Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తమిళ కార్తీకదీపం ! స్టాలిన్ బాటలో విజయ్ ! సుప్రీంలో తొలి ఎదురుదెబ్బ !!

August 4, 2026 by M S R

.

మీకు గుర్తుంది కదా… తమిళనాడులోని మదురై జిల్లా, తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే వివాదం… నిరభ్యంతరంగా కార్తీకదీపం వెలిగించుకోవచ్చునని చెన్నై హైకోర్టు తీర్పు చెబితే, ఆ తీర్పు చెప్పిన జస్టిస్ స్వామినాథన్ మీద ఏకంగా అభిశంసనకు ప్రయత్నించింది సోకాల్డ్ యూపీఏ కూటమి… (కూటమి మొత్తం ఇలాంటి పార్టీలే కదా)…

తమిళనాడులోని అప్పటి యాంటీ హిందూ ప్రభుత్వం ఆ తీర్పు అమలు చేయకుండా, మొండికేసింది… అంతేకదా… తమిళ డీఎంకే గానీ, కేరళ లెఫ్ట్ గానీ అర్జెంటుగా అప్పటికప్పుడు శబరిమలలో రుతమహిళల్ని ప్రవేశపెట్టడానికి త్వరపడతాయి గానీ కార్తీకదీపం వాటికెందుకు..?

Ads

అప్పట్లోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కింది… తరువాత డీఎంకే కూలిపోయింది… టీవీకే విజయుడు వచ్చాడు… తను కూడా యాంటీ హిందూయే కదా… పాత డీఎంకే బాటలోనే అదీ…

హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాలని… తమిళనాడు ప్రభుత్వం మళ్లీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జనవరిలో హైకోర్టు తీర్పు వెలువడితే.. దానిపై అప్పీల్ చేయడానికి జూన్ వరకు ఎందుకు ఆగిపోయారని తమిళనాడు ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది…

Thiruparankundram

విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 11న ఈ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. మదురై జిల్లా కలెక్టర్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తమిళనాడు వక్ఫ్ బోర్డు, సికిందర్ బాదుషా దర్గా మేనేజ్మెంట్, ఒరిజినల్ పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది.

ఈ కేసు గురించి సంక్షిప్తంగా మరోసారి… మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండ అడుగున సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. అదే కొండపై సికిందర్ బాదుషా దర్గా కూడా ఉంది. ఆ దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న పురాతన రాతి స్తంభంపైన ‘కార్తీక దీపం’ వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు భక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తగిన భద్రత మధ్య దీపం వెలిగించుకోవచ్చని 2025 డిసెంబర్ లో తీర్పు చెప్పింది. జనవరి 6న డివిజన్ బెంచ్ కూడా ఈ తీర్పును సమర్థిం చింది. దీపం వెలిగించడం వల్ల దర్గా హక్కులకు ఎలాంటి భంగం కలగదని.. లా అండ్ ఆర్డర్ సమస్యలు రావని స్పష్టం చేసింది.

పర్యావరణం, వారసత్వ సంపద రక్షణ, భద్రత కారణాల దృష్ట్యా అక్కడ దీపం వెలిగించడాన్ని అనుమతించబోమని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొండపై దర్గాకు సమీపంలో దీపం వెలిగించడం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని వాదిస్తోంది…

ఆ నిర్దిష్ట రాతి స్తంభంపై దీపం వెలిగించినట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని.. ఆ ఆచారం వేరే చోట ఉండేదని ప్రభుత్వం ఏవేవో సాకులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో తదుపరి విచారణ మరింత ఆసక్తికరంగా మారింది… సో, విజయ్, ఇప్పుడు నీ స్టాండ్ ఏమిటి..? స్టాలిన్ భాషే నీ భాషా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!
  • ANR – VaniSri – తెలుగు వెండి తెరపై ఓ సూపర్ హిట్ పెయిర్ !
  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions