కోర్టు లీగల్ కోణంలో వెలువరించిన తీర్పు సబబే… సీనియర్ నరేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా నిజానికి తన పెళ్లిళ్ల వ్యవహారంలో తన ధోరణిని సమర్థించుకునే ప్రయత్నమే… తన వెర్షన్ జనంలోకి బాగా వెళ్లడానికి తను సినిమా మాధ్యమాన్ని వాడుకున్నాడు… తెలివైన ఆలోచన… తన మూడో పెళ్లాం రమ్య రఘుపతిని విలన్‌గా చిత్రీకరించాడు… ఐతే సినిమా మొదట్లోనే ఈ కథ కల్పితమనే డిస్‌క్లెయిమర్ ఇచ్చేసి, ఒరిజినల్ పేర్లను పోలే కల్పిత పేర్లనే పాత్రలకు పెట్టడంతో బహుశా […]
వాటీజ్ దిస్ బ్రో..? డైలాగ్స్ రాసేప్పుడు కనీస జాగ్రత్త అవసరం లేదా..?
సినిమాల్లో పాత్రను బట్టి కొన్ని డైలాగ్స్ ఉంటాయి… ఏదో ఓ పాత్ర ఏవో డైలాగ్స్ చెప్పినంతమాత్రాన అవి ఆ దర్శకుడు, కథారచయిత, డైలాగ్స్ రచయిత అభిప్రాయాలేమీ కావు… అర్థం చేసుకోవచ్చు, కానీ కొన్ని డైలాగ్స్ సొసైటీపై ప్రభావం చూపిస్తాయి… ఉదాహరణకు ఏదేని సినిమాలో ఓ డాక్టర్ పాత్రలో ఏదేని వ్యాధి మీద ఏవేవో తెలిసీతెలియని వ్యాఖ్యలు చేయిస్తే, ప్రేక్షకులు వాటిని నిజమేనేమో అని భ్రమపడే ప్రమాదం ఉంది… అందుకే మాటల రచయిత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి… అఫ్కోర్స్, దర్శకుడికి […]
బ్రోదిన బ్రోవగ బ్రోచిన బ్రోదర… ఇది ఏ భాష తమన్ బ్రోదర్ …
ఇది బ్రో సినిమా గురించిన రివ్యూ కాదు, ఒరిజినల్ సినిమాకు అద్దిన రీమేక్ మసాలాల ఘాటు గురించి విశ్లేషణ కూడా కాదు… అందులోని ఒక పాట గురించిన విమర్శ… గీత రచయిత కళ్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాటను అదితి భావరాజు, ఆదిత్య అయ్యంగార్, అద్వితీయ, అనుదీప్, అరుణ్ కౌండిన్యస్, దామిని భట్ల, హారిక నారాయణ్ తదితరులు పాడారు… ‘‘చలనచిత్రం యొక్క ఇతివృత్తానికి నిజం చేస్తూ, ఈ పాట సంస్కృత- స్తోత్ర శైలిలో కాలానికి మరియు మరణానికి […]
సీమ దసరా చిన్నోడు… రీల్స్, షార్ట్స్ నిండా పిల్లలు, ముసలోళ్ల దాకా అవే స్టెప్పులు
అప్పట్లో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అనే పాట భాఘా ఫేమస్ కదా… ఏ పెళ్లి, ఏ ఫంక్షన్ చూసినా అదే పాట… ఇక రీల్స్, షార్ట్స్ అయితే లెక్కే లేదు… యూట్యూబ్ పండగ చేసుకుంది ఆ పాటతో… విచిత్రమేమిటంటే ఆ పాట పాడిన మోహన భోగరాజుకన్నా ఎక్కడో పెళ్లిలో వరుడి ఎదుట ఈ పాటకు డాన్స్ వధువు వీడియో మహా వైరల్ అయ్యింది… అంతటి వైరల్ తరువాత మళ్లీ తెలుగునాట మరే వీడియో అంతగా క్లిక్ […]
హీరోలూ, దేవుళ్లు కానవసరం లేదు… జస్ట్, మనుషులుగానైనా స్పందించండి…
వరద నీరు ముంచెత్తినప్పుడు ఒక బాధ… వరద నీరు తగ్గాక జరిగిన నష్టం చూసుకుని మరో బాధ… పాత వరంగల్ జిల్లాలోని అనేక గ్రామాల పరిస్థితి అదే… ప్రత్యేకించి మోరంచపల్లి వంటి పల్లెలు దారుణంగా దెబ్బతిన్నాయి… అంతెందుకు..? హిస్టారిక్ భద్రకాళి చెరువుకు గండి సహా ఇప్పటికీ అనేక కాలనీలు వరదనీటిలోనే ఉన్నాయి… ఒక్కొక్క ఇంట్లో మూణ్నాలుగు అడుగుల నీరు, బురద… తిరిగి ఈ జీవితాలు యథాస్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందో..? ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందో అందరికీ […]
పెళ్లిపెటాకులై చాన్నాళ్లయినా సరే… సమంతను వదలని ఆ ఇంటిపేరు…
ఫ్యాన్స్ అంటే అంతే… లాజిక్కులకు, వాస్తవాలకు అందదు ఆ అభిమానం… ఉదాహరణకు సమంత రుత్ ప్రభు ఫ్యాన్స్… రెండు మత పద్ధతుల్లో నాగచైతన్యతో పెళ్లయింది… నాగార్జునకు ఇష్టముండే చేశాడా, చైతూ ఒత్తిడి మేరకు తప్పనిసరై తలవంచి అంగీకరించాడా వేరే విషయం… పెళ్లయ్యాక కూడా ఆమె స్వేచ్ఛావర్తన, పోషించిన కొన్ని పాత్రల తీరుతో అక్కినేని కుటుంబం కోపగించింది… చివరకు చైతూ కూడా ఆగ్రహం చెందాడు… ఠాట్, నువ్వూ వద్దు, నీతో సంసారమూ వద్దు అని తరిమేశాడు… నువ్వేమిటోయ్ నన్ను […]
ఔను బ్రో… అసలే ఫ్యాన్స్‌కు దేముడు… పైగా దేముడి పాత్ర… ఫ్యాన్స్‌కు పండుగ…
జీవితం ఏది, ఎలా ఇస్తే అలాగే స్వీకరించండి… ఇదీ బ్రో సినిమా కథ సారాంశం… ఇది బలంగా చెప్పాలంటే బలమైన ఎమోషన్స్ ఉండాలి సీన్లలో… అవి పండాలి కథనంలో… కానీ అలా కథ మీద, కథనం మీద కసరత్తులు చేస్తే అది తెలుగు సినిమా ఎందుకవుతుంది..? పైగా ఇందులో పవన్ కల్యాణ్ హీరో… అసలే తనను దేముడిగా పరిగణించే భక్తులకు కొదువ లేదు తెలుగు రాష్ట్రాల్లో… ఇక సాక్షాత్తూ తనను దేవుడి పాత్రలో చూపిస్తుంటే, దానికి తగిన […]
ఎహె, బయటికి వచ్చేశాను అని చెప్పకుండా… క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పాలి…
ఆమధ్య చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న తరువాత త్రిష ఓ పదం వాడింది… పొసగడం లేదు, పడటం లేదు, ఇష్టం లేదు, అబ్బో కష్టం కాబట్టి తప్పుకున్నా వంటి ఏ పదాల జోలికీ పోలేదు… ఎందుకంటే..? మళ్లీ రిలేషన్స్ బాగుండాలి కదా… అందుకని తెలివిగా, మర్యాదగా క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేసింది… అది ఓ బ్రహ్మ పదార్థం వంటి, భ్రమ పదార్థం వంటి పదం… సరిగ్గా ఇదీ దాని నిర్వచనం అని ఎవరూ చెప్పలేరు… కాకపోతే సినిమాల్లో ఎవరైనా […]
కల్యాణరామ్ పరువు తీసిన అమిగోస్.., టీవీక్షకులూ ఫోఫోవోయ్ అనేశారు…
నందమూరి కల్యాణరామ్… ఏళ్లకేళ్లు ఎదురు చూడగా చూడగా డగా… ఒక్క హిట్… దాని పేరు బింబిసార… ఆహా, మావాడు కాకపోతే ఇంకెవ్వరూ ఈ పాత్ర పోషించలేరు, సూపర్, బంపర్ అంటూ జూనియర్ ఎన్టీయార్ తెగ మోశాడు… సరే, అప్పట్లో జానపద ఫిక్షన్ కథలు కాస్త ట్రెండ్ కదా… కాస్త కథ ట్రీట్మెంట్ కూడా బాగున్నట్టనిపించింది… సినిమా హిట్టయ్యింది… ఇంకేముంది..? కల్యాణరాముడి సూపర్ ఇన్నింగ్స్ స్టార్టయినట్టే అని సైట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సహా మోసేశారు… నిజానికి […]
Hidimba… నందిత శ్వేత నటనొక్కటే హైలైట్… మిగతా సినిమా అంతా సోసో…
హిడింబ… అంటే అర్థమేంటి..? అదొక పేరు… మహాభారతంలో హిడింబాసురుడు… అడవుల్లోకి పారిపోయిన పాండవులను హతమార్చి తినాలని ప్రయత్నిస్తాడు… చివరకు భీముడి చేతుల్లో హతమవుతాడు… ఆ హిడింబాసురుడి చెల్లె హిడింబి… భీముడినే పెళ్లి చేసుకుంటుంది… వాళ్ల కొడుకే ఘటోత్కచుడు… ఇదీ భారతంలోని కథ… మరి హిడింబ అనే సినిమా కథకూ ఈ భారత కథకూ లింక్ ఏమిటి..? ఏమీ లేదు… ఈ సినిమా కథలోనూ నరమాంస భక్షకులుంటారు… ఆ హిడింబ కథలోనూ నరమాంస భక్షకులుంటారు… అదొక్కటే పోలిక… మరి […]
అక్షయ్ కుమార్ సినిమాపై ఆదిపురుష్ దెబ్బ… భయపడుతున్న సెన్సార్…
మొత్తానికి ఆదిపురుష్ భారీ వ్యయం, భారీ ఫ్లాప్ దేశంలోని సినిమా నిర్మాతలందరికీ ఓ పాఠం నేర్పింది… తలాతోకా లేని పిచ్చి డైలాగులతో, సీన్లతో, వేషధారణలతో ఓ చెత్తా గ్రాఫిక్ సినిమాను ప్రజెంట్ చేస్తే ఈ దేశ ప్రేక్షకులు ఎలా రియాక్టవుతారో స్పష్టంగా చెప్పింది… కొందరు జాతీయవాదులు అనవసర ప్రేమతో సినిమాను చూడండీ, చూడండీ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసినా సరే ప్రేక్షకులు పట్టించుకోలేదు… చివరకు అలా అభిమాన ప్రచారాన్ని చేసిన ప్రేక్షకులు సైతం ఛీకొట్టేశారు అంతిమంగా… […]
అమ్మకానికి హాట్‌స్టార్… కాదంటే ఏదైనా బలమైన గ్రూపుతో పొత్తు…
హాట్ స్టార్ – వాల్ట్ డిస్నీ తెలుసు కదా… ఓటీటీ, పలు భాషల్లో సినిమాల రిలీజ్, వెబ్ సీరీస్, వీడియో ఆన్ డిమాండ్… చాలా పాతుకుపోయింది వినోదరంగంలో… ఇప్పుడిది మాంచి బలమైన మూలాలున్న జాయింట్ వెంచర్ భాగస్వామి కోసం అన్వేషిస్తోంది… అసలు వీలయితే అమ్మేయాలని అనుకుంటోంది మంచి పార్టీ దొరికితే… విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఓ నివేదిక ప్రకారం… ఈ ప్రయత్నాలు చాలా ప్రాథమిక దశలోనే ఉన్నయ్… ఇంకా ఏ […]
వెండి తెరపై వెలగబోయే సితార… తల్లి వేయించే అడుగులు అటువైపేనా..?!
మిత్రుడు Rajasekhar Reddy… రాసిన ఓ పోస్టు చదువుతుంటే… అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల సినిమాల్లోకి రాకుండా, హీరోయిన్గా చేయకుండా అభిమానులు అడ్డుపడిన తీరు గుర్తొచ్చింది… ఫ్యాన్స్ అభిప్రాయానికి తలొగ్గిన కృష్ణ బిడ్డను సినిమాల్లోకి రానివ్వలేదు… కానీ ఓ హీరోయిన్ నమ్రతను తన కొడుకు మహేశ్ పెళ్లి చేసుకోకుండా మాత్రం కృష్ణ అడ్డుకోలేదు… ఇష్టమో, అయిష్టమో గానీ మహేశ్ నిర్ణయానికి సమ్మతించాడు… ఫ్యాన్స్ కూడా పెద్దగా వ్యతిరేకించలేదు… ఇప్పుడు మహేశ్ కూతురు సితారను భావి హీరోయిన్గా […]
హడలగొట్టే భయంకరంగారావు… హాయిగొలిపే టింగురంగారావు…
నట చిరస్వీ…. రంగారావు ఎస్వీ…. జులై 18 ఎస్వీఆర్ 49 వ వర్ధంతి… నట యశస్వి ఎస్వీ రంగారావు నటనలో నిజంగా యశశ్వినే. ఆయన పరమపదించి నలబై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యింది. 1974 లో ఇదే రోజున కన్నుమూశారు. ఇప్పటికీ ఆయన పాత్రలు చిరస్థాయిగా నిలుస్తున్నాయి. ఆయన నటనకు ఈ తరం సైతం ముగ్దులవుతున్నారు. అనేక పాత్రలను అవలీలగా పోషించిన రంగారావును స్మరించుకుంటూ డాక్టర్ పురాణపండ వైజయంతి రచన ఇది… స్వర్గలోకం సందడిసందడిగా ఉంది. చిత్రమేమిటంటే స్వర్గంలో […]
Narsapalle Song… ఒకే పాట 2 గొంతుల్లో, 2 సినిమాల్లో… ఒకటి చిరంజీవిది…
నర్సపల్లే… ఈ ఫోక్ సాంగ్ ఎంత పాపులరో తెలుసు కదా… యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్… పాట పాడిన కనకవ్వ అకస్మాత్తుగా స్టార్ అయిపోయింది… పలు టీవీ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొంది… మంగ్లితో కూడా కలిసి పాడింది… ఇప్పుడు తెలంగాణ పాట మీద కదా ఇండస్ట్రీ కన్ను… సరే, దాన్ని అలాగే తీసుకుని వాడుకుంటే పర్లేదు… కానీ తెలుగు ఇండస్ట్రీ తెలంగాణ పాటను అలా ఎందుకు స్వచ్ఛంగా ఎందుకు ఉంచుతుంది..? చిరంజీవి భోళాశంకర్ సినిమా వస్తోంది కదా… అందులో […]
పాపం పసివాడు సినిమా గుర్తుందా..? ఐతే ఇది చదవండి ఓసారి…
Bharadwaja Rangavajhala…… విరామచంద్ … టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టారరుల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన దేవుడు చేసిన మనుషులు . ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచీ వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. మన పాపులర్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ ఆయనకు సమీప బంధువు. వి.రామచంద్రరావు సుదీర్ష సహాయ దర్శకత్వ అనుభవం తర్వాత […]
ఓహ్… ప్రభాస్ ప్రాజెక్ట్-కే సినిమాలో కే అంటే ఆ మహాభారత పాత్రా..?!
‘‘ఒక సైంటిఫిక్ ప్రపంచం… మానవాళికి ఓ పెద్ద విపత్తు సంభవిస్తుంది… మహాభారతం నుంచి కర్ణుడిని ఎత్తుకొస్తారు… భూమండలాన్ని రక్షిస్తారు… అదే ప్రాజెక్ట్ కే… అంటే కర్ణ…’’ ఇదీ ఆ సినిమా కథ అట… ఒకవైపు అమితాబ్ బచ్చన్, మరోవైపు కమల్ హాసన్… హీరో ప్రభాస్, హీరోయిన్ దీపిక పడుకోన్… దిశా పటాని… సూర్య కూడా అంటున్నారు గానీ డౌట్ ఫుల్… దేశం యావత్తూ అభిమానించే ఈ అతిరథ తారాగణం కొలువు తీరే సినిమా అంటే ఏమేరకు ఎక్స్పెక్టేషన్స్ […]
ఆ కలం కదిలితే హిట్టే… తెలుగు సినిమా మహామహులందరికీ ఇష్టుడు…
Bharadwaja Rangavajhala……… కాబట్టి మిత్రులారా … ఇప్పుడు మనం దాట్ల వెంకట నరసరాజు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న ఆయన జయంతి. కె.వి.రెడ్డి విజయా బ్యానర్ లో పాతాళబైరవి తీసిన తర్వాత వాహినీకి పెద్దమనుషులు కమిట్ అయ్యారు. పింగళి విజయాలో రచయితగా జీతానికి చేరడంతో గత్యంతరం లేక చక్రపాణి అనుమతి కోరారు. ఆయన ఇవ్వలేదు. మీరు రచయితను ఇవ్వకపోతే నేను సినిమా తీయలేనా అని బెజవాడ నుంచి ఓ కొత్త రచయితను తీసుకువచ్చారు. ఆయన పేరు డి.వి.నరసరాజు. […]
వైష్ణవి చైతన్య… ఎక్కడి టిక్‌టాక్ వీడియోలు… ఎక్కడి సినిమా హీరోయిన్ చాన్స్…
ఆమే… అవును, ఆమే… వైష్ణవి చైతన్య… ఎందుకు లేరు తెలుగులో..? సరిగ్గా పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయాలే గానీ తెరపై బాగా రాణించగల సత్తా మన తెలుగమ్మాయిల్లో ఎందుకు లేదు..? ఉంది… కాకపోతే మన నిర్మాతలకు, డైరెక్టర్లకు కనబడి చావరు… వాళ్లకు ఎంతసేపూ తెల్లతోలు, ఎక్స్పోజింగ్, కమిట్మెంట్లు కావాలి… తెల్లతోలు తారలకు నటన రాకపోయినా పర్లేదు, పాత్ర ఎలా ఉన్నా పర్లేదు, డబ్బు అడిగినంత ఇస్తే సరి… ఈ అమ్మాయే చూడండి… విజయవాడ… వైష్ణవి… అల వైకుంఠపురంలో […]
కాస్త అధిక శృంగార రసం… నర్తకి అనూరాధకు చిరంజీవితోపాటు పేరొచ్చింది…
ఇందాకే ఎవరో చెప్తుంటే విన్నాను … చిరంజీవి మగమహారాజు సినిమా విడుదలై నలభై ఏళ్లు అయ్యిందట. ఆ సినిమా విడుదలైనప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. అప్పటి పీపుల్స్ వార్ లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలో ఉన్నాను. విశాఖ నుంచీ నెల్లూరు వరకూ బెంగుళూరు మద్రాసు అప్పుడప్పుడు నాగపూర్ … నాగపూర్ లో సరోజ్ థియేటర్ బాగా గుర్తు. ఇలా దాదాపు రైళ్లల్లోనో బస్సుల్లోనో లారీల్లోనో బతికేస్తున్న రోజులవి. అలాంటి సమయంలో ఈ మగమహారాజు విడుదలైంది. నేను […]
- « Previous Page
- 1
- …
- 47
- 48
- 49
- 50
- 51
- …
- 117
- Next Page »