. ఒక వాట్సాప్ పోస్టు కనెక్ట్ అయ్యేలా ఉంది… రెక్కలొచ్చిన పిల్లలు ఎక్కడో ఎగిరిపోయారు… ఒంటరిగా ఇక్కడే మిగిలిపోయే తల్లి పక్షో, తండ్రి పక్షో… ఏ రాత్రికి ఏ అవసరం వస్తుందో తెలియదు… ఒకవేళ ఏ రాత్రిపూటో ఏ స్ట్రోకో వస్తే..? తెల్లవారి కాదు, ఆ మరుసటి రోజు కాదు… చుట్టుపక్కల వాళ్లు ఎవరైనా వాసన వస్తే పోలీసులకు చెబితే గానీ… ఆ తలుపులు తెరుచుకోవు, ఆ దేహం ఏ స్థితిలో ఉందో తెలియదు… జపాన్‌లో ఇలాంటి […]
జస్ట్, ప్రమాదవశాత్తూ ఓవర్‌డోస్ అట… జనం నమ్మేస్తారా కల్పనా..?!
. వాళ్ల వ్యక్తిగత జీవితాలు వాళ్ల సొంతం… ఆ జీవితాల్లోకి తొంగిచూడటం తప్పు అంటుంటారు కొందరు నీతిపెద్దలు… కానీ ఒక కేసు అయినప్పుడు, సెలబ్రిటీల జీవితాలు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు వాళ్ల వ్యక్తిగత జీవితాలూ వార్తాంశాలే అవుతాయి… కావాలి… అవుతున్నాయి కూడా… ఉదాహరణకు సింగర్ కల్పన… ఆమె బతుకంతా గతంలో విషాదం… పోరాటం, సాధన, ఆత్మవిశ్వాసం, గానప్రతిభ ఎట్సెట్రా… ఆమె అంటే సంగీత ప్రియులకు మంచి అభిమానం… నిజంగా అద్బుత గాయని ఆమె… కానీ కొందరు సెలబ్రిటీలకు […]
రష్మి హోస్టింగ్ మొహం కొట్టేసిందా..? యాంకర్ రవిని ప్రవేశపెట్టారా..?!
. ఈటీవీ ప్రోమో ఒకటి కొత్తగా కనిపించింది… శ్రీదేవి డ్రామా కంపెనీ రాబోయే ఎపిసోడ్… వుమెన్ డే స్పెషల్ అట… అందులో డొక్కా సీతమ్మకు సంబంధించిన బిట్ ఉన్నట్టుంది… బాగుంది, మంచి ఎంపిక… ఆకాశ్ పూరి గెస్టు… పర్లేదు, ఈజ్ ఉంది, కానీ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడో మరి… కానీ విశేషంగా కనిపించింది ఏమిటంటే… యాంకర్ రవి… తను స్వతహాగా మంచి ఎనర్జీ, స్పాంటేనిటీ ఉన్న యాంకరుడే… కానీ మిగతా వాళ్లలాగే పికప్ కాలేకపోతున్నాడు ఎందుకో… యాటిట్యూడ్ […]
ఈ ఎన్నిక వోట్ల లెక్కింపు… బహు చిత్రము, సంక్లిష్టము, సుదీర్ఘము…
. అత్యంత సంక్లిష్టంగా ఉండే అమెరికా ఎన్నికలు, సుదీర్ఘ లెక్కింపులు… నిన్నటి ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వోట్ల లెక్కింపు సేమ్ సేమ్ అనిపించింది… విజేతను తేల్చడానికి పాటించే పద్ధతి చూస్తే మన ఎన్నికల సంఘం తీరు మీద మనకే జాలేస్తుంది… అసలు మండలి అనేదే వృథా అనే చర్చ చాన్నాళ్లుగా దేశంలో సాగుతూనే ఉంది… అనేక రాష్ట్రాల్లో శానస మండళ్లు లేవు… సరే, ఏదో రాజకీయ పునరావాసం కోసం వైఎస్ మళ్లీ తీసుకొచ్చిన మండలిని […]
ఇజ్రాయిల్ అంటే అంతే..! నో కాంప్రమైజ్..! ఈ థ్రిల్లర్ ఓసారి చదవండి..!
. ముందుగా వాట్సప్ గ్రూపుల్లో బాగా సంచరిస్తున్న ఒక పోస్టులోని ఒక భాగాన్ని తీసుకుందాం… అది ఇజ్రాయిల్‌కు అనుకూలంగా బీజేపీ సోషల్ బ్యాచ్ పుష్ చేస్తున్న పోస్ట్… బాగానే వైరల్ అవుతోంది… అయితే ఆ మొత్తం పోస్టు గాకుండా… అందులో ఒక స్టోరీని తీసుకుందాం… ఇజ్రాయిల్ ధోరణి స్థూలంగా ఎలా ఉంటుందో ఈ కథ మనకు చెబుతుంది… ఈ కథ పేరు ‘ఆపరేషన్ థండర్ బోల్ట్’… అయితే ఈ వైరల్ కథలో లేని కొన్ని ఫినిషింగ్ టచెస్ […]
దీన్ని తెలుగు అందామా..? పిల్లలకు ఈ ఇనుప గుగ్గిళ్లు తినిపించాలా..?!
. ఏ మీడియంలో చదవాలన్నది ఇప్పుడు పెద్ద చర్చ. మన దేశంలో లెక్కలేనన్ని భాషలు, యాసలు. చివరికి లిపే లేని భాషలు కూడా మనుగడలో ఉన్నాయి. ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రవాహంలో పడి ముందుకు వెళుతుంటే మనం కూడా అందులోనే మునిగి తేలాలి కదా! అన్నది మెజారిటీ వాదం. ఇంగ్లిష్ వ్యామోహంలో పడి… బతికి ఉండగానే మన మాతృభాషలకు మనమే తలకొరివి పెట్టాలా? అన్నది మరో వాదం. మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం సాధ్యాసాధ్యాలమీద యుద్ధాలు […]
అర్ధరాత్రి… ఆ రద్దీ బోగీలో ఓ రోగి విలవిల… ఎదుటి బెర్తులో ఓ పెద్దాయన…
. నేను చెన్నైలో పనిచేస్తూ ఉండేవాడిని… నా పూర్వీకుల ఇల్లు భోపాల్‌లో… నాన్న అక్కడే ఉండేవాడు… హఠాత్తుగా ఓరోజు పబ్లిక్ కాల్ ఆఫీస్ నుంచి నాన్న కాల్ చేసి, వెంటనే ఇంటికిరా అన్నాడు… నాకిక్కడ అర్జెంటు పని ఉంది అని చెప్పేలోపు కట్ చేశాడు… అప్పటికప్పుడు బ్యాగు సర్దుకుని రైల్వే స్టేషన్ చేరుకున్నాను… బుకింగ్ లేదు, రిజర్వేషన్ లేదు… వేసవి సెలవులు కదా, ఏ రైలు చూసినా ఫుల్లు రద్దీ… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ మీద […]
మొగుడు తొమ్మిదేళ్లు పెద్ద… పైగా టీబీ… నాలుగో పెళ్లాం… చదవాల్సిన లైఫ్…
ఉమ… ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో… కోయంబత్తూరు… తండ్రి బాలకృష్ణన్, తల్లి తంకమణి… తండ్రి తన యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ ఒక సంవత్సరం చదివి, వదిలేసి, వద్దులే అని తండ్రి చెప్పగానే తిరిగి వచ్చేశాడు… ఓ డాక్టర్ దగ్గర కంపౌండర్‌గా కూడా చేరాడు… అప్పట్లో అల్లోపతిని ఎవరూ పట్టించుకునేవారు కాదు… సైకిల్ మీద డాక్టర్, కంపౌండర్ ఊరంతా తిరిగేవారు రోగుల కోసం… ఇది జరిగే పని కాదని ఏదో మిల్లులో చేరాడు… అక్కడ రిసెప్షనిస్టుగా చేరిన తంకమణిని పెళ్లిచేసుకున్నాడు… బిడ్డ […]
బీజేపీకి కొత్త జోష్… ఎమ్మెల్సీ విజయాలు ఓ మార్పుకు సంకేతం..!!
. రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచింది బీజేపీ… ఎహె, ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయానికి కొలమానం ఎలా అవుతాయి అని తేలికగా తీసేయకండి… బీసీ వాదాలు, బీఆర్ఎస్ విచిత్ర మద్దతులు ఏమీ పనికిరాలేదు… రాష్ట్రంలో ఓ విశేష రాజకీయ పరిస్థితిని ఈ ఎన్నికలు సూచిస్తున్నాయి… అదీ గమనించాల్సింది… ఎస్, ట్రూ… హరీష్, కవిత, కేటీయార్ ఎంత తిరిగినా, రోజురోజుకూ ఏవేవో చెబుతున్నా జనంలో స్పందన లేదు… కేసీయార్ ఫామ్ హౌజులో పడుకుని, పార్టీని గాలికి వదిలేయడం దాన్ని దారుణంగా […]
సింహం సింగిల్‌గా వస్తున్నప్పుడు… దానికి డొల్ల కిరీటం దేనికి జగన్..!?
. అన్న సింహం, పులి, ఏనుగు, తిమింగలం, షార్క్… ఇలాంటి ఉదాహరణలన్నీ వేస్ట్… అదేనండీ… జగన్ ప్రతిపక్ష హోదా గురించి అడుక్కోవడం దేనికి అని… సింహం ఏదీ అడుక్కోదు, వేటాడి చిక్కించుకుంటుంది… బహుశా జగన్‌కు ఎవరూ చెప్పలేదేమో,., అఫ్కోర్స్, ఎవరు చెప్పినా తను వినడు… కానీ తనకైనా తెలిసి ఉండాలి కదా… సింహం ఎవరినీ ఏదీ అడుక్కోదు అని… 11 సీట్లకు పడిపోవడం అంటేనే తన అపరిపక్వ పాలన మీద ఆంధ్రాజనం అత్యంత దారుణమైన తిరస్కరణ వోటు […]
మేనరికాలే కాదు… ఒకే కులంలో పెళ్లిళ్లూ హానికరం… వ్యాధికారకం…
. జన్యుసంకరం అనండి, వైవిధ్య జన్యుసంపర్కం అనండి… ఏ జాతినైనా బలపడేట్టు చేస్తుంది… మానవ పరిణామ క్రమాన్ని పరిశీలించేవారూ అంగీకరించే వాస్తవం ఇది… వైవిధ్యమైన కలయిక బలాన్ని ఇస్తుంది… సాధారణ భాషలో చెప్పాలంటే… కులాంతరం, కుటుంబాంతరం, మతాంతరం, దేశాంతరం, ఖండాంతర వివాహాలు శారీరిక, అనువంశిక లక్షణాల కోణంలో చూస్తే బెటర్… అఫ్కోర్స్, సంస్కృతులు, అలవాట్లు, భాషలు, తత్వాలు పడొచ్చు, పడకపోవచ్చు… కొత్త సమస్యలకు తలెత్తొచ్చు కూడా… కానీ పూర్తిగా ఒక హ్యూమన్ అనే కోణంలో చూస్తే మటుకు […]
నెటిజనం విరుచుకుపడి… రోహిత్ శర్మపై ఆ పిచ్చి ట్వీట్ డిలిట్…
. Nàgaràju Munnuru ……. డాక్టర్ షామా మహమ్మద్ అనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భారత్ కాప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతిని గేలి చేస్తూ లావుగా ఉన్నాడు, బరువు తగ్గాలి, ఇప్పటి వరకు ఉన్న భారత క్యాప్టెన్ లలో అసలు ఏ మాత్రం ఆకట్టుకోలేని వ్యక్తి అని విమర్శలకి దిగింది… అవును నిజమే.. అతను కెప్టెన్‌గా కాదు కదా.. జట్టులో ఉండటానికి కూడా పనికి రాడు అంటూ టీఎంసీ నాయకుడు సుగతా రాయ్ పెట్రోల్ పోశాడు… ఆ […]
ఈసారి ఆమె గళం కాదు, ఆమె మౌనం అందరికీ వినిపించింది!
. Psy Vishesh ……. “ఆమె గానం వినిపించింది… కానీ, ఆమె బాధను వినలేకపోయాం!” “పాటలు పాడితేనే నా బాధను మర్చిపోగలను.” “నా గళం వినిపిస్తేనే నేను బతికున్నట్లుగా ఉంటుంది.” ఇవి గాయని కల్పన గారు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు. కానీ, ఈసారి ఆమె మౌనంగా నిద్రమాత్రలు మింగింది! ఈసారి ఆమె గళం కాదు, ఆమె మౌనం అందరికీ వినిపించింది! ఈ వార్త విన్న వెంటనే మనందరం షాక్ అయ్యాం. “ఎందుకు ఇలా చేసుకుంది?” “ఆమెకేమైనా […]
ధన్యజీవి..! అత్యంత అరుదైన రక్తంతో లక్షల శిశువులకు ప్రాణదానం..!
. నిన్న ఇంగ్లిషు మీడియాలో కనిపించిన ఈ వార్త ఆసక్తికరంగా ఉంది… “గోల్డెన్ ఆర్మ్ మ్యాన్” గా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియన్ రక్తదాత జేమ్స్ హారిసన్ 88 సంవత్సరాల వయస్సులో కన్నుమూశాడు… ఫిబ్రవరి 17న NSW సెంట్రల్ కోస్ట్, ఆస్ట్రేలియాలోని పెనిన్సులా విలేజ్ నర్సింగ్ హోమ్‌లో ఆయన మరణించినట్టు ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ లైఫ్ బ్లడ్ ధృవీకరించింది…. ఇదీ వార్త… అసలు ఎవరాయన..? ఎందుకు తన గురించి చెప్పుకోవాలి…? ఇదీ అసలు ప్రశ్న… సింపుల్‌గా చెప్పాలంటే ఈయన అరుదైన […]
రాష్ట్రాలు కేంద్రాన్ని యాచించాలా… ఎంత ఇస్తే అంతే తీసుకోవాలా..?
. రాష్ట్రమా! యాచించు! అంతర్జాతీయ స్థాయి పేరు రావాల్సిన తెలుగు కార్టూనిస్ట్ సురేంద్ర హిందూ ఇంగ్లిష్ దినపత్రిక కోసం గీచిన ఒక కార్టూన్. ఒక పెద్ద టేబుల్. టేబుల్ మీద ఆ చివరనుండి ఈ చివరవరకు పొడుగాటి ఖడ్గం. అనేక పార్టీల ప్రతినిధుల గుంపు (మిత్రపక్షాలు/ ప్రతిపక్షాలు) ఖడ్గం మొనదేలిన వైపు ఉంటారు. అధికారంలో ఉన్న ఒక పెద్దాయన (అధికార పక్షం) ఖడ్గం పిడికిలి వైపు ఉంటాడు. “Come this side. How beautiful this sword […]
ఇలాంటి సినిమాలు కదా తీయాలి... సొసైటీకి చుక్కాని కావాలి…
. Sai Vamshi (విశీ)…… ఇలాంటి సినిమాలు కదా తీయాలి.. ఇట్లా కదా మత సామరస్యం చాటాలి (The Bonding of a Two Women of Two Religions) … 2000, జనవరి 22. కేరళ రాష్ట్రంలోని అళప్పుళ జిల్లాలో ఉన్న అంబళాపుళ గ్రామంలో కాంగ్రెస్ వార్డ్ మెంబర్ 34 ఏళ్ల రజియా బీవీ. ఓ రాత్రి పూట ఇంటికొస్తున్న సమయంలో రైల్వే ట్రాక్‌పై ఎవరో కూర్చుని ఏడుస్తున్న శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే, ఓ […]
సింగర్ కల్పన..! ఈ ఫోటో చూడటం బాధాకరం… బతుకంతా విషాదమేనా..?!
. బాధాకరం… సింగర్ కల్పనను హాస్పిటల్‌కు తీసుకుపోతున్న ఫోటో బాధాకరం… ఆమెకు ఏమైంది..? ప్రస్తుతానికి ఎవరూ ఏమీ చెప్పలేని దుస్థితి… (ఈ పోటో పబ్లిష్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు…) కల్పనా రాఘవేందర్… శాస్త్రీయ సంగీతంలో మంచి విద్వత్తు ఆమె సొంతం… ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచీ శిక్షణ, సాధన… గాన రాక్షసి అంటారు అందరూ… అంటే ఏదైనా అలవోకగా పాడగలదు… ఆమె తండ్రి రాఘవేందర్ ఓ గాయకుడు, తల్లి సులోచన గాయకురాలు… చిన్నతనం నుంచీ ఆమె స్టూడియోలు […]
భలే ఆడావు కోహ్లీ… రియల్ చేజింగ్ స్టార్… ఫైనల్‌కు చేర్చావు…
. ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలుస్తుందా లేదా వేరే సంగతి… వన్డే అంటేనే అనూహ్యాలు… కానీ ఒక్క విషయం చెప్పుకోవాలి… అవును, కోహ్లీ గురించే… మొన్న చెప్పుకున్నాం కదా, సెంచరీ చేసి పాకిస్థాన్ మీద విజయానికి మూల కారకుడయ్యాడు… ఎస్, రోహిత్ శర్మలా తొందరపడకుండా… పరిస్థితిని, పిచ్‌ను అర్థం చేసుకుని, షాట్లకు పోకుండా, సింగిల్స్ తీస్తూ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు… అసలు ట్రోఫీ రాకపోయినా సరే, పాకిస్థాన్ మీద గెలుపే ఇండియన్లలో ఆనందాన్ని నింపింది… సేమ్, ఈ […]
మైగ్రెయిన్‌కు చికిత్స ఉందా..? లేదు, జస్ట్, ఉపశమనాలు మాత్రమే…
. మిత్రుడు అశోక్ కుమార్ వేములపల్లి రాసిన ఒక పోస్టు, కామెంట్లలో ఓ వివరణ చదివాక ఇది రాయాలనిపించింది… ముందుగా తనకు ఎంతకాలంగానో వేధిస్తున్న మైగ్రెయిన్ గురించి తనేం రాసుకున్నాడో చూద్దాం… మైగ్రెయిన్ తగ్గడానికి ఎవరు ఎన్నిరకాల సలహాలు ఇచ్చినా, తీసుకుని ట్రీట్మెంట్ చేయించా.. ఇంతవరకూ తగ్గలేదు.. గత పదేళ్లలో అన్నిరకాల ట్రీట్మెంట్లు అయిపోయాయి.. మొదట విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్ దగ్గర రెండేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను తగ్గలేదు.. తర్వాత గుంటూరు ప్రముఖ హోమియో స్పెషలిస్ట్ డాక్టర్ […]
బహుపరాక్… రెచ్చిపోకండి… ప్రతి ఒక్కడూ డైరీలో రాసుకుంటున్నాడు…
. Paresh Turlapati ….. ఏపీలో లోకేష్ ఒక్కడే రెడ్ బుక్ రాసుకున్నాడు అనుకున్నా… లోకేష్ రెడ్ బుక్ లో ఎర్ర ఇంకు పెన్నుతో రాసుకున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నాడు… ఇంకా లిస్టులో సజ్జల.. నానీ లు లైన్ లో ఉన్నారని టాకు… కానీ లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్.. రఘురామ కృష్ణంరాజు లు కూడా డైరీలో పేర్లు రాసుకున్నారని కొంతమందికి ఇప్పుడు తెలిసింది… లాకప్ లో పోలీసులతో […]
- « Previous Page
- 1
- …
- 4
- 5
- 6
- 7
- 8
- …
- 482
- Next Page »