ముందుగా క్షమాపణలు కోరుతున్నా… ఆ గలీజు భాషలోనే హెడింగ్ పెట్టినందుకు… మల్ల ఏం జెయ్యాలె, ఎవరి భాషల చెప్పితే వాళ్లకు సమజైతది…! చార్మి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అట… ఓ టీజర్ రిలీజ్ చేశారు… అందరూ ఓహో ఆహా అని మస్తు రాస్తున్నారు… హీరో రామ్ అట మాస్ యాక్షన్ సీన్లు కుమ్మిపడేశాడట, పాన్ ఇండియా మూవీ అట, దత్తు సంజయుడిని తెచ్చి పెట్టుకున్నారట, మరో బంపర్ హిట్ పక్కా అట… […]
మెహరీన్..! ఏమిటీ రచ్చ..? నీదే తప్పు…! ఎందుకీ వ్యాఖ్యలు..? ఆయ్ఁ
హీరోయిన్ మెహరీన్ పిర్జాదాదే తప్పు… ఎగ్ ఫ్రీజింగ్ గురించి అవగాహన కల్పించేలా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేయడం గురించి కాదు… ఆ పని మంచిదే… ఓ పాపులర్ నటి ఎగ్ ఫ్రీజింగ్ మీద కాస్త మహిళల్లో చైతన్యం పెంచే ప్రయత్నం గుడ్… ఎటొచ్చీ ఆ తరువాత పరిణామాలే… కొన్ని సైట్లు, యూట్యూబ్ చానెళ్లు ఎడాపెడా వార్తలు రాసేశాయి… ఏమనీ..? మెహరీన్ ఇదుగో ఇలా అవగాహన ప్రచారం చేసింది, అభినందనీయం, మహిళలూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని […]
ప్రతి సీనుకూ పద్యమో, శ్లోకమో, పాటో… మొత్తం 36… అందరూ అతిరథులే…
Subramanyam Dogiparthi….. మైరావణ + శ్రీకృష్ణ తులాభారం + శ్రీకృష్ణ పాండవీయం + శ్రీకృష్ణ రాయభారం = శ్రీకృష్ణ సత్య . అయితేనేం ! మూడు గంటలూ ఎన్టీఆరే కనిపించినా , బోర్ కొడితేనేగా …! రాముడిగా , వృధ్ధ రావణుడిగా , మహా విష్ణువుగా , కృష్ణుడిగా దర్శనమిస్తాడు ఈ సినిమాలో . యస్వీఆరుకి కూడా రెండు పాత్రలు . మైరావణుడు , దుర్యోధనుడు . ప్రముఖ దర్శకులు , NTR మెంటార్ కె వి […]
పుష్పరాజ్… జబర్దస్త్ బ్యాచ్ కమెడియన్ కాదు… తన లెక్కలే వేరు…
చాలామంది రాశారు… ముందుగా నమ్మలేదు… ఎక్స్‌లో నాగబాబు అధికారిక పోస్టే అని చూశాక ఆశ్చర్యం కూడా వేయలేదు… నాగబాబు ధోరణి అదే కాబట్టి… గతంలోనూ చూశాం కాబట్టి… కాకపోతే అల్లు అర్జున్ పేరు తీసుకోలేదు అందులో… ఐనా అందరికీ అర్థమైంది, నాగబాబు కోపపు ట్వీట్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అని… అందరూ అదే రాసుకొచ్చారు… అబ్బే, నేను జనరల్‌గా ట్వీటాను తప్ప, అల్లు అర్జున్‌ను ఉద్దేశించి కాదు అంటూ నాగబాబు ఖండించలేదు కాబట్టి ఖచ్చితంగా అది అల్లు […]
ఔనమ్మా… ఏవో కథలు ఉంటేనే కదా ఓ సినీ జంట విడిపోయేది…
రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులకు దరఖాస్తు చేసుకుని రెండేళ్లయిపోయింది… దాదాపు 18 సంవత్సరాల పెళ్లి బంధాన్ని తెంపేసుకున్నారు… ఈ రోజుల్లో విడాకులు పెద్ద విశేషం కాదు, కానీ సినీ సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే ఏ వ్యవహారమైనా జనాసక్తి కారణంగా ప్రముఖంగా వార్తల్లో నలుగుతుంది… అంత పెద్ద హైఫై కుటుంబంతో తన బంధాన్ని ధనుష్ ఎందుకు తెంపుకోవాలనుకున్నాడు..? ఇది ఈరోజుకూ మిస్టరీయే… వాళ్లు ఒకరిపైనొకరు చిల్లర విమర్శలతో బురద జల్లుకోలేదు… మా ఇద్దరికీ పడటం లేదు, […]
అలా కనిపించేవాడేమో గానీ… నాటి ఎన్టీవోడు మనసున్న మారాజే…
Bharadwaja Rangavajhala……. నర్రా రామబ్రహ్మంగారు గౌతమీ పిక్చర్స్ పేరుతో ఎన్టీఆర్ తో చాలా సినిమాలు తీశారు. మహామంత్రి తిమ్మరుసు, ఆలీబాబా నలభై దొంగలు, నిర్దోషి ఇలా… గౌతమీ పిక్చర్స్ వారి కార్యాలయం మద్రాసులో పింగళి నాగేంద్రరావుగారింట్లో ఉండేది. ఆయన కూడా పింగళి లాగే బ్రహ్మచారి. పింగళి నాగేంద్రరావుగారు మరణించే సమయంలో ఆయన దగ్గరున్న ఇద్దరిలో రామబ్రహ్మంగారు ఒకరు. రెండోవారు డి.వి.నరసరాజు. అప్పటికే పింగళి తన ఇంటిని ఘంటసాలకు అమ్మేశారు. ఇలా అమ్మడం మీద ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం […]
ఈమధ్య కాలంలో వచ్చిన క్షమించరాని సినిమా ఆదిపురుష్
Subramanyam Dogiparthi….. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా, పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిధి కాదా, అదే పరమార్ధం కాదా … పేరంటాలలో , పెళ్ళిచూపుల్లో వీర పాపులర్ అయిన పాట . 1971 లో బి ఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన సతీ అనసూయ సినిమాలో పాట ఇది . సతీ అనసూయ కథలో సతీ సుమతి కథ కూడా కలిసి ఉంటుంది . 1971 సినిమాలో అనసూయగా జమున , […]
ఈ విశేషమైన రోజున అమ్మలు చదవాల్సిన ఓ వాస్తవ కథ… హిర్కానీ బురుజు…
అప్పట్లో మరాఠీలో ఓ చిత్రం వచ్చింది… పేరు హిర్కానీ… నిజానికి అది రియల్ స్టోరీయే… కాకపోతే కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కథను ఇంకాస్త బరువుగా మలిచారు… ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్‌లో దొరుకుతుంది… విషయం ఏమిటంటే, అందరూ అమ్మ దినం గురించి, సారీ, ఇది కటువుగా ధ్వనిస్తోంది కదా, మాతృదినోత్సవం, మదర్స్ డే సందర్భంగా చాలా రాస్తున్నారు కదా… ఇది కూడా గుర్తు చేయాలనిపించింది… హిర్కానీ… పాలమ్ముకునే ఓ పల్లె పడతి… రాయగఢ్ కోట సమీపంలో ఉండేది… […]
రామాయణంపై మేధోహక్కులట… సాయిపల్లవి రామకథకు అడ్డంకులట…
ఒక వార్త… రణబీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీతగా నటించే రామాయణం సినిమా చిక్కుల్లో పడింది అని..! దాదాపు ఐదారువందల కోట్ల ఖర్చుతో భారీ ఎత్తున ప్రతిష్ఠాత్మకంగా తీయబోయే ఈ సినిమాకు నితిష్ తివారీ దర్శకుడు… రావణుడిగా నటించడంతోపాటు కన్నడ హీరో యశ్ ఈ సినిమాలో డబ్బు కూడా పెట్టుబడి పెడుతున్నాడట… ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారుల రెమ్యునరేషనే వంద కోట్ల దాకా ఉండనుందనే కథనాలు వచ్చాయి గానీ అందులో నిజానిజాలు ఎవరూ కన్‌ఫరమ్ చేయరు కాబట్టి […]
రాజమౌళి… ఈ దర్శకుడు మరో ఇరవయ్యేళ్లూ ఇక దొరక్కపోవచ్చు…
ఈమధ్య వరుసగా రాజమౌళి వార్తలు కనిపిస్తున్నాయి… అవన్నీ క్రోడీకరిస్తే రాబోయే 20 సంవత్సరాల వరకూ అసలు రాజమౌళి మరే కొత్త హీరోకు టైమ్ ఇవ్వడం గానీ, ఇంకో కొత్త సినిమా అంగీకరించడం గానీ ఉండబోవేమో… సరదాగా చెప్పుకున్నా సరే, రాజమౌళి దొరకడం అంత సులభం కాదు… పాత సినిమాల్ని కాపీ కొడతాడా..? చరిత్రకు వక్రబాష్యాలు చెబుతాడా..? అనే ప్రశ్నలు వేరు… వాటిని కాసేపు పక్కన పెడితే రాజమౌళిది తెలుగు ఇండస్ట్రీలో ఓ చరిత్ర… తాను చెప్పాలనుకున్న కథను […]
ఓ చుక్కా నవ్వవే… వేగులచుక్కా నవ్వవే… నావకు చుక్కానవ్వవే…
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా… అందానికి అందం ఈ పాట మొన్న ఒకరోజు మధ్యందిన మార్తాండుడు ఎండ ప్రచండంగా చల్లుతున్నవేళ హైదరాబాద్ ఇంట్లో బిసిబెళిబాత్, పెరుగన్నం తిని బండలు కూడా గుండెలు పగిలి ఏడవాల్సిన ఎండలకు పెట్టింది పేరైన విజయవాడ బయలుదేరాను. ఊరు దాటి బాటసింగారం బాట దాటగానే కనురెప్పలు వాటంతటవే పడిపోతున్నాయి. కునుకుపడితే మనసుకాస్త కుదుట పడుతుందని ఆత్రేయ సూత్రీకరించాడు కాబట్టి సీటు వెనక్కు వాల్చుకుని నిద్రలోకి జారుకున్నాను. లేచేసరికి నార్కట్ పల్లి బోర్డు కనిపిస్తోంది. కళ్లు నులుముకుని… […]
రివ్యూలు కూడా ఫార్ములాలోనే ఇమడాలా..? ఇలా రివ్యూలు రాయలేమా..?!
Priyadarshini Krishna….. ఇంతకుముందు చాలాసార్లు నేను అన్నాను, మళ్ళీ చెప్తున్నాను… సినిమా రివ్యూ అంటే సినిమాలోని ఇతివృత్తం లేదా కథని విశ్లేషించడం, పాత్రల పోకడను, దర్శకుడు ఆయా పాత్రలని మలిచిన తీరుని , ఆయా పాత్రలను పోషించిన నటుల నటనాచాతుర్యాన్ని చర్చించడం కాదు. ప్రేక్షకునికి ఆ సినిమాని పూర్తిగా పరిచయం చెయ్యడం. సినిమాలోని వివిధ విభాగాలు ఆ సినిమాలో ఎలా మెరుగైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి అనే అంశాలను చర్చించడాన్ని రివ్యూ అనాలి. ఇవాళ్టి వరకు తప్పడ్ సినిమాపై […]
సత్యదేవా హఠాత్తుగా ఏమైనది..? పర్‌ఫామెన్స్ మరీ ఇలా మారిందేమిటి…?!
సత్యదేవ్… నటనలో మెరిట్ ఉన్న బహుకొద్దిమంది తెలుగు హీరోల్లో ఒకడు… నో డౌట్… సరైన పాత్ర పడి, డిమాండ్ చేయాలే గానీ తన ఎఫర్ట్ మొత్తం పెట్టి న్యాయం చేయగలడు… చాన్నాళ్లుగా ఫ్లాపులు పడుతూనే ఉన్నా సరే ఈరోజుకూ తనకు అవకాశాలు వస్తున్నాయంటే విశేషమే… అఫ్‌కోర్స్, సినిమాను తను ఈజీగా లాగగలడు అనే నమ్మకమే కావచ్చు కూడా… ఇప్పుడు కృష్ణమ్మ అనే ఓ సినిమా వచ్చింది… మార్కెట్‌లో పెద్ద మంచి పేరున్న సినిమాలు ఏమీ లేవు… ఈ […]
ఆ తెలుగు టీవీ డిబేట్‌లాగే… ఈ ప్రతినిధి కూడా బభ్రాజమానం భజగోవిందం…
నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 సినిమా గురించి ఏదో రివ్యూ వంటి ఒపీనియన్ కూడా రాయాల్సి వస్తుందని అనుకోలేదు… దీనికి దర్శకుడిగా వ్యవహరించిన మూర్తి టిపికల్ టీవీ5 మార్క్ న్యూస్ ప్రజెంటర్… తన డిబేట్ల తీరు చూసినా, తనకు దీటుగాడు సాంబశివరావు తీరు చూసినా ఈ సినిమా గురించి పెద్ద భ్రమలేమీ ఉండనక్కర్లేదు… డిబేట్ ప్రజెంటర్ ఎలా ఉండకూడదో చెప్పడానికి మన తెలుగు చానెళ్లలో పలు కేరక్టర్లు సుప్రసిద్ధం… వీళ్లు నిజానికి మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలోనే ఉన్నారా..? […]
హీరో తలకు దెబ్బ.., మెమొరీ లాస్, డేటా కరప్ట్… మళ్లీ దెబ్బ, డేటా రికవరీ…
Subramanyam Dogiparthi…. దసరా బుల్లోడు జైత్రయాత్ర కొనసాగుతూ ఉండగానే విడుదలయి , వంద రోజులు ఆడిన చక్కటి సెంటిమెంటల్ , మ్యూజికల్ హిట్ 1971 లో వచ్చిన ఈ పవిత్ర బంధం సినిమా … అక్కినేని- వాణిశ్రీ జోడీలో వచ్చిన మరో గొప్ప సినిమా … కృష్ణంరాజు ఇంకా విలన్ గానే హీరో చేతిలో దెబ్బలు తింటూనే ఉన్నాడు అప్పటికి … కాంచనకు కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రే లభించింది ఇందులో… హీరోకి , హీరోయిన్ కి […]
హీరో మారువేషం అంటేనే అది… ప్రేక్షకులు తప్ప ఎవరూ గుర్తుపట్టరు…
Subramanyam Dogiparthi…. రైతుల కష్టాల మీద , కార్మికుల కష్టాల మీద , పేదల పాట్ల మీద సినిమాలు వచ్చే ఒకనాటి రోజుల్లో వచ్చిన సినిమాలు ఇవి . 1971 లో బి ఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన రైతుబిడ్డ సినిమాలో NTR , వాణిశ్రీలు జంటగా నటించారు . వంద రోజులు ఆడింది . ఇలాంటి కధాంశంతో మన తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి . ANR అర్ధాంగి , కృష్ణ పాడిపంటలు వగైరా . […]
ఇంట్రస్టింగే… ఓ స్టార్ హీరో వెంట సినిమా ఇండస్ట్రీ నడవడం లేదెందుకు…?
ఎక్కడో చదివినట్టు గుర్తు… పవన్ కల్యాణ్ మరీ జబర్దస్త్ రేంజ్ నాయకుడైపోయాడు అని… కారణమేందయ్యా అంటే… పిఠాపురంలో జబర్దస్త్ బ్యాచ్ కమెడియన్లే ప్రచారంలో కనిపిస్తున్నారు అని… సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా మద్దతు రావడం లేదు, ఇక చిరంజీవి చెప్పినట్టు తను అందరివాడు ఎలా అయ్యాడు అని ఆ వార్త ప్రశ్నించింది… తమ్ముడే కాబట్టి చిరంజీవి ఓ వీడియో సందేశం ఇచ్చాడు, అయిపోయింది… మర్యాదకు రాంచరణ్ కూడా దాన్ని షేర్ చేశాడు, ఒడిసింది ముచ్చట… నాగబాబుకు ఎలాగూ […]
ఆహా దిగ్దర్శకా… నిర్మాతకు పాదమర్ధనంపై ఎంత గొప్పగా చెప్పావయ్యా…
సరే, ఇండస్ట్రీ అంటేనే అది… కాళ్లావేళ్లాపడటం, కాళ్లు పట్టుకోవడం, కాళ్లు పట్టడం, కాళ్లతో తన్నించుకోవడం… కొందరు పెద్ద దర్శకులు, నిర్మాతలు, మరీ ప్రత్యేకించి హీరోలు… సెట్‌లో అలా కుర్చీలో కూర్చుని ఉంటాడు, లేదా సెట్‌లోకి అడుగుపెడతాడు… ఇంకేముంది..? ఒక్కొక్కడూ వచ్చి కాళ్లు మొక్కి తమ భక్తిప్రపత్తులను, విధేయతల్ని, వినయాన్ని, అణకువను ప్రదర్శించాలి… కాళ్లు మొక్కించుకునేవాడికి అది ఆభిజాత్య, ఆధిపత్య, ఆత్మాహం ప్రదర్శన… వాడికది కిక్కు… దొరికిందిరా సందు అనుకుని కొందరు అవకాశాల కోసం అక్కడే కూలబడి కాళ్లు […]
ఎంత మాటంటివి రానా..? యానిమల్ మూవీ అంత దరిద్రంగా ఉందా..?
‘యానిమల్’ సినిమా మీద నెగెటివిటీ ఈరోజుకూ వ్యాపిస్తూనే ఉంది… ఫాఫం, వంగా సందీప్ రెడ్డి… సమర్థించుకోవడానికి నానా పాట్లూ పడుతున్నాడు… ఎవరు ఆ సినిమా మీద నెగెటివ్ కామెంట్లు పాస్ చేస్తున్నా సరే వాళ్లపైనా సెటైర్లతో విరుచుకుపడుతున్నాడు… ఎదురుదాడి… అంతా యానిమల్ పాత్రోచిత ప్రవర్తనే… మొన్నామధ్య అమీర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం తను తీసిన లాపతా లేడీస్ లో యానిమల్ కేరక్టర్ మీద కొట్టినట్టుగా ఓ సీన్ పెట్టింది… దానికిక సందీప్ నుంచి కుయ్ […]
ఆ ఇద్దరూ తప్పిపోయారు… తమని తాము తెలుసుకున్నారు…
తప్పిపోయారు – తమని తాము తెలుసుకున్నారు….. లా పతా లేడీస్ ‘రోజంతా ఖాళీగానే ఉంటావుకదా!’ (పొద్దున్నే లేచి వంట, టిఫిను, గిన్నెలు, బట్టలు … అన్నిపనులూ చేసుకునే గృహిణులను భర్త, పిల్లలు, చుట్టాలు అనేమాట). ‘మంచి కుటుంబాల్లో ఆడవాళ్లు, తల, నోరు ఎత్తరు’ ( ఇప్పటికీ చాలా చోట్ల వినిపించే మాట ). ఆడవాళ్లు లేకుండా ఏ పనీ కాదు. ఏ కుటుంబమూ మనలేదు. అయినా చాలామంది వారి గురించి చులకనగా మాట్లాడుతుంటారు. ఉద్యోగం చేసే మహిళలు కూడా […]
- « Previous Page
 - 1
 - …
 - 68
 - 69
 - 70
 - 71
 - 72
 - …
 - 112
 - Next Page »
 


















