Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిగ్‌బాస్ క్రాస్ ఓవర్ యాడ్ – కన్ఫ్యూజన్ ఫుడ్… లాజిక్‌లెస్ మూడ్!

September 2, 2026 by M S R

.

నలుగురు సౌత్  ఇండియా పాపులర్ స్టార్లు… ఎవరి ఫాలోయింగ్ వాళ్లది… ఆ నలుగురూ ఆయా సౌత్ భాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ షో హోస్ట్ చేస్తున్నారు… ఓసారి ఒకేచోట వారికి కేటాయించిన గ్రీన్‌రూముల్లో కూర్చుని ఉంటారు… టిఫినీలు ఆర్డర్ చేస్తాడు…

ఆ సర్వరుడేమో ఒకరు ఆర్డర్ చేసిన డిష్ మరొకరికి సర్వ్ చేస్తాడు కన్‌ఫ్యూజన్‌లో… వోకే, ఓసారి తినిచూద్దాం అంటూ ఆ నలుగురూ వాటిని టేస్ట్ చేసి, వావ్,  బాగుంది అని సర్వ్ చేసిన డిష్‌నే తినేస్తారు… ఇదీ యాడ్… దేని కోసం అంటే… నాలుగు సౌత్ భాషల్లో తదుపరి బిగ్‌బాస్ సీజన్ ఈ 6 నుంచి స్టార్ట్ కాబోతోంది…

Ads

BIGGBOSS

ఒకేసారి నాలుగు భాషల్లో కొత్త సీజన్లు స్టార్ట్ కాబోతున్నాయి అని చెప్పడానికి ఈ క్రాస్ ఓవర్ యాడ్ చేశారు క్రియేటర్లు ఎవరో గానీ… అంటే… “Four superstars. Four houses. One epic moment…” అని చెప్పడానికి ప్రయాస… వోకే… యాడ్ చూడటానికి బాగుంది, నలుగురు స్టార్లు ఒకే యాడ్‌లో, ఒకే కాన్సెప్టులో భలే ఇమిడారు…

పెసరట్టు సుదీప్‌కి… వడ సాంబార్ మోహన్‌లాల్‌కి… ఉప్మా నాగార్జునకి… పిట్టు విజయ్ సేతుపతికి ! సో వాట్..? యాడ్ వార్తల్లో ఓమాట చెబుతున్నారు… రాస్తున్నారు… వేర్వేరు రాష్ట్రాల ఫుడ్ కల్చరల్, రీజనల్ ఐడెంటిటీ అని… అదెలా..?

ఆ నాలుగు డిషెస్ నాలుగు రాష్ట్రాల వారికీ సంబంధించినవే… ఏం..? నాగార్జున ఉప్మా తినడా… పెసరట్టు ఏమైనా తెలుగు యూనిక్ టిఫినా..? అసలు అదేదో సినిమాలో నాగార్జున ఉప్మా ఎలా వండాలో నేర్చుకుని, తినడానికి ఓరోజు ఆఫీసుకు బంక్ కూడా కొడతాడు…

BIGGBOSS

అలాగే వడ సాంబార్, పిట్టు (పుట్టు) కూడా… ఇవన్నీ సౌత్ వంటకాలే… ఆయా ప్రాంతాల స్పెషల్స్ ఏమీ కావు… సో, యాడ్ క్రియేటర్లు ఏదో ప్రయాసపడ్డారు గానీ నిజమైన క్రాస్ ఓవర్ యాడ్ కాదు… ఇవి నిజంగా ఆయా రాష్ట్రాల ఐకానిక్ వంటకాలేనా? పెసరట్టు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలియనిదెవరు? వడ సాంబార్ తమిళనాడుకే పరిమితమా? ఉప్మా ఒక్క తెలుగు రాష్ట్రాల పేటెంటా? పిట్టు అంటే శ్రీలంక నుంచి కేరళ, తమిళ ప్రాంతాల వరకూ కనిపించే వంటకం కాదా?

కాకపోతే ఒకే బిగ్‌బాస్, నాలుగు భాషలు, నాలుగు హౌజులు, నలుగురు హోస్టులు… కలిసి ఫుడ్ కాన్సెప్టులో యాడ్‌లో ఇమిడిపోవడం చూడ్డానికి బాగుంది… ఐనా బిగ్‌బాస్ అంటేనే లాజిక్‌లెస్ వినోదం కదా, పర్లేదు, ఇలాంటివి ఆ షోలో చూస్తూనే ఉంటాం… అరెరె, యాడ్‌లో చూపినట్టు నాలుగు షోల నడుమ క్రాస్ ఓవర్ మాత్రం ప్లాన్ చేయకండి బ్రదర్స్… కలగా‘పులగం’ అయిపోగలదు… భాషలు వేర్వేరు, అర్థం కావు… బెడిసికొట్టొచ్చు…!!

మరో నాలుగు రోజుల్లో షో లాంచ్ కదా, ఈసారి మంచి గోప్యత మెయింటెయిన్ చేస్తున్నారు… ఆల్రెడీ హౌజులోకి ఎవరెవరు వస్తారో అందరితో ఒప్పందాలు గట్రా పూర్తయిపోయి ఉంటాయి… కానీ అసలు లిస్టును ఎవరూ సరిగ్గా ఊహించలేకపోతున్నారు కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బిగ్‌బాస్ క్రాస్ ఓవర్ యాడ్ – కన్ఫ్యూజన్ ఫుడ్… లాజిక్‌లెస్ మూడ్!
  • ఏం చిల్లర గాళ్లురా మీరు..? పాకిస్థాన్ మురికి యాటిట్యూడ్ మారదు !!
  • బొద్దింకల అసలు కథ ! తెర వెనుక ఇండియా వ్యతిరేకుల ఆట !!
  • ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అదే… జో జీతా వహీ సికిందర్ ! వహీ చంద్రబాబు !!
  • ఇరుముడి, హనుమాన్ అంశ్ – మధ్యలో మరో సెన్సేషనల్ హిట్ !!
  • వామ్మో… అమ్మ గారు- ఆరు గంటలు… ఎడిటర్లకు ఓ ‘టాక్సిక్‌’ టాస్క్ !!
  • ‘నాణ్యమైన వీర్యాని’కి మస్తు గిరాకీ – ‘మంచి సంతానం’ కోసం అడ్డగోలు రేట్లు !!
  • ఆల్ ది బెస్ట్ సుజయ్ S/o ETV సుమన్… రామోజీ ఏకైక మగవారసుడు…
  • రేవంత్ రెడ్డి తిట్టాడు సరే – కానీ ఒక్క ప్రశ్నకూ జవాబివ్వలేని BRS క్యాంపు !!
  • అల్లు అరవింద్ మాటల్లో తప్పు లేదు- తను యశ్‌ను కించపరచలేదు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions