. రాజస్థాన్- లక్నో మ్యాచా..? అబ్బే, ఏం చూస్తాంలే అనుకుని చానెల్ స్కిప్ చేయబోతుటే… కామెంటేటర్ అరుపులు విని ఒక్కక్షణం రిమోట్ దానంతటదే ఆగిపోయింది… ఇక కాసేపు అలా టీవీ నడుస్తూనే ఉంది… కారణం :: ఆ కుర్రాడు… జస్ట్, వాడి వయస్సు 14 ఏళ్లు… అవును, చుట్టూ వేల జనం, సీనియర్ ప్లేయర్లు, జట్టు పెట్టుకున్న నమ్మకం తాలూకు ఒత్తిడి… ఓ ఫాస్ట్ బౌలర్ నేర్పుగా విసిరిన బంతిని అలా సిక్స్ బాదాడు… జనంలో కేకలు… […]
ఆ నలుగురూ ఎవరూ రారు… లేరు… ఆ ఒక్కడే తోడు, ఆత్మబంధువు…
. మన చుట్టూ ఫుల్లు నెగెటివిటీ… దీనికితోడు ప్రధాన రాజకీయ పార్టీలు క్షుద్ర డిజిటల్ పొలిటికల్ క్యాంపెయిన్లతో వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తున్న నేపథ్యంలో… మీడియాలో కాస్తో కూస్తో పాజిటివిటీ వైబ్స్ వ్యాపింపజేసే కొన్ని వార్తలైనా అవసరం… ఇది అలాంటి వార్తే… బాగా నచ్చింది… అన్నీ ఉన్నవాడు సాయం చేస్తే దానికి పెద్ద విశేషం ఉండదు… ఔదార్యం వరకూ వోకే… కానీ ఏమీ లేనివాడు, రెక్కాడితే గానీ డొక్కాడనివాడు నిజంగా సొసైటీకి సేవ చేస్తే, అదీ మనం […]
బస్తీమే సవాల్… కుస్తీ బరిలో దిగితే చాలు ఎవడైనా తలవంచాల్సిందే…
. ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గానీ… సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే కథ చాలా ఫేమస్ ఒకప్పుడు… కాంతారావు హీరోగా 1960 ప్రాంతంలో ఓ సినిమా కూడా వచ్చినట్టు గుర్తు… కథానాయిక తన అందాన్ని మోహించి, తనను పెళ్లాడటానికి వస్తే, వాళ్లకు పరీక్షలు పెట్టి, ప్రశ్నలు వేసి, ఓడిపోగానే శిరస్సులు ఎగురగొడుతుంది… మహామహులే వచ్చి ఓడిపోయి, ఆ శిక్షకు గురవుతారు… అదీ కథ… సరే, మనం ఓ కథలోకి వెళ్దాం… 1940, 50 ప్రాంతం… […]
లేటుగా పత్రికాఫీసుకు వెళ్లి తన ప్రసంగవార్త రాసిచ్చి వెళ్లాడు నెహ్రూ..!!
. మనవాడు, మహ గట్టివాడు మానికొండ చలపతిరావు ———————————————– A Father figure in Indian Journalism ———————————————– 1983 మార్చి 25వ తేదీ… సాయంకాలం. ఢిల్లీలో అలవాటు ప్రకారం ఈవెనింగ్ వాక్ కి వెళుతున్నారో పెద్దాయన. అది కాకానగర్. అక్కడ చాయ్ తాగడం ఒక పాత అలవాటు. వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ పెట్టే యాదవ్ సింగ్ పెద్దాయన్ని చూసి కిచెన్ లోకి వెళ్ళాడు. కుర్చీలో పెద్దాయన ఒక పక్కకి వాలిపోయాడు. అది చూసిన అక్కడి […]
తెల్ల చీరెలో టెన్నిస్ ఆట… అసలు ఎవరు ఈ మెహర్బాయ్ టాటా..!?
. నూరు సంవత్సరాల క్రితం, టెన్నిస్ ఆటను మహిళలు పరిశుభ్రమైన తెల్లని స్కర్ట్లు మరియు టీ-షర్టులలో ఆడుతుంటే…, ఒక భారతీయ మహిళ తెల్లని సాంప్రదాయ చీరె ధరించి ఆ ఆటను ఆడింది… స్పూర్తిదాయక విజయాల్ని కూడా పొందింది… ఆమె పేరు మెహెర్బాయ్ టాటా… పార్సీ శైలిలో చీరె ధరించినప్పటికీ, ఆమె కోర్టు మీద అద్భుతమైన చురుకుదనాన్ని ప్రదర్శించింది. భారతదేశంలోని వివిధ టోర్నమెంట్లలో ఆమె 60 కంటే ఎక్కువ బహుమతులను గెలుచుకుంది. మెహెర్బాయ్ 1879 అక్టోబర్ 10న బొంబాయిలో […]
ఓ దినకూలీ కొడుకు… అవమానం నుంచి ఐఏఎస్ సాధన దాకా…
. ( రమణ కొంటికర్ల ) ……. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిందనే పాప్యులర్ కోట్ ను మనం ఈమధ్య తరచూ వింటూనే ఉన్నాం. కానీ, ఒక్క అవమానం జీవితాన్ని మార్చేసిందనేది ఈమధ్య విన్నామా..? అలాంటి కథే హేమంత్ ది. ఓ కూలీ కొడుకు ఐఏఎస్ ఎలా అయ్యాడు.. ఎందుకు తనకు కలెక్టర్ కావాలనిపించిందో చెబుతుందీ కథ. ప్రముఖ పారిశ్రామికవేత్త.. తెలంగాణా రాష్ట్ర స్కిల్ యూనివర్సిటీ పర్యవేక్షకుడు ఆనంద్ మహీంద్రా తన X ఖాతాలో చేసిన పోస్టుతో.. అవమానం […]
భారత జాతి సంస్మరించాల్సిన ఓ జపానీ యువతి… చదవాల్సిన చరిత్ర…
పదే పదే మనం మన చరిత్ర పుస్తకాల్లో కొందరి స్వాతంత్ర్య సమరయోధుల కథలే చదువుతున్నాం… కానీ తమ ప్రాణాలకు తెగించి, విదేశాల్లో ప్రవాసంలో ఉంటూ దేశమాత సేవలో పునీతులైన ఎందరి కథల్నో మన చరిత్ర పుస్తకాలు మనకు చెప్పడం లేదు… అంతేకాదు, మనవాళ్లను పెళ్లి చేసుకుని, తమ జీవితాల్ని భరతమాత పాదాల వద్ద అర్పించిన విదేశీయుల కథలూ ఉన్నయ్… కానీ ఇన్నేళ్లూ వాటిని మన పిల్లలకు చెప్పినవాడెవ్వడు..? టోసికో… ఈమె కథ ఖచ్చితంగా చదవదగ్గది… భర్త పేరు […]
ఎలుక బొరియల టెక్నిక్… ఓ చిన్నపాటి అద్భుతాన్ని చూపించింది…
. Rat Hole – Real Heroes: ఉత్తరాఖండ్ ఉత్తరకాశిలో సొరంగం దారి నిర్మాణ కార్మికులు 41 మంది సొరంగం తొలుస్తూ…17 రోజులు అందులోనే చిక్కుబడిపోయారు. చివరికి అద్భుతం జరిగి అందరూ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. వారి ప్రాణాలను రక్షించడం కూడా రాజకీయం కావడం దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఆ చర్చ ఇక్కడ అనవసరం. పైనుండి కొండను నిలువుగా తొలిచే వెర్టికల్ డ్రిల్లర్లు, రాతిని, మట్టిని తొలిచే హారిజాంటల్ డ్రిల్లర్లు, అప్పటికప్పుడు విదేశాల నుండి తెప్పించిన బాహుబలి అత్యాధునిక […]
అమ్మా… ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి… నేనొక ముష్టివాడిని…
ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒక రోజు ఒక ఇంటి వద్ద భవతీ భిక్షాం దేహి, మాతా! అన్నపూర్ణేశ్వరీ అని అడిగాడు. ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగు మీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించలేదేమో!! అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ “భవతీ భిక్షాం దేహి, మాతా! అన్నపూర్ణేశ్వరి” అని అన్నాడు. పండితుడికి కోపం వచ్చింది. నేనిక్కడ ఉంటుండగా నాతో మాట్లాడకుండా, నాకు చెప్పకుండా […]
ఓ పాత పరుపు, 4 వంటపాత్రలు… బయటపడేసి బజారులో నిలబెట్టాడు ఓనర్…
. అనామకంగా… ఓ సాదాసీదా అపార్ట్మెంట్… ఒక్కడే బతుకుతూ ఉండేవాడు… నియమబద్ధ జీవితం… మధ్యతరగతి జీవనం… ఎవరి మీదా ఆధారపడి బతకడం ఇష్టం లేదు… ఓనర్ తరచూ విసుక్కునేవాడు… అద్దె సరిగ్గా కట్టడం లేదంటూ నిందించేవాడు… ఇల్లు ఖాళీ చేసి, వెళ్లిపో అని అరిచేవాడు… ఆయన మౌనంగా భరించేవాడు, మీ అద్దె అణా పైసలతో సహా చెల్లిస్తాను అని చేతులెత్తి ఓ దండం పెట్టేవాడు… డబ్బు ఎక్కడ ఎలా కాస్త అడ్జస్టయినా ముందుగా అద్దె కట్టేవాడు… ఐనా […]
ఈమె ఎవరు..? హిమాలయాలకు ఏం లాక్కొచ్చింది..? ఏం కట్టిపడేసింది..?
. అదుగో ఆ ఆశ్రమంలో స్వామి రేపిస్ట్… ఇదుగో ఈ ఆశ్రమంలో అంతా వ్యభిచారం… కబ్జాలు, వసూళ్లు, పాదపూజలు, కుట్రలు… అన్నీ అక్రమాలే… కేసుల నమోదు… అరెస్టు… బెయిల్ నిరాకరణ… ఎన్ని వార్తలు చదివాం, చదువుతూనే ఉన్నాం..? అసలు ఒక ఆశ్రమం అనగానే ఓ నెగెటివిటీ ధ్వనించేంతగా మీడియా ప్రసారం… ప్రచారం… పోలీసు కేసులు… వాటికితోడు రాజకీయ నాయకులతో అక్రమ బంధాలున్న కార్పొరేట్ సన్యాసులు సరేసరి… నిజానికి కొన్ని వేల ఆశ్రమాలున్నయ్ ఈ దేశంలో… హిమాలయ ప్రాంతాల్లో […]
ఆ ముగ్గురూ… ఒకే ఊరు, ఒకే బడి, ఒకే తరగతి, ఒకే కులం… కానీ దారులు..?!
. ముందుగా ఓ కథ చదవండి… 2017 నుంచి రకరకాల సైట్లలో, సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా సర్క్యులేటయింది… ఇప్పటికీ షేర్ అవుతూనే ఉంటుంది… డెస్టినీ అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి దీన్ని ఉదహరిస్తుంటారు… చదువు, సంపద, హోదా, వారసత్వం, సపోర్ట్ ఏమున్నా సరే, పిసరంత అదృష్టం, కర్మఫలం బాగుంటే విజయం వెంట ఉంటుందని చెప్పడానికి ఈ కథను వివరిస్తుంటారు… ఆ కథేమిటంటే..? ఒక పిల్లవాడు… బ్రిలియంట్… బడిలో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్… ప్రతి పరీక్షలో టాపర్… […]
గ్రేట్ ఫాదర్..! కొడుకు కోసం నమ్మలేని అద్భుతం సాధించిన తండ్రి ప్రేమ..!!
. కొన్ని అద్భుతాలు అంతే..! ఆ అద్భుతాల వెనుక అంతులేని మానవప్రేమ… గాఢమైన అనుబంధం… సాహసం…! యాదృచ్ఛికమో, దైవసంకల్పమో, మానవప్రయాసో, కాకతాళీయమో… కొన్ని నమ్మలేని అద్భుతాలు వినిపిస్తయ్, కనిపిస్తయ్, నిబిడాశ్చర్యంలో ముంచేస్తయ్… ఇదీ అంతే… అప్పట్లో చాలా ఏళ్ల క్రితం తెలుగులో పాపులర్ నవల పాఠకుల్ని ఉర్రూతలూగిస్తున్న కాలం అది… యండమూరి వీరేంద్రనాథ్ ఓ వీక్లీలో ప్రార్థన అనే సీరియల్ రాస్తుండేవాడు… (ఏదో ఇంగ్లిష్ నవల నుంచి ఆ ప్రార్థన నవల ఇతివృత్తం తీసుకున్నట్టు రచయిత కూడా […]
ఇజ్రాయిల్ అంటే అంతే..! నో కాంప్రమైజ్..! ఈ థ్రిల్లర్ ఓసారి చదవండి..!
. ముందుగా వాట్సప్ గ్రూపుల్లో బాగా సంచరిస్తున్న ఒక పోస్టులోని ఒక భాగాన్ని తీసుకుందాం… అది ఇజ్రాయిల్‌కు అనుకూలంగా బీజేపీ సోషల్ బ్యాచ్ పుష్ చేస్తున్న పోస్ట్… బాగానే వైరల్ అవుతోంది… అయితే ఆ మొత్తం పోస్టు గాకుండా… అందులో ఒక స్టోరీని తీసుకుందాం… ఇజ్రాయిల్ ధోరణి స్థూలంగా ఎలా ఉంటుందో ఈ కథ మనకు చెబుతుంది… ఈ కథ పేరు ‘ఆపరేషన్ థండర్ బోల్ట్’… అయితే ఈ వైరల్ కథలో లేని కొన్ని ఫినిషింగ్ టచెస్ […]
అర్ధరాత్రి… ఆ రద్దీ బోగీలో ఓ రోగి విలవిల… ఎదుటి బెర్తులో ఓ పెద్దాయన…
. నేను చెన్నైలో పనిచేస్తూ ఉండేవాడిని… నా పూర్వీకుల ఇల్లు భోపాల్‌లో… నాన్న అక్కడే ఉండేవాడు… హఠాత్తుగా ఓరోజు పబ్లిక్ కాల్ ఆఫీస్ నుంచి నాన్న కాల్ చేసి, వెంటనే ఇంటికిరా అన్నాడు… నాకిక్కడ అర్జెంటు పని ఉంది అని చెప్పేలోపు కట్ చేశాడు… అప్పటికప్పుడు బ్యాగు సర్దుకుని రైల్వే స్టేషన్ చేరుకున్నాను… బుకింగ్ లేదు, రిజర్వేషన్ లేదు… వేసవి సెలవులు కదా, ఏ రైలు చూసినా ఫుల్లు రద్దీ… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ మీద […]
మొగుడు తొమ్మిదేళ్లు పెద్ద… పైగా టీబీ… నాలుగో పెళ్లాం… చదవాల్సిన లైఫ్…
ఉమ… ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో… కోయంబత్తూరు… తండ్రి బాలకృష్ణన్, తల్లి తంకమణి… తండ్రి తన యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ ఒక సంవత్సరం చదివి, వదిలేసి, వద్దులే అని తండ్రి చెప్పగానే తిరిగి వచ్చేశాడు… ఓ డాక్టర్ దగ్గర కంపౌండర్‌గా కూడా చేరాడు… అప్పట్లో అల్లోపతిని ఎవరూ పట్టించుకునేవారు కాదు… సైకిల్ మీద డాక్టర్, కంపౌండర్ ఊరంతా తిరిగేవారు రోగుల కోసం… ఇది జరిగే పని కాదని ఏదో మిల్లులో చేరాడు… అక్కడ రిసెప్షనిస్టుగా చేరిన తంకమణిని పెళ్లిచేసుకున్నాడు… బిడ్డ […]
ధన్యజీవి..! అత్యంత అరుదైన రక్తంతో లక్షల శిశువులకు ప్రాణదానం..!
. నిన్న ఇంగ్లిషు మీడియాలో కనిపించిన ఈ వార్త ఆసక్తికరంగా ఉంది… “గోల్డెన్ ఆర్మ్ మ్యాన్” గా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియన్ రక్తదాత జేమ్స్ హారిసన్ 88 సంవత్సరాల వయస్సులో కన్నుమూశాడు… ఫిబ్రవరి 17న NSW సెంట్రల్ కోస్ట్, ఆస్ట్రేలియాలోని పెనిన్సులా విలేజ్ నర్సింగ్ హోమ్‌లో ఆయన మరణించినట్టు ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ లైఫ్ బ్లడ్ ధృవీకరించింది…. ఇదీ వార్త… అసలు ఎవరాయన..? ఎందుకు తన గురించి చెప్పుకోవాలి…? ఇదీ అసలు ప్రశ్న… సింపుల్‌గా చెప్పాలంటే ఈయన అరుదైన […]
దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు…
. 1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది… అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్… ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి… జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు… ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు… ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు […]
Take A Bow… ఎంత మంచివాడవురా… ఎన్ని నోళ్ల పొగుడుదురా…
. ( రమణ కొంటికర్ల )… మనం చూసిన అతి పెద్ద విపత్తుల్లో కరోనా ఒకటైతే.. సునామీ మరొకటి. అలాంటి సునామీ నుంచి బతికి బట్టకట్టిన ఓ అమ్మాయికి.. నాటి సునామీ సమయంలో ఎందర్నో మృత్యుఒడి నుంచి తప్పించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇటీవలే పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగేవరకూ ఆ ఐఏఎస్ అధికారి దంపతులే ఆ అమ్మాయికి గాడ్ ఫాదర్, మదర్ గా నిల్చారు. ఆ కథ వినాలంటే ఓసారి నాగపట్నంలో నాటి సునామీ కాలం 2004కు […]
మహిళా స్పూర్తి..! సముద్రపు ఆ అంచు టచ్ చేసిన నేవీ కమాండర్స్..!
. ( రమణ కొంటికర్ల ) .. ….. సంద్రపు చివరి అంచును చుట్టివచ్చిన సాహస వనితలు.. ఆ కమాండర్స్! . ఇద్దరు భారత నేవీ మహిళా అధికారులు అద్భుతమైన ఫీట్ సాధించారు. భూమిపైనే చివరి ప్రాంతమైన మిస్టీరియస్ ఏరియా.. పాయింట్ నెమోను చుట్టిరావడమే వారు సాధించిన ఘనత. సముద్రంలో చివరి సరిహద్దు వరకు వెళ్లడమే తప్ప.. ఆ సరిహద్దు ఆవలికి వెళ్లి ఆ అంచుల్లోని మారుమూల ప్రాంతాలను చుట్టిరావడం పూర్తిగా సాహసోపేతమైన, ఓపికతో కూడిన […]
- 1
- 2
- 3
- …
- 13
- Next Page »