. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సంక్రాంతి ఉత్సవం నిర్వహించాడు ఢిల్లీలోని తన నివాసంలో… గ్రామీణ కళాకారులను పిలిచాడు… మోడీ, ఇతర మంత్రులు, తెలంగాణ -ఏపీ నాయకులు, గవర్నర్లు, పార్టీ ఎంపీలు తదితరులు హాజరయ్యారు… గుడ్, గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇలాంటి తెలుగు ఆతిథ్యాలను ఇచ్చేవాడు… తులసి పూజ చేశాడు మోడీ… గంగిరెద్దుకు ఫుడ్ తినిపించాడు… మంగళదీపం వెలిగించాడు… అక్కడ ఎవరో ఏదో చెబితే అదే తెలంగాణ సాంస్కృతిక […]
తెలుగు రాజకీయాల్లో ఓ వింత పాత్ర… విఫల, విద్వేష బాటసారి…
. తెలంగాణను బలంగా వ్యతిరేకించిన వైఎస్ బతికి ఉన్నా సరే రాష్ట్ర విభజన జరిగేది… 2009లోనే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది… … ఇదీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజా వ్యాఖ్య… విజయవాడలో జరిగిన ఏదో ఆత్మీయ సమావేశంలో చెప్పాడట నిన్న… అప్పట్లో ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీ విప్… సో, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అని ఓ తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా వైఎస్ ఈయన్ని అడిగితే… వ్యతిరేకించి, ఇలా అయితే ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పాడట… హైకమాండ్ నిర్ణయం […]
కంట్రీ డిలైట్ మిల్క్ రేటు… అచ్చం జియో మొబైల్ టారిఫ్ ప్యాకుల్లాగే…
. బిగ్‌బాస్ షో చూసినవాళ్లకు గుర్తు… హౌజులో చిరంజీవి బొమ్మతో, కంట్రీ డిలైట్ అనబడే పాల ప్యాకెట్ల యాడ్… బయట కూడా బాగానే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు… కానీ అదే బిగ్‌బాస్ షోలో మణికంఠ అనే ఓ మెంటల్ కేరక్టర్ పాల్గొన్నాడు… మధ్యలోనే చేతులెత్తేసి, కాడికిండ పడేసి, పారిపోయి వచ్చాడు… చివరకు తను కూడా ఈ మిల్క్ యాడ్‌లో కనిపించాడు ఎక్కడో… అబ్బో, చిరంజీవి రేంజ్‌కు ఎదిగిపోయాడే అనుకుంటూ… యాడ్ చూస్తుంటే నాలుగు ఆర్డర్ ఇస్తే నాలుగు ఫ్రీ […]
సరస్వతి నది అంతర్వాహినిగా కాళేశ్వరం దగ్గర ప్రవహిస్తోందా…!!
. సరస్వతి నది… అదెక్కడ ఉంది..? ఇప్పుడు లేదు… ఎక్కడో ఉత్తర భారతంలో ఉండేది గతంలో అని చదువుకున్నాను… ఇప్పుడది అంతర్వాహిని అని కూడా చెబుతుంటారు… మొన్న ఓ బోర్ తవ్వుతుంటే పెద్ద ఎత్తున ప్రవాహం బయటపడింది… అదే సరస్వతి ఆనవాళ్లు అని చెప్పినవాళ్లూ ఉన్నారు… కాదు, అదొక పూర్వకాలం నాటి సముద్రం ఆనవాళ్లు అన్నవాళ్లూ ఉన్నారు… ఏమో… నిజమేమిటో తెలియదు… ఇప్పుడు తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాళేశ్వరం దగ్గర పుష్కరాల్ని నిర్వహిస్తారట… మంత్రి శ్రీధర్ బాబు […]
ఆ సంపన్ననగరం ఇంకా పొగలు రేగుతున్న ఓ బూడిదకుప్ప…
. లాస్ ఏంజిల్స్… హాలీవుడ్ ప్రముఖులతోపాటు సొసైటీని ప్రభావితం చేయగల హైప్రొఫైల్ వ్యక్తుల ఇళ్లు తగులబడిపోయాయి… ఆ సంపన్ననగరం ఇప్పుడు పొగలు రేగుతున్న ఓ బూడిదకుప్ప… నామరూపాల్లేకుండా కాలిపోయింది… పునరుద్ధరణ అసాధ్యం అనిపించేలా…! 12 లక్షల కోట్ల నష్టం అని ఓ ప్రాథమిక అంచనా… ఇంకా ఎక్కువే ఉండొచ్చు… 40 వేల ఎకరాల మేరకు కార్చిచ్చు కాల్చేసింది… 10 వేల ఇళ్లు బూడిదయ్యాయి… 2 లక్షల మంది ఇళ్లు లేనివారయ్యారు… భవిష్యత్ ప్రమాదాల్ని ఊహించి మరో 2 లక్షల […]
3 రోజుల్లో కోటిన్నర దర్శనాలు… మేడారం చూసి నేర్చుకొండి సార్…
. కన్నెకంటి వెంకటరమణ ….. తిరుపతి విషాద సంఘటన… మేడారం జాతర అనుభవాలు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం, పదుల సంఖ్యలో క్షతగాత్రులు అయ్యారనే వార్తలతో దేశం మొత్తం నివ్వెర పోయింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా, ప్రతీ రోజూ లక్షల సంఖ్యలో భక్త జనులు వెంకన్న దర్శనానికి వస్తున్నా, ఏవిధమైన లోటు, ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మంచి పేరుంది. టిటిడి చేసే ఏర్పాట్లపై దేశంలోని పలు ప్రముఖ […]
పీకే సారీ సబబే..! తిరుపతి తొక్కిసలాటపై ఓ డిఫరెంట్ వెర్షన్..!
. నేను సారీ చెప్పాను కదా… మీరెందుకు జనానికి సారీ చెప్పరు…? అని దబాయించి మరీ అడుగుతున్నాడు పవన్ కల్యాణ్… ఎవరిని..? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని, ఈవో శ్యామలరావును, డిప్యూటీ ఈవో వెంకన్న చౌదరిని…! ఎవరో అడిగారని క్షమాపణలు చెప్పాలా..? సారీ చెబితే చచ్చిపోయినవాళ్లు బతికొస్తారా..? అంటూ పెడసరంగా మాట్లాడుతున్నాడు చైర్మన్ నాయుడు… మళ్లీ పవన్ కల్యాణ్‌తో గోక్కోవడం ఎందుకులే అనుకుని, అబ్బే, నేను పవన్ కల్యాణ్ గురించి కాదు అని తనే ఖండించుకుంటాడు… ఐనా […]
ఆమెను చంపేశారు… 20 ఏళ్లుగా అయిపూజాడా లేరు… సీన్ కట్ చేస్తే…
. 2005… ఆమె పేరు రంజని… కేరళలోని ఓ ఊరు… దివిల్ అని ఆ ఊరివాడే… యవ్వనం, ఆకర్షణ… వాడేవో మాయమాటలు చెప్పాడు… లొంగదీసుకున్నాడు… అనుభవించాడు… ఆమెకు గర్భం… ఇది తెలియగానే దివిల్ ఆ ఊరు వదిలేశాడు… పఠాన్‌కోట్ ఆర్మీ ఏరియాలో తేలాడు… ఆమె గర్భానికీ నాకూ ఏ సంబంధమూ లేదని బుకాయించాడు గ్రామస్థులు వెళ్లి అడిగితే… ఆమెకు ఏం తోచాలో తెలియడం లేదు… ఈలోపు రాజేష్ అనే మరో వ్యక్తి అనిల్ కుమార్ పేరుతో పరిచయం […]
యుద్ధ దేశాలకు అమెరికా సాయంలో కూడా స్కాములు…
. . ( పార్థసారథి పొట్లూరి ) .. …. లారా కూపర్ – Laura Cooper! డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అఫ్ డిఫెన్స్ రష్యా, ఉక్రెయిన్, యురేసియాలకి కో ఆర్డినేటర్ గా పెంటగాన్ లో పనిచేస్తున్నది గత 20 ఏళ్లుగా! ఈ లారా కూపర్ రాజీనామా చేసింది! కో ఆర్డినేటర్ అంటే రష్యా, ఉక్రెయిన్, యూరోప్, ఆసియాలతో సంప్రదింపులు జరపడం! మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో అంటే రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ […]
ఓహో… తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా శాసించేది దిల్ రాజేనా..?!
. ముందుగా ఓ వార్త చదవండి…. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్ కు అనుమతి… మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపు… సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100 రూపాయలు పెంపు, జనవరి 11 నుంచి 5 షోస్ కు అనుమతి… జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకి […]
పదిహేడేళ్ల తరువాత సజీవంగా ‘మృతుడు’ ప్రత్యక్షం… ఏమిటీ కథ..?!
. మన నేర దర్యాప్తు వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థల డొల్ల వ్యవహారాన్ని అప్పుడప్పుడూ కొన్ని కేసులు ప్రబలంగా, నగ్నంగా పట్టిస్తుంటాయి… పేదలు, ఖర్చులు పెట్టి లాయర్లను పెట్టుకోలేని వాళ్లు జైళ్లలోనే మగ్గుతుంటారు, అసలు నేరమే చేయకపోయినా ఏళ్ల కొద్దీ జైళ్లలో ఉంటారు, లేదా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు… ఇదీ అలాంటిదే… ఝాన్సీ… ఉత్తరప్రదేశ్‌లోని ఓ పట్టణం… ఆ పోలీసులు గస్తీ తిరుగుతున్నప్పుడు యాభయ్యేళ్ల ఓ వ్యక్తి తారసపడ్డాడు… రొటీన్‌గా ఆరా తీస్తే ఆయన పేరు […]
కేటీఆర్ ఫార్ములా కేసు… జగన్ మనిషితో అక్రమ ఆర్థిక లంకెలు…
. కేటీఆర్ ఫార్ములా కేసులో ప్రధానమైన అంశం ఏమిటి…? అవినీతి, అధికార దుర్వినియోగం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ… తను పెట్టిన కేసు కూడా అదే… ఏదో విదేశీ కంపెనీ, చెల్లింపులు అనేసరికి ఈడీ ఎంటరైంది… అందరికీ తెలిసిందే… అంతకుముందు కేసీఆర్ బీజేపీని బజారుకు ఈడ్చడానికి, పార్టీ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేయడానికి ఎన్ని కుటిల విఫల ప్రయత్నాలు చేసినా సరే సక్సెస్ కాలేదు, పైగా ఓ పిచ్చి డ్రామా ప్లానుతో పరువు తీసుకున్నాడు తనే… ఐనా […]
అంటే అన్నాడు గానీ ట్రంపు… ఆ ఊహ నిజమైతే ఎంత బాగుండు…
. అంటే అన్నాడు గానీ, ఆ ఊహ ఎంత బాగుందో అని ఓ ఫేమస్ సినిమా డైలాగ్… కెనడా మీద, దిగిపోయిన ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మీద, ఆ ప్రభుత్వ విధానాల మీద అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తున్నాయి సగటు భారతీయుడికి… తన స్వార్థం కోసం, తన అధికారం కాపాడుకోవడం కోసం ట్రూడో కొన్నాళ్లుగా ఇండియా మీద విషం కక్కుతున్నాడు… ఖలిస్థానీ శక్తులకు అడ్డాగా మార్చాడు ఆ […]
దోస్త్ మేరా దోస్త్..! మజ్లిస్ కాంగ్రెస్ దోస్తీ… బీఆర్ఎస్కు పెద్ద నష్టమే..!!
. వైఎస్, చంద్రబాబు, కిరణ్‌కుమార్, రోశయ్య, కేసీఆర్… ఎవరూ పాత బస్తీకి ఏమీ చేయలేదనీ, రేవంత్ రెడ్డి మాత్రం సరైన రీతిలో వెళ్తున్నాడు… ఈ మాట అన్నది మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ… తను చెప్పింది పాత బస్తీకి మెట్రో పొడిగింపు గురించే కావచ్చుగాక… కానీ ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్టుగా… ఎవరు అధికారంలో ఉంటే వాళ్లతో మంచిగా ఉండి, కావల్సిన పనులు చేయించుకునే ఒవైసీకి ఇప్పుడు రేవంత్ హఠాత్తుగా మిత్రుడు కావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు… […]
టీటీడీ ఈవో గారూ… కొన్ని సూచనలు… కొన్ని ప్రశంసలు… చదవండి…
. . ( Paresh Turlapati ) .. … TTD EO గారూ విన్నపాలు వినవలె… మొన్న అలిపిరి మెట్ల మార్గం మీదుగా నడక ద్వారా తిరుమల కొండమీదకు చేరుకున్నప్పుడు నేను గమనించినవి.. భవిష్యత్తులో మార్పులు చేయాల్సినవి ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి పరిశీలించి చర్యలు తీసుకోగలరు ! 1. నడక మార్గంలో టీటీడీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు చాలామంది పాదచారులకు ఉపయోగకరంగా ఉన్నాయి.. ఈ సెంటర్లో ఒక డాక్టరు, నర్సు […]
ఇంతకీ గుళ్లను ఎవరికి అప్పగించడం బెటర్..? ఏ పద్ధతిలో..!?
. . ( Subramanyam Dogiparthi ) .. … అయిదు సంవత్సరాల కింద 14-12-2019 న గుంటూరులో నేను , మాజీ చీఫ్ సెక్రటరీ IYR కృష్ణారావు గారు హిందూ దేవాలయాల పరిరక్షణపై ఒక సదస్సును నిర్వహించాం . సదస్సు ఎక్కడ ఆగిందంటే : దేవాలయాల పరిరక్షణ ఎవరికి/ఏ సంస్థకు అప్పచెప్పాలి అనే అంశం వద్ద ఆగింది . నిన్న విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం ఆ అంశానికి […]
హైందవ శంఖారావం కవరేజీలో తెలుగు మీడియా వివక్ష..!!
. లక్షల మందితో నిన్న ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన హైందవ శంఖారావం వార్తకు ప్రాధాన్యమే లేదా..? విశ్వహిందూపరిషత్ నేతృత్వంలో సాగిన ఆ సభకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంది… అంతమంది సాధుసంతులు హాజరైనందుకు కాదు… హిందూ చైతన్యం అంతంతమాత్రం కనిపించే ఏపీలో అంతమందితో సభ జరగడం, మా గుళ్లపై సర్కారీ పెత్తనాలు ఏమిటి అని ప్రశ్నించడం ఖచ్చితంగా వార్తా ప్రాధాన్యం ఉన్న సభే… ఏపీలో జరిగింది కాబట్టి అది ఏపీ వార్త మాత్రమేనా..? ఏపీ పనికిమాలిన రాజకీయ సొల్లు వార్తలన్నీ […]
రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, సేఫ్ జోన్… ఏమిటీ ఎమ్మెల్యేల కేటగిరీలు..!?
. ముందుగా ఓ వార్త,… రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలపై థర్డ్ పార్టీ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విభాగాలపై సర్వే 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు వెల్లడించాయి… సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు… రెడ్ జోన్లో ఉన్న […]
అనంత శ్రీరాం శంఖారావం సరే… సోకాల్డ్ బీజేపీ, స్వామీజీల సంగతి…?!
. విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం ఇప్పుడున్న హిందూ వ్యతిరేక వాతావరణంలో అవసరమే… ఆ సంఘటన, ఆ చైతన్యం, ఆ ప్రతిఘటన అవసరమే… పలు రాజకీయ పార్టీలు వోట్ల కోసం మైనారిటీల పక్కన నిలబడి మెజారిటీని ఉపేక్షిస్తూ, అవమానిస్తూ, రాబోయే ప్రమాదాల్ని పట్టించుకోని నేపథ్యంలో ఇలాంటివి అవసరమే…ఇదే విజయవాడలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఈ సభకు నేపథ్యం, సంకల్పం, ఉద్దేశం ఏమిటో తెలియవు కానీ… జనం మాత్రం స్వచ్చందంగా బాగా తరలివచ్చారు… మరి కొత్తగా తన అవసరం […]
రష్యా మెడలు వంచుతున్న ఉక్రెయిన్… పోరు ముదురుతోంది..!!
. . ( పొట్లూరి పార్థసారథి ).. …. ఉక్రెనియన్ దళాలు రష్యా లోకి చొచ్చుకుపోతున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం! చాలా రోజుల నుండి రష్యా లోని కురుస్క్ (Kursk ) ప్రాంతం మీద పట్టు కోసం ఉక్రెయిన్ ఆర్మీ ప్రయత్నిస్తూ ఉన్నా సఫలం కాలేదు! కానీ ఈ రోజు ఉక్రెయిన్ ఆర్మీ రష్యాలోని సుద్ఝా కురుస్క్ హైవే మీద ఎలాంటి ప్రతిఘటన లేకుండా ముందుకు వెళుతున్నాయి! ఉక్రెయిన్ కురుస్క్ ని స్వాధీనం చేసుకుంటుందా? […]