. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును తొలగించి, సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టే విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థించుకుంటున్న తీరు విస్మయకరంగా, తప్పుడు పద్ధతిలో ఉంది… రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన వివరణ కూడా అభ్యంతరకరంగా ఉంది… ఎస్, తను చెప్పినట్గుగానే… ‘‘రాజకీయాలు కలుషితమయ్యాయో… నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదు…’’ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయి… ‘‘పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటం లేదు, వారి ప్రాణత్యాగాన్ని […]
‘ఏయ్ సిపాయీ… నువ్వు డాన్స్ చేయాలి, లేకపోతే కొలువు ఊడుతుంది…’
· డ్యాన్స్ చేయకపోతే.. పోలీసు ఉద్యోగం ఊడుతుంది … ‘ఏయ్ సిపాయీ! దీపక్! ఇప్పుడొక పాట పెడ్తారు. దానికి నువ్వు డ్యాన్స్ చేయాలి. లేకపోతే నీ ఉద్యోగం ఊడుతుంది. తప్పుగా అనుకోకు, ఇవాళ హోలీ. అర్థమైంది కదా?’ అని అంటున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, ప్రస్తుతం ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే తేజ్ప్రతాప్ యాదవ్. హోలీ సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు ఇది. మొన్న ఈ వీడియో వైరల్గా […]
అది ప్రభుత్వ పురస్కారం కాదు… ప్రైవేటు సన్మానం మాత్రమే…
. చిరంజీవి ఆల్రెడీ లండన్ బయల్దేరి ఉంటాడేమో… 19న బ్రిటన్లో సన్మానం కదా… మొన్న ఆ వార్త చదివాక కొన్ని సందేహాలు… అందరూ ఏమని రాశారంటే..? ‘‘అగ్రహీరో చిరంజీవి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది… యూకే పార్లమెంటులో గౌరవ పురస్కారం అందుకోనున్నాడు… ఇదొక అంతర్జాతీయ అవార్డు… ఇన్ని దశాబ్దాలుగా కళారంగం ద్వారా, సామాజికంగా సేవలు అందిస్తున్నందుకు అరుదైన గుర్తింపు, ప్రశంస…’’ ఒకరిద్దరయితే బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిందని రాసేశారు… పనిలోపనిగా తను గిన్నీస్ […]
అతడు… ఈరోజుకూ అలరిస్తూనే ఉంది… ఆశ్చర్యపరిచే అరుదైన రికార్డు…
. ఎక్కడో చదివాను… నచ్చింది… ఎందుకంటే..? ఎన్నోసార్లు అనుకుని ఉంటాను… అతడు అనే సినిమాను స్టార్ మా చానెల్ ఇప్పటికి ఎన్నిసార్లు ప్రసారం చేసి ఉంటుంది అని…! ఎప్పుడో 2005 లో వచ్చిన సినిమా… ఎప్పుడు ఆ చానెల్ ట్యూన్ చేసినా ఈ సినిమా కనిపిస్తూనే ఉంటుంది… ఇరవై ఏళ్లలో ఇప్పటికి 1500 సార్లు ప్రసారం చేశారట… వరల్డ్ రికార్డు… కాదు, ఇక ఆ రికార్డును ఎవరూ, ఏ సినిమా అందుకోలేదేమో… నిజంగానే సినిమా ఎన్నిసార్లు చూసినా […]
సునీత దిగొస్తే… కల్పన మళ్లీ పుట్టినట్టేనట… హేమిటో ఫాఫం సాక్షి రాతలు..!!
. గతంలో దినపత్రికల సండే సప్లిమెంట్స్లో ఆర్టికల్స్, భాష, ప్రజెంటేషన్ గట్రా నాణ్యంగా ఉండేవి… సాక్షి వచ్చాక ఫ్యామిలీ పేజీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది… కానీ ఇప్పుడు..? ఆ సండే మ్యాగజైన్స్, ఫ్యామిలీ పేజెస్ తమ విలువను కోల్పోయాయి… రీడబులిటీ వేగంగా పతనమైపోయింది… నిన్న అనుకోకుండా సాక్షి సండే మ్యాగజైన్ చూడబడ్డాను… సునీతా విలియమ్స్ గురించిన స్టోరీ… హెడింగ్, లీడ్ చూడగానే ఆశ్చర్యంతోపాటు ఒకింత అసహ్యమూ కలిగింది… ఎస్, 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుబడిపోయిన […]
ఓహ్… పెళ్లితో మగవాడికీ ఈ సమస్య అదనమా..? భలే చెప్పారయ్యా..!!
. అదీ సంగతి. మగవాళ్ళు ఇంతింత లావు కావడానికి పెళ్ళే కారణం తప్ప మరొకటి కానే కాదు. పెళ్ళికి ముందు నాజూగ్గా, రివటలా, ఎండు పుల్లల్లా ఉన్నవారు…పెళ్ళయ్యాక కదల్లేని పర్వతాల్లా తయారుకావడానికి శాస్త్రీయమైన కారణాలు దొరికిపోయాయి. కదిలి వచ్చే మేరునగంలా ఉంటే తీగలాంటి అమ్మాయిలెవరూ ఇష్టపడరన్న ఎరుకకొద్దీ ఎంతోకొంత శరీరంపై శ్రద్ధ పెట్టి ఊబకాయం రాకుండా జాగ్రత్త పడతారట. కొంచెం లావు కాగానే వ్యాయామం చేసో, ఆహారం తగ్గించో సన్నబడడానికి ప్రయత్నిస్తారట. పెళ్ళయ్యాక ఆ శ్రద్ధ ఉండదట. […]
డియర్ ఆర్కే గారూ… 350 కిలోల బంగారు నాణేల్ని ఏం చేశారంటారూ..?!
. నిన్నటిదే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న కొత్త పలుకులో ఒకటీరెండు పేరాలు బలంగా ఆకర్షించాయి… ‘‘హైదరాబాద్లోని ఒక డిస్టిలరీ యాజమాన్యం 200 కోట్ల రూపాయలతో దాదాపు మూడున్నర క్వింటాళ్లు, అంటే 350 కిలోల బంగారు నాణేలను కొనుగోలు చేసింది. పద్మావతి జ్యువెలర్స్ అనే సంస్థకు సదరు డిస్టిలరీ నుంచి 200 కోట్ల రూపాయలు చెక్కు రూపంలోనే అందాయి. ఆ డబ్బు తీసుకున్న పద్మావతి జ్యువెలర్స్ సంస్థ 350 కిలోల బంగారాన్ని నాణేలుగా మార్చి అందజేసింది. సదరు బంగారాన్ని […]
ఆ ఇద్దరూ అగ్ర హీరోలే అప్పటికి… కలిసి నటిస్తే మాత్రం తుస్సు…
. Subramanyam Dogiparthi …….. ఎన్ని పంతాలు పట్టింపులు వచ్చినా , ఇగో సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు వాటిని పక్కన పెట్టి మన పాత తరం హీరోలు కలిసి చాలా సినిమాలే నటించారు . మొదటగా చెప్పుకోవలసిన జంట NTR , ANR … అలాగే కృష్ణ , శోభన్ బాబు … వీళ్ళు పెద్ద హీరోలు అయ్యాక కూడా కలిసి నటించారు . ముఖ్యంగా చెప్పుకోవలసింది యన్టీఆర్ , కృష్ణల గురించే … ఇద్దరికీ ప్రొఫెషన్లో […]
ఇందిరాగాంధీపై అత్యంత నాసిరకం బయోపిక్… ఎమర్జెన్సీ..!!
. Jayasree Pavani …… ఎమర్జెన్సీ సినిమా గురించి నాలుగు మాటలు : 1925 లో నండూరివారు ఎంకిపాటల సంకలనం ముద్రించే ముందు, స్వాతంత్ర్య సమర యోధుడు దుగ్గిరాల వారిని ముందు మాట రాస్తారా అని అడిగేరట. దానికి ఆయన ఆ పాటలను చదివి, ఇదే నా ముందుమాట అంటూ “నాజూకు లేదురా ఎంకిలో నండూరు సుబ్బిగా” అని రాశారట. అందరూ నవ్వేశారు. పాటలు సూపరు హిట్టు. కానీ పల్లెటూరి అమ్మాయిలోని అమాయకత్వమో, గడుసుదనమో మోతాదు మించితే […]
వందేళ్లుగా లెనిన్ ‘అలాగే ఉన్నాడు’… ఆయన సిద్ధాంతాలే గల్లంతు…
. Bhandaru Srinivas Rao ………. మేము మాస్కోలో వున్న అయిదేళ్ళ కాలంలో గమనించింది ఏమిటంటే, వానయినా, ఎండయినా (ఎండలకు చాన్స్ లేదనుకోండి) వానయినా వంగడి అయినా, మంచు అయినా, మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో గడ్డకట్టే చలి అయినా, అయినా కొనుగోళ్ల కోసం, జనాలు క్యూల్లో వుండడం చూశాను కానీ, కావాలని వెళ్లి, ఆరుబయలు మంచు మైదానంలో గంటల తరబడి క్యూలో నిలబడి తమవంతు కోసం వేచి చూసే సీను ఒక్క చోటే కనబడింది. అది […]
ఆహా… కీలకమైన ఉగ్రవాద నేత హతం..? గుర్తుతెలియని యమకింకరులతో…
. …. ( పార్థసారథి పొట్లూరి ) …. హఫీజ్ సయిద్ చనిపోయాడు! ఎవరు అతను అనుకుంటున్నారా..? 26/11 ముంబై మారణకాండ మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్… గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులలో మరణించాడు! గుర్తుతెలియని వ్యక్తులు అనేకమంది భారత వ్యతిరేక శక్తులను ఖతం చేస్తున్నారు తెలుసు కదా కొన్నాళ్లుగా… నిన్న అంటే శనివారం రోజున అబు కతల్ ( Abu Qatal) ను జీలం జిల్లాలోని దిన అనే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి […]
అనసూయను ఆంటీ అని పిలవాలంటే అది పడిపోవాల్సిందేనట…
. అనసమ్మతో ఇదే తంటా… నా ఇష్టమొచ్చినట్టు బట్టలేసుకుంటా, బికినీలో ఫోటో షూట్ చేసుకుని పబ్లిక్ డొమెయిన్లో పెడతా, నా మొగనికే ఏ బాధ లేదు, మీకేం నొప్పి, నన్నేమన్నా అంటే ఒక్కొక్కడినీ కేసుల్లో బుక్ చేస్తా… ఇలా విరుచుకుపడుతుంది కదా… చాలా ఉదాహరణలు చూశాం కదా… అసలు ఆమెను ఎప్పుడూ లైవ్లో ఉంచేవే ఈ వివాదాలు, ఈ బెదిరింపులు, ఈ ఝలక్కులు… సరే, ప్రచారం కోసం ఆమె బాధ ఆమెది… అదొక పంథా అనుకుందాం… కొన్నాళ్లుగా […]
అసలు హిందీ ఓ భాషేనా..? దాన్ని ఎందుకు దేశం మీద రుద్దుతారు..?!
. Why not HINDI (త్రిభాషా విధానం.. కొన్ని వాస్తవాలు) NOTE: IMPORTANT Points tobe Noted. త్రిభాషా విధానం మీద రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ విషయంపై కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం అవసరం. * జాతీయ విద్యా విధానం-2020లోని త్రిభాషా విధానం విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని పేర్కొంది. అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలన్నది తప్ప, హిందీ తప్పకుండా ఉండాలన్న నిబంధన లేదు. మూడోది ఏదైనా అంతర్జాతీయ […]
ఈ చరిత్ర ఏ సిరాతో…. ఈరోజుకూ అంతే… ఈ చరిత్ర ఏ రంగు సిరాతో…
. Subramanyam Dogiparthi ……… ఈ చరిత్ర ఏ సిరాతో ! ఇప్పుడయితే ఏ రంగు సిరాతో అని పెట్టవలసి ఉంటుందేమో ! ఎర్ర రంగా లేక బులుగు రంగా లేక కాషాయ రంగా లేక మరి ఇంకేదయినా రంగా ? ఈ సినిమాలో కూడా ఒక సీనులో ఇలాంటి ప్రస్తావన ఉంటుంది . విలనేశ్వరుడి భజింత్రీ కవి అంటాడు . విలన్ కొడుకు పుట్టాకనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వ్రాస్తాను అంటాడు . చరిత్రదేముంది ; […]
ముంబై..! వేగంగా తన పర్యాటక ప్రాభవాన్ని కోల్పోతున్నదా..?!
. ( హరగోపాల రాజు వునికిలి) …. ముంబై తన ప్రాభవాన్ని కోల్పోతోందా..? ముంబై ….దేశ ఆర్ధిక రాజధాని.. మరాఠా సంస్కృతికి మచ్చుతునక.. పార్సీ సంప్రదాయానికి ప్రతీక .. కానీ గత కొన్నేళ్లుగా తన ప్రాభవాన్ని కోల్పోతుందా అని అన్పిస్తోంది.. నాటి బొంబాయికి నేటి ముంబైకి కొన్నిస్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. ముంబైకి లైఫ్ లైన్ అనదగ్గది లోకల్ రైళ్ళు.. కచ్చితమైన సమయానికి పేరు. కోట్లాదిమంది ప్రయాణికులకు అత్యంత చవకైన ప్రయాణ సాధనం. ఇప్పుడిప్పుడే మెట్రో రైళ్ళు వాటిపై ఒత్తిడి […]
కోర్ట్… న్యాయవాద వృత్తి మీద గౌరవం పెంచిన సినిమా ఇది…
. ‘చదువు తో పాటు చట్టం గురించి కూడా పిల్లలకి నేర్పించాలి. అసలు చదువు లేకపోయినా పర్లేదు, చదువు కన్నా చట్టం అందరికీ తెలియాలి’ – మన దేశంలో చట్టాల మీద అవగాహన గురించి ఒక సినిమా – తెలుగు సినిమా – చర్చించడం గొప్ప విషయం. కోర్ట్ సినిమాలో ఆ ప్రయత్నం చాలా బాగా చేసారు. ఇది చాలా సున్నితమైన అంశం. న్యాయ వ్యవస్థకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, ఎవరినీ నొప్పించకుండా, విమర్శించకుండా సాధారణ […]
కీరవాణి ఆంధ్రుడు కాబట్టి అనర్హుడా..? మరి అల్లిపూల వెన్నెల మాటేమిటి..?
. ఆంధ్రజ్యోతిలో ఓ వార్త కనిపించింది… కేసీయార్ బిడ్డ కవిత మండలిలో మాట్లాడుతూ ‘తెలంగాణలో సంగీత దర్శకులే లేరా..? జయజయహే తెలంగాణ పాటకు ఆంధ్రా వ్యక్తితో సంగీత దర్శకత్వమా..? సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు… ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు…’ అని విమర్శించింది… నవ్వొచ్చింది… వోకే, కీరవాణి స్వరకల్పన ఏమాత్రం బాగాలేదు, తెలంగాణ జనానికి అస్సలు నచ్చలేదు… ఫాఫం కీరవాణికి ఏమైంది అనిపించింది… ఆయన రాజమౌళి సినిమాలకు తప్ప ఇక తన క్రియేటివిటీ చూపించే స్థితిలో […]
“అరే… తాగినప్పుడు గిట్లనే మజాక్ చేస్తార్రా బై… దానికే కొట్టాల్నా?”
. హైదరాబాద్ బంజారాహిల్స్. ఉద్యోగ పక్షులు రెక్కలు కట్టుకుని, లంచ్ బాక్సులు కట్టుకుని బైకుల్లో, కార్లలో, ఆటోల్లో, రాపిడో బైకుల్లో వెళ్ళే వేళ. ఆఫీస్ లో నా సీటు పక్కన పెద్ద కిటికీలో నుండి కనపడే పచ్చటి చెట్టును, వీధిని చూడడంలో నాకు ఏదో ఆనందం ఉంటుంది. పక్కింటివారి చెట్టు కొమ్మ నా కిటికీ ముందు వాలి… ఎర్రటి, తెల్లటి పూలగుత్తులతో ఏదో పూలబాస మాట్లాడుతున్నట్లు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. పచ్చటి కొమ్మలు, ఊగే పూలకొమ్మలతో కిటికీ […]
తెలంగాణ ఓ పవర్ హౌజ్… ఐటీయే కాదు, ఇది ఫార్మా హబ్ కూడా…
. Jaganadha Rao ……. తెలంగాణ అనేది ఒక పవర్ హౌజ్. ఎలాగంటే..? వివిధ రకాల ఉత్పత్తులు, ఆహారం, దుస్తులు, వివిధ రకాల సేవలు, కిరాయిలు, రవాణా ఖర్చులు మొదలైన వాటి ధరల పెరుగుదల రేటుని ద్రవ్యోల్బణం (Inflation) గా పిలుస్తారు. భారత దేశంలో ప్రస్తుతం ది బెస్ట్ రాష్ట్రం అంటే తెలంగాణ. నిన్న రిలీజ్ చేసిన జాతీయ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) లెక్కల ప్రకారం మన దేశంలో తెలంగాణలో అతి తక్కువ ఇన్ ఫ్లేషన్ (1.3%) […]
పిల్లల్ని చంపకండర్రా… ఏమో, భవిష్యత్తులో ఎవరు ఏమవుతారో…
. ‘చస్తే మీరు చావండి… మీ పిల్లల్ని కూడా చంపేసి పోతున్నారేమిట్రా’…. ఈమధ్య ఈ ప్రశ్న బలంగా వినిపిస్తోంది… మానసిక వైకల్యంతోనో, దౌర్బల్యంతోనో, వేధించే అనేకానేక సమస్యలతోనే ఆత్మహత్యలు చేసుకోవడం ఈరోజు కొత్తదేమీ కాదు… ఏనాటి నుంచో ఉన్నదే… కానీ… పిల్లల్ని కూడా చంపేస్తున్నారు… వాళ్లను కన్నందుకు వాళ్లను చంపేసే హక్కు కూడా ఉన్నట్టు… మేమే చనిపోతే ఇక మా పిల్లలకు దిక్కెవరు..? అనే భావనే కావచ్చుగాక… కానీ ఏమో, ఆ పిల్లల్లో సొసైటీకి ఉపయోగపడే ఆణిముత్యాలు […]
- « Previous Page
- 1
- …
- 5
- 6
- 7
- 8
- 9
- …
- 489
- Next Page »