సోఫాజీ… సారీ, శివాజీ చెప్పినట్టుగా బిగ్‌బాస్ టీం తన అడుగులకు మడగులొత్తుతోంది… ఎలాగూ నాగార్జున తనకు మద్దతుగా ఉన్నందుకా..? ప్రతిసారీ శివాజీ తప్పేమీ లేదంటూ వెనకేసుకొస్తున్నందుకా..? లేక ముందే తనను విజేతగా మనసులో పెట్టుకునే తన ఎంట్రీని యాక్సెప్ట్ చేశారా..,? మరి ఎందుకు ఇన్నిరోజుల వృథా ప్రయాస..?
ఈరోజు ఏదో సందర్భంలో తనను నామినేట్ చేశారనే ఉక్రోషం పట్టలేక ‘ఇక పగులుద్ది మీకు’ అన్నట్టుగా ఏదో కూశాడు… అదీ వెటకారంగా ‘మహారాణులు, రాజమాతలు’ అని వికటాట్టహాసం చేస్తూ… మొదటి నుంచీ తను అంతే… ఆడేది లేదు, యాక్టివ్‌గా ఉండేది లేదు… ఓ గ్యాంగును వెంటేసుకుని ఎడ్డి వ్యూహాలు రచించి, ఏవో పిచ్చి సమర్థనలు చేసుకోవడం తప్ప…!
కొన్నాళ్లు ఆ చేయి పనిచేయకపోయినా సరే… నన్ను పంపించేయండి అంటాడు, బిగ్‌బాస్‌నూ నిందిస్తాడు… ఎవడినో ఒకడిని తన్ని బయటికి వెళ్తానంటాడు… ఆ పిచ్చి కూతలన్నీ నాగార్జునకు బాగున్నాయేమో, కానీ ఎప్పుడూ బెడ్ పై పడుకుని, సోఫాలో కూర్చుని తన పెత్తనాలు సాగిస్తున్న తీరు నాగార్జునకు నచ్చతుందేమో గానీ చిల్లరగా, నీచంగా ఉంది బిగ్‌బాస్… ఆమధ్య ఎవరో కంటెస్టెంట్ తనను బిజ్జాలదేవ అన్నట్టు గుర్తు…
Ads
తనకు తోడుగా తన గ్యాంగులో భోలే… ఏవో రాగాలు తీస్తాడు, ఉడుక్కుంటాడు, సూటిగా ఏదీ చెప్పలేడు… ఒర్రకు అంటాడు… పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో చెలామణీ అయిపోతున్నాడు కదా, దాన్ని చూసి భోలే నేను పాటబిడ్డను అని పదే పదే చెప్పుకుంటుంటాడు… సీరియస్‌గా ఆడాల్సిన సందర్భంలోనూ ఏవో రాగాలు… విసిగిస్తున్నాడు… యావర్ ఈవారం నామినేషన్ల సందర్భంగా అందరూ ఆశ్చర్యపోయేరీతిలో అరుపుల్లేవ్, బీపీతో ఊగిపోవడాల్లేవ్… మీదమీదకు దూసుకురావడం కూడా లేదు…
నిజంగా విసిగించే మరి రెండు కేరక్టర్లు అశ్విని, రతిక… అశ్విని మరీనూ… తనకు ఏమీ అర్థం కాదు, ఒకరు చెప్పేది అర్థం చేసుకోదు, పెద్దగా నోరు వేసుకుని అరవడం… నామినేషన్ల సందర్భంలో నిజంగానే బీపీ పెరిగి కింద పడిపోతుందేమో అనిపించేలా అరిచింది… బాగా చిరాకెత్తిస్తోంది… ప్రియాంక, శోభాశెట్టి దోస్తులు కాబట్టి, వాళ్లు తెలివిగా నామినేషన్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు కలిసి… అమర్‌దీప్‌ను సేవ్ చేశారు… శివాజీని, భోలేను, యావర్‌ను, అంటే శివాజీ గ్యాంగును బుక్ చేశారు… రతికను ఫిక్స్ చేశారు… అలాంటప్పుడు అశ్విని, రతిక జాగ్రత్తగా అడుగులు వేయాల్సింది… ఆ సోయి లేదు ఇద్దరికీ… ఇంకోవైపు టీవీ సీరియల్స్ బ్యాచ్ చాలా తెలివిగా ప్లే చేస్తోంది… ప్రియాంక, శోభ, అమర్‌దీప్ ప్లస్ అర్జున్…
అసలే బయటికి వెళ్లి మళ్లీ వచ్చింది రతిక… శివాజీ గ్యాంగు కాళ్లావేళ్లా పడి… దాసోహం అయిపోయింది… కానీ ఆట మారలేదు, తనకు ఆట చేతకాదు… పైగా మొన్న నామినేషన్లలో ఉండి, ఒక్కొక్కరినే సేవ్ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది… తనను మినహాయించాలంటూ నాగార్జునకు మొరపెట్టుకుంది… ఎలిమినేషన్ల చివరి దశలో నాగార్జున చేసేదేముంది..? తేజా నయం… నవ్వుకుంటూ హౌజు నుంచి వెళ్లిపోయాడు… చాలా కూల్‌గా… ఏ ఉద్వేగం లేదు, నటన లేదు, ఓవరాక్షన్ లేదు… రతికది హౌజులోకి అనవసర రీఎంట్రీ… దామిని, సందీప్ వంటి కేరక్టర్లు బెటర్… ఈసారి నామినేషన్ల ఎపిసోడ్‌లో అందరికన్నా కూల్‌గా మొత్తం తమాషా చూస్తూ కూర్చున్నది అర్జున్… తెలివైన ప్లేయర్..!!
Share this Article