. Bharadwaja Rangavajhala………. పులకించని మదులను సైతం పులకరింపచేసిన గాన మాధుర్యం జిక్కి కృష్ణవేణి జయంతి నేడు. పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే ఎవరో చెప్పలేరు కానీ జిక్కి అనగానే ఎవరైనా గుర్తుపడతారు. కమ్మని కంఠంతో మధురమైన పాటలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను మైమరపించిన గాత్రం జిక్కి కృష్ణవేణి. ఈ రోజు జిక్కి పుట్టినరోజు. జిక్కి తండ్రి మద్రాసు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్లది చిత్తూరు జిల్లా, చంద్రగిరి. చిన్న […]
విశ్వనాథుడు కదా… జావళి పాటకీ జయమాలినితో డాన్స్ చేయించగలడు…
ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమయింది జయమాలిని జావళి . అద్భుతమైన సాహిత్యం , సంగీతం . వీటికి దీటుగా జయమాలిని నృత్యం . జయమాలిని చేత , మంజు భార్గవి చేత కళావర్షాన్ని కురిపించగల కళాతపస్వి కె విశ్వనాథ్ . ‘‘అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ నిరంజనా’’ . తెలుగీకరించబడిన సంస్కృతం . Telugised Sanskrit . ఇంతటి అందమైన సంగీతాన్ని అందించిన కె వి మహదేవన్ని , పాడిన సుశీలమ్మని స్మరించుకోవాలి […]
ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!
. ఒప్పినోళ్లు మెచ్చనీ ఒప్పనోళ్లు సచ్చనీ …. అని మాయదారి మల్లిగాడు అనే సూపర్ హిట్ సినిమాలోని ‘వస్తా మళ్లొస్తా’ అనే బంపర్ హిట్ పాటలో ఓ చరణం… నిజంగా కృష్ణ బతుకంతా నమ్మింది, ఆచరించింది అదే బాట… మెచ్చుకునేవాడు, అంగీకరించేవాడు ఒప్పుకోనీ, లేదంటే ఒప్పుకోకపోతే, ఒప్పుకునేందుకు మనసు రాకపోతే, వాళ్ల చావు వాళ్లు చావనీ… అంతే… ఆ సినిమాలూ అంతే, తన బతుకు తీరూ అంతే… నిజానికి గొప్పగుణం… ఈ సచ్చనీ పదం ఏమిటి అని […]
జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
. ఒక తెలుగు సినిమా పాట… ఓ పాత అగ్ర హీరో… బెల్ బాటమ్ పాంటు, బ్లేజర్, షూస్, టోపీ ధరించి ఎగురుతున్నాడు… వాటిని స్టెప్పులు అంటారు… పక్కనే జయప్రదో, శ్రీదేవో ఫాఫం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎగురుతోంది… సగం సగం బట్టలు… మంచుకొండల్లో హీరోకు కార్గిల్ దుస్తులు… హీరోయిన్ వంపుసొంపులు కనిపించాలి కాబట్టి అరకొర దుస్తులు… అంతేనా..? ఒకే పాటలో నాలుగైదుసార్లు హీరో గారి కాస్ట్యూమ్స్ ఛేంజ్… అదేమంటే ఫ్యాన్స్ రకరకాల డ్రెస్సుల్ని ఇష్టపడతారుట… […]
వేకువజామున వెన్నెల మరకలుగా… ఆహా… మేఘమా- దేహమా పాట నేటికీ క్లాసిక్…
. మంచుపల్లకీ సినిమాకు నలభయ్యేళ్లు అని సోషల్ పోస్టు ఒకటి చూసేసరికి ఆనందమేసింది… అప్పట్లో క్లాస్ సినిమా… ప్రత్యేకించి మేఘమా దేహమా పాటకు కురిసిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు… ఆ సినిమాను డైరెక్ట్ చేసే సమయానికి వంశీ వయస్సు పాతికేళ్లు కూడా నిండలేదు… తనే ఆరున్నరేళ్ల క్రితం ఫేస్బుక్లో ఈ సినిమా సంగతులు వివరంగానే రాసుకొచ్చాడు… అందులో కొన్ని ఇంట్రస్టింగు పాయింట్స్…. Pasalapudi Vamsy.. మాటల్లోనే… కమలహాసన్ కి అన్నయ్య, సుహాసినికి తండ్రి అయిన చారుహాసన్ […]
గుండె తడిని తాకే పాట..! మంగళంపల్లి నోట ఓ మాయల దెయ్యం..!
. నిజానికి పాపులర్ సినిమా పాటల మీద కూడా మనవాళ్లు గతం నుంచీ పెద్ద విమర్శో, విశ్లేషణో పట్టించుకోరు… ఇప్పుడంటే ఓ కొత్త సినిమా పాట రాగానే, అదెంత చెత్తగా ఏడ్చినా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర్నుంచి టీవీలు, సైట్లు, ట్యూబర్లు ఒకటే డప్పు దంచి కొడుతున్నారు… ఇంతకుముందు అసలు సినిమా పాటను ఓ సాహిత్యంగానే పరిగణించేవాళ్లు కాదు… రాసేవాళ్లు, కంపోజ్ చేసేవాళ్లు, ఆడేవాళ్లు, ఆడించేవాళ్లు, పాడేవాళ్లు, తీసేవాళ్లు కూడా దాన్నలాగే భ్రష్టుపట్టించారు… కాకపోతే ఆరుద్ర, […]
రాజేంద్రప్రసాద్ హౌజ్ హజ్జెండ్…! బోలెడు పాత్రలున్నా ఆ కారే హీరో..!
. Subramanyam Dogiparthi…. గుండమ్మ కధ , యమగోల వంటి బ్లాక్ బస్టర్లకు డైలాగ్స్ వ్రాసిన మా గుంటూరు జిల్లా వాడయిన డి వి నరసరాజు గారు దర్శకత్వం వహించిన ఏకైక సినిమా 1986లో వచ్చిన ఈ కారు దిద్దిన కాపురం . చక్కని హాస్య రస భరిత కుటుంబ కధా చిత్రం . ఆయనే కధ , స్క్రీన్ ప్లే , డైలాగులను కూడా వ్రాసుకున్నారు . నిర్మాత రామోజీరావు గారు . కోడలు దిద్దిన కాపురం […]
కాళ్లు బొబ్బలెక్కినా… ఆగకుండా 9 రోజులపాటు నర్తిస్తూనే…
. Mohammed Rafee ….. 216 గంటల శాస్త్రీయ నృత్య మారథాన్ భరతనాట్యంలో విదుషి దీక్ష ప్రపంచరికార్డు భరతనాట్యం అంటే తమిళనాడు! కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్! పేరిణి అంటే తెలంగాణ! యక్షగానం అంటే కర్ణాటక! కానీ, ఇప్పుడు భరతనాట్యం అంటే కర్ణాటక రాష్ట్రం వైపు చూసే రోజులు వచ్చాయి! జూలై నెలలో కర్ణాటక మంగుళూరుకు చెందిన డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రెమోనా పెరీరా 170 గంటల పాటు భరత నాట్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది! ఆ […]
కల్వకుండా చేసే కేసీయార్ కాదు… కల్వకుండా చేసే రేవంత్ రెడ్డి..!!
. మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఓ మాటన్నాడు… ‘కల్వకుండా చేసే కుటుంబది’… ఎవరిని అన్నాడు..? కేసీయార్ కుటుంబాన్ని..! అంటే ఏమిటి..? ‘‘అది కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, కల్వకుండా చేసే కుటుంబం, బీసీలు ఓసీలు కలవొద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవొద్దు, హిందూ ముస్లింలు కలవొద్దు, ఎవరినీ కల్వకుండా చేసే కుటుంబం’’… బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి… నిజానికి కల్వకుండా చేసేది కేసీయార్ కుటుంబమే కాదు… మరోరకంగా ‘‘కల్వకుండా చేసే రేవంత్ […]
సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
. ఒక చిన్న దళిత రైతు… నిజానికి తనకు లక్షలకులక్షలు దక్కాలి… కానీ ఓ యూనివర్శిటీ తనను మోసగించింది… పరిశోధనలు చేతకాని శాస్త్రవేత్తలు ఈ రైతు డెవలప్ చేసిన ఓ వరి రకాన్ని హైజాక్ చేశారు… పేటెంట్ రైట్స్ పొందారు… ఎంత దారుణం అంటే… చివరకు ఆ రైతు తన అనారోగ్యానికి సరైన చికిత్స చేయించుకోలేక గడ్చిరోలిలో ఓ ఆదర్శ డాక్టర్ల జంట నడిపే హాస్పిటల్లో చేరి, అక్కడే చనిపోయాడు… ఇదీ సంక్షిప్తంగా కథ… చెప్పుకున్నాం కదా… […]
ఓ డాక్టరమ్మ జీవన వీలునామా..! ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా పోనివ్వండి..!
. శరీరం సహకరించడం ఇక ఆపేసినప్పుడు, కోలుకునే అవకాశం ఏమాత్రం లేనప్పుడు, ప్లీజ్, నాపై ఏ చికిత్సలూ చేయవద్దు… నన్ను ఇక ఈ లోకం వదిలి వెళ్లేందుకు అనుమతించండి….. – డా. లోపా మెహతా ఎవరు ఈమె..? ముంబైలోని జీఎస్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అక్కడ ఆమె అనాటమీ విభాగం అధిపతి… ఆమె తన 78వ ఏట ఓ లివింగ్ విల్ (జీవన వీలునామా) రాసుకున్నారు. అందులో ఆమె స్పష్టంగా ఇలా పేర్కొన్నారు…. “నా శరీరం […]
తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!
. చెన్నై… మైలాపూర్… కాపాలీశ్వర కోవెలలో దర్శనం అయిపోయింది… గిరి ట్రేడింగ్ స్టోర్స్లోకి వెళ్లి ‘తత్వబోధ’ పుస్తకం కోసం వెతుకుతున్నాను… అక్కడ బోలెడన్ని పుస్తకాలు… అనేక సీడీలు… అభంగ్ నుంచి అరుణా సాయిరాం దాకా… భజనల నుంచి బాంబే జయశ్రీ దాకా… బొచ్చెడు సీడీలు… ఓహ్, సరైన ప్లేసులోకే వచ్చాం అనిపించింది… నా భార్య భారతీయర్ పాటల సీడీల కోసం వెతుక్కుంటోంది… నేనేమో ఆ పుస్తకాల దొంతర్లలో ఆ తత్వబోధ అనే పుస్తకం కోసం అన్వేషిస్తున్నాను… దొరకడం […]
మోడీపై అగ్గిమండుతున్న ట్రంపు… దేనికి..? విస్తుపోయే వివరాలివి..!!
Pardha Saradhi Potluri …… రా కలిసి పంచుకుందాం – part 2 ఆగస్ట్ 15 న వ్లాడిమిర్ పుతిన్, డోనాల్డ్ ట్రంప్ అలస్కాలో సమావేశం అయిన రోజు ప్రపంచ మీడియా దృష్టి ఉక్రెయిన్ గురుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అనే విషయం మీద ఉంచారు, కానీ అదే రోజు రెండు ముఖ్య సంఘటనలని వెలుగులోకి తీసుకురావడం మీద మీడియా దృష్టి పెట్టలేదు అవి…. 1.పుతిన్, ట్రంప్ సమావేశానికి వచ్చిన రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ […]
నిశ్శబ్ద సాహచర్యం… ఉన్నన్నాళ్లూ ఆ ఉనికి విలువ తెలియదు..!!
. Raghu Mandaati ….. గతం గట్టిగా తలుపు తడుతున్నట్టుంది రఘు… మనసులో పుటలు తిరగేస్తుంటే, ప్రతి జ్ఞాపకం ఒక వాసన, ఒక ఆప్యాయత తెచ్చిపెడుతోంది. కొందరి సహవాసమే మనం గ్రహించకుండానే మన ఆత్మకు ఒక ఆధారం అవుతుంది. ఒకావిడ గురించి చెప్తా రఘు… ఒక ఉన్నతాధికారి ఆవిడ. తన ప్రతిభతో, పట్టుదలతో, ఎన్ని అవరోధాలున్నా ఒక్కొక్కటిగా అధిగమించి, చివరికి గౌరవప్రదమైన పదవితో విరమణ తీసుకుంది. ఆమె పేరు, ఖ్యాతి, విజయాలు ఇవన్నీ సమాజానికి ఒక ప్రేరణ. […]
సినిమా ఆటంటేనే ఓ లాటరీ… నష్టానికి సిద్ధపడే ఆట మొదలెట్టాలి…
. ప్రసేన్ బెల్లంకొండ …. అతనలా ఏడుస్తూ వీడియో పోస్ట్ చెయ్యడం చూసి జాలేసింది. జాలి అతనికి వచ్చిన కష్టం వల్ల కాదు. అతని అమాయకత్వానికి. కనీసం పదిమందైనా థియేటర్లో లేరు అన్నది అతని కన్నీళ్ళ కారణం. అతను ఇటీవలి పరిణామాలను తెలుసుకోకపోయయినా ఉండాలి. లేదూ తనను తాను ఎక్కువగా ఊహించుకుని ఉండాలి. మొదటి రోజు మార్నింగ్, మాటినీ షోలకు పదిమంది కూడా రాకపోవడం అనేది ఇటీవలి సర్వ సాధారణ పరిణామం. ఎన్నో సినిమాలు ఇద్దరో ముగ్గురో […]
పంచెలో ఉన్న భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి..!!
. అతిలోకసుందరి శ్రీదేవి బిడ్డ… ఆ ట్యాగే జాన్వీకపూర్ కెరీర్కు ఎప్పటికప్పుడు ఊతం… అఫ్కోర్స్, అదే అందం, కాస్త చురుకుదనం… ఇంకాస్త నటన నేర్వాలి… మంచి పాత్రలు పడాలి… చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలోనే పెరిగింది కాబట్టి కాస్త చిన్న వయస్సులోనే ముదురు… ఈమధ్య పరమ్ సుందరి సినిమాలో ఓ మలయాళీ పాత్ర వేస్తే, మాలీవుడ్ వ్యతిరేకంగా స్పందించింది… జాన్వీ ఆ పాత్ర చేసిందని కాదు, ఆ యాసకు ఓనర్లమైన మేమెందుకు ఆ పాత్రకు పనికిరాలేదు అని… […]
సాక్షాత్తూ కేసీయార్ బిడ్డే చెబుతోంది… కాళేశ్వరంలో అవినీతి నిజమేనని..!!
. కల్వకుంట్ల కవిత కాళేశ్వరం కథలో మరింత మసాలా యాడ్ చేసింది… అనుకోని ఫ్లేవర్ ఇది… తాజాగా ఆమె ఏమంటున్నదంటే..? కవిత సంచలన కామెంట్స్… కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా… వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారు… అందుకే రెండవ టర్మ్ లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారు… హరీష్ రావు, సంతోష్ వల్లనే కెసిఆర్ కి అవినీతి మరకలు… నాపై కుట్రలు చేసినా సహించాను… కానీ కెసిఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే […]
కితకితలు గీతాసింగ్… జోవియల్ సెల్ఫ్ పంచుల నడుమ కళ్లల్లో చెమ్మ..!!
. గీతాసింగ్… ఈ పేరు బహుశా ఇప్పుడు చాలమందికి గుర్తుండి ఉండదు… కితకితలు అని అప్పట్లో ఓ సినిమా వచ్చింది… అల్లరి నరేష్ హీరో… అదొక నవ్వుల నావ… హిట్టయింది కూడా… అందులో కథానాయిక ఓ లావుపాటి కేరక్టర్.., ఆమే గీతాసింగ్… ఊరు నిజామాబాద్… బిగ్టీవీలో కిస్సిక్ అనే చాట్ షో వస్తుంది కదా… అందులో తాజాగా గీతా సింగ్ కనిపించింది… చూస్తుంటే ఓ ఆశ్చర్యం… చాన్నాళ్లయింది ఆమె తెర మీద కనిపించక… ఇప్పుడు హఠాత్తుగా బుల్లితెర […]
సినిమా అంటేనే పత్తాలాట… ఏడిస్తే లాభం లేదోయీ ‘బార్బరికా..’
. సినిమా అంటేనే పత్తాలాట… అవును, పేకాట… జూదం… కోడిపందేలు… బెట్టింగులు… సక్సెస్, ఫ్లాప్ నువ్వెంత కష్టపడినా నీ చేతిలో ఉండదు… ఎందుకంటే..? కారణాలు అనేకం కావచ్చు, ప్రేక్షకుడు జడ్జి, నియంత, నిరంకుశుడు… వాడు కాదంటే ఏ సరుకూ వినోద మార్కెట్లో చెల్లుబాటు కాదు… త్రిబాణధారి బార్బరిక్ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవాత్సవ ఓ వీడియో రిలీజ్ చేశాడు…. ఏమనీ..? తాను తెరకెక్కించిన ‘బార్బరిక్’ సినిమాకు ప్రేక్షకులు రాకపోవడంతో బోరున ఏడ్చారు అందులో… అలాగే తన చెప్పుతో […]
అత్తా అనసూయమ్మా… నీతో వరసోయమ్మా… హేమిటో, అప్పట్లో ఆ కథలు..!
. Subramanyam Dogiparthi …… అత్తాఅల్లుళ్ళ సవాళ్ళ మీద , మామాఅల్లుళ్ళ సవాళ్ళ మీద మనకు చాలా సినిమాలు ఉన్నాయి . మా తరం వారికి మొదట గుర్తొచ్చేది 1971 లో వచ్చిన బొమ్మా బొరుసా సినిమాయే . యస్ వరలక్ష్మి , చలం , చంద్రమోహన్ , వెన్నిరాడై నిర్మల , రామకృష్ణలు నటించారు . వరలక్ష్మి అరుపులతో థియేటర్లు వణికిపోయేవి . ఆ సినిమా వచ్చిన చాలా కాలం తర్వాత 1986 జూలైలో వచ్చిన […]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5
- 6
- 7
- …
- 374
- Next Page »