యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ… అలియాస్ మణిశర్మ… మొన్నామధ్య ఎంతసేపూ తమన్, డీఎస్పీయేనా… నాకూ చాన్స్ ఇస్తే వైవిధ్యం ఉంటుంది కదా అంటూ నిర్మాతలను కోరుతూ హఠాత్తుగా ప్రచారతెర మీదకు వచ్చాడు… నిజంగా ట్రాజెడీ… 30 ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన మణిశర్మ నాకూ చాన్సులు ఇవ్వండి సార్ అనడగడం బాగనిపించలేదు… అడగడం బాగా లేదని కాదు… అలా అడిగే సిట్యుయేషన్ బాగా లేదని… ఎస్, ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్, డీఎస్పీ టాప్ మ్యూజికల్ […]
చివరి రోజుల్లో అన్నమయ్య సినిమా తీయాలని కూడా కష్టపడ్డాడు పాపం…
Bharadwaja Rangavajhala……… డైరక్టర్ మాధవరావు ఆత్రేయతోనే ఎక్కువగా రాయించుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన మాధవరావు చిల్లర దేవుళ్లు నవలను సినిమాగా తీసీ అందులోనూ ఆత్రేయతోనే పాటలు రాయించుకున్నాడు. కింద మీకు కనిపిస్తున్న ఫొటోలో ఆత్రేయ ఆఫీసులో కూర్చున్న మాధవరావూ ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ జగన్నాథ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఆత్రేయ దగ్గరకు ఎందుకొచ్చారంటే.. 1972 అగస్ట్ నెల్లో విడుదలైన కన్నతల్లి సినిమా పాటల గురించి మాట్లాడడానికి వెళ్లారు. నిజానికి ఈ ఫొటో తీసినది 1970 […]
మరి బంపర్ హిట్ డైరెక్టర్ కదా… ఈమాత్రం నెత్తికెక్కదా..? ఎక్కినట్టుంది..!!
చిన్నాచితకా డైరెక్టర్లకే ఒక్క హిట్టు దక్కేసరికి కిక్కు నెత్తికెక్కుతోంది… ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు… మరి అర్జున్‌రెడ్డి, దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్, ఇప్పుడు యానిమల్ సూపర్ బంపర్ హిట్లు కొట్టిన వంగా సందీప్‌కి ఇంకెంత ఎక్కాలి..? కిక్కు..! అసలే తన సినిమాలే కాస్త మెంటల్ టైపు, తన హీరోలూ అదే టైపు… మరి తనూ అంతే అనుకోవాలి కదా… పైగా మా వరంగల్ కదా, కాస్త తల పైకెత్తుకునే ఉంటుంది ఎప్పుడూ… […]
వెండి తెరపై నెగెటివ్ క్యాంపెయిన్… ఏపీలో రెండు పొలిటికల్ క్యాంపులూ సేమ్…
ముందస్తుగా ఓ డిస్‌క్లెయిమర్ :: మీడియా రాతలు, ప్రచారంతో ఎవరూ గెలవరు, ఎవరూ ఓడిపోరు… ప్రజలు వోట్లు వేయటానికి ఈ క్యాంపెయిన్స్‌ను ఏమీ పరిగణనలోకి తీసుకోరు… వాళ్ల లెక్కలు వేరు, కొలిచే ప్రమాణాలు వేరు… ఐనా సరే, ప్రతి పార్టీ, ప్రతి నాయకుడికీ మీడియా కావాలి… భజన కావాలి లేదా ప్రత్యర్థుల వాదనలకు కౌంటర్లు వేయాలి… వాయిస్ జనంలోకి పోవాలి, అందుకే మీడియా కావాలి… అంతకుమించి మీడియా ప్రభావం శూన్యం… వైఎస్ సీఎం గాకుండా యెల్లో మీడియా […]
పైన చూస్తే తళుకుల తార.. లోన చూస్తే వెన్నెల ధార… కత్తెర మాసపు సెగ…
తమిళ పాట.. కత్తెర మాసపు ఆట … తమిళంలో ‘నాట్టామై’ అనే సినిమా ఉంది తెలుసా? దాన్నే తెలుగులో ‘పెదరాయుడు’గా తీశారు. అక్కడా ఇక్కడా పెద్ద హిట్! అందులో ‘కొట్టా పాక్కుం.. కొళుందు వెత్తలయుం’ పాట ఇంకా పెద్ద హిట్టు! తమిళంలో సంగీత దర్శకుడు సిర్పి గారు స్వరపరచిన ఆ పాట భారీ హిట్ కావడంతో తెలుగులోనూ అదే ట్యూన్ వాడారు. ఇక్కడ పాట గుర్తుంది కదా!? ‘బావవి నువ్వు.. భామని నేను..’ సరే! ఇదంతా చెప్పడం […]
జగన్, కేసీయార్‌లపై చిరంజీవి విసుర్లు ఏల..? రేవంత్ సన్మానాల మర్మమేంటి..?
సైట్ పేరు దేనికిలే గానీ… ఓ వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… పద్మ పురస్కారాలు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం సన్మానాలు చేసింది కదా… ఇకపై ఆ పురస్కారం వస్తే 25 లక్షల నగదు బహుమతి, నెలకు 25 వేల పెన్షన్ ఇస్తామనీ రేవంత్ రెడ్డి చెప్పాడు… సరే, ఆ ప్రకటనల మీద కూడా భిన్నాభిప్రాయాలున్నా, కాసేపు పక్కన పెడదాం… సదరు వార్త ఏం చెబుతున్నదంటే… ‘‘పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా […]
యాంకర్ రష్మి ఆనందంతో మెలికలు తిరిగిపోయింది… అరుదైన ప్రశంసే మరి…
మురళీమోహన్… ఒకప్పటి హీరో… తెలుగుదేశం నాయకుడు… వయస్సు 83 ఏళ్లు… ఇప్పటికీ తన ఆరోగ్యాన్నిబాగా కాపాడుకుంటున్నాడు… తన సంపాదన, తన ఆస్తులు, తన వ్యవహారాలే తప్ప పెద్దగా వివాదాల్లోకి రాడు… పిచ్చి విమర్శల జోలికి పోడు… ప్రత్యేకించి టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో కూడా ఎప్పుడూ కనిపించడు… తనను శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కు పిలిచారు… ఎప్పటిలాగే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కలిసి ఏవో మూస పంచులు వేస్తారు కదా… వేశారు… తరువాత మురళీమోహన్ వచ్చాడు […]
పరపరా నరికివేతల నెత్తుటి కాండలు కావు… ఓ మధ్యతరగతి మందహాసం…
Prabhakar Jaini……. ఆచార్ అండ్ కో సినిమా చూసాను. చూడకపోతే, చాలా మిస్ అయ్యేవాణ్ణి. సినిమా చూస్తున్నంత సేపూ, మనసు పురా వీధుల్లో తిరిగిన అనుభూతి కలిగింది. దర్శకుడు ఆనాటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో కృతకృత్యులయ్యారు. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు కొంటె పిల్లలుగా అల్లరి చేసిన వాళ్ళు, ఇంటి యజమానురాలిగా ఉన్న తల్లి – తండ్రి మరణం తర్వాత ఎంత సులభంగా, నాచురల్ గా, బాధ్యతలు తెలిసిన వ్యక్తులుగా, తల్లి నెమ్మదిగా పిల్లల చాటు వ్యక్తిగా రూపాంతరం చెందడం […]
లారీ గుద్దిన ఆటోలా దెబ్బయిపోవడమే… మరి *గోట్* పాటంటే మజాకా..?!
సండేలాంటి లైపూ మండేలా మండుతోంది… అసలు పాట ఎత్తుకోవడమే మైండ్‌కు మండేలా తాకింది ఆ గీత రచయిత భాషలో చెప్పాలంటే… సండేలాంటి లైఫు అంటే వోకే, బద్దకంగా స్టార్టయి, జాలీగా గడిచి, ఏ వినోదంతోనో ముగుస్తుందీ అనుకుందాం… కానీ మండే అంటే మండటం ఏమిటి..? ఓహో… మండే మళ్లీ డ్యూటీకి వెళ్లాలి కదా, అది ‘మండే’ రోజు అన్నమాట… హబ్బ, ఏం కవిహృదయం… అదిరిపోయింది బాసూ… గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాల తరువాత రాబోయే సుడిగాలి సుధీర్ […]
అంజలిని ముద్దాడాలంటే ఏదో ఇబ్బంది… దర్శకుడు కొట్టేవాడు అప్పుడప్పుడూ…
‘షాపింగ్ మాల్’ హీరో ఏడీ? ఏమయ్యాడు? (షాపింగ్ మాల్ (తమిళంలో ‘అంగాడి తెరు’) సినిమాలో అంజలితో కలిసి నటించిన హీరో మహేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 14 సినిమాలు చేసినా అవేవీ విజయం సాధించలేదు. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు ఇవి..) * మాది తమిళనాడులోని దిండుగల్. నేను వాలీబాల్ క్రీడాకారుణ్ని. జాతీయ స్థాయిలో కూడా ఆడాను. ఒకసారి టోర్నమెంట్ ఆడి వస్తూ […]
ఏమి బిగ్‌బాస్ బాల్రాజూ… బూట్‌కట్ సినిమాను గిట్ల తీసినావూ…
బూట్‌కట్ బాలరాజు సినిమాకు సంబంధించి సోహెల్ చేసిన తప్పులేమిటి..? చాలా ఉన్నాయి… అందులో కొన్ని ముఖ్యమైనవి… బిగ్‌బాస్ కంటెస్టెంటుగా పాపులరైన సోహెల్ ఆ షోకూ, రెగ్యులర్ సినిమాకు నడుమ తేడా తెలుసుకోకపోవడం… బిగ్‌బాస్ హౌజులో ఉన్నప్పుడు నాకు మస్తు సపోర్ట్ చేశారు, కామెంట్స్ పెట్టారు, ఇప్పుడేమైంది అని ఆశ్చర్యపోవడం విస్మయకరమే… బిగ్‌బాస్ వేరు, కమర్షియల్ సినిమా వేరు… బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లుగా ఉన్న పదీపదిహేను మందిలో ఎవరు యాక్టివ్, టాస్కుల్లో ఎవరు బాగా చేస్తున్నారనే అత్యంత పరిమిత చట్రంలో […]
అదే నిజమైతే… ఆ ‘విడుదల’ మూవీ ఎడిటర్‌కు వీరతాళ్లు వేయాల్సిందే…
నిజంగానే బాగా ఆసక్తికరం అనిపించింది ఒక వార్త… ముందుగా ఆ వార్త చదవండి… తరువాత మిగతా కథ… ‘‘దర్శకుడు వెట్రిమారన్ తీసిన ‘విడుదల పార్ట్- 1’ విమర్శకుల ప్రశంసలను అందుకుంది… తమిళంలో మంచి విజయం సాధించింది… అఫ్ కోర్స్, తెలుగులో పెద్ద స్పందన ఏమీలేదు… ఇలాంటి జానర్లు తెలుగు వాళ్లకు పెద్దగా కనెక్ట్ కావు… అందుకే మన ఆడియెన్స్ లైట్ తీసుకున్నారు… కాకపోతే ఓటిటిలో చూసిన కొందరు శెభాష్ అంటున్నారు కొందరు… థియేటర్ ప్రేక్షకులకూ ఓటీటీ ప్రేక్షకులకూ […]
1968 నాటికే వోటర్ల కొనుగోళ్లు ఆరంభం… ‘నిలువు దోపిడీ’ మూవీయే సాక్ష్యం…
Subramanyam Dogiparthi……. ఈ సినిమా వంద రోజులు ఎందుకు ఆడిందో ఎప్పటికీ అర్థం కాదు . కేవలం NTR సినిమా కావటమే . సాధారణంగా దేవిక ఒద్దికగా ఉండే పాత్రలనే వేస్తుంది . ఈ సినిమాలో NTR నే మించిపోయి రేగింగ్ చేసేస్తుంది . వీళ్ళిద్దరి శృంగారం కూడా శృతి మించి ఆ రోజుల్లో విమర్శలకు గురయింది . ముఖ్యంగా B , C క్లాస్ సెంటర్లో బాగా ఆడింది . వాళ్ళ శృంగారం బాగా ఎక్కింది […]
శరణ్య…! మంచి పాత్ర పడాలే గానీ ‘హీరోలా’ చెలరేగిపోదూ… దుమ్మురేపింది…
సాధారణంగా తెలుగు సినిమాలు అంటేనే… ఆడ పాత్రలకు పెద్ద ప్రాధాన్యం ఉండదు, విలువ ఉండదు… ఏదో తెర నిండుగా కనిపించడానికి అక్కరకొచ్చే పాత్రలు… అంటే మెజారిటీ సినిమాల్లో… ఇక హీరోయిన్లయితే మరీ ఘోరం… హీరో పక్కన పిచ్చిగెంతులు వేయడానికి, అందాలన్నీ తెర మీద ప్రదర్శించడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు… అంటే చాలా సినిమాల్లో… ఏదో ఒకటీ అరా సినిమాల్లో, మంచి అభిరుచి ఉన్న దర్శకుల సినిమాల్లో మాత్రమే మహిళా పాత్రలకు సరైన చిత్రణ ఉంటుంది, కేరక్టరైజేషన్ ఉంటుంది… […]
రచయిత అనంత శ్రీరాం తప్పు… స్టార్ మాటీవీది మరీ తప్పున్నర…
అనంత శ్రీరాం మంచి గీత రచయితే… కానీ నోటి దూల ఎక్కువ… తనంతటతనే ఇజ్జత్ తీసుకుంటూ ఉంటాడు అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ… ఆమధ్య దిగుదిగునాగ అనే ఓ పిచ్చి గీతాన్ని సమర్థించి నవ్వులపాలయ్యాడు… తరువాత ఏదో మరో వివాదం… సూపర్ సింగర్ టీవీ సినిమా సాంగ్స్ కంపిటీషన్స్ షోలో నలుగురు జడ్జిల్లో తను ఒకడు ప్రస్తుతం… అంతకుముందు జీతెలుగులో ఇలాంటి షోలో కూడా జడ్జిగా చేస్తూ, పిచ్చి గెంతులు వేస్తూ చిరాకెత్తించాడు… ఈ సూపర్ సింగర్ షోలో […]
మహేశ్ బాబు మీద కేసు..? ఇదెక్కటి ట్విస్టు బ్రదర్…? తనెలా బాధ్యుడు..?!
వినియోగదార్లను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలకు గాను ఆయా కమర్షియల్స్‌లో డబ్బు తీసుకుని నటించిన నటీనటులను, సెలబ్రిటీలను కూడా బాధ్యులను చేస్తుంది వినియోగదారుల రక్షణ చట్టం… ఎందుకంటే, సొసైటీ పట్ల వాళ్లకూ జవాబుదారీతనం ఉంటుంది కాబట్టి… గుట్కా సరోగేట్ యాడ్స్ విషయంలో అమితాబ్ దగ్గర నుంచి అక్షయకుమార్ దాకా స్పందించారు… యాడ్స్ నుంచి వెనక్కి తగ్గారు… కానీ మన మహేశ్ బాబు మాత్రం తగ్గలేదు, దానిపై అస్సలు స్పందించలేదు… ఈ కథంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… మహేశ్ […]
ఆ సూర్యకాంతం మరీ అలాంటి పాత్ర చేయడం కలుక్కుమనిపించింది…
Subramanyam Dogiparthi……. ఆకలి మంటలు బాబు ఇవి ఆరని మంటలు బాబు పాట అందరికీ గుర్తుండే ఉంటుంది . ఫంక్షన్లప్పుడు భోజనాలు ఆలస్యమయితే ఈ చరణం ఎత్తుకునే వాళ్ళం సరదాగా . ఆ పాట ఈ సినిమా లోనిదే . ఓ మామూలు పెసరట్లు అమ్ముకునే నాగభూషణం లాటరీ టికెట్టుకు లక్షల రూపాయల నడమంత్రపు సిరి రాగానే ఎలా దిగజారి అధఃపాతాళానికి పడిపోతాడో చూపిస్తుందీ సినిమా . నడమంత్రపు సిరి మాత్రమే కాదు ; నడమంత్రపు అధికారం […]
వీళ్లు పాతతరం తారలు కారు… మనసులో ఏ ఎమోషనూ దాచుకోరు… ఇచ్చిపడేస్తారు…
ఒక చిన్న వార్త… ఎందుకు ఆకర్షించిందీ అంటే… సాధారణంగా సినిమా తారలు, టీవీ తారలు ఎవరూ సినిమాల మీద గానీ, నటీనటుల మీద గానీ, దర్శకుల మీద గానీ నెగెటివ్ వ్యాఖ్యలు చేయరు… వాళ్ల జీవితాలు ఇండస్ట్రీలో సెన్సిటివ్… అసలే మగ వివక్ష… తమ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే తరువాత తమను తొక్కేస్తారనే భయం… అందుకే నచ్చినా నచ్చకపోయినా గొంతు దాటనివ్వరు… లోలోపల అణిచేసుకుంటారు… కానీ తమిళ నటి కస్తూరి అలా కాదు… సినిమాలే కాదు, పలు […]
ఈ సినిమా పాటలో కృష్ణను ఎన్టీయార్ ఆవహించేస్తాడు… కాంచనను కూడా…!!
Subramanyam Dogiparthi…… 1968 లో వచ్చిన ఈ నేనంటే నేనే సినిమాలో కృష్ణ , కాంచనలకు పాటల షూటింగులో NTR ఆవహించాడు . గుంతలకిడి గుంతలకిడి గుమ్మా పాటలో మాట వీర పాపులర్ ఆరోజుల్లో . ఈ పాటలో కృష్ణ కాంచన పిర్రల్ని వాయించి వదలి పెట్టాడు . చివర్లో కాంచన కూడా కృష్ణ పిర్రల్ని వాయించేసింది . కృష్ణ , కాంచన ఇద్దరూ నటనా విహారం చేసారు . చాలా ఎనర్జిటిక్ గా , చలాకీగా […]
ప్రజల పాటకు గౌరవం… నందుల్లేవ్, సింహాల్లేవ్… ఇక గద్దర్ అవార్డులు…
గద్దర్ కి అత్యున్నత నీరాజనాలు… గద్దర్ మా లెజెండ్. మా బ్రాండ్. రాష్ట్ర అంబాసిడర్. ఇక నుంచి సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డులే కాదు, కవులు కళాకారులకు ఇచ్చే అన్ని పురస్కారాలు గద్దర్ పేరిటనే ఇస్తాం… ఈ ఉగాది తోనే గద్దర్ పురస్కారాలు ప్రారంభం. వచ్చే ఏడు నుంచి గద్దర్ జయంతి రోజే వారి పేరిట పురస్కారాల ప్రధానం చేస్తాం. ఘనంగా స్మరించుకుంటాం. ఇది నా శాసనం. నా మాటే జీవో. మరో మాట. సభలో […]
- « Previous Page
- 1
- …
- 43
- 44
- 45
- 46
- 47
- …
- 126
- Next Page »