చాలా ఇష్యూల్లో ఇతర మీడియా ధోరణుల గురించి చెప్పుకున్నట్టుగానే, ఈనాడు ప్రమాణాల ఉత్థానపతనాల గురించీ చెప్పుకుంటాం చాలాసార్లు… ప్రత్యేకించి తెలుగు భాషకు ఓ జికా వైరస్లాగా అంటించిన దాని అనువాద పైత్యం గురించి కూడా…!! కానీ ఈరోజు ఆ పత్రిక (ఇప్పటికీ పత్రిక అనొచ్చా అనే డౌటొచ్చింది తొలిసారి) ఫస్ట్ పేజీ హాశ్చర్యం వేసింది… దిగ్భ్రాంతి… ప్రమాణాల పతనం ఇంత వేగంగా ఉందా పత్రికలో అనిపించేలా…!! అది ఫస్ట్ పేజీ, ఫస్ట్ లీడ్, ఫస్ట్ ఫోటో…!! సీమను […]
దటీజ్ నాగార్జున..! తిక్క కేరక్టర్లకు మెత్తమెత్తగా భలే కౌన్సిలింగ్..!!
నో డౌట్… నాగార్జున ఓ గుడ్ టీవీ హోస్ట్… టీవీ రియాలిటీ షోలకూ స్క్రిప్టులు, రిహార్సల్స్ గట్రా ఉంటయ్ కానీ ప్రధానంగా హోస్ట్కు స్పాంటేనిటీ ముఖ్యం… ప్రత్యేకించి బిగ్బాస్ వంటి రియాలిటీ షో హోస్టింగు అంత ఈజీ ఏమీ కాదు.., హౌజులోకి రకరకాల కేరక్టర్స్ వస్తారు.., రోజుల తరబడీ బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు.., గొడవలు, దోస్తీలు, లవ్వులు, వివాదాలు కామన్… పలుసార్లు కంటెస్టెంట్లలో ఫ్రస్ట్రేషన్ లెవల్స్ పెరుగుతూ షో నిర్వాహకులకు తలనొప్పిని కూడా క్రియేట్ చేస్తుంటయ్… […]
మిటూ..! చైనా అధికార పార్టీ నేత నిర్వాకం… ఆమె మాయమైపోయింది…
హక్కుల్లేవ్… తొక్కల్లేవ్… ఎవరి మీద కోపమొచ్చినా సరే తొక్కేయడమే… అది చైనా ప్రభుత్వం మీదే కాదు, ఆ నాయకుల మీదైనా సరే, ఎవడేం మాట్లాడినా, మాట్లాడతారేమోనని సందేహమొచ్చినా, చెప్పినట్టు వినకపోయినా… మనుషులు మాయం అయిపోతారు… అంతే… ఆ ఇనుప గోడల నడుమ ఎవడి బతుకేమిటో, ఎవడి భవిష్యత్తు ఏమిటో ఎవడికీ తెలియదు… అలీబాబా ఫౌండర్ జాక్ మాను చైనా ప్రభుత్వం ఎంత భ్రష్టుపట్టించిందో మొన్నమొన్ననే కదా చదువుకుంది… తాజాగా ఇదుగో, ఈ టెన్నిస్ మహిళ స్టార్ కూడా […]
యత్రనార్యస్తు పూజ్యంతే..! మగతనాల చర్చలతో ఏపీ పాలిటిక్స్ పునీతం..!!
బాగాలేదు… అస్సలు బాగాలేదు… ఏపీ రాజకీయాల్లో బూతులు, వ్యక్తిత్వ హననాల గురించి కాదు… ఇప్పుడు కొత్తేమీ కాదు… ఇక్కడితో ఆగేదీ కాదు… చిన్న చిన్న బూతులతో మొదలై, బోసిడికే మీదుగా మగతనాల దాకా ‘అద్భుతంగా ఎదిగిన’ ఏపీ రాజకీయాల నీచస్థాయికి అందరూ బాధ్యులే… ఒకడు తక్కువ కాదు, ఒకడు ఎక్కువ కాదు… చంద్రబాబు దుశ్శాసన చరిత్ర మరిచారా అనే సమర్థనల నుంచి దుశ్వాసనుల తాతలుగా వ్యవహరించాలా అనే వాదనల దాకా..!! చివరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న […]
చట్టాల రద్దుతో కూడా నష్టమేనా..? మోడీ మరో పెద్ద తప్పుచేశాడా..?
మోడీ తప్పు చేశాడా..? వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాదా..?…. రైతుచట్టాల రద్దు మీద దేశవ్యాప్తంగా రైతువిజయం పేరిట సంబరాలు సాగుతున్నా సరే, మోడీ ఈ చర్య రైతులకు పరోక్షంగా మరింత అన్యాయం చేయబోతోందనే చర్చ కూడా సాగుతోంది… ఐతే ఈ విజయ సంబరాల చప్పుళ్ల నడుమ ఈ చర్చ పెద్దగా వినిపించదు… ఎవరైనా ఏమైనా మాట్లాడితే రైతుద్రోహి అనే ముద్రవేస్తారనే భయం… నిజానికి మోడీ నిర్ణయాన్ని ఎవరూ ఊహించలేదు… బీజేపీలోనే ఎవరికీ తెలియదు… […]
అద్భుతం..! మన కథల ప్లాట్లనే మనం కాపీ కొట్టడం ఓ అద్భుతం..!!
అద్భుతం… సినిమా అద్భుతం అని చెప్పడం లేదు… సినిమా పేరు మాత్రమే అద్భుతం..! ఆల్రెడీ ఎవరో సినిమా తీస్తున్న కథతో ఈ నిర్మాత, దర్శకుడు కూడా సినిమా తీయడం నమ్మలేని ఓ అద్భుతం… అదీ నమ్మలేని అంశంతో, కన్విన్స్ చేయలేని కథనంతో నానా ప్రయాసపడటం మరో అద్భుతం… ప్రేక్షకులు పిచ్చోళ్లే గానీ, మరీ ఇది మొన్నామధ్య వచ్చిన ప్లేబ్యాక్ అనే సినిమా కథే అని గుర్తించలేనంత పిచ్చోళ్లని ఈ నిర్మాతలు అనుకోవడం ఇంకో అద్భుతం… ముందే అమ్మేసుకున్న […]
ఎవరి మెడలు వంచాలన్నా… వోటు భయం క్రియేట్ చేయడమే మార్గం…
ఒక రాజకీయ పార్టీ… అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ మెడలు వంచాలంటే… ఓ రాజకీయ అనివార్యతను క్రియేట్ చేయడమే మార్గం..! అది ప్రజల సహకారంతో నిర్మించే బలమైన ఉద్యమాల ద్వారానే సాధ్యం..! అత్యంత బలమైన లాబీయిస్టులకు తలొగ్గకుండా, అప్పట్లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే కారణం ఈ రాజకీయ అనివార్యతే…! పార్టీలను వణికించాల్సిన అంశం ఏమిటంటే..? వోట్లతో వోడిస్తాం..!! ఈ మెసేజ్ అర్థమైతే చాలు, అధికారం అనేక మెట్లు దిగివస్తుంది, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తుంది… అవసరమైతే అనూహ్యంగా […]
ఈ మాజీ కలెక్టర్ నామినేషన్ చెల్లుతుందా..? వీఆర్ఎస్కు కేంద్రం అంగీకరించిందా..?
నిన్న సోషల్ మీడియాలో తెగతిరిగిన ఫోటో మీమ్ ఇది… వరి వేస్తే తాట తీస్తా అన్న కలెక్టర్ ఇప్పుడు ఆకుపచ్చ కండువా వేసుకుని, టీఆర్ఎస్ మహాధర్నాలో కూర్చుని, వరి కొనకపోతే ఖబడ్దార్ అంటున్నాడు అనేది ఈ సెటైర్… ఆయన అలా రాజీనామాలు చేయడం, ఇలా ప్రభుత్వం ఆమోదించడం, ఆ వెంటనే గులాబీ కండువా కప్పేసుకోవడం, ఎమ్మెల్సీ పదవి వరించడం… అలా అలా ఆగమేఘాల మీద కొన్ని పరిణామాలు పరుగులెత్తాయి… అంతకుముందు ఆయన ముఖ్యమంత్రికి జరిపిన బహిరంగ పాదాభివందనాలు, […]
#అసలు_వాస్తవం_ఏంటో_తెలుసుకుందాం… పోస్టులో అన్నీ అవాస్తవాలే…
మొన్నటి నుంచి తెలుగు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది ఒక పోస్టు… ఎవరు రాశారో తెలియదు కానీ పైపైన చదివితేనే, అది రాసిన రచయితకు వరి గురించి ఏమీ తెలియదని మాత్రం మనకు తెలుస్తుంది… బహుశా వాట్సప్ యూనివర్శిటీలో కొత్త అడ్మిషన్ కావచ్చు… ఐనా ప్రభుత్వాలే అడ్డగోలు అబద్ధాలకు, తప్పుడు ప్రచారాలకు, ప్రజల కళ్లకు గంతలు కట్టే ఆందోళనలకు దిగుతుంటే ఆఫ్టరాల్ సోషల్ యాక్టివిస్టుల తప్పేముంది..? కాస్త సబ్జెక్టు తెలిసిన నిపుణులు, అధికారుల నుంచి జ్ఞానబోధ […]
ఫాఫం నాగార్జున..! గ్రహచార దోషాలేవో బాగా తన్నేస్తున్నట్టున్నయ్..!!
ఫాఫం నాగార్జున..! మళ్లీ అనిపించింది ఇలా..! ఎందుకు..? చెప్పుకుందాం… అప్పుడెప్పుడో తాతల జమానాలో వచ్చిన శ్రీరామదాసు… అప్పటి నుంచి నాగార్జున సినిమాలు బోలెడు వచ్చినయ్, ఒక్క హిట్టూ లేదు, సోగ్గాడే చిన్ని నాయనా, మనం కాస్త పర్లేదు… ఇక వర్మ అనే ఓ మెంటల్ కేసు ఉద్దరించిన ఆఫీసర్ అనే మూవీ నాగార్జునకు ఇప్పటికీ అప్పుడప్పుడూ కలలోకి వచ్చి వణికిస్తుంది… మన్మథుడు-2 ఢమాల్… మరోవైపు స్టూడియో వ్యవహారాలూ అంత బాగాలేవు… పెద్ద కొడుక్కి లవ్ స్టోరీ రూపంలో […]
zero votes..! ఎన్నికల సంఘానికి ఈ సోయి ఎందుకు లోపించింది..?!
చిన్న వార్త… చాలా చిన్న వార్త… వేరే పత్రికల్లో కనిపించలేదు గానీ… ఈనాడులో నాలుగు ముక్కల చిన్న వార్త ఒకటి కనిపించింది… నిన్న కొన్ని మునిసిపాలిటీల వోట్ల లెక్కింపు జరిగింది కదా ఏపీలో… కుప్పంలో వైసీపీ గెలిచింది, టీడీపీ చతికిలబడింది అనే సుదీర్ఘ విశ్లేషణలకన్నా ఈ చిన్న వార్తే ఆకర్షించింది… ఆఫ్టరాల్ రాజకీయాల్లో ఎగుడుదిగుళ్లు సహజం… పడిలేవడం, లేచిపడటం, చేతకాకపోతే కాలగతిలో కొట్టుకుపోవడం… కుప్పం ఓ లెక్కా..? అయితే కుప్పంలో నలుగురు అభ్యర్థులకు అసలు ఒక్క వోటూ […]
सुनो द्रोपदी शस्त्र उठालो… ప్రియాంక చేసింది అంత క్షమించరాని తప్పా..?!
छोडो मेहँदी खडक संभालो खुद ही अपना चीर बचा लो द्यूत बिछाये बैठे शकुनि, मस्तक सब बिक जायेंगे सुनो द्रोपदी शस्त्र उठालो, अब गोविंद ना आयेंगे| कब तक आस लगाओगी तुम, बिक़े हुए अखबारों से, कैसी रक्षा मांग रही हो दुशासन दरबारों से| स्वयं जो लज्जा हीन पड़े हैं वे क्या लाज बचायेंगे सुनो द्रोपदी […]
HAMMER… పాకిస్థాన్ నెత్తిన సుత్తి… ఉగ్రకేంద్రాలపై రియల్ పాశుపతం..!
………… By…. పార్ధసారధి పోట్లూరి…………. HAMMER- హామ్మెర్! HAMMER అంటే Highly Agile Modular Munition Extended Range or HAMMER. చాలామంది అపోహ పడుతున్నట్లు హామర్ అనేది మిసైల్ కాదు.ఎయిర్ to గ్రౌండ్ బాంబ్. జెట్ యుద్ధవిమానం నుండి భూమి మీద ఉండే హై వాల్యూ టార్గెట్ ని ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడెందుకు ఈ చర్చ ? 36 రాఫెల్ జెట్ల డీల్ లో భాగంగా వెపన్ పాకేజీ కూడా ఉంది.వెపన్ పాకేజీ లో […]
తగ్గేదేలే..! సీపీఎంకు కూడా ఓ వాట్సప్ యూనివర్శిటీ ఉందండోయ్…!!
‘‘కేరళ సి.ఎం. మామూలోడు కాదు…. ఏం చేశారో తెలుసా…? కమ్యూనిస్టు భావజాలం నీది.. చాలా కష్టం. నువ్వు బతకలేవురా అంటూ కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను అంటుంటారు. కానీ కమ్యూనిస్టులు ఎలాంటి వారో అందరికీ తెలుసు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంలో వారిది కీలక పాత్ర. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ముఖ్యమంత్రులే ఉన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో వీరికి అందె వేసిన చేయి. అందులో కేరళ సిఎం పినరయి […]
చంటోడిని భుజాన వేసుకుని అడవిబాట పట్టిన ఈ మహిళ ఏమైపోయింది..?!
ఒక డిస్టర్బింగ్ ఫోటో ఇది… ఆ అడవిలో ఎవరామె చంటి బిడ్డను ఎత్తుకుని వెళ్తోంది..? ఎవరి కోసం..? ఏ అన్వేషణ కోసం..? ఇదే కదా మీ ప్రశ్న… ఆమె పేరు అర్పిత… చత్తీస్గఢ్, బీజాపూర్ అడవుల్లో తన భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తోంది… ఆమె భర్త అజయ్ రోషన్ ఓ ప్రభుత్వ శాఖలో సబ్ ఇంజనీర్… బీజాపూర్ జిల్లా, మాంకెలి ఏరియాలో ఘడ్ గోర్నా రోడ్ సర్వే కోసం తన అటెండర్తో కలిసి వెళ్లినప్పుడు నక్సలైట్లు కిడ్నాప్ […]
ఓహో.., అది బీజేపీ నిర్ణయం కాబట్టి గుడ్డిగా వ్యతిరేకించాలా..?!
అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా అనుమానించాలి, ఖండించాలి, వ్యతిరేకించాలి, ఆడిపోసుకోవాలి, అడ్డుకోవాలి….. ఈ దిక్కుమాలిన రాజకీయమే ఈ దేశానికి ప్రధాన శాపం… చిన్న డిస్క్లెయిమర్ ఏమిటంటే… బీజేపీ ఏమీ శుద్ధపూస కాదు…!! ప్రతి అంశాన్ని బీజేపీ కోణంలోనే చూసి, మోడీ వ్యతిరేక కోణంలో మాత్రమే ఆలోచించి, ఆర్ఎస్ఎస్ నిర్ణయంగానే ముద్రవేసి, హిందుత్వ-మనువాద ధోరణి అని తేల్చేసి, ప్రజావ్యతిరేకం అని తీర్పు చెప్పేయాలా..? నవీన్ పట్నాయక్ వంటి ఒకరిద్దరు న్యూట్రల్ రాజనీతిజ్ఞులు మినహా ప్రతి సీఎం అలాగే ఉన్నాడు, […]
చిప్పకూడు..! ఓ కోర్టు భలే ఆర్డరేసింది… బాగుంది… కానీ..?
ఒరేయ్, నీ అవినీతి బయటికి తీసి, జైలులో చిప్పకూడు తినిపిస్తానురా..? అని భీకరంగా హెచ్చరిస్తుంటాడు ఓ పార్టీ నాయకుడు మరో నాయకుడిని… ఛిఛీ, చిప్పకూడు తినివచ్చినవాడు కూడా నీతులు చెబుతున్నాడు, ఇంతకు నీచం ఏముంది అని ప్రెస్మీట్లో సొల్లు కక్కుతూ, ఆయాసపడుతూ ఉంటాడు మరో నాయకుడు మరోచోట… నిజంగా చిప్పకూడు, అనగా సినిమాల్లో చూపించినట్టుగా, వీళ్లు సొట్టలు బడిన ఓ రాతెండి బొచ్చె పట్టుకుని, ఖైదీల వరుసల్లో నిలబడతారా..? మన భ్రమ..! పిండి కొద్దీ రొట్టె… అసలు […]
అశ్శరభ శరభ… ఓంకార్ మాయాద్వీప మంత్రదండం విరిగిపోయింది…
మొన్నొకసారి కాసేపు… నిజంగా కాసేపే మాయాద్వీపం అనబడే ఓ రియాలిటీ షోను చూడటం తటస్థించెను… ఒకింత ఠారెత్తినట్టు అనిపించెను… ఆ దిక్కుమాలిన పిచ్చి సీరియళ్లే నయం కదా, ఆ దర్శకుల సాముగరిడీలు చూస్తూ కామెడీగా పడీ పడీ నవ్వుకోవచ్చు అని కూడా అనిపించెను… అసలు ఆ మాయాద్వీపంలో వేరే దెయ్యాలు, భూతాల సెట్లు దేనికి..? ఆ బవిరిగడ్డంతో ఓంకారన్నయ్యే ఓ పెద్ద మాయల ఫకీరులాగా ఉన్నాడు కదా అని నవ్వొచ్చెను… ప్రాణభీతితో వెంటనే చానెల్ మార్చేసి, ఈసారి […]
హిందూ భక్తుల సొమ్మే అప్పనంగా దొరికిందా..? ఓ ఇంట్రస్టింగ్ కేసు…!!
ఎన్నాళ్లుగానో ఉన్న చర్చే… చర్చిలు, మసీదులు, గురుద్వారలు, జైన గుళ్లు, ఇతర తెగల ప్రార్థనాలయాల మీద లేని ప్రభుత్వ పెత్తనం హిందూ గుళ్లు, సంస్థల మీద ఎందుకు..? గుళ్లకు ధర్మకర్తలుగా రాజకీయ నాయకులు, నామినేటెడ్ అనుచరులు దేనికి..? ఏ గుళ్లో ఏ పూజ ఎలా చేయాలో కూడా కోర్టులు ఎందుకు నిర్దేశించాలి..? ఆచారాలు, ఆగమాల మీద వాటికున్న పరిజ్ఞానం ఎంత..? అవి అకస్మాత్తుగా పీఠాలుగా ఎందుకు వ్యవహరించాలి… ఇది మరో చర్చ… సరే, ఇవెప్పుడూ ఉండేవే… పోనీ, […]
అసలే మాస్ ప్రభాస్, ఆపై పూజాహెగ్డే… ఈ హైక్లాస్ భావకవిత్వం నప్పుతుందా..?!
ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా..? విడిపోని యాత్రికులా..? వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే… ఊపిరొక్కటేలే… ఒక శ్వాసలా, నిశ్వాసలా… ఆటాడే విధే ఇదా ఇదా, కలవడం ఎలా..? కలా..? రాసే ఉందా..? ఈ రాతలే, దోబూచులే…… ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలోని ఓ పాట ఇది… ఇప్పటిదాకా మీరు చదివింది పాటలోని మొదటి భాగం… ఇరుప్రేమికులు అంటాడు, కలవరు అంటాడు, విడిపోని యాత్రికులు అంటాడు… మళ్లీ వెంటనే దారొకటే, కానీ దిక్కులు […]
- « Previous Page
- 1
- …
- 408
- 409
- 410
- 411
- 412
- …
- 490
- Next Page »