. Bharadwaja Rangavajhala … మార్క్సీయ వాక్యం … శాంతి అనేది రెండు యుద్దాల మధ్య విశ్రాంతి. అదే వాక్యం కొంచెం కామెడీగా రాజాధిరాజు సినిమాలో సైతాను నోటెంట వస్తుంది. అన్నట్టు శాంతంటే తెల్సా శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్లు అని … ముళ్లపూడి వెంకట్రమణ గారు పొలిటికల్ రైటర్ గా ముద్రేయించుకోడానికి పెద్దగా ఇంట్రస్టు చూపించలేదుగానీ … ఆయన తన సినిమాల్లో రాజకీయాలు బానే రాశారు … మన ఊరి పాండవులు చిత్రంలో […]
మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
. పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు పాట పెదవి విప్పింది. గుండె గొంతుకలో వేదన సుడులు తిరిగితే మౌన రోదనగా పాట పుట్టింది. ఆనందం అర్ణవమైతే మనసుకు రెక్కలొచ్చి పాట పుట్టింది. పుడితే ఉయ్యాల పాటనుండి పొతే మొయ్యాల్సిన పాటదాకా బతుకంతా పాటే. ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణాన్ని […]
ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
. Subramanyam Dogiparthi …….. సినిమాలన్నీ సందేశాలనో వినోదాన్నో ఇవ్వవు . సమాజంలో ఉండే ఒక రుగ్మతను లేదా సమస్యను తీసుకుని దానిని ప్రేక్షకులకు పరిచయం చేయటమో , వివరించటమో , జాగ్రత్తగా ఉండండని చెప్పటమో జరుగుతుంది . సాధారణంగా ఇలాంటి కధావస్తువుతో సినిమాలను బాలచందర్ ఎక్కువగా తీసారు . ఒకప్పుడు మన తెలుగు వారు కూడా తీసారు . 1970s నుండి ఇలాంటి సినిమాలు తీసేవారు తగ్గిపోయారు . మళ్ళా అలాంటి ప్రయత్నం 1980 s […]
అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…
. ఆమధ్య తెలుగు పాట గురించి… సందర్భోచితం గురించి… పాత్రోచితం గురించి… సహజత్వం గురించి… ఏదేదో చెప్పుకుంటూ ఆగిపోయినట్టున్నాం కదా… అంతేకదా మరి… ఎహె, ఊరుకొండి సార్, తెలుగు సినిమా పాటల్లో విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది..? సొట్టలు పడిన సత్తురేకు డబ్బాలో గులకరాళ్ల మోతలా ఓ ట్యూన్, చిత్రవిచిత్ర పదాల్ని అందులో పేర్చేయడం అంటారా..? అలాగని అన్నీ ఒకేగాటన కట్టేసి తీసిపారేయలేం కదా… సహజత్వం, పాత్రోచితం, సందర్భోచితాల గురించే తీసుకుంటే… పర్ సపోజ్, ఓ […]
ఓహో… కమలహాసన్ తాజా సంకుచితత్వం వెనుక అదా కథ…!?
. కన్నడం మీద పిచ్చి కూతలు కూసిన కమలహాసన్… మొత్తం కర్నాటక బాధపడినా… థూత్కరించినా… ఎందుకు సారీ చెప్పడం లేదు… చివరకు కర్నాటక ఫిలిమ్ ఛాంబర్ ఆ సినిమాను నిషేధించినా సరే, వైరమే కోరుకుంటున్నాడు తప్ప తల వంచడం లేదు దేనికి..? సంస్కారాన్ని, మర్యాదను మరిచి, రేప్పొద్దున తనకు కర్నాటకలో ‘వ్యాపార నష్టం’ వాటిల్లబోతుందని తెలిసీ స్పందించడం లేదు దేనికి…? హైకోర్టు కూడా నువ్వేమైనా చరిత్రకారుడివా..? క్షమాపణ చెప్పొచ్చు కదా అనడిగితే… కమల్‌హాసన్ తరఫు న్యాయవాది మేం […]
అన్ని సినిమాల్లోలాగే… పొలిటిషియన్సే విలన్లు… ఎదిరించేవాడే హీరో…
. Subramanyam Dogiparthi …….. అనగనగా ఓ యంపి గారు (గొల్లపూడి). జాతీయ జండాకు ఎన్ని రంగులంటే నాలుగు రంగులు అని చెప్పే ఓ మాజీ MLA (అల్లు రామలింగయ్య) యంపి గారికి తోక . తనకు తానే దేశ్ కీ నేతా అని కూడా చెప్పుకుంటూ ఉంటాడు . ఇద్దరూ కలిసి ఊళ్ళో అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు . వీళ్ళని ప్రతిఘటిస్తూ రాబిన్ హుడ్ పాత్రలో మన కథానాయకుడు (బాలకృష్ణ) ఉంటాడు . హీరో గారి అక్క […]
మాస్టర్లందరూ కలిసి వండిన ఓ మాస్టర్ పీస్.. ఇద్దరు..!
. సరిగ్గా రెండున్న దశాబ్దాలకు పూర్వం.. 1997. అది, కాచిగూడ తారకరామ సినిమా హాల్… ఫస్ట్ డే, ఈవినింగ్ ఫస్ట్ షో చూడాలని గట్టి పట్టుబట్టి ఓ సినిమా చూశాను. బిగ్ స్క్రీన్ పై ఎంజీఆర్, కరుణానిధి పాత్రలు ప్రత్యక్షమయ్యాయి. అందులో కరుణానిధి మినహా.. అప్పటికే ఎంజీఆర్ కన్నుమూశాడు. కానీ ఆ ఇద్దరూ.. ఇద్దరు సినిమా రూపంలో సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షమయ్యారు. తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ సమకాలీన రాజకీయాల్లో రెండు […]
వ్యక్తిగా తనపై బోలెడు అభ్యంతరాలు… కానీ సంగీతంలో అల్టిమేట్ ఇసై జ్ఞాని…
. Bharadwaja Rangavajhala……. వి… విలయ రాజా…. సంగీత సాగరాన్ని మధించి గీతామృతాన్ని ప్రపంచానికి పంచిన స్వర తపస్వి ఇళయరాజా. మ్యూజికల్ వర్డ్స్ తో … రాసే … పాటకు ఓ వాతావరణం సృష్టించడం వేటూరి లక్షణం. ఈ ఇద్దరి కాంబినేషన్ వర్ధిల్లిన ఎనభై, తొంభై దశకాల తెలుగు సినిమా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మన స్మృతి పథం నుంచి చెరిగిపోవు. కళాతపస్వి విశ్వనాథ్ తో శంకరాభరణం తర్వాత పూర్ణోదయా సంస్ధ నిర్మించిన చిత్రం సాగరసంగమం. నరుడి […]
అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
. జగదేక వీరుడు- అతిలోక సుందరి పైపైన చూస్తే ఏముంది అందులో అనిపిస్తుంది కదా… ఓ దేవకన్య, ఉంగరం పారేసుకోవడం, ఏదో మందు కోసం హిమాలయాలకు వెళ్లిన హీరోకు దొరకడం, ఆమె ఇక్కడే ఉండిపోవడం, ఓ మనిషితో ఓ దేవకన్య ప్రేమ, ఓ విలన్ మాంత్రికుడు… కానీ ఆ కథను తెరపై బాగా పండించడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఉపయోగపడింది… చిరంజీవి స్టార్‌డం, శ్రీదేవి సోయగాలు (అచ్చం దేవకన్యలా)… పాటలు… ఇవీ సినిమాను రక్తికట్టించాయి… […]
మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
. మీడియా చెవుల్లో పూలు పెట్టడం, పిచ్చోళ్లను చేయడం చాలామంది సినిమా సెలబ్రిటీలకు అలవాటే… అఫ్‌కోర్స్, ఉన్నవీ లేనివీ రాసి సెలబ్రిటీలను పిచ్చోళ్లను చేయడం కూడా మీడియాకు అలవాటే… కానీ రీసెంటుగా శ్రీలీల కూడా మీడియాకు ఝలక్కులు ఇస్తోంది… రీసెంటుగా ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసింది… బిగ్ డే, కమింగ్ సూన్ అని రాసింది… అన్నీ ఓ పెళ్లి ఎంగేజ్‌మెంట్ తరహా ఫోటోలు అవి… సో, ఇంకేముంది..? శ్రీలీల పెళ్లవుతుందోచ్ అని […]
…. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
. Subramanyam Dogiparthi …….. కంచుకాగడా… 40 సంవత్సరాల కింద ఆనాటి రాజకీయ , సామాజిక పరిస్థితులను టార్గెట్ చేస్తూ తీయబడిన ఈ సినిమా ప్రస్తుత పరిస్థితులకు కూడా , కాదు కాదు , ప్రస్తుత పరిస్థితులకే ఎక్కువ సూటవుతుంది . సర్వకాల సర్వావస్థల యందు , సర్వ్యావస్థల యందు సెట్టయ్యేలా తీసారు . ఈ సినిమా కధారచనలో పాలుపంచుకున్న మహారధి , సత్యమూర్తి , కోదండరామిరెడ్డిలను గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి . అంతకు మించి AK 47 […]
‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
. రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడకపోతేనే వార్త… ఈమధ్య ఎవరు అతిథిగా పిలిచినా సరే వెళ్లి, ఏదేదో మాట్లాడుతున్నాడు… ఏదో అయ్యింది తనకు… అందుకే తేడా కొడుతోంది… రాను రాను ఎవరు తనల్ని ఏ ఫంక్షన్‌కు పిలవాలన్నా సరే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలి, లేదా ఏదో ఓరకంగా పిచ్చి కూతలతోనైనా ప్రచారం తీసుకువస్తున్నాడు కదా అనుకుంటే తప్ప… తనొక మంచి వక్తను అనే భ్రమల్లో బతుకుతున్నాడు ఫాఫం… అయిదు తరాల నటులతో పనిచేశాను, ఆఫ్టరాల్ వీళ్లంతా ఎంత […]
డార్క్ వెబ్ అంటే… అది ఇల్లీగల్ కాదు, క్షుద్రమూ కాదు నానీ…
. నిజానికి హిట్-3 సినిమా థియేటర్‌లో చూడాలనే అనుకున్నాను… నాని ఫ్యాన్‌ను కదా… అఫ్‌కోర్స్, కొన్నాళ్లుగా దారితప్పినా సరే… కానీ విపరీతమైన హింస ఉంటుంది, మీ ఇష్టం అని తనే తేల్చిపారేశాడు కదా.,. పిల్లలు చూస్తే దడుసుకుంటారు అని కూడా గొప్ప టేస్టుతో ముందే చెప్పాడు కదా… ఆ నెత్తుటి కమురు వాసన ఎందుకులే అని అవాయిడ్ చేశాను… సరే, ఓటీటీలో వచ్చింది కదా… మరీ భీకరంగా ఉన్నచోట చకచకా మూవ్ చేసి, అసలు నాని చెప్పినంత […]
హమ్మో… ఆ పాత నాగదుర్గ కాదు… ‘దారిపొంటచ్చి’ దడపుట్టించింది…
. నిజం… ఏ సినిమా పాటలూ సాటిరావు అనిపిస్తుంది కొన్నిసార్లు… ఐదారేళ్లుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్మురేపుతున్న సంగతి చెప్పుకున్నాం కదా పలుసార్లు… సినిమాల్లో కూడా అవే పెట్టుకుంటున్నారు… వాటి మాటెలా ఉన్నా, ప్రైవేటు సాంగ్స్ మాత్రం విపరీతంగా జనంలోకి వెళ్తున్నాయి… నమ్ముతారా..? కోట్లల్లో వ్యూస్… ప్రత్యేకంగా సాంగ్ రాయించి, కాస్త ఖర్చు పెట్టి, సినిమాల్లో పాటలకన్నా బాగా చిత్రీకరిస్తున్నారు… అనేకమంది జానపద కళాకారులు రాణిస్తున్నారు… ఆ డీజే సౌండ్, బీట్ ధాటికి పాటలు సరిగ్గా […]
తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
. సూపర్ స్టార్ కృష్ణ జయంతి కదా నిన్న… తన గురించి ఏదో వెతుకుతూ ఉంటే… ఓ పాట కనిపించింది, వినిపించింది… ఫాఫం అనిపించింది… రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఓ సినిమా వచ్చింది 1976లో… నమ్మలేని విషయం ఏమిటంటే… దానికి దర్శకుడు బాపు… కాకపోతే పాటలు బాగుంటాయి… చిత్రీకరణలో కాదు, ట్యూన్లు, కంటెంటు… అందులోనూ రాకోయీ అనుకోని అతిథి పాట ఓ మరుపురాని పాటే… ఇది వింటుంటే మనసు పదే పదే మేఘసందేశం సినిమా […]
ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…
. Director Devi Prasad.C….. కోడిరామకృష్ణ గారు దర్శకుడైన తొలి నాళ్ళలో, తన సినిమాలు విడుదలైనప్పుడు, డిగ్రీ చదువుకొంటున్న ఓ అభిమాని “కోదాడ” నుండి రాసే ఉత్తరాల కోసం ఎదురుచూసేవారట. రంగురంగుల అక్షరాలలో సినిమాని అద్భుతంగా విశ్లేషిస్తూ హిట్టా ఫట్టా అనేది కూడా నిర్మొహమాటంగా రాసేవాడట. ఆ అభిమాని పేరు”కరణ్‌రాజ్”. తర్వాత కొన్నేళ్ళకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా గురువుగారి దగ్గర చేరినప్పుడే తను కూడా వొచ్చి చేరిపోయాడు. మితభాషి, అతి సున్నిత మనస్కుడు. అతని మాట […]
ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…
. Subramanyam Dogiparthi …. దర్శకేంద్రుడు NTRతో జస్టిస్ చౌదరి తీస్తే దర్శకరత్న ANRతో ఈ జస్టిస్ చక్రవర్తిని తీసారు … అందులో NTR , ఇందులో ANR ద్విపాత్రాభినయం చేసారు తండ్రీకొడుకులుగా . పెద్దపెద్దోళ్ళకు కూడా స్పర్ధ ఉంటుంది . తన తోటి వాడు సాధించినదానిని తానూ సాధించాలనే స్పర్ధే బహుశా దాసరి చేత ఈ జస్టిస్ చక్రవర్తిని తీయించి ఉంటుంది . ఆ స్పర్థ రాఘవేంద్రరావు, దాసరి మధ్య మాత్రమే కాదు… ఎన్టీయార్, ఏఎన్నార్ […]
‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్‌లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’
. 1997 ద్వితీయార్ధంలో నేను విజయవాడ వార్త రిపోర్టర్‌గా పనిచేస్తున్న సందర్భమది.. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈటీవీ, ఈనాడు పత్రికలకు ఎవ్వరూ సినిమా అడ్వటైజ్‌మెంట్స్ ఇవ్వకూడదంటూ నిర్ణయం తీసుకున్నారు… అప్పట్లో దాసరి వర్సెస్ రామోజీ వేడిగా నడిచేది కదా… తరువాత చాన్నాళ్లకు గానీ సద్దుమణగలేదు… సరిగ్గా ఆ నిర్ణయం తీసుకున్న రోజు సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు విజయవాడ ఐలాపురం హోటల్‌లో బస చేశారు. దాసరి నిర్ణయంపై అప్పుడు ఎఫ్‌డిసి చైర్మన్‌గానో, ‘మా’ గౌరవ అధ్యక్షుడిగానో (ఈ రెండింటిలో ఏదో […]
రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
. Shankar G ….. సినిమా హీరోగా స్థిరపడటానికి నటనే వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. సినిమా రంగంలో కొండంత నటన తెలిసినా అవగింజంత అదృష్టం ఉండాలంటారు కానీ కృష్ణ అనే నటుడుకి కొండంత అదృష్టమే అండగా ఉంది. నటుడి రూపం, నవ్వు, అందం, నడక, హీరోయిజం ఏదైనా కావచ్చు చూసేవాళ్ళను సమ్మోహితులను చేయటానికి. ఆ నటుడిని చూడటం ఒక వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనం అతడు నటించిన సినిమా కథ బావుందా లేదా అన్నది అనవసరం… […]
నాటి జతొజడ జమజచ్చ జంట… ప్లెయిన్, ఫెయిర్ మూవీ…
. రాజేంద్ర ప్రసాద్ ఏదో ఓ పాత్రలో నటిస్తూనేే ఉన్నాడు… చిన్నాచితకా పాత్రలతో సహా… కానీ అర్చన చాన్నాళ్లయింది తెర మీద కనిపించక… అప్పుడెప్పుడో లేడీస్ టైలర్ సినిమాలో జతొజడ, జమజచ్చ అంటూ అల్లరి చేశారు… డ్యూయెట్లు, రొమాన్స్ లేకపోయినా ఆ జంట అప్పుడు బాగానే అనిపించింది… మళ్లీ ఇన్నేళ్లకు, అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత… ముసలోళ్లయ్యాక మళ్లీ జతకలిశారు… వయస్సుకు తగిన పాత్రలే… ఇద్దరూ ఆ పాత్రలకు న్యాయం చేశారు… హుందాగా…! ఎమోషన్స్ బేస్డ్ […]
- « Previous Page
- 1
- …
- 5
- 6
- 7
- 8
- 9
- …
- 122
- Next Page »