ఒక్కొక్క సినిమాయే ఫట్‌మని పేలిపోయాయి… చివరకు ఏ గొప్ప నటుడికి వారసుడిగా తెరపైకి వచ్చాడో ఆయన బయోపిక్స్ రెండూ బోల్తా కొట్టాయి… వయస్సు పెరుగుతోంది… కొత్తతరం వస్తోంది… ఇక బాలకృష్ణ కెరీర్ ముగింపుకు వస్తోంది అనుకున్నదశలో అఖండ తనకు ఓ పునరుజ్జీవం… ఆ సినిమాలోనూ బాలకృష్ణ మార్క్ వికారాలు కొన్ని ఉన్నా సరే, నయా అఘోరా పాత్ర తనకు సరిగ్గా సూటైంది… తన మార్కెట్ మళ్లీ ఒక్కసారిగా బుల్ దశలోకి వచ్చేసింది… అదే ఊపుతో వీరసింహారెడ్డి వచ్చి, […]
ధనుష్ సార్… మీకు కాంప్లిమెంట్స్… యువార్ టోటల్లీ డిఫరెంట్ సార్…
రెండుమూడు విషయాల్లో ‘సార్’ సినిమాను మెచ్చుకోవాలి… హీరో ధనుష్‌ను, నిర్మాతలను, దర్శకుడిని కూడా మెచ్చుకోవాలి… ధనుష్‌కు ఇమేజ్ ఉంది… మార్కెట్ ఉంది… డిష్యూం డిష్యూం, యాక్షన్, మాస్ మసాలా, రస్టిక్, ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తున్న ఈరోజుల్లో ఓ సామాజిక సమస్యను చర్చకు పెడుతూ సినిమాను తీయడం అభినందనీయం… ఏవో నాలుగు పిచ్చి పాటలు పెట్టేసి, హీరో చేతిలో ఓ మెషిన్ గన్ పెట్టేసి, ఫట్ ఫట్ కాల్పులు జరిపించేసి, పాన్ ఇండియా పేరిట అయిదారు భాషల్లో […]
మధుర గతమా..? మధుర గీతమా..? మంద్రంగా, ఆర్తిగా, హృద్యంగా, ప్రవాహంగా…!
గుణ శేఖర్ అభిరుచి ఉన్న దర్శకుడు కాబట్టి… మణిశర్మ బాణీలు బాగుంటాయి కాబట్టి… ఈ సినిమా ఓ భిన్నమైన ప్రేమ కథ కాబట్టి… ఇప్పటికీ మరుపురాని ఓ చారిత్రిక ఎపిసోడ్ కాబట్టి… రాబోయేది పాన్ ఇండియా యాక్షనేతర, ఫిక్షనేతర, ఫార్ములా మసాలాయేతర సినిమా కాబట్టి… భిన్న గాయకులతో మణిశర్మ పాడిస్తున్నాడు కాబట్టి… దర్శకుడు ఈ కథను హీరోయిన్ సెంట్రిక్‌గా మార్చాడు కాబట్టి… అనేక కాబట్టుల నడుమ శాకుంతలం పాటలపై కాస్త ఆసక్తి… ఆ పాటల గుణవిశేషాలపై చెప్పుకోవడం… […]
ఈ తెలుగు సినీ ప్రముఖులు మొదట్లో ఏ పనులు చేస్తుండేవారు… (పార్ట్-2)
Sankar G………. (మొదటి భాగానికి తరువాయి…) 21. జగన్మోహిని, పున్నమినాగు లాంటి చిత్రాలలో నటించిన నటుడు నరసింహరాజు గారికి కూడా ఒకప్పుడు రాజకీయాలంటే ఆసక్తి. నవదేశం పేరుతో ఒక పార్టీని కూడా పెట్టాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. 22. నటుడు బ్రహ్మానందం అద్భుతమైన చిత్రకారుడు కూడా. ముఖ్యంగా దైవ చిత్రాలను గీయడంలో ఆయనది అందె వేసిన చేయి. 23. నటుడు ఆలీ (పెద్దవాడయ్యాక) సినీ ప్రవేశానికి ముందు ప్రముఖ గాయకులు శ్రీపాద జిత్ […]
ఈ టాలీవుడ్ ఇంట్రస్టింగ్ ముచ్చట్లు మీరెప్పుడైనా విన్నారా..? (పార్ట్-1)
Sankar G…….. సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో కొన్ని చిత్రమైనవి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం. 1. యస్వీ రంగారావు గారు నటించిన బంగారు పాప చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమాను చూశాక స్వయాన చార్లి చాప్లిన్ రంగారావు నటనను ఎంతగానో కొనియాడారు. జార్జ్ ఇలియట్ రచించిన సైలాస్ మర్నర్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు […]
శ్రీమణికి ఒడుపు చిక్కింది… తెలంగాణ పదాల విరుపు, సొగసు పట్టుకున్నాడు…
ఇప్పుడు ఓ సినిమాకు సంగీత దర్శకత్వం అంటే రికార్డింగ్ స్టూడియోలో దూరి, నాలుగు ట్రాకులు పాడించుకుని, అన్నీ మిక్స్ చేసుకుని, నిర్మాతకు అప్పగించేయడం కాదు… ట్యూన్ కట్టాలి, ట్రాకులు పాడించుకోవాలి, ఓ సింగిల్ సాంగుగా మార్చాలి, హీరోతో నాలుగు స్టెప్పులు వేయాలి, రిలీజ్ చేసిన సింగిల్స్‌లో తనే ప్రముఖంగా కనిపించాలి… వీలైతే పాట కూడా తనే రాసుకోవాలి, లేదంటే కొరియోగ్రఫీ కూడా చేయాలి… ఎక్కడో తిరుచిరాపల్లిలో పుట్టిన సంతోష్ నారాయణన్‌కు కూడా ఈ విషయం బాగానే అర్థమైంది… […]
ఇలియానా కాంట్రవర్సీ..! హఠాత్తుగా ఇప్పుడెందుకో మరి పురాతన తవ్వకాలు..?!
నిజానికి ఇది కొత్త వార్తేమీ కాదు… చాలా ఏళ్ల క్రితం వార్తే… ఇప్పుడు ఏదో హఠాత్తుగా బయటికొచ్చినట్టు, వెలికితీసినట్టు రాసేస్తున్నారు కానీ ఇలియానా వివాదం చాలా పాతదే… బహుశా 2011 నాటిది… పైగా అందరూ ఆమెదే తప్పు అన్నట్టు రాస్తున్నారు తప్ప… ఆమె కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు… విషయం ఏమిటంటే..? తమిళంలో మోహన్ నటరాజన్ అనే ఓ నిర్మాత ఉన్నాడు… దైవత్తిరుమగల్ అని ఓ సినిమా తీశాడు… అందులో విక్రమ్ హీరో, అనుష్క శెట్టి హీరోయిన్… […]
అలుసిచ్చింది కదాని… నయనతారను పదే పదే గెలుకుతున్న మాళవిక…
మాళవిక మోహనన్ అని ఓ హీరోయిన్ ఉంది తమిళనాడులో… సెకండ్, థర్డ్ లేయర్ హీరోయిన్… అనగా పెద్ద పేరున్న నటి కాదని అర్థం… 9 సినిమాల వయస్సు ఆమెది… పదేళ్ల తన్లాట… తెలుగులో ఏమీ చేయలేదు… మనకు పరిచయం లేదు… గతంలోలాగా కాదు కదా ఇప్పుడు… సీనియర్లను గెలకాలి, ఏదోలాగా వార్తల్లో ఉండాలి… ఎప్పుడూ జనం నోళ్లలో నానుతూ ఉండాలి… దాంతో ఫాయిదా ఏమిటని అడక్కండి… ఒక్కొక్కరి తత్వం ఒక్కో తీరు… ఆమధ్య ఓసారి నయనతారను ఉద్దేశించి […]
100 కాంతారలు- 1000 కేజీఎఫ్‌లు- లక్ష బాహుబలులు = మొఘలే ఆజమ్
అది భారతీయ వెండితెర కలలుగంటున్న కాలం. ఒక సృజనాత్మక సాహసం, ఒక కళాత్మక సౌరభం, చేతులు కలిపిన నడిచిన చారిత్రక సందర్భం. *** ఇతను మావాడు, మా భారతీయుడు, ప్రపంచ సినిమా గమనాన్ని మలుపు తిప్పగల మొనగాడు అని మనం అంతా మనస్ఫూర్తిగా చెప్పుకోగల సత్యజిత్ రే కలకత్తాలో ఒక అపూర్వమైన శిల్పం చెక్కుతున్నాడు. *** ఇక్కడ మన మద్రాసులో ఒక మాంత్రికుడూ మహా స్వాప్నికుడూ కదిరె వెంకటరెడ్డి అనే తెలుగువాడు ఒక పౌరాణిక కనికట్టు విద్యకు వ్యాకరణం రాసే పనిలో తలమునకలైవున్నాడు. […]
దానిమ్మ మొగ్గ… హిందీలో అనార్కలి…! మరుపురాని ఓ కల్ట్ క్లాసికల్ మూవీ…!
Taadi Prakash…………… కె.ఆసిఫ్ కన్న పసిడి కలల పంట…. MUGHAL-E-AZAM… A MASTERPIECE…. ఇప్పటికి సరిగ్గా 60 సంవత్సరాల క్రితం…. 1960 ఆగస్ట్ 5వ తేదీ : భారతదేశం అంతటా ‘మొగలే ఆజమ్’ అనే CULT CLASSIC విడుదలై చరిత్ర సృష్టించింది. భారతీయ ప్రేక్షకుడు అలాంటి సినిమా ఎన్నడూ చూసిఎరగడు. చూపు తిప్పుకోనివ్వని విజువల్ ఎఫెక్ట్‌తో, ఈ జన్మికక చాలు అనిపించే మధుర సంగీతంతో, పృథ్వీరాజ్ కపూర్ డైలాగుల మేఘ గర్జనతో, వెండితెర వీనస్ మధుబాల వెన్నెల సౌందర్యంతో […]
ప్రభాస్ అంటే ప్రభాసే… కేజీఎఫ్ యశ్ కాదు కదా… ఫరమ్గా నో అనేశాడు…
అందుకే ప్రభాస్ అంటే ప్రభాసే… చేతిలో వేల కోట్ల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులున్నాయి… ఐనాసరే, ఎక్కడా ఒత్తిడి ఫీల్ కావడం లేదు… కొన్ని అంశాల్లో స్థిరంగా వ్యవహరిస్తున్నాడు… తనకు నచ్చని అంశమైతే నిర్మొహమాటంగా తోసిపుచ్చుతున్నాడు… తనతో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సాలార్ అని ఓ సినిమా తీస్తున్నాడు తెలుసు కదా… దాన్ని నిర్మించేది కాంతార, కేజీఎఫ్ నిర్మాతలు హొంబలె ఫిలిమ్స్ వాళ్లు… కాంతార, కేజీఎఫ్ సృష్టించిన వసూళ్ల సునామీ తెలుసు కదా, ఆ జోష్‌తో హొంబలె ఫిలిమ్స్ […]
కలకానిదీ విలువైనదీ… బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు…
Bharadwaja Rangavajhala……… [ 90528 64400 ] …. అన్నపూర్ణతో శ్రీశ్రీ…. తెలుగు సినిమా చరిత్రలో అన్నపూర్ణ సంస్ధకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దుక్కిపాటి మధుసూదనరావు గారి మానసపుత్రికగా ప్రారంభమైన అన్నపూర్ణా వారి తొలి చిత్రం దొంగరాముడు. ఈ అన్నపూర్ణ అక్కినేని వారి అర్ధాంగి కాదు. దుక్కిపాటి సవతి తల్లట. సవతి తల్లంటే గయ్యాళి అని సినిమా వాళ్లు బోల్డు ఉదాహరణలు తీశారు గానీ … దుక్కిపాటి వారికి మాత్రం సవతి తల్లి మీద బోల్డు […]
అన్నమయ్య ట్యూన్లు నిజంగా ఎవరివి..? ఆ క్రెడిట్స్ ఎవరు కొట్టేశారు..?
Sankar G …………. ఒక్క రాఘవేంద్రరావు – వంద భ్రష్టు సినిమాలు… సినిమాలు తీసి దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళలో మొదటి తరం మనిషి. సరే, నేటి సినిమా రంగమే డబ్బుండి సంస్కారం లేని కుటుంబాల చేతులలోనూ, మాఫియా చేతులలోనూ, ఉన్నప్పుడు మనం చూడటం మానేయటం తప్ప, ఏమీ చేయలేము. ఏది ఎలా ఉన్నా, సినిమా నిర్మాతలకు టార్గెట్స్ యువకులు, స్త్రీలు. ఈ రెండు గ్రూపులనూ ప్రధానంగా లక్ష్యంగా చేసికొని, సినిమాలు తీయటం ఆధునిక మేనేజిమెంట్ విద్యలో […]
కొత్తతరాన్ని కనెక్ట్ కావడమంటే… బొడ్డు మీద పళ్లు విసిరినంత ఈజీ కాదు సారూ…
తెలుగులో ప్రతి అగ్ర హీరోకు అప్పట్లో సూపర్ హిట్లు, కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన పెద్ద దర్శకుడు… లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ పోతుందని నమ్మి, లాజిక్ రహితంగానూ సినిమాల్ని నిలబెట్టిన దిగ్దర్శకుడు… ఎనభయ్యేళ్ల వయస్సులో విశ్రాంతి తీసుకోకుండా ఇంకా ఏదో చేయాలని తాపత్రయం… కానీ కొత్త తరానికి కోవెలమూడి రాఘవేంద్రరావు తెలిస్తే కదా… అప్పటి ఆలోచనలు, ధోరణికి కొత్త తరం కనెక్ట్ అయితే కదా… అందుకే ఏ పని చేసినా ఇప్పుడు ఫెయిల్యూరే… బొడ్డు దర్శకుడిగా పేరు […]
The Revenant …. ఎందుకు చూడాలంటే ఈ హాలీవుడ్ సినిమాను…
Sankar G……….. ది రెవెనెంట్ సినిమా చూశారా? సినిమా గొప్పతనం ఏమిటి? నేడు ప్రపంచ సినిమాలో అత్యుత్తమ సాంకేతిక దర్శకుల్లో అలెహాండ్రో ఇన్యారిటు ముందు వరుసలో ఉంటారు. అత్యుత్తమ సాంకేతిక దర్శకులు అంటే? అద్భుతమైన లేదా ఒరిజినల్ కథ లేకపోయినా కథనం, దర్శకత్వం, సంగీతం, సినిమటోగ్రఫీ విభాగాల్లో అత్యుత్తమ సృజన చూపేవారు. వెస్ ఆండర్సన్, డెనిస్ వెల్నూవ్, స్పైక్ జాంజ్, టైకా వైటిటి, అలెక్స్ గార్లండ్, ఎడ్గర్ రైట్, అల్ఫోన్సో కువరో ఈ కోవకు చెందిన వారు. వీరి సినిమాల్లో […]
అందరికీ నీలా ఓ సెలబ్రిటీకి పుట్టే అర్హత, భాగ్యం ఉండవు కదా వరలక్ష్మీ…!!
మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబులో సినిమా రివ్యూలు రాసేవాళ్లపై మండిపడే సినిమావాళ్లలో వరలక్ష్మీ శరత్‌కుమార్ మొదటిదీ కాదు, చివరి వ్యక్తి కూడా కాబోదు… అసలే పాపులర్ నటికి పుట్టిన బిడ్డ… బార్న్ విత్ గోల్డెన్ స్పూన్… ఓ సెలబ్రిటీ పిల్లగానే పెరిగింది… సినిమాల్లో ఎంట్రీ కూడా శరత్‌కుమార్ బిడ్డగానే సులభంగా దొరికబట్టుకుంది… అఫ్కోర్స్, తను కష్టపడి నిలబడింది… కానీ మనిషిలోని అహం, సెలబ్రిటీ పిల్లగా పెరిగిన తాలూకు పొగరు ఇంకా అలాగే ఉన్నట్టున్నయ్… అందుకే రివ్యూలు రాసేవాడికి […]
లే లే లెలేలే నా రాజా… నరాల్ని సుతారంగా గిచ్చి లేపే పాటగత్తె ఈమె…
Bharadwaja Rangavajhala……….. (9052864400)……. తెలుగుసినిమా పాటల చరిత్రలో ఎల్.ఆర్.ఈశ్వరిది స్పెషల్ పేజ్. ఆంధ్రుల అల్లారు ముద్దుల గాయని ఎల్లార్ ఈశ్వరి అని ఆరోజుల్లో ఆరుద్ర కితాబు ఇచ్చారు కూడా. ఎల్.ఆర్.ఈశ్వరి ఓ తరహా గీతాలకు ప్రసిద్ది. దీనికి పూర్తి విరుద్దమైన ఇమేజ్ ఘంటసాల మాస్టారిది. అయితే విచిత్రంగా ఎల్ఆర్ ఈశ్వరితో జోడీ కట్టి కొన్ని అల్లరి పాటలు కూడా పాడేశారు ఘంటసాల మాస్టారు. లీల తర్వాత హీరోయిన్లకు సుశీలతోనూ…కాదంటే…జానకితోనో పాడించడం సంగీత దర్శకుల అలవాటుగా ఉండేది. వ్యాంప్ సాంగ్స్ […]
రష్మికకు కత్తెర… పుష్ప సీక్వెల్ పాత్ర కుదింపు… స్క్రీన్ స్పేస్ తక్కువే…
సొంత కన్నడ ఇండస్ట్రీ దాదాపు తనను వదిలేసినా, వ్యతిరేకత కనబరుస్తున్నా సరే… రష్మిక హేపీగానే ఉంది… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి ప్రిస్టేజియస్ ప్రాజెక్టులు, పెద్ద బ్యానర్ల అవకాశాలు తలుపు తడుతున్నాయి… రెమ్యునరేషన్ భారీగా అందుతోంది… షేర్ చేసుకోవడానికి జాన్ దోస్త్ విజయ్ దేవరకొండ ఉండనే ఉన్నాడు… హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను రిలీజ్ అయిపోగా, చేతిలో యానిమల్ ప్రాజెక్టు ఉంది… తెలుగులో పుష్ప-2 చేస్తోంది… ఈ పుష్ప దగ్గరే చిన్న చిక్కు… ఆమెకు […]
ఆస్కార్ బాట దొరికింది… డీఎస్పీ, థమన్ బీరెడీ… గుడ్ ఆర్గనైజర్‌ను వెతకండి…
తెలుగు పాట ‘నాటునాటు’ ఆస్కార్‌కు చేరువైనట్టే ఉంది… కీరవాణిని ఆస్కార్ అవార్డుల వేదికపై పర్ఫామ్ చేయమని అడిగారు అంటే… అది అవార్డు దక్కబోతోందనడానికి ఒక సూచికగా భావించాలట… ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం కూడా ఒక సూచికే అంటున్నారు… సరే, మంచిదే… కానీ పాపం, ఆ పాటకు ప్రాచుర్యమే ఆ స్టెప్పులతో వచ్చింది… లేకపోతే ఆ పాట కంటెంటులో ఏముందని..? ఆ స్టెప్పులు కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ బాగా బాధపడుతున్నాడని వార్తలు… ఎంతసేపూ కీరవాణి […]
నిజమా స్మితా… సినిమా సెలబ్రిటీలు నిజాలు చెబుతారా..? చెప్పారా..?
ఎక్కడో ఓ మీమ్… సోనీ లివ్ ప్లాట్‌ఫామ్ కోసం సింగర్-యాక్టర్ స్మిత ‘నిజం విత్ స్మిత’ అని ఓ టాక్ షో చేస్తోంది… కాదు, చేసింది… అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తయింది… తాజాగా ఇప్పుడు ప్రసారం ప్రారంభించారు… సో, పెద్దగా వర్తమాన అంశాలపై ఫోకస్ పెద్దగా ఉండకపోవచ్చు… అయితే పవన్ కల్యాణ్‌ను ఈమధ్య ఓ రాజకీయ నాయకుడిగా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు కదా అన్నయ్య చిరంజీవి… పవన్ ఎప్పుడో ఓసారి ఏదో ఒక పెద్ద హోదాలోకి ఎదుగుతాడు, తన […]
- « Previous Page
- 1
- …
- 69
- 70
- 71
- 72
- 73
- …
- 126
- Next Page »