రాజధాని ఫైల్స్ సినిమాకు సంబంధించిన న్యాయవివాదాలు ఎలా ఉన్నా… అసలు సినిమా ఎలా ఉంది..? ఏముంది..? ఆర్జీవీ తీసే పొలిటికల్ సినిమాలాగే ఉంది… చట్టపరమైన చిక్కులు రాకుండా తప్పకుండా డిస్‌క్లెయిమర్ ఇస్తారని తెలిసిందే కదా… ‘ఇదంతా కల్పితం, ఇందులోని పాత్రలు నిజజీవితంలో ఎవరినీ పోలి ఉండవు’ అంటూ… ఇచ్చారు అలాగే… అంతేనా..? అమరావతి ఐరావతి అవుతుంది… పాత్రల పేర్లను కూడా మార్చారు… కానీ మామూలు ప్రేక్షకుడికి కూడా ఏ పాత్ర ఎవరిని ఉద్దేశించిందో అర్థం అవుతూనే ఉంటుంది… […]
కథ, పాట, ట్యూన్, వ్యాపారం, మనోభావాలు… సినిమాల రిలీజులకు సీతకష్టాలు…
ఎక్కడో ఇంట్రస్టింగ్‌గా అనిపించే ఓ వార్త తారసపడింది… మొన్నామధ్య శ్రీమంతుడు సినిమా కథ నాదేనని కోర్టుకెక్కిన శరత్ చంద్ర అనే రచయిత ఈ వ్యాజ్యంలో గెలిచాడు కదా, అది ఇంకా సెటిల్ కాలేదు, ఎలా సెటిల్ చేసుకుంటారనేది దర్శక నిర్మాతల ప్రయాస, దాన్నలా వదిలేస్తే… అదే రచయత ఇప్పుడు మరో సినిమాను కూడా ఇలాగే గెలికే ప్రయత్నం చేస్తున్నాడు… అదీ మహేశ్ బాబు సినిమాయే… పేరు మహర్షి… శ్రీమంతుడు సినిమాకథలాగే మహర్షి కూడా రొటీన్ ఫార్మాట్లో గాకుండా […]
మనమే తోపులం కాదు… బాలీవుడ్ తీసికట్టు కాదు… ఈ మిషన్ చెప్పేదీ అదే…
ఒక సినిమాను థియేటర్లో చూస్తుంటే సీన్లు చకచకా కదిలి వెళ్తుంటే… వాటి విశేషం, అర్థం గట్రా మన మెదడుకు ఎక్కేలోపు మరో సీన్ వచ్చేస్తుంది… మరో డైలాగ్ ఏదో వినిపిస్తుంది… సినిమా బాగున్నట్టు అనిపిస్తుంది గానీ బుర్రలో రిజిష్టర్ కావు సరిగ్గా… టీవీల్లో కూడా అంతే… కానీ ఓటీటీ యుగం వచ్చాక బెటర్… కొన్నిసార్లు వెనక్కి వెళ్లి, డైలాగ్ విని, ఆ సీన్ చూసి, ఇంకా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయగలం… లేదా మైనస్ పాయింట్లు కూడా పట్టుకోగలం… […]
నటన అంటే ఆయన… దీటైన మేటి నటప్రదర్శన అంటే ఆమె…
Subramanyam Dogiparthi…. ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది . దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఈ పాట ఈ సినిమాను వంద రోజులు ఆడించటమే కాదు ; జనం వెయ్యేళ్ళు ఆస్వాదించే పాటయింది . మనసున్న జనం గుండెల్ని పిండే పాటయింది . ఈ పాటలో ప్రతి పదం అద్భుతం . దేవులపల్లి వారి పద విరాట రూపం . ఆ సాహిత్యానికి ధీటుగా ముఖ భావాలను చూపించింది […]
తాళి అంటే మాంగల్యమే కాదురా… పుస్తె కూడా..!!
గొట్టిముక్కల కమలాకర్ రచించిన అదో హాస్పిటల్ అనబడు చిత్రరాజం కథ ఇది…! ట్యాగ్ లైన్ :: తాళి అంటే మాంగల్యమే కాదురా.., పుస్తె కూడా..! జనరల్ వార్డు క్షయ పేషెంటుకి రోగం కమ్మేసినట్టు దిగులుగా, స్పెషల్ వార్డు డబ్బున్నోడి షష్టిపూర్తి అవుతున్న ఫంక్షనుహాల్లా దర్జాగా ఉన్నాయి..! ఆ హాస్పిటల్ ఎంట్రన్సులో వినాయకుడూ, ఏసుక్రీస్తూ, మసీదు బొమ్మా కలిపి ప్రింటేసిన ఓ ఫోటో ప్లాస్టిక్ ఫ్రేము కట్టించి భారతదేశపు సెక్యులరిజమంత అందంగా ఉంది. దాని ముందు పూలూ, అగరుబత్తీలూ, […]
అప్పుడు కాదు… నిజంగా ఈ అక్కినేని సినిమా ఇప్పుడు అవసరం…
Subramanyam Dogiparthi….. అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక , సందేశాత్మక చిత్రం . ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం . సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ చేసి , అధికారం నెత్తికెక్కి , చట్టం అంటే భయం లేక హత్యలు , మానభంగాలు చేయటం సాధారణ విషయమయిపోయిన 21 శతాబ్దానికి అవసరమైన సినిమా . అక్కినేని , […]
ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో !
Subramanyam Dogiparthi….. ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మిస్తానికి ప్రజల్ని బాదుతుంటాడు . హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు . స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు ; ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు . ఈరోజుల్లో స్థూపాలను , విగ్రహాలను విమర్శించే సినిమాలను బాయ్ కాట్ కూడా చేస్తారు , చేపిస్తారు . వామపక్ష భావజాలం […]
ఇంట్రస్టింగ్… విరిగిపడిన రెండు ప్రతిభా కెరటాల పునః కలయిక…
ఆసక్తికరమైన వార్తే… దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టితో ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా చేయబోతున్నాడు..! ఎదుగుతూ ఎదుగుతూ కెరీర్ బాగా ఉన్న దశలో ఇద్దరూ బోల్తా కొట్టినవాళ్లే… ఇద్దరూ ప్రతిభులే… కాకపోతే డెస్టినీ వాళ్ల పక్షాన లేదు… ఆ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనేది అందుకే ఇంట్రస్టింగ్… అనుష్క వయస్సు 42 ఏళ్లు… మంగళూరు, తుళు మహిళ… బెంగుళూరులోనే చదివిన ఈ యోగా ఇన్స్ట్రక్టర్ కన్నడ సినిమాలకన్నా తెలుగు, తమిళ సినిమాల్లోనే ప్రసిద్ధురాలు… కన్నడంలో ఒక్క […]
లీడర్ బయోపిక్ అంటేనే ఢమాల్…! వరుసగా ప్రతి సినిమా డిజాస్టరే…!!
‘రజాకార్’ అని ఓ కొత్త సినిమా వస్తోంది కదా… మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే రిలీజ్ అనుకున్నారు, బీజేపీకి కాస్త ఫాయిదా అవుతుందనీ అనుకున్నారు, తరువాత ఏమైందో వాయిదా పడింది… దానికి సంబంధించిన ఓ ఫంక్షన్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాట్లాడుతున్నప్పుడు ఆమె రాజకీయాల్లోకి వచ్చే అంశం ఓ ప్రశ్నగా ఎదురైంది… ఎప్పటిలాగే ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే వస్తానని చెప్పిన ఆమె… నవ్వుతూ… ‘త్వరలో రాబోయే నా సినిమా ఎమర్జెన్సీ గనుక చూస్తే నేను […]
పావులు, పాచికలు… కలియుగానికి ఓ వికృతరూపం భ్రమయుగం…
చూడబోతే అదేదో పురాతన కాలం నాటి ఏదో ఫాంటసీ కథలా కనిపిస్తోంది… సో వాట్… మంచిదే కదా, ఇంట్రస్టింగ్… ఎహె, అంతటి మమ్ముట్టి మరీ ముసలాడిలా, సడెన్‌గా చూస్తే ఎవడో మంత్రగాడిలా కనిపిస్తున్నాడు… వోకే, తప్పేముంది..? పాత్రోచిత ఆహార్యం కావచ్చు… అబ్బా, ఆ డైలాగులు గట్రా ఏదో హారర్ కథలా అనిపిస్తోంది… వావ్, మరీ మంచిది… ట్రెండ్ అదే కదా… అబ్బా, అది కాదు మహాశయా… అదేదో భూతాలు, మంత్రాలు, మాయలు కథలా ఉంది… పర్లేదంటారా..? వోకే […]
ఈ అందగత్తె… హీరోయిన్గా వెలుగుతుందీ అనుకుంటే తల్లిగా సెటిలైంది..!
Subramanyam Dogiparthi…… మా నాన్నగారితో కలిసి చీరాలలో నాజ్ థియేటర్లో చూసా ఈ సినిమాను . 1968 లో బ్లాక్ బస్టర్ . 15 కేంద్రాలలో వంద రోజులు , విజయవాడ దుర్గా కళా మందిరంలో 186 రోజులు ఆడింది . ఎన్నో సినిమాల్లో NTR కు తల్లిగా నటించిన పుష్పలతకు ఈ సినిమా మొదటి సినిమా . NTR కు భార్యగా నటించింది . చాలా అందంగా , చక్కటి నటన కలిగి ఉంది, పెద్ద […]
జగన్ విజయప్రస్థాన యాత్రకన్నా… షర్మిల పాత్ర కత్తిరింపుపైనే సోషల్ చర్చ…
మహి వి రాఘవ … యాత్ర-2 దర్శకుడు… యాత్ర ఫస్ట్ పార్ట్‌ను అందరికీ కనెక్టయ్యేలా, ఎమోషన్స్ కూడా సరిగ్గా చిత్రిక పట్టగలిగి… తీరా యాత్ర సీక్వెల్‌కు వచ్చేసరికి… తనలోని క్రియేటివ్ దర్శకుడిని కోల్పోయాడు అనే విమర్శను ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు… జగన్ వ్యతిరేక శిబిరం ఎలాగూ సినిమా మీద ఏదేదో వ్యాఖ్యానాలు చేస్తుంది, అది సహజం… ఇది సాదాసీదా ఓ మసాలా మూవీ కాదు గనుక, వర్తమాన రాజకీయాలతో అల్లబడిన కథ గనుక… ఒక నాయకుడిని బాగా ఎలివేట్ […]
ఇంకేం చేయాలి చెప్మా..! ఇద్దరు బడా స్టార్ల ఎదుట నిలిచిన పెద్ద ప్రశ్న…!!
రజినీకాంత్ వయస్సు 73 ఏళ్లు… తనను ఓ ఫ్యాన్‌లా చూడకపోయినా సరే, తను సాధించిన పాపులారిటీ ఎప్పుడూ అబ్బురం అనిపిస్తుంది… ముదురు ఛాయ, బక్కపలుచని దేహం, పెద్ద అందగాడు కూడా కాదు… ఐనా సరే, ఇండియన్ సినిమా తెర మీద తను ఓ సుప్రీం హీరో… అదీ భాషలకు అతీతంగా… తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ ఎట్సెట్రా… పద్మవిభూషణ్… సీన్ కట్ చేస్తే… చిరంజీవి వయస్సు 68 ఏళ్లు… రజినీకన్నా చిన్నోడే… తను కూడా పద్మవిభూషణ్… తన […]
మిస్ నాట్ పర్ఫెక్ట్..! త్రిపాఠీ లావణ్యం, నటన అంట్లు తోమడానికే సరిపోయాయ్…!
Ms not so Perfect… సాధారణంగా సీరీస్లు, సినిమాలు చూసిన తర్వాత రివ్యూలు రాయాలంటే మహా బోరు బద్దకం. కానీ ఈ కళాఖండంపై రాయాలనుకునీ రాయకుండా టైం పాస్ చేసా… కానీ, రాయడం వల్ల ఇలాంటి కళాఖండాల బారిన పడకుండా వుంటారని గుర్తొచ్చింది. సరే, ఇంతకీ ఏంటి ఈ కళాఖండం కథాకమామీషు….. డిస్నీహాట్‌స్టార్‌లో కొత్తగా రిలీజయిన ‘Miss Perfect’ గురించి… దీనిలో లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్లో నటించింది… ఆమెకి జోడీగా బిగ్‌బాస్ ఫేమ్ అభిజిత్ నటించాడు. దీనిని […]
ఇది మన రజినీకాంత్ సినిమాయేనా…? నిజం చెప్పు ఐశ్వర్యా…!!
రజినీకాంత్ ఇమేజీ అసాధారణం… ప్రేక్షకులు తన నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు… థియేటర్ విజిళ్లతో దద్దరిల్లిపోవాలి… దశాబ్దాలుగా తనను చూస్తూనే ఉన్నా సరే… తన డైలాగులు, తన మేనరిజమ్స్, తన ఎలివేషన్, ఎమోషన్స్ ఎట్సెట్రా కావాలి… ఏమాత్రం తగ్గినా సరే సినిమా ఢమాల్… ఈ అతి అంచనాలే రజినీకాంత్ సినిమాలకు బలం, బలహీనత కూడా… తను మారలేడు… జనం మారనివ్వరు… అలాగని రొటీన్ మొనాటనస్ సినిమాలు తీస్తే క్రమేపీ తన మీద న్యూట్రల్ ఆడియెన్స్ ఆసక్తిని చంపేసుకుంటున్నారు… […]
ఈగిల్… సంక్రాంతి బరి నుంచి గాలివాటం గద్ద తప్పుకుని… బతికిపోయింది…
ఎవరో సరిగ్గా రాసినట్టు అనిపించింది… ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సిండికేట్ ప్రభావం పుణ్యమాని రవితేజ ఈగల్ సినిమాను మొన్నటి సంక్రాంతి బరి నుంచి తప్పించడమే మంచిదైంది… లేకపోతే కొట్టుకుపోయేది లేదా నలిగిపోయేది… వెంకటేశ్ సైంధవ్ రిజల్ట్ చూశాం కదా… హనుమాన్ దెబ్బకు అంతటి గుంటూరు కారమే హిట్టో కాదో చెప్పలేని స్థితి… నాగార్జున నాసామిరంగా సినిమా ఏదో కన్నులొట్టబోయి బయటపడిందట… శివకార్తికేయన్ సినిమా అయలాన్ కూడా వాయిదా వేసుకుని, చివరకు తెలుగు రిలీజ్ లేకుండానే, అదే తమిళ […]
అనుకుంటాం గానీ… అసలు పాటే లేకుండా కృష్ణ డాన్స్ ఇరగేశాడు…
Subramanyam Dogiparthi…. నిర్మాత డి రామానాయుడుకి తన సినిమాలో ఏదో ఒక అతిధి పాత్రలో నటించే సెంటిమెంట్ ఉందని మనందరికీ తెలిసిందే . డాక్టర్ గానో , పోలీసు ఆఫీసర్ గానో తళుక్కుమంటుంటాడు . ఈ సినిమాలో పెళ్ళి కొడుకుగా కనిపిస్తారు . విజయనిర్మలను పెళ్లి చేసుకుంటారు . చక్కటి ఎమోషనల్ , సెంటిమెంటల్ సినిమా . ఓ చిన్న పాప కరుడుగట్టిన ముగ్గురు హంతకులలో ప్రేమను చిగురింపచేసి , మనుషులను చేసి , పోలీసులకు లొంగిపోయేలా […]
‘ఇంకో పదిసార్లు పీఎం అయినా సరే… ఆర్టికల్ 370 టచ్ కూడా చేయలేడు…’
‘ఈ రూమ్‌లో ఉన్న మనం, ప్రధాని ఆఫీసులోని ఒకరిద్దరు కోర్ మెంబర్స్, అంతేతప్ప చివరకు ప్రధాని పీఏకు కూడా సైతం మన ప్లాన్ ఏమిటో తెలియవద్దు’… ‘ఈ ప్రధాని మరో పదిసార్లు పీఎం అయినా సరే ఆర్టికల్ 370 మీద చేయి వేయలేడు’… ‘చరిత్రలో లిఖించబడాలీ అంటే ఎవరో ఒకరు చరిత్రను లిఖించాలి కదా’… ఇలా కొన్ని డైలాగ్స్ ఏకంగా ప్రధాని కార్యాలయాన్నే సినిమాలోకి లాగుతాయి… సినిమా పేరు ఆర్టికల్ 370… నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ […]
Yatra2… జగన్ ఇమేజ్ బిల్డింగ్ మూవీ… ఫీల్ గుడ్ పాజిటివ్ ధోరణి…
ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు, సొంత మీడియా సంస్థలు తమ నాయకుడిని, తమ పార్టీని ఎప్పుడూ పాజిటివ్ యాంగిల్లో చూపించడానికి ప్రయత్నిస్తాయి… అలా ప్రయత్నించడం వాటి కర్తవ్యం… అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ విధానాల్ని తూర్పారబట్టడం, తమ పార్టీ విధానాల్ని జస్టిఫై చేయడడం కూడా సాధారణమే… కేవలం ఒక నాయకుడి కోసం సినిమా తీయడం అంటే, తన ప్రతి చర్యనూ జస్టిఫై చేయాలి, ఇప్పుడు ఎన్నికల ముందు పొలిటికల్ ఫాయిదా కోసం తీయబడిన సినిమా కాబట్టి […]
‘కోడి కోసం వచ్చావా గోపాలా… పుట్ట తేనె కావాలా గోపాలా…’’
Bharadwaja Rangavajhala….. కురిసే చినుకు ఎద వరకు ఎల్లువైతే … కడవరకూ వేచి ఉంటానంటూనే … కాలం చెల్లితే ఇంత మన్నేసిపొమ్మనే… ఎద రొదను తన వేణుగానంతో మన హృదయాల్లోకి ప్రసారం చేసినవాడు నవీన్. హృదయాల మీద పెంకులు ఎగిరిపోయేలా తన సంగీతంతో ఆత్మలకు మేలుకొలుపు పాడతాడు. కావాలంటే … మణిరత్నం బొంబాయి కోసం రెహ్మాన్ స్వరకల్పన చేసిన థీమ్ మ్యూజిక్ గుర్తు చేసుకోండి… రెహ్మాన్ సత్తా బాలీవుడ్ కి చాటిన తాళ్ సంగీతానికి ఊతం నవీన్ వేణుగానమే. ఎద […]
- « Previous Page
- 1
- …
- 42
- 43
- 44
- 45
- 46
- …
- 126
- Next Page »