల్దేరెను..!!
Veeramae Vaagai Soodum…… ఇదీ విశాల్ తమిళంలో తను సొంతంగా నిర్మించిన చిత్రం పేరు… దాన్నే సామాన్యుడు అని తెలుగులోకి డబ్ చేసి మన మీదకు వదిలాడు… ఇప్పుడు అందరు హీరోలకూ అలవాటే కదా… తెలుగైనా, తమిళమైనా, మలయాళమైనా, కన్నడమైనా చకచకా ఇతర సౌత్ ఇండియా భాషల్లోకి కూడా డబ్ చేసి, ఒకేసారి రిలీజ్ చేసేయడం… వీలయితే హిందీలో కూడా విడుదల చేస్తే సరి… వస్తే నాలుగు డబ్బులు, లేదంటే చేతులు దులుపుకుంటే సరి… అలాగే సామాన్యుడు […]
అంతటి పిచ్చి ఆరాధకుడు వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ ఎందుకిచ్చింది..?!
వర్మ ఇంటర్వ్యూలు చూసీ చూసీ, అందరూ ఏమనుకుంటారు..? తనకు ఏ ఉద్వేగాలూ ఉండవు అని…! తను కూడా ఎప్పుడూ అదే కలరింగ్ ఇస్తుంటాడు… అన్ని బంధాలకూ అతీతుడు అనిపించుకోవాలని తన తపన… అదేం వ్యాధి అనకండి, అదొక తత్వం… పర్వర్షన్కు కూడా అందడు అనేకసార్లు..! అయితే తను చెప్పేదంతా నిజమేనా..? కాదు, తప్పు… ఎమోషన్ లేనివాడు ఎందుకు ఉంటాడు..? ఎంతటి స్వార్థపరుడైనా, రాక్షసుడైనా, యోగిపుంగవుడైనా ఏదో ఒక ఎమోషన్ కదిలించడం ఖాయం… అంతెందుకు..? ఇదే వర్మ ఎన్నిసార్లు […]
అసలు సమస్య రాహుల్ అహం ప్లస్ కోటరీ… మోడీకి అదే బలం…
దేశంలో బీజేపీని నిలువరించడానికి ఓ బలమైన ప్రతిపక్షం కావాలి… కాంగ్రెస్ పార్టీ ఆ అవసరానికి తగినట్టుగా ఎదిగే సిట్యుయేషన్ లేకపోవడంతోనే సంకుచిత, ప్రాంతీయ, కుటుంబ, అవినీతి పార్టీల నేతలు కూడా తొడలు కొడుతున్నారు… అన్నీ ఒక్కచోట కుట్టేసి, ఓ బలమైన బొంత తయారు చేసి, కుర్చీ ఎక్కాలనే ఆశలు, ప్రయత్నాలు సాగుతున్నయ్… ఈ కప్పలతక్కెడ పార్టీల కూటములు గతంలో ఈ దేశాన్ని ఏ స్థితుల్లోకి నెట్టేశాయో చూశాం… ఆ పతనావస్థలో చంద్రబాబు కూడా పాత్రధారే… దాన్నలా వదిలేద్దాం… […]
నితిన్ హిట్… సాయిధరమ్ బిలో యావరేజ్… ఆది ఫ్లాప్… జ్యోతిక అట్టర్ ఫ్లాప్…
నిజమే… హీరో నితిన్‌కు కాస్త రిలీఫ్… స్టార్ మాటీవీలో తన సినిమా మేస్ట్రో రిలీజ్ చేశారు ఆమధ్య (23 జనవరి) … హైదరాబాద్ కేటగిరీలో 6.59 టీఆర్పీలు వచ్చినయ్… మొత్తంగా లెక్కేస్తే 8 నుంచి 8.50 దాటి ఉంటుంది… నిజానికి ఇప్పుడున్న స్థితిలో ఇవి కాస్త మంచి రేటింగ్సే… పైగా ఇది అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన అంధాధున్ సినిమాకు రీమేక్… టీవీల్లో, ఓటీటీలో చూసీ చూసీ బాగా పాతచింతకాయ పచ్చడి అయిపోయింది… దాన్ని ఇప్పుడు నితిన్ హీరోగా […]
స్టాలిన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నట్టు..? సీబీఐ దర్యాప్తు జరిగితే తప్పేంటి..?!
ఈమధ్య కొన్ని అంశాల్లో స్టాలిన్ పనితీరును మెచ్చుకుంటున్నాం కదా… అలాగని తను అన్ని అంశాల్లోనూ సమర్థించదగినవాడు అని కాదు… ప్రత్యేకించి మతం అనే అంశం దగ్గర రిజిడ్‌గా ఉంటున్నాడు ఇప్పటికీ… తను నాస్తికుడు, అందులో తప్పులేదు, దేవుడిని నమ్మాలా లేదా అనేది వ్యక్తిగతం… కానీ నాస్తికత్వానికీ యాంటీ-హిందూ ధోరణికీ సంబంధం ఉండకూడదు, అన్ని మతాలకూ-దేవుళ్లకూ దూరంగా ఉండాలి… కానీ స్టాలిన్ తన తండ్రి, తన పార్టీ వ్యవస్థాపకులు పాటించిన యాంటీ-హిందూ ధోరణికే తను కూడా కట్టుబడి వ్యవహరిస్తున్నాడు… […]
అసలే లేటు వయస్సు పెళ్లి… అప్పుడే ఆ బంధంలో ఒడిదొడుకులా..?
ఎక్కడో చదివినట్టు గుర్తు… జేడీ చక్రవర్తి, తన భార్య అనుకృతి గోవింద శర్మకు బైబై చెప్పబోతున్నట్టు వార్త… కొన్ని సైట్లలో మాత్రమే… మిగతావాళ్లెవరూ పట్టించుకోలేదు, అయినా జేడీ ఇలాంటివి పట్టించుకునే టైపే కాదు… నిజమేమిటో వదిలేద్దాం… నమ్మబుల్ అనిపించలేదు, కానీ అసలే ఇది బ్రేకప్పులు, డైవోర్సుల సీజన్ కదా… నిజమే ఐనా పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు… ఐతే విశేషంగా అనిపించింది ఏమిటంటే..? తనకు శ్రీదేవి అక్క బిడ్డ, అప్పట్లో హీరోయిన్ మహేశ్వరితో ఎఫైర్ అని బోలెడు కథనాలు […]
అబ్బో, హిమజను కూడా దింపారుగా… ఇక ఈ షోకు కూడా బూతే భవిష్యతి…
మొన్నామధ్య నటి హిమజ బ్రేకప్ అని వార్తలు వచ్చినయ్ కదా… ఎహె, నాకసలు పెళ్లే కాలేదు, ఇలా పెళ్లి చేసేముందు, విడాకులు మంజూరు చేసేముందు నాకూ కాస్త చెప్పండి అని సెటైర్ వేస్తూ ఓ వీడియో కౌంటర్ రిలీజ్ చేసింది చూశారు కదా… అబ్బో, ఈ పిల్లకు ఎటకారం ఎక్కువే అని కొందరు ఉడుక్కున్నారు… ఆమె తన ఇన్‌స్టాలో చాలా ఫోటోలు డిలిట్ కొట్టేసింది… కొన్ని కీలకఫోటోలు ఎక్కడైనా దొరికితే ఈమెగారి బ్రేకప్‌కు ముందు చిత్రాలు ఇవీ […]
ఫాఫం ధోని… సైఫై యానిమేటెడ్ గ్రాఫిక్ సినిమా లుక్కుకు పూర్ రెస్పాన్స్…
నిజానికి ఇది ఓ ఇంట్రస్టింగ్ వార్తే… అంటే సినిమాలు, వెబ్ సీరిస్, నవలలకు సంబంధించి సుమా… మొన్న మనం చెప్పుకున్నాం కదా, అదేదో ప్రభాస్ సినిమాలో పూజా హెగ్డే కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోతే గ్రాఫిక్స్‌తోనే సాంగ్ లాగించేశారని… రాబోయే రోజుల్లో సెలబ్రిటీల మొహాలతోనే యానిమేటెడ్ గ్రాఫిక్స్‌తో సీరిస్ లేదా సినిమాలు వచ్చే చాన్స్ ఉందని..! ఇదీ అలాంటిదే… గతంలో పత్రికల్లో చిత్ర కథలు వచ్చేవి… అంటే బొమ్మలతో కథ చెప్పడం… మరి ఈ డిజిటల్ యుగంలో […]
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జంట… వేర్వేరు రాష్ట్రాలు… ఓ చిత్రమైన టికెట్ల కథ…
ఇటు పంజాబ్… అటు యూపీ… రెండింటి నడుమ ఓ బంధం ఇప్పుడు ఓ చిత్రమైన వార్తాకథనాన్ని ఆవిష్కరిస్తోంది… అంతేనా..? ప్రియాంక గాంధీ ధోరణి మీద, కాంగ్రెస్ టికెట్ల పంపిణీ తీరు మీద దుమారం రేపుతోంది… కాస్త వివరంగా చెప్పుకుందాం… అంగద్ సింగ్ అని ఒక ఎమ్మెల్యే, పంజాబ్‌లోని నవన్షార్ నుంచి కాంగ్రెస్ టికెట్టు మీద గెలిచాడు… 26 ఏళ్లకే ఎమ్మెల్యే అయిపోయాడు… నిజానికి ఆ నియోజకవర్గంలో ఎన్నాళ్ల నుంచో ఆ కుటుంబసభ్యులే గెలుస్తున్నారు… అదంతా వేరే కథ… ఇప్పుడు […]
వావ్… జనసేన పార్టీకి గుర్తింపు దక్కింది… బాబు, జగన్, కేసీయార్లకు దీటుగా…
రాక రాక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా ఎదగాలంటే… ముందుగా నోటిని అదుపులో పెట్టుకోవాలి, ప్రతి మాటా ఆచితూచి వాడాలి, మాటల్లో సంస్కారాన్ని ప్రోదిచేయాలి, హుందాగా అడుగులు వేయాలి, పరిపక్వ రాజకీయం వైపు ఆలోచించాలి… కానీ మన తెలుగు రాష్ట్రాల రాజకీయం మొత్తం బూతులు, కక్షసాధింపులు, అబద్ధాలు, యూటర్నులు, కేసులే కదా… ఒక్కసారి స్టాలిన్ వైపు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది… జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు… తోటి భాగస్వామ్య పక్షాలకు సీట్ల కేటాయింపు […]
ఆంధ్రజ్యోతి ఎలా ఏడ్చినా సరే… ఈ విషయంలో జగన్ అడుగులు సబబే…
నో డౌట్… ఏపీ ప్రభుత్వ వ్యవహారాలను అమరావతి ఆంధ్రజ్యోతి రిపోర్టింగ్ విభాగం ఇట్టే పట్టేసుకుంటోంది… మిగతా పత్రికలకు చేతకావడం లేదు… పత్రికల్లో అదొక్కటే కాస్త గట్స్ చూపిస్తోంది… ఐతే సమస్య ఎక్కడొస్తుందీ అంటే… పెండను, బెల్లాన్ని ఒకేరీతిన చూడటం, ప్రతిదీ జగన్ మీదకు విషంగా మార్చేసి అచ్చేయడం అలవాటైపోయింది దానికి… ఉదాహరణ కావాలా..? మొన్నామధ్య కొత్త జిల్లాల ఏర్పాటు మీద కేంద్రం నిషేధం పెట్టింది, జగన్ జనం చెవుల్లో పూలు పెడుతున్నాడు అని ఫస్ట్ పేజీలో ఓ […]
జగన్మోహన్రెడ్డి ఈడీ కేసుల కీలకాధికారికి యూపీలో బీజేపీ టికెట్టు..!
సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులు అనగానే గుర్తొచ్చే పేరు సీబీఐ నుంచి అప్పటి జేడీ లక్ష్మినారాయణ పేరు… తరువాత రాజకీయాల్లో చేరి, చేదు అనుభవం మూటగట్టుకుని, ప్రస్తుతం తనేమిటో తనకే అర్థం కాని అయోమయంలో ఉన్నట్టున్నాడు… మరో పేరు గుర్తొస్తుంది… ఈడీ నుంచి జేడీ రాజేశ్వర్ సింగ్… దేశంలో పెద్ద పెద్ద కేసుల్ని ఈడీ తరఫున డీల్ చేసిన ఈయన ఇప్పుడు యూపీలో బీజేపీ టికెట్టు మీద పోటీచేస్తున్నాడు… ఇంకా 12 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ […]
నేహా శెట్టి… తెలుగు సినీ జర్నలిజాన్ని ఈడ్చి లెంపకాయ కొట్టింది…
తెలుగు సినిమా జర్నలిజాన్ని ఆ కొత్త హీరోయిన్ ఈడ్చి లెంపకాయ కొట్టింది… అసలే ఆమధ్య ఆర్ఆర్ఆర్ ప్రెస్మీట్లో ఒకాయన రాజమౌళి ఆహా, రాజమౌళి ఓహో అని కీర్తనలు పాడాడు కదా, అది కాస్తా వైరల్ అయిపోయి, నెటిజనం తిట్లపర్వానికి పూనుకోవడంతో మిగతా జర్నలిస్టులంతా తలలు దించుకున్నారు… ఇప్పుడు ఏమిటంటే..? డీజేటిల్లు అనే సినిమా వస్తోంది… అందులో జొన్నలగడ్డ సిద్ధు హీరో, నేహా శెట్టి హీరోయిన్… విమల్ కృష్ణ దర్శకుడు… టీజర్ రిలీజ్ పెట్టుకుని బుధవారం మీడియాను ఆహ్వానించారు… […]
రాజేంద్రప్రసాద్ ప్రవర్తన మీద మాట్లాడటానికే ఇష్టపడని మాళవిక..!!
సాధారణంగా మన సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే… క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే కాదు, చాలా అంశాల్లో వాళ్లను మనుషుల్లాగే చూడరు… ప్రతి ఒక్కడూ వాళ్లను సొంత ఆస్తిలా చూసేవాడే… ఐతే కాస్త టెంపర్మెంట్ ఉన్న లేడీ ఆర్టిస్టులయితే కొన్ని అంశాల్లో హఠాత్తుగా రియాక్టవుతారు, గొడవ అవుతుంది… ప్రత్యేకించి హీరోల ఇగోస్ వల్ల సమస్యలొస్తుంటయ్… ఐతే ఏళ్లు గడిచిపోయినా ఆ లేడీ ఆర్టిస్టులు ఇక వాటి గురించి ఎక్కడా బయటపెట్టరు… కానీ మాళవిక కథ […]
ఎంత సోకినా… ఎందరికి అంటుకున్నా… ఆందోళన వద్దు, దాని పనైపోయింది…
Yanamadala Murali Krishna……………. *** రానున్నదంతా ఒమిక్రానే… కోవిడ్ పీడ ఇక అంతానికి చేరువలో…*** కొరోనా వైరస్ రక రకాలుగా రూపాంతరం చెందుతూ, 2021 నవంబర్ 24 నాటికి ఒమిక్రాన్ రకంగా పరిణమించింది. తొలిగా దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ ఈ రకం వైరస్ విపరీతమైన వేగంతో వ్యాపించగలదు. అయితే ప్రధానంగా ముక్కు, గొంతు కణజాలానికి పరిమితమవుతుంది. విధ్వంసాన్నీ, విషాదాన్నీ సృష్టించిన డెల్టా రకం కొరోనా వైరస్ తరహాలో ఇది ఊపిరితిత్తుల కణజాలానికి వ్యాపించడం, అక్కడ పెరిగే అవకాశాలు […]
ఇండస్ట్రీ అంతే… టాలెంట్ టన్నుల్లో ఉన్నా సరే టైమ్ కలిసిరావాలి…
Bharadwaja Rangavajhala…………. ఆంధ్రా దిలీప్ అని చెలాన్ని, ఆంధ్రా దేవానంద్ అని రామ్మోహన్ నీ ఇలా పిల్చారు గానీ… అసలు ఆంధ్రా నసీరుద్దీన్ అనదగ్గ నటుడు సత్యేంద్ర కుమార్ గురించి అనరేం… నిజానికి ఈ పోలిక కోసం సత్యేంద్ర కన్నా ముందు నారాయణ రావు ఉన్నారనుకోండి… ఆయన నిజంగానే ఆంధ్రా, ఈయన తెలంగాణ అనుకుంటే సమస్యే లేదు కదా… సత్యేంద్ర కుమార్ అసలు పేరు అన్నాబత్తుల సత్యేంద్రకుమార్ … ఊరు ఖమ్మం. ఖమ్మంలో కళా పరిషత్ ఏర్పాటు […]
జనం 1500 కోట్ల పైబడి ఖర్చు చేస్తేనే… పెద్ద హీరోలందరికీ ఇక ఖుషీ…
ఈనెలను విడిచిపెట్టండి… ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తెలుగు ప్రజలు కనీసం 1500 కోట్లను వెచ్చిస్తే గానీ పెద్ద హీరోలను సంతృప్తిపరచలేరు… నిజానికి నాగార్జున, బాలయ్య, బన్నీ నయమేమో… కరోనా గిరోనా జాన్తానై అంటూ మార్కెట్లోకి వచ్చేశారు… ఆ రిస్క్‌కు మంచి ఫలితం పొందారు… కరోనా పేరిట పదే పదే వాయిదాలు వేస్తూ, మార్కెట్లో అడుగుపెట్టడానికి జంకుతున్న పలు పెద్ద సినిమాలు వచ్చే మూడు నెలల్లో పలకరించనున్నయ్… పైగా అవీ ఓటీటీ బాపతు సరుకు కాదు… […]
- « Previous Page
- 1
- …
- 356
- 357
- 358
- 359
- 360
- …
- 466
- Next Page »