. మంచు లక్ష్మి వర్సెస్ ఆ జర్నలిస్టు కథను కాసేపు పక్కన బెడితే… ఆమె ప్రధాన పాత్రలో నటించిన దక్ష, ది డెడ్లీ కాన్స్పరసీ సినిమా ఎలా ఉంది..? చాన్నాళ్లయింది కదా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా రాక… మరి దీని సంగతేమిటి..? పైగా సొంత సినిమా… లక్ష్మి మంచి నటి, అందులో డౌట్ లేదు… అది వదిలేసి మిగతావి చెప్పుకుందాం… ఈ సినిమా విషయంలో ఆమె చేసిన ప్రాథమిక తప్పు ఏమిటంటే… సన్నాఫ్ ఇండియా […]
లచ్చక్క అంత తేలికగా వదలదట..! ఈ జర్నలిస్టుపై ఫిర్యాదు..!
. నిజానికి మన తెలుగు ఫిలిమ్ జర్నలిస్టులకు సంబంధించి ఇది చిన్న వార్తేమీ కాదు… తమ విపరీత ధోరణులతో ఇండస్ట్రీ వాళ్లకు జర్నలిస్టులు షాకులు ఇస్తుంటే మంచు లక్ష్మి అలియాస్ కంచు లక్ష్మి ఓ షాక్ ఇచ్చింది… రీసెంట్ వివాదం తెలుసు కదా… మూర్తి అనే సినిమా జర్నలిస్టు ఆల్రెడీ పలు వివాదాలతో అందరికీ పరిచయమే… మొన్న ఓ ఇంటర్వ్యూలో 50 ఏళ్ల మహిళ, పన్నెండేళ్ల కూతురున్న తల్లికి డ్రెస్ సెన్స్ ఉండాలి కదా, మిమ్మల్ని చూసి […]
ఆస్కార్‌కు మన హోమ్‌బౌండ్ సినిమా… అసలేమిటీ ఈ కథాకమామీషు..!
. “హోమ్‌బౌండ్” సినిమా భారతదేశం నుంచి 2026 ఆస్కార్ “Best International Feature Film” కేటగిరీలో అధికారికంగా ఎంపికయ్యింది… ఈ నిర్ణయం 12 మంది సభ్యులతో ఉన్న సెలక్షన్ ప్యానల్ తీసుకుంది… అసలు ఏమిటి ఈ సినిమా..? 2020లో న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ‘Taking Amrit Home’ అనే ఆర్టికల్ ఆధారంగా రాసుకున్న రియల్ స్టోరీ… పెద్ద పేరున్న దర్శకుడేమీ కాదు… నీరజ్ ఘైవాన్… షార్ట్ ఫిలిమ్స్, అంథాలజీ ఫిలిమ్స్, టీవీ సీరియల్స్ … అవీ ఎక్కువేమీ కాదు… […]
కృష్ణ గారడీ ఏమీ లేదు… అంతా పక్కా టైం పాస్ పల్లీబఠానీ…
. Subramanyam Dogiparthi ….. నిజంగానే గారడీ . కృష్ణ , విజయ బాపినీడుల గారడీ . ఫక్తు కమర్షియల్ మాస్ మసాలా గోలగోల ఎంటర్టయినర్ . ఇలాంటి కధలను నేయటంలో విజయ బాపినీడు సిధ్ధహస్తుడు . ఫేమిలీ సెంటిమెంట్+ క్రైం+ ఏక్షన్+ కావలసినంత కామెడీ . వెరశి 1986 లో వచ్చిన వినోదాత్మకం చిత్రం ఈ కృష్ణ గారడీ . అగ్నికి వాయువు తోడయినట్లు ఈ సినిమాను కాశీ విశ్వనాధ్ డైలాగులు కూడా బాగానే నడిపించాయి […]
సేమ స్టోరీ… సేమ్ ప్రచారం… సేమ్, అప్పట్లో శ్రీదేవి… ఇప్పుడు దీపిక…
. సేమ్… సేమ్ అదే కథ… అప్పట్లో శివగామి పాత్రలో శ్రీదేవిని తీసుకోవాలని అనుకుని, తరువాత రమ్యకృష్ణను తీసుకుని… ఏయే సాకులతో శ్రీదేవిని దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోెభు బదనాం చేశారో… అచ్చు అలాంటివే కారణాలు ఇప్పుడు దీపిక పడుకోన్ మీద కల్కి నిర్మాతలు చెబుతున్నారు… సీన్ రిపీట్… పారితోషికం ఎక్కువ అడిగింది… వర్కింగ్ టైమ్ షెడ్యూల్ తనకు అనుకూలంగా అడ్జస్ట్ చేయాలంది… తనతో వచ్చే టీమ్‌కు సకల స్టార్ సౌకర్యాలు డిమాండ్ చేసింది… ఇవే కదా […]
గెలిచానని నవ్వనా… ఏడ్వనా… మనసా కవ్వించకే నన్నిలా..!
. మంచి పాటలు అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ కొన్ని వస్తున్నాయి… అంటే కాస్త పాత్రోచిత, సందర్భోచిత, సాహిత్య విలువలు అరకొరగా అయినా సరే ఉండేవి… కానీ గతమ్ము మేలు వర్తమానముకన్నన్ అన్నట్టుగా… పాత సినిమా గీతాల రచయితలు ఆయా పాత్రల్ని, సందర్భాల్ని ఎలివేట్ చేస్తూనే కాస్త సాహిత్యపు వాసనలకు ప్రయత్నించేవాళ్లు… గుద్దుతా నీయవ్వ గుద్దుతా వంటి పాటలు అప్పుడూ ఉన్నయ్… జామచెట్లకు కాస్తాయి జామకాయలు వంటి అర్ధరహిత ప్రేలాపనలు ఇప్పుడూ ఉన్నయ్… ఇదెందుకు గుర్తొచ్చిందంటే..? అనుకోకుండా యూట్యూబ్‌లో […]
రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
. మరో కొత్త వివాదం… దీపిక పడుకోన్ అగ్రతార బాలీవుడ్లో… అందుకే బాగా చర్చనీయాంశం… ఆల్రెడీ స్పిరిట్ అనే సినిమా నుంచి వంగ సందీప్ రెడ్డి దీపికను తొలగించి, తన యానిమల్ ఫేవరెట్ స్టార్ తృప్తి దిమ్రిని పెట్టేసుకున్నాడు… ఇది ప్రభాస్ సినిమా… ఏమైంది..? ఎందుకు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు రకరకాలు… రెమ్యునరేషన్, షూటింగ్ టైమ్స్ మొదలుకొని… అప్పట్లో శ్రీదేవి శివగామి పాత్ర పోషణకు కోరినట్టు ఏవేవో గొంతెమ్మ కోరికలూ కావచ్చు… ఏమో, కొత్తగా తల్లినైన నాకు […]
డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
. అరె, ఇతర సిమిలర్ రియాలిటీ షోలు చెడిపోతుంటే, మేం మాత్రం ఎందుకు చెడిపోవద్దు, మనమూ భ్రష్టుపట్టిపోదాం అన్నట్టుగా ఉంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో వర్తమాన వ్యవహార శైలి… రాబోయే ఎపిసోడ్ బాపతు ప్రోమో అదే చెబుతోంది… థమన్ భయ్యా, కాస్త తమాయించుకో… సరే, ముందుగా ఓ విషయం… పవన్ కల్యాణ్ రాబోయే సినిమా ఓజీకి బెనిఫిట్ షో ధర 1000 రూపాయలు అట… ఫ్యాన్స్ నుంచే ఉల్టా దోచుకోవడం… పైగా టికెట్ రేట్ల […]
చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
. Subramanyam Dogiparthi … శోభన్ బాబు , జయసుధ అదరగొట్టేసారు . తల్లిదండ్రుల్ని నిరాదరించే బిడ్డలు , మోసం చేసే బిడ్డలు , నడిరోడ్డుపై నిల్చోబెట్టే బిడ్డలు కలియుగంలో , ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో చాలా మామూలు . అలాంటి కధాంశాల మీద చాలా సినిమాలే వచ్చాయి . ఈ సినిమా కధాంశాన్ని ఓ గొప్ప మలుపుతో , ముగింపుతో నేసారు దాసరి . ఆదర్శవంతుడైన ఓ స్కూల్ మాస్టారు తన ముగ్గురు కుమారులను బాధ్యత […]
మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్ సెన్స్ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
. మన తెలుగు సినిమా జర్నలిస్టుల సంగతి తెలిసిందే కదా… అఫ్కోర్స్, అన్ని భాషల సినిమా జర్నలిస్టులూ అంతే అనుకొండి… అప్పుడప్పుడూ మనవాళ్లు వేసే ప్రశ్నలు ఎంత హాస్యాస్పదంగా మన పరువే ఎలా తీస్తుంటాయో మనం చెప్పుకున్నాం కదా పలుసార్లు… కానీ పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతల జోలికి పోరు… చిన్న నటులు, చిన్న నిర్మాతలపైనే మన ప్రతాపం… మంచు మోహన్‌బాబు వంటి పెద్దతలకాాయల జోలికి వెళ్లమనండి… నో… నెవ్వర్… తమకు సంబంధం లేని అంశంలో వేణుస్వామిపై […]
విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
. Bharadwaja Rangavajhala… బాపు రమణలు కృష్ణ ఇంకా నటశేఖరగానే ఉండగా తీసిన కృష్ణావతారం సినిమా గుర్తుంది కదూ… ఆ సిన్మా తమిళంలో వచ్చిన రాజాంగంకు రీమేకు. ఆ సిన్మా హీరో వాగై చంద్రశేఖర్. డైరెక్టర్ శక్తి. కృష్ణావతారం 1982 లో రిలీజ్ అయ్యింది. రాజాంగం 1981 రిలీజ్. యంగ్ హీరో చంద్రశేఖర్ చేసిన కారక్టర్ ను హీరో కృష్ణకు అడాప్ట్ చేయడానికి రమణ గారు పెద్దగా కష్టం పడలేదు. అదే ఎర్ర చొక్కా, గళ్ళ లుంగీ. శ్రీదేవి […]
వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
. Mohammed Rafee …. వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… భానుమతి ఏమన్నారంటే! బొమ్మరాజు భానుమతి..! హీరోయిన్ కాదు, అప్పట్లో హీరో ఆమె..! సినిమా ఇండస్ట్రీని హడలెత్తించిన ఏకైక మహిళా నటీమణి..! మిస్సమ్మ డేట్స్ కుదరక ఆవిడ వదిలేస్తే, ఇండస్ట్రీ కి సావిత్రి వచ్చి మహానటి అనిపించుకుంది..! మిస్సమ్మలో భానుమతి నటించి ఉంటే సావిత్రి అనే మహానటికి అవకాశం వచ్చి ఉండేదా..? భానుమతి పుట్టింది ఒంగోలు దగ్గరలో దొడ్డవరం! తన 13వ యేట వర విక్రయం […]
భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?
. Subramanyam Dogiparthi …. మరో జస్టిస్ చక్రవర్తి సినిమా . ఆ సినిమాలో నేరం నుంచి విముక్తి కలిగినా చేసిన నేరానికి కోర్ట్ హాల్లో కుప్పకూలిపోతారు . ఈ బ్రహ్మరుద్రులు సినిమాలో నేరం చేసి పోలీసులకు లొంగిపోతారు . లొంగిపోవటంతో సినిమా ముగుస్తుంది . అశ్వినీదత్ నిర్మాతగా కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో 1986 నవంబర్‌లో వచ్చింది ఈ సినిమా . న్యాయ పరిరక్షణలో స్వంత బావకే ఉరిశిక్షను విధించే జడ్జిగా , చెల్లెలు చేత శాపనార్థాలు […]
చలి అంటే లెక్కేలేని ఆయన… హఠాత్తుగా బిర్ర బిగుసుకు పోయాడు…
. Devi Prasad C …. డిసెంబర్ నెలలో కులుమనాలి మంచుకొండల్లో “దేవి” సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒంటిమీద ధరించిన ఊలు కోట్లు, మంకీ క్యాప్‌లు, గ్లౌజ్‌లు, రబ్బరు షూస్‌ని చీల్చుకుని మరీ శరీరాల్లోకి దూరి ఎముకల్ని కొరికేస్తోంది చలి. వెళ్ళిన మొదటిరోజు మంచులో దొర్లి పాటలు పాడిన హీరోలను తల్చుకుంటూ, ఆ వెండి కొండల నడుమ మేమూ హీరోల్లా ఫీలైపోయి మంచుముద్దలు విసురుకుంటూ ఆడుకున్నాము. రెండోరోజునుండే తిరిగి వెళ్ళబోయే 10 వ రోజు ఎప్పుడొస్తుందా అనుకుంటూ రోజులు […]
నిజ జీవిత తలపై రాజశేఖర్ ‘తలంబ్రాలు’… షీరోయిక్ పాత్ర…
. Subramanyam Dogiparthi…. మరో లేడీస్ సెంటిమెంట్ పిక్చర్ ఈ తలంబ్రాలు . తలంబ్రాలు అనే టైటిల్ కన్నా ఆడది తలచుకుంటే వంటి ఇంకేదో టైటిల్ పెట్టి ఉంటే ఇంకా ఆప్ట్‌గా బాగుండేదేమో ! సక్సెస్ అయింది కాబట్టి తలంబ్రాలే కరెక్ట్ అని తేల్చాల్సి ఉంటుంది . సినిమాకు షీరో జీవితే . తమిళంలో అప్పటికే అరంగేట్రం చేసి ఉన్న జీవితకు తెలుగులో మాత్రం ఇదే మొదటి సినిమా . మొదటి సినిమాలోనే షీరో పాత్ర లభించటం […]
నాటకాలు, సినిమాలు… రచన, నటన… విసు ఓ తమిళ దాసరి…
. Subramanyam Dogiparthi …. మనకు దాసరి నారాయణరావు ఎలాగో తమిళ నాటక , సినిమా రంగాలకు విసు అలాంటి వాడు . అయితే దాసరి విజయాలు విసు విజయాల కన్నా చాలా చాలా ఎక్కువ . విసు తమిళంలో చాలా నాటకాలను వ్రాసారు , వేసారు , వేయించారు . కొన్నింటిని సినిమాలుగా తీసారు , నటించారు కూడా . ఆ వరుస లోనిదే తిరుమతి ఒరు వెగుమతి అనే నాటకం . ఆ నాటకాన్నే అదే […]
వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…
. Subramanyam Dogiparthi ….. జమజచ్చ . ఆ జమజచ్చ చుట్టూ నేయబడ్డ కధ . 1+4 సినిమా . వంశీ మార్క్ సినిమా . ఈ లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ అయిఉండకపోతే చచ్చిపోయేవాడిని అని ఒక ప్రోగ్రాంలో రాజేంద్రప్రసాదే చెప్పాడు . మన తెలుగు ప్రేక్షకులకు రాజేంద్రప్రసాదుని మిగిల్చిన అల్లరి గోల సినిమా ఇది . 1986 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా రాజేంద్రప్రసాద్ , వంశీ కెరీర్లలో ఓ మైలురాయిగా మిగిలి పోయిన […]
‘‘నేనెందుకు బాధపడాలి… బాధపడితే శోభన్‌బాబు పడాలి గానీ…’’
. Mohammed Rafee …. నిన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు వర్ధంతి… దర్శకుడు శివ నాగేశ్వరరావు నాతో కృష్ణంరాజు గురించి చెప్పిన ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్న! కోనసీమలో షూటింగ్! అప్పట్లో ఇప్పటిలా ఫెన్సింగ్ అంటూ ఏమీ లేదు. కేవలం పురికొస తాడుతో ఆ షూటింగ్ ఏరియా లోపలకు జనం రాకుండా కడతారు. ఎవరైనా చూడటానికి వచ్చినా తాడు దాటి లోపలకు రాకూడదు. షూటింగ్ కు ఇబ్బంది! షూటింగ్ లో ఒక అభిమాని తాడు దాటుకుని లోపలకు వచ్చి […]
Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్పుట్…
. తేజ సజ్జ… ఈ ఒకప్పటి బాలనటుడు హను-మాన్ సినిమాతో హీరోగా ఓ మెట్టు ఎక్కాడు… పాన్-ఇండియా ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు… ఇప్పుడు మిరాయ్ సినిమాతో మరో మెట్టు ఎక్కి, తన కెరీర్‌కు మరికొంత బూస్టప్ ఇచ్చుకున్నట్టే… (నటన సంగతి ఎలా ఉన్నా… మొన్నామధ్య ఎవరో విలేకరి సినిమాల్లో మతం గురించి వేసిన ప్రశ్నకు తేజ మంచి పరిణత జవాబు ఇచ్చిన తీరు నచ్చింది…) అఫ్కోర్స్, ఇంకాస్త నటనలో సాధన అవసరం అనిపిస్తుంది అక్కడక్కడా… కానీ ఈ సినిమా […]
పెద్ద థ్రిల్ ఏమీ లేదు… సినిమా మొత్తం చూడాల్సి రావడమే ఓ హారర్…
. పదకొండేళ్లు… పదకొండు సినిమాలు… ఈరోజుకూ నటన బేసిక్స్ నేర్చుకుంటూనే ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్… సినిమాల్లోకి ఎంట్రీ వరకే సినిమా కుటుంబనేపథ్యం పనిచేస్తుంది గానీ నిలదొక్కుకోవడానికి స్వయంకృషి, సాధన అవసరమనీ, దానికితోడు పిసరంత అదృష్టం కూడా కావాలని చెప్పడానికి మరో ఉదాహరణ… లాంగ్ షాట్స్ ఎలాగోలా కవర్ చేసినా… క్లోజప్ షాట్స్‌లో తేలిపోతారు చాలామంది నటులు… భావోద్వేగాలను పలికించే ఫ్లెక్సిబుల్ మొహం, సాధన అవసరం… పదేళ్లు దాటినా ఈరోజుకూ ఇదీ తన సినిమా అని చెప్పుకోవడానికి ఏమీ […]
- « Previous Page
- 1
- …
- 4
- 5
- 6
- 7
- 8
- …
- 112
- Next Page »


















