Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుకున్నదే – ‘జన్వాడ క్విడ్ ప్రోకో’ యవ్వారంపై బీఆర్ఎస్ వితండవాదన

July 9, 2026 by M S R

.

అనుకున్నదే… కాస్త ఆలస్యం అయింది… హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో కట్టిన బ్లిస్ అనబడే భారీ ప్రాజెక్టుకు మద్దతుగా గులాబీ శిబిరం రంగంలోకి దిగి అడ్డగోలు సమర్థనకు, వితండవాదానికి దిగుతుందని ఊహించిందే… అలాగే దిగింది…

ఇక్కడ చిన్న ప్రశ్న… జన్వాడ ఫామ్‌ హౌజుకు, ఈ బ్లిస్ అక్రమ ప్రాజెక్టు అనుమతులకూ నడుమ క్విడ్ ప్రోకో ఉందని కదా నిన్న మొత్తం వార్తలు సర్క్యులేటయ్యాయి… ఆ జన్వాడ ఫామ్ హౌజు పేరుకు సదరు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ ఓనర్ పేరుతోనే ఉంటుంది… కానీ కేటీయార్ అనుభవిస్తుంటాడు… పైకి మాత్రం అబ్బే, అది నాదు కాదు అంటాడు…

Ads

ఇప్పుడు సదరు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు మద్దతుగా పింక్ క్యాంపు రంగంలోకి దిగి సపోర్టుగా ప్రాపగాండాకు దిగిందంటే… దాని అర్థం ఏమిటి..? ‘‘అది మన కేటీయార్ జన్వాడ ఫామ్ హౌజుతో లింకున్న బ్లిస్ ప్రాజెక్టు, సో, మనం సపోర్ట్ చేయాలి’ అనే కదా… స్పష్టంగా బయటపెట్టుకుంటున్నారు బీఆర్ఎస్ క్యాంపెయినర్లు…

ప్రదీప్

సరే, వాళ్ల జస్టిసిఫికేషన్ ఏమిటో తెలుసా..? ‘‘ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ మీద హైడ్రాను ఉపయోగించి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఎఫ్‌టీఎల్ పరిధిలో లేకపోయినా మార్కింగ్ చేసి బెదిరిస్తున్నారుు… పక్కన ఉన్న మూడు రియల్ ఎస్టేట్ నిర్మాణాలకు మినహాయింపు దేనికి మరి..? పక్కన ఉన్న పార్క్ హోటల్‌కు మినహాయింపు దేనికి? మరి అక్కడే ఉన్న నెక్లెస్ రోడ్డు, వందేళ్ల క్రితం వేసిన రైల్వే లైన్, ఇంటర్నల్ రోడ్డు అన్నీ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయా?

ప్రదీప్

ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కన్నా ముందున్న బీఎస్ మక్తా పేదల కాలనీలో 20,000 మంది నివాసం. మరి వాళ్ల ఇండ్లు కూలుస్తారా? గతంలో దొంగతనంగా ప్రదీప్ రెడ్డి గెస్ట్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసి అరెస్ట్ అయిన రేవంత్. పాత పగ తీర్చుకోవడానికే ఇప్పుడు బిల్డింగ్ పూర్తయ్యాక అనుమతులు రద్దు…’’ ఇదీ బీఆర్ఎస్ వాదన…

janwada

ఈ క్యాంపు మరిచిపోయిన నిజం ఏమిటంటే..? హైడ్రా మాత్రమే కాదు, ఇరిగేషన్, రెరా, జీహెచ్ఎంసీ, కలెక్టరేట్ అన్నీ అవి అక్రమ నిర్మాణాలేనని తేల్చేశాయి… పైగా పక్కన ఉన్న నిర్మాణాలతో పోలిక… అంటే, వాళ్లూ దొంగలే, మేం దొంగతనం చేస్తే తప్పేముంది అనే వితండవాదం… అన్నింటికీ మించి మక్తా పేదలకు ముందు పెట్టుకుని షీల్డ్ తీసుకోవడం!

ప్రదీప్

సో, నెక్లెస్ రోడ్డు, రైల్వే లైన్ అవే పరిధిలో ఉన్నాయి కాబట్టి… మన ప్రదీపుడు కూడా దొరే… శుద్ధపూసే అంటోంది బీఆర్ఎస్… పైగా ‘‘ఆరేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభమై, 17 ఫ్లోర్లు నిర్మాణం పూర్తయ్యాక, ఇప్పుడు దాని అనుమతులు రద్దు చేస్తున్నారు’’ అంటోంది… అసలు అనుమతులేవీ లేవని కదా ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు! నిర్మాణం ప్రారంభమై, పూర్తయ్యాక ఇక అనుమతులు అక్కర్లేదా..? దాంతో రెగ్యులరైజ్ అయిపోయినట్టేనా..? అందుకే వితండవాదం అనేది!!

బ్లిస్

దాని పక్కనే మరో మూడు పెద్ద అపార్ట్‌మెంట్లున్నాయి, మరి వాటి సంగతేమిటి అంటూ వాళ్లను ఈ వివాదంలోకి లాగుతున్నారు…

‘‘ఇదే రోడ్డు మీద ఉన్న 200 ఇండ్లు, అపార్ట్మెంట్లు, అన్నీ సక్రమమేనట. కానీ ఇదొక్కటే భవంతి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందట. ఇదీ హైడ్రా అధికారుల వింత వాదన…’’ అంటోంది బీఆర్ఎస్… రేపు మక్తాలో పేదల ఇళ్లనూ కూల్చేస్తారు అని ఓ సెంటిమెంట్ ఎగేసి, వాళ్లను ఉసిగొల్పే ప్రయత్నం… అసలు హైడ్రా ఆఫీసు ఉన్న బుద్ధభవన్ కూడా ఎప్‌టీఎల్ పరిధిలో ఉందని మరో ప్రచారం…

సో, కేటీయార్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు క్విట్ ప్రోకో కింద ఇచ్చిన అనుమతులన్నీ రేవంత్ రెడ్డి అర్జెంటుగా రెగ్యులరైజ్ చేయాలా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions